రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్‌లైన్‌ పొడిగిస్తారా? | Exchange of Rs 2000 no deadline extension What You Need before sep30 | Sakshi
Sakshi News home page

రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్‌లైన్‌ పొడిగిస్తారా?

Published Mon, Sep 25 2023 5:19 PM | Last Updated on Mon, Sep 25 2023 6:03 PM

Exchange of Rs 2000 no deadline extension What You Need before sep30 - Sakshi

Exchange Rs 2000: చలామణీలో ఉన్న రూ. 2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకున్న తరువాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులో డిపాజిట్‌  చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గడువు   ఈ నెలాఖరుతో  ముగియనుంది. ఆర్‌బీఐ "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు  రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30, 2023 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది.

అయితే నిజానికి ఈ గడువు 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబరు 25, 27, 28 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 26, 29, 30 తేదీలు మాత్రమే నోట్ల మార్పిడికి చాన్స్‌ ఉంటుంది. అయితే ఈ క్రమంలో డెడ్‌లైన్‌ పొడిగిస్తుందా? లేదా అనే ఊహాగానాలున్నాయి. డెడ్‌లైన్‌ పొడిగించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిమంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే తాజా రూమర్లపై  కేంద్రం నుంచి ఆర్‌బీఐనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

ఈ ఏడాది  మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అయితే  రెండు వేల రూపాయలనోట్లను ఆయా  బ్యాంకుల్లో డిపాజిట్‌ లేదా మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ  గడువు లోపల తమ వద్ద మిగిలిన రూ. 2 వేల నోటును మార్పిడిలేదా డిపాజిట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే ఆర్‌బీఐ మార్గ దర్శకాల ప్రకారం ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి, అభ్యర్థన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్‌ లేకుండానే మార్పిడి చేసుకోవచ్చు.అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ID ప్రూఫ్‌ని కలిగి ఉండటం మంచిది.

ఈ వారంలో బ్యాంకుల సెలవులు
బ్యాంకులు సోమవారం నుండి బుధవారం వరకు (సెప్టెంబర్ 25 -సెప్టెంబర్ 27 వరకు) సాధారణంగా పనిచేస్తాయి.
గురువారం,సెప్టెంబర్ 28, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెలవు.
శుక్రవారం,శనివారం  అంటే సెప్టెంబర్ 29 , సెప్టెంబర్ 30 తేదీలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో  శుక్రవారం కూడా సెలవు.
మరోవైపు ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అయితే  మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement