
Rs 2000 notes Deadline extended up to October 7 ఉపసంహరించుకున్న రూ. 2000 నోటు డిపాజిట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 30తో ముగియనున్న నేపథ్యంలో ఈ గడువును అక్టోబరు 7 వరకు పెంచుతున్నట్టు శనివారం వెల్లడించింది. అంతేకాదు రూ.2000 నోట్లు చట్ట బద్దంగా చలామణిలో ఉంటాయని కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాప్యం లేకుండా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని ఆర్‌బీఐ ప్రజలను కోరింది.
RBI సంచలన ప్రకటన
ఉపసంహరణ ప్రక్రియకు నిర్దేశించిన వ్యవధి ముగిసినందున, రూ. 2000 నోట్ల డిపాజిట్ / మార్పిడికి అవకాశాన్ని అక్టోబర్ 07, 2023 వరకు పొడిగించాలని నిర్ణయించాం అని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని వెల్లడించింది.
► వినియోగదారులు అక్టోబరు 8 తరువాత నుంచి ఈ నోట్లను 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు.
వ్యక్తులు, సంస్థలు 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను దేశంలోని తమ బ్యాంక్ ఖాతాలకు ఎంత మొత్తానికి అయినా జమ చేయవచ్చు.
► అంతేకాకుండా, దేశంలోని కస్టమర్లు భారతదేశంలోని వారి బ్యాంక్ ఖాతాలకు క్రెడిట్ కోసం 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాల్లో దేనినైనా చిరునామాకు పంపి, ఇండియా పోస్ట్ ద్వారా రూ.2000 నోట్లను పంపవచ్చు అయితే ఈ క్రెడిట్ సంబంధిత ఆర్‌బీఐ / ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటుంది, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాల సమర్పించాలి.
► న్యాయస్థానాలు, చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ప్రభుత్వ విభాగాలు లేదా దర్యాప్తు ప్రక్రియల్లో పాలుపంచుకున్న ఇతర పబ్లిక్ అథారిటీలు లేదా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎటువంటి పరిమితి లేకుండా 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలలో దేనిలోనైనా రూ.2000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు అని ఆర్‌బీఐ తెలిపింది.
కాగా క్లీన్-నోట్ విధానంలో భాగంగా మే 19న రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లు రూ.0.24 లక్షల కోట్లుగా ఉన్నాయని ఆర్‌బీఐ గత శుక్రవారం వెల్లడించింది. (లగ్జరీ బీఎండబ్ల్యూ ఈవీ: గంటల్లోనే హాల్ సేల్, ధర ఎంతంటే?)