Rs 2,000 Notes Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రూ. 2,000 ఉపసంహరణ గురించి చేసిన అధికారిక ప్రకటన అందరికి తెలిసిందే. ఆర్‌బీఐ ప్రకారం ఈ రోజు (మే 23) నుంచి రెండు వేల నోట్లను సమీపంలో ఉన్న ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ఉన్న బ్యాంకులోని మార్చుకోవాలనే ఖచ్చితమైన నిబంధన లేదు.
ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?
ప్రారంభంలో చెప్పినట్లుగానే ఒక వ్యక్తి రోజుకి కేవలం 10 నోట్లను మాత్రమే (రూ. 20,000) మార్చుకోవచ్చు. అయితే దీని కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని ఇప్పటికే ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. నోట్ల మార్పిడి ఈ రోజు నుంచి ప్రారంభమై 2023 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత నోట్ల మార్పిడికి గడువు పెరుగుతుందా.. లేదా అనేదానిపైన ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.
రూ. 2వేల నోట్లను మార్చుకోవడానికి సమయం చాలా ఉంది. కావున ప్రజలు గుంపులు గుంపులుగా బ్యాంకులపై పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చెప్పిన గడువు లోపల రెండు వేల నోట్లు ఖజానాకు చేరుతాయని ఆశిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ కావలసిన చర్యలు తీసుకుంటుందని కూడా వెల్లడించారు. అంతే కాకుండా రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో ఆర్థిక వ్యవస్థపై పడే భారం చాలా తక్కువగా ఉంటుందన్నారు.
(ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల ఎక్స్‌చేంజ్‌కి అవి అవసరం లేదన్న ఎస్‌బీఐ)
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నోట్ల మార్పిడిని మరింత సులభతరం చేయడానికి సంబంధిత అధికారులు బ్యాంకులలో ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు, ప్రజలు క్యూ పాటిస్తూ ఈ అవకాశం వినియోగించుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల వద్ద రద్దీగా ఉన్న సమయంలో నకిలీ రూ. 2000 నోట్లు మార్పిడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!)
Comments
Please login to add a commentAdd a comment