notes exchange
-
పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ (3 అంచెల రక్షణ) కవర్‌ను వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్‌ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ అన్నారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. -
రేపే లాస్ట్ డేట్ - మిగిలిన రూ.2000 నోట్ల పరిస్థితి ఏంటి?
రూ. 2000 నోట్ల ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ కోసం ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. అయితే ఇప్పటి వరకు 93 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సమయంలో 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) గడువు పొడిగిస్తుందా? లేదా అనే దానిపైన చాలా మందికి సందేహం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రెండు వేలు నోట్లను బ్యాంకుల ద్వారా మార్చుకోవడానికి 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 30 వరకు సుమారు నాలుగు నెలలు గడువు కల్పించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఈ గడువు రేపటితో ముగుస్తుంది. ఇప్పటికి కూడా వెనక్కి రావాల్సిన నోట్లు 7 శాతం ఉన్నాయని, దీని కోసం ఆర్బీఐ గడువు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదీ చదవండి: ఆడి కారులో వచ్చి ఆకుకూర అమ్ముతున్నాడు - వీడియో ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, ఇతర వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న రూ. 2000 నోట్లను బ్యాంకులో జమ చేయడానికి గడువు పొడిగించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ గడువు అక్టోబర్ 31 వరకు పొడిగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2023 మే 19 నుంచి సెప్టెంబర్ 2 వరకు 93 శాతం రెండు వేలు నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయి సంబంధిత శాఖ వెల్లడించింది. -
రూ. 2,000 నోట్లు ఇంకా ఉన్నాయా? ఈజీగా ఇలా మార్చుకోండి..
దేశంలో చలామణిలో ఉన్న రూ. 2000 నోట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉపసంహరించిన విషయం తెలిసిందే. గత మే నెల 19న ఈ నిర్ణయం ప్రకటించిన ఆర్బీఐ తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవాలని లేదా డిపాజిట్ చేయాలని కోరింది. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. ఇప్పటికే చాలా మంది తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేశారు. నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పటి నుంచి జులై 31 వరకు సుమారు 88 శాతం రూ. 2000 నోట్లు బ్యాంకులకు చేరినట్లు తెలిసింది. వీటి విలువ రూ. 3.14 లక్షల కోట్లు. ఇంకా రూ. 0.42 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కి రావాల్సి ఉంది. డిజిటల్ లోన్ గురించి తెలుసా? ఈ డాక్యుమెంట్లుంటే సులువుగా రుణం! ఈ నేపథ్యంలో ఇంకా తమ వద్ద రూ.2000 నోట్లు ఉన్నవారు వెంటనే డిపాజిట్ చేయాలని ఆర్బీఐ కోరుతోంది. అయితే బ్యాంకులకు వెళ్లి నోట్లు డిపాజిట్ చేయలేనివారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సులువైన పరిష్కారంతో ముందుకొచ్చింది. అమెజాన్ కస్టమర్లు ఏదైనా క్యాష్ ఆన్ డెలివెరీ ఆర్డర్ చేసినప్పుడు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. ఆర్డర్ చేసిన వస్తువు ధరను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో డిపాజిట్ చేసుకోవచ్చు. నెలవారీ రూ. 50,000 గరిష్ట డిపాజిట్ పరిమితికి లోబడి అమెజాన్ కస్టమర్లు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం ప్రత్యేకంగా కేవైసీ ధ్రువీకరించిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి నోట్లు మార్చుకునే ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం చాలా అవసరం. మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో అప్డేట్ చేసిన మొత్తాన్ని ఆన్లైన్ షాపింగ్, క్యూఆర్ ఆధారిత చెల్లింపులు, రీఛార్జ్‌లు, స్విగ్గీ, జొమాటో వంటి ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ చెల్లింపుల కోసం ఉపయోగించవచ్చు. అమెజాన్ పే వ్యాలెట్‌తో నోట్లు మార్చుకోండిలా.. అమెజాన్ యాప్‌లో వీడియో కేవైసీని పూర్తి చేయండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ చేయండి. డెలివరీ ఏజెంట్‌కు రూ.2000 నోట్లు ఇవ్వండి ఏజెంట్ మీ అమెజాన్ పే వ్యాలెట్‌లో మిగిలిన బ్యాలెన్స్‌ని తక్షణమే అప్డేట్ చేస్తారు. -
విశాఖలోని నోట్ల మార్పిడి కేసులో జనసేన నాయకుడి అనుచరుడు అరెస్ట్
-
నోట్ల మార్పిడి ఈ రోజు నుంచే.. సులభంగా ఎక్కడ మార్చుకోవచ్చంటే?
Rs 2,000 Notes Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రూ. 2,000 ఉపసంహరణ గురించి చేసిన అధికారిక ప్రకటన అందరికి తెలిసిందే. ఆర్బీఐ ప్రకారం ఈ రోజు (మే 23) నుంచి రెండు వేల నోట్లను సమీపంలో ఉన్న ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చు. మీ అకౌంట్ ఉన్న బ్యాంకులోని మార్చుకోవాలనే ఖచ్చితమైన నిబంధన లేదు. ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? ప్రారంభంలో చెప్పినట్లుగానే ఒక వ్యక్తి రోజుకి కేవలం 10 నోట్లను మాత్రమే (రూ. 20,000) మార్చుకోవచ్చు. అయితే దీని కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదని ఇప్పటికే ఎస్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. నోట్ల మార్పిడి ఈ రోజు నుంచి ప్రారంభమై 2023 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత నోట్ల మార్పిడికి గడువు పెరుగుతుందా.. లేదా అనేదానిపైన ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. రూ. 2వేల నోట్లను మార్చుకోవడానికి సమయం చాలా ఉంది. కావున ప్రజలు గుంపులు గుంపులుగా బ్యాంకులపై పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చెప్పిన గడువు లోపల రెండు వేల నోట్లు ఖజానాకు చేరుతాయని ఆశిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. దీని కోసం రిజర్వ్ బ్యాంక్ కావలసిన చర్యలు తీసుకుంటుందని కూడా వెల్లడించారు. అంతే కాకుండా రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో ఆర్థిక వ్యవస్థపై పడే భారం చాలా తక్కువగా ఉంటుందన్నారు. (ఇదీ చదవండి: రూ. 2000 నోట్ల ఎక్స్చేంజ్కి అవి అవసరం లేదన్న ఎస్బీఐ) ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నోట్ల మార్పిడిని మరింత సులభతరం చేయడానికి సంబంధిత అధికారులు బ్యాంకులలో ప్రత్యేకమైన కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు, ప్రజలు క్యూ పాటిస్తూ ఈ అవకాశం వినియోగించుకోవాలని చెబుతున్నారు. బ్యాంకుల వద్ద రద్దీగా ఉన్న సమయంలో నకిలీ రూ. 2000 నోట్లు మార్పిడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. (అన్నీ సాహసాలే: ఆరు నెలలకే వేల కోట్ల బిజినెస్!) -
పోస్టాఫీసులో సీబీఐ దాడులు
సబ్ పోస్ట్‌మాస్టర్, ట్రెజరర్ అరెస్ట్ సాక్షి, విశాఖపట్నం: టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి వ్యవహారంలో విశాఖ స్కేప్‌కు సంబంధాలు న్నాయంటూ రేగిన కలకలం మరువకముందే మరో సంచలనానికి నగరం వేదికైంది. పాత నోట్లను నిబంధనలకు విరుద్ధంగా మార్చారనే అభియోగాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సబ్ పోస్టాఫీస్‌లో ఇద్దరు ఉన్నతోద్యోగులను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు వెల్లడించారు. పాత నోట్ల రద్దు తర్వాత వాటిని మార్చుకునేందుకు బ్యాంకులతో పాటు పోస్టాఫీసుల్లోనూ అవకాశం కల్పించారు. ఇందులో అక్రమాలకు అవకాశం ఉండటంతో సీబీఐ నిఘా వేసింది. ఈ క్రమంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం సబ్ పోస్టాఫీస్ నుంచి రూ.20 లక్షలకుపైగా అక్రమంగా నోట్ల మార్పిడి జరిగినట్లు సమాచారం అందింది. రహస్య పరిశోధన అనంతరం సమాచారం నిజమేనని నిర్ధారించుకున్న అధికారులు ఈ నెల 14న ఆకస్మికంగా దాడి చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. బంధువుల కోసం అక్రమాలు సబ్ పోస్టుమాస్టర్ కె.లలిత, ట్రెజరర్ షేక్ ఎస్ శామ్యూల్ జాన్‌లు తమ బంధువులు, స్నేహితులకు చెందిన రూ.21.73 లక్షల నగదును నిబంధనలకు విరుద్ధంగా మార్చినట్టు తనిఖీల్లో బయటపడింది. పాత నోట్లు తీసుకుని కొత్త రూ.2 వేల నోట్లు ఇచ్చినట్లు తేలింది. దీంతో వీరిపై పలు ఐపీసీ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇద్దరు పోస్టల్ అధికారుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం సబ్ పోస్టాఫీసులోని మరో ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
రూ.32,93,500 స్వాధీనం జగిత్యాల: కోరుట్లలో నోట్ల మార్పిడికి యత్నిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అనంతశర్మ తెలిపారు. మంగళవారం జగిత్యాల డీపీవో కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో నోట్ల మార్పిడి ముఠా వివరాలు వెల్లడించారు. చింత మోహన్ (కోరుట్ల), మహ్మద్ ఇలాయత్ (పెర్కిట్), బాజిరెడ్డి (నిజామాబాద్)లు కొంతకాలంగా కోరుట్లలో నోట్ల మార్పిడి దందా నడిపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో వీరు ఏపీ 15 ఏక్యూ 0992 నంబరు గల జైలో వాహనంలో వెళ్తుండగా సీఐ రాజశేఖర్‌రాజు ఆధ్వర్యంలో మంగళవారం కోరుట్ల లిమ్రా దాబా వద్ద పట్టుకున్నారు. వీరు రూ.32,93,500 కలిగి ఉన్నారని, ఆ డబ్బుకు ఎలాంటి లెక్కలు లేవని తెలిపారు. దీంతో తాము ఇన్‌కంట్యాక్స్ అధికారులకు సమాచారం అందించామన్నారు. ఇందులో సుమారు రూ.3 లక్షల విలువ గల విదేశీ కరెన్సీతోపాటు కొత్త రూ.20 వేల వరకు కొత్త రూ.2 వేల నోట్లు, మిగతావి పాత రూ.500, రూ.వెరుు్య నోట్లు ఉన్నాయన్నారు. వీరు 20-30 పర్సంటేజీతో దందా నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. కాగా, ఈ ముఠాను పట్టుకున్న కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, ఎస్ఐ కృష్ణకుమార్‌లను ఉన్నతాధికారులు, ఎస్పీ అనంతశర్మ అభినందించారు. -
నోట్ల మార్పిడికి రాం రాం!
-
పేదోళ్ల చుట్టూ బడాబాబుల చక్కర్లు
• కూలీ ఇచ్చి క్యూలో నిలబెడుతున్న బడాబాబులు • అటవీ గ్రామాల్లో జోరుగా కమీషన్ దందా • నోట్ల మార్పిడికి కాంట్రాక్టర్లు, స్మగ్లర్లపై మావోయిస్టుల ఒత్తిడి మహదేవపూర్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో అక్రమంగా సంపాదించి దాచుకున్న రూ.500, రూ.1000 నోట్ల మార్పిడి కోసం బడా బాబులు పేదోళ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. రూ.300 కూలీ ఇచ్చి మరీ బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద క్యూలైన్న్లలో నిలబెడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం మండలాల్లోని అటవీ గ్రామాల ప్రజలతో పెద్దనోట్లు మార్పిడి చేరుుంచడానికి కలప స్మగ్లర్లు, గుడుంబా వ్యాపారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ వద్ద ఉన్న రూ.500, 1000 నోట్లను అటవీ గ్రామాల్లోని పేదలకు ఇచ్చి మహారాష్ట్రలో, తెలంగాణలోని బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మార్పిడి చేరుుస్తున్నట్లు సమాచారం. ఇందుకు ఒక్కొక్కరికి రూ.300 కూలీ కూడా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది దళారులు అటవీ గ్రామాల్లోని ఆదివాసీ, గిరిజనులు, దళితుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని రూ.500లకు రూ.450, రూ.1000 నోటుకు రూ.900లు ఇస్తున్నారు. కొందరు వ్యాపారులు 10 శాతం కమీషన్న్కు పెద్ద నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇదే అదనుగా మావోరుుస్టులు పెద్ద నోట్లను మార్చుకునేందుకు స్మగ్లర్లు, ఇసుక మాఫియా, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. మావోరుుస్టులకు తిప్పలే! పెద్దనోట్లు రద్దుతో డంపుల కోసం అన్వేషించే ముఠాల సంచారం తగ్గిపోరుుందని చర్చ జరుగుతోంది. కలప స్మగ్లింగ్, గుడుంబా తయారీ, మహారాష్ట్రకు రవాణా చేసేందుకు సహకరించే నిరుపేదలు పెద్ద నోట్లను అంగీకరించకపోవడంతో తాత్కాలికంగా అక్రమ రవాణాకు బ్రేకు పడింది. పెద్దనోట్లు మార్చుకురావాలని సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను మండల కేంద్రాలకు, పట్టణ ప్రాంతాలకు పంపుతున్నట్లు సమాచారం. పలిమెల మండలానికి చెందిన ఒక యువకుడు సుమారు రూ.40లక్షల పెద్ద నోట్లు మార్పిడి చేయడానికి ప్రయత్నించి విఫలమైనట్లు పుకార్లు షికారు చేస్తున్నారుు. అధికార పార్టీ నాయకులు పెద్దనోట్ల మార్పిడికి బ్యాంక్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. పెళ్లికీ నిబంధనలా..? నిజామాబాద్ పట్టణంలో ఆర్యనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన మోహన్ ఎఫ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగి. ఆయన కుమార్తె గాయత్రిదేవికి డిసెంబర్ 3న పెళ్లి జరగాల్సి ఉంది. ఆయనకు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బును ఇక్కడి గోదాం రోడ్డులోని ఎస్బీఐ ఖాతాలో ఈ నెల 8వ తేదీ తర్వాత జమ చేసుకున్నారు. కుమార్తె వివాహం కోసం ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు గురువారం శుభలేఖ, ఇతర ఆధారాలు తీసుకుని బ్యాంకుకు వచ్చారు. అరుుతే ఈ నెల 8 కంటే ముందు ఖాతాలో ఉన్న డబ్బులు మాత్రమే వివాహాల కోసం ఇవ్వాలన్న ఆర్బీఐ నిబంధనలు అడ్డంకిగా మారారుు. దాంతో ఖాతాలోని డబ్బు ఇవ్వలేమని బ్యాంకు మేనేజర్ స్పష్టం చేశారు. ఎలాగైనా డబ్బు ఇప్పించాలని వేడుకున్నా ఫలితం లేకపోరుుంది. దీంతో గత్యంతరం లేక రూ.24 వేలు డ్రా చేసుకుని కన్నీటితో తిరిగి వెళ్లిపోయారు. -
రూ.వెయ్యికి వీడ్కోలు
► చెలామణికి ముగిసిన గడువు ►బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ స్వస్తి ► డిపాజిట్ చేయూల్సిందే.. ►రూ.500 చెలామణికి పరిమితులు ► బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు ఆదిలాబాద్ అర్బన్ : రూ.1000 నోట్లకు కాలం చెల్లింది. గురువారం నాటితో ఆ కరెన్సీ చెలామణి గడువు ముగిసింది. రూ.500 నోట్లు పరిమితులతో కూడిన చెలామణికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు, కరెంటు బిల్లు, పన్నులు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఆస్పత్రులు, రైల్వే, బస్ టికెట్ల బుకింగ్ కోసం రూ.500, రూ.1000 నోట్ల చెలామణికి అవకాశం కల్పించారు. ఇక ఆ గడువు ముగిసిపోవడంతో గురువారం ముగియడంతో కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్ల చెలామణిని డిసెంబర్ 15వరకు పొడిగించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు, కరెంటు, నీటి బిల్లులు, రూ.500 లోపు మొబైల్ రీచార్జీకి చెల్లుబాటు అవుతుంది. డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ట్యాక్స్కు మినహాయింపు ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రూ.500 నోట్లు టోల్‌ప్లాజాల్లో చెల్లుబాటు అవుతాయి. ఒక్కసారి రూ.5వేల విలువైన వస్తువులను వినియోగదారులు సహకార స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికీ అవకాశం లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇక రూ.వెరుు్య నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయూల్సిందే. డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో డిపాజిట్‌కు ఆయూ నోట్లను స్వీకరిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో పన్నులు, మొండి బకాయిల వసూలుకు గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీలు, విద్యుత్ సంస్థల పంట పండింది. భారీ మొత్తంలో పన్నులు, బకారుులు వసూలయ్యూరుు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.కోట్లలో డిపాజిట్లు వచ్చి చేరాయి. మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల వరద మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పరిధిలో వివిధ రకాల పన్నుల వసూలకు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది. ఏళ్లు గడిచినా వసూలు కాని చెల్లింపులు కేవలం 15 రోజుల్లో రూ.2.80 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. రద్దు తర్వాత 30 శాతం మేర పన్ను వసూలైంది. పంచాయతీల్లో పన్ను వసూళ్లు రూ.3.50 కోట్లు ఉండగా, నోట్ల రద్దుకు ముందు రూ.60 లక్షలు వసూలు చేయగా, జిల్లా వ్యాప్తంగా రద్దు నుంచి ఇప్పటి వరకు రూ.35 లక్షలు వసూలు అయ్యాయి. నోట్ల రద్దు వ్యవహారంతో ప్రజలు పన్ను చెల్లించేందుకు ముందుకు రావడంతో అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దీంతో పంచాయతీలకు నిధుల వరద పారింది. పెట్రోల్ బంకులకు కాసుల గలగల పెట్రోల్ బంకుల్లో పాతనోట్ల చెల్లుబాటుతో ఈ నెల 9 నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.11 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఆదిలాబాద్ పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంక్‌లు ఉన్నాయి. ప్రతి రోజు సుమారుగా 5 నుంచి 6 లక్షల లీటర్ల పెట్రోల్, 4 నుంచి 5 లక్షల లీటర్ల డిజిల్ అమ్మకాలు సాగుతుంటాయి. పెద్ద నోట్ల రద్దుతో వాహనదారులు ట్యాంకులు నింపుకోవడంతో ఒకేసారి 30 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. వీటిపై ప్రభావం.. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో జనజీవనం అతలాకుతలమైంది. చిల్లర దొరకకా, ఉన్న నోట్లు బ్యాంకుల్లో మార్చుకునేందుకు అప్పగించడంతో చిల్లిగవ్వ లేక వ్యాపారాలు స్తంభించిపోయాయి. గత నెల వరకు కాసులు కురిపించిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, కార్యాలయాలు ప్రస్తుతం నోట్ల రద్దు ప్రభావంతో కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. నోట్ల రద్దు ప్రభావంతో ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడగా, నిర్మాణ, వ్యాపారం, ఆబ్కారీ, రియల్ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇరవై రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద నోట్లు మార్చుకునేందుకు, ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకునేందుకు క్యూ కట్టక తప్పడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బ్యాంకులకు వెళ్తే ఒక రోజు మొత్తం కేటాయించేయాలి. ప్రస్తుతం ఆ ప్రభావం కొద్దిగా తగ్గింది. సరిపడా నోట్లు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం రద్దు వ్యవహారానికి ముందు సరిపడా నోట్లు అందుబాటులో ఉంచి రద్దు చేసినట్లైతే ఇంత ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. ఎక్కువ డబ్బులు అవసరమున్నా రద్దు ప్రభావంతో బ్యాంకు అధికారులు ఇస్తలేరు. చేతిలో డబ్బులు లేక ఏమి చేయాలన్న తోచడం లేదు. - షేక్ ఖలీమ్, ఓ బ్యాంక్ ఖాతాదారు, ఆదిలాబాద్ ప్రభుత్వం గడువు పెంచాలి ప్రజలకు ఇంకా చిల్లర కష్టాలు తీరలేదు. చిల్లర కష్టాలు తీరిన తర్వాత పెద్ద నోట్లను తీసుకోకున్నా ఫర్వాలేదు. చిల్లర దొరకకముందే పెద్ద నోట్లను వాడుకలోంచి తీసేయడం సరికాదు. ఇంకా చాలామంది దగ్గర పాత నోట్లు కన్పిస్తున్నాయి. వీటిని సమర్పించేందుకు ప్రభుత్వం పెద్ద నోట్లు చెలామణికి గడువును పొడిగించాలి. కొత్తగా రూ.500, రూ.100 నోట్లు సరిపడా అందుబాటులోకి వచ్చాక పెద్ద నోట్ల చెలామణికి చెక్ పెట్టిన సరిపోతది. - కె.విక్కీ, పొన్నారి, తాంసి -
నోట్ల మార్పిడికి రాం రాం!
⇒ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్‌కే రూ. 1,000 నోటు పరిమితం ⇒ 15వ తేదీ వరకు అనుమతించిన చెల్లింపులన్నీ పాత రూ. 500 నోట్లతోనే.. ⇒ కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం ⇒ జాబితాలో తాజాగా మొబైల్ రీచార్జ్, స్కూలు ఫీజులు, కో-ఆపరేటివ్ స్టోర్లు ⇒ పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిలకు మాత్రమే అవకాశం ⇒ డిసెంబర్ 2 వరకూ టోల్ ట్యాక్స్ రద్దు న్యూఢిల్లీ పెద్ద నోట్ల రద్దుతో కొనసాగుతున్న ప్రజల కష్టాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 24 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 15 వరకూ అనుమతించిన చోట్ల పాత 500 నోటును వాడుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో బ్యాంకుల్లో రూ. 500, వెయ్యి నోట్ల మార్పిడిని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. ‘పౌర సేవల బిల్లులు(కేవలం నీటి, విద్యుత్ బిల్లుల చెల్లింపు) చెల్లించేందుకు డిసెంబర్ 15 వరకూ పాత రూ. 500 నోటు వినియోగించవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నోట్ల మార్పిడి నవంబర్ 25 నుంచి అందుబాటులో ఉండదు’ అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇంత కుముందు ఈ గడువు డిసెంబర్ 30 వరకూ ఉంది. నవంబర్ 8న నోట్ల రద్దుపై మోదీ ప్రకటన అనంతరం పౌర సేవల బిల్లులు, ఆస్పత్రుల్లో వైద్య ఖర్చుల కోసం, రైల్వే, బస్సు, విమాన టికెట్లకు , పెట్రోల్ బంకులతో పాటు పలుచోట్ల 500, వెరుు్య నోట్లను అనుమతించారు. ఈ గడువును నవంబర్ 24 వరకూ పొడిగిస్తూ వచ్చారు. గడువు ముగియడంతో గురువారం రాత్రి తాజా నిర్ణయం తీసుకున్నారు. అరుుతే ఇక నుంచి కేవలం రూ. 500 నోట్లు మాత్రమే స్వీకరిస్తారని, వెరుు్య నోట్లను ఎక్కడా తీసుకోరని, బ్యాంకులతోపాటు పోస్టాఫీసుల్లోని సేవింగ్స్ ఖాతాల్లో మాత్రమే డిపాజిట్ చేసుకోవాలని ఆర్థిక శాఖ పేర్కొంది. ఎక్కడెక్కడ పాత 500 నోటు చెల్లుతుందంటే.. పౌర సేవల బిల్లులు.. కేవలం విద్యుత్, నీటి బిల్లుల కోసమే.. బకాయిలు చెల్లించాలి.. ఆస్తి పన్ను చెల్లింపులకు వర్తించదు టోల్ ప్లాజాలు (డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ టోల్ వసూలు లేదు) డిసెంబర్ 3 నుంచి 15 వరకు చెల్లించవచ్చు పెట్రోల్ బంకులు.. శ్మశాన వాటికలు.. కోర్టు ఫీజులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పాల కేంద్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య ఖర్చులకు డాక్టర్ చీటీతో అన్ని మందుల షాపుల్లో మందుల కొనుగోలుకు రైల్వే టికెట్ కౌంటర్లు, బస్సు టికెట్ కౌంటర్లు (ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సహకారంతో నడిచే బస్సులు), ఎరుుర్‌పోర్టు కౌంటర్లు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీ, స్థానిక సంస్థల స్కూళ్లలో ఒక్కో విద్యార్థి రూ.2 వేల వరకూ ఫీజులు చెల్లించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ విక్రయ కేంద్రాల నుంచి విత్తనాల కొనుగోలుకు మొబైల్ రీచార్జ్ కోసం.. ఒక రీచార్జ్‌కు ఒక్క నోటే తీసుకుంటారు. కన్సూమర్ కోఆపరేటివ్ స్టోర్ల నుంచి రూ. 5 వేల వరకూ కొనుగోళ్లకు విదేశీయులు వారానికి రూ. 5 వేల వరకూ విదేశీ కరెన్సీ మార్చుకోవచ్చు. వివరాలు పాస్‌పోర్టులో తప్పకుండా నమోదు చేయాలి. రైల్వే క్యాటరింగ్ సేవలకు, సబర్బన్, మెట్రో రైలు టికెట్ల కొనుగోలుకు చారిత్రక స్థలాల్లో టికెట్ల కొనుగోలుకు -
బ్యాంకులలో పాతనోట్ల మార్పిడి బంద్
-
బ్యాంకులలో పాతనోట్ల మార్పిడి బంద్
పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్రం పలు నిర్ణయాలు వెలువరించింది. బ్యాంకులలో నోట్ల మార్పిడిని గతంలో ప్రకటించినట్లుగానే బుధవారంతో ఆపేసింది. ఇప్పటికే ఈ తరహా మార్పిడి కోసం బ్యాంకులలో క్యూలైన్లు తగ్గుతున్నాయని, అందువల్ల ఇప్పటివరకు అసలు బ్యాంకు ఖాతాలు లేనివారు ఖాతాలు తెరుచుకోడానికి, అలాగే తమవద్ద ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడానికి వీలుగా బ్యాంకులలో రద్దీ తగ్గించాలన్న ఉద్దేశంతో పాతనోట్ల మార్పిడిని 24వ తేదీ తో ఆపేస్తున్నామని ప్రకటించింది. ఇక పాత 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును డిసెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ నోట్ల చెల్లుబాటు విషయంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనలలో కొన్నింటిని మార్చి, మరికొన్నింటిని చేర్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... 500, 1000 రూపాయల నోట్ల వాడకానికి సూచనలు ఇవీ... కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, మునిసిపల్, స్థానిక సంస్థల యాజమాన్యాలలో నడుస్తున్న అన్ని పాఠశాలలలో స్కూలు ఫీజులను రూ. 2వేల వరకు రూ. 500 నోట్లతో చెల్లించవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కాలేజీలలో కూడా ఫీజులు చెల్లించవచ్చు. రూ. 500 వరకు ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జికి చెల్లించుకోవచ్చు. ఒకసారి రూ. 5వేల విలువైన వస్తువులను వినియోగదారుల సహకార స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. మంచినీళ్లు, విద్యుత్ బిల్లుల పాత బకాయిలు, ప్రస్తుత బిల్లులను చెల్లించవచ్చు. ఇది కేవలం వ్యక్తుల గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ కోరిక మేరకు టోల్ ప్లాజాల వద్ద డిసెంబర్ 2వ తేదీ వరకు టోల్ మినహాయింపు, 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 500 నోట్లతో చెల్లింపునకు ఆమోదం విదేశీయులు వారానికి రూ. 5000 వరకు విదేశీ కరెన్సీని మార్చుకునేందుకు అనుమతి. దీనికి సంబంధించిన ఎంట్రీలను వాళ్ల పాస్‌పోర్టులలో నమోదుచేస్తారు. Central Government decides that there will be no over the counter exchange of old Rs. 500 and Rs. 1000 notes after midnight of 24.11.2016. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Certain other exemptions relating to cancellation of legal tender character of old Rs. 500 and Rs.1000 notes extended up to 15.12.2016. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Those extended till 15.12.2016 include Payment of current & arrear dues to utilities which will be limited to only water and electricity. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Foreign citizens will be permitted to exchange foreign currency upto Rs.5,000 per week.Entry to this effect will be made in their passports. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 Toll payment at toll plazas can be made via old Rs.500 notes from 3.12.2016 to 15.12.2016 as toll free arrangement continues upto 2nd Dec. — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 For details of decisions taken today relating to cancellation of legal tender character of old Rs.500 &Rs.1000 notes:https://t.co/iJ5RWadKkZ — Ministry of Finance (@FinMinIndia) 24 November 2016 -
నోట్ల మర్పిడి కేసులో 17 మంది అరెస్ట్
-
సీనియర్ సిటిజన్లకే బ్యాంకు సేవలు
-
వయో వృద్ధులకే బ్యాంకు సేవలు
శనివారం నాడు పాతనోట్లు మార్చుకుందామని గానీ, ఖాతాలోంచి నగదు విత్‌డ్రా చేసుకుందామని గానీ బ్యాంకులకు వెళ్దామని అనుకుంటున్నారా.. అయితే కాస్త ఆగండి. ఈనెల 19వ తేదీ శనివారం బ్యాంకులు మామూలు సమయాల్లోనే పనిచేస్తాయి గానీ, వాటిలో కేవలం వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) మాత్రమే సేవలు అందిస్తారు. ఈ విషయాన్ని ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ రిషి తెలిపారు. రెండో శని, ఆది వారాల్లో కూడా పనిచేసిన బ్యాంకులు.. ఈసారి మూడో శనివారం అయినా సెలవు ప్రకటిస్తాయని తొలుత కొందరు భావించారు. కానీ, ఎప్పటిలాగే మామూలు పనివేళల్లోనే శనివారం పనిచేస్తాయని తెలిపారు. దేశంలోని అన్ని బ్యాంకులకూ ఈ నిబంధన వర్తిస్తుందని రాజీవ్ రిషి చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని.. ప్రతిరోజూ బ్యాంకుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన అన్నారు. అందుకే ఈ శనివారం తాము నోట్ల మార్పిడి పని చేయబోమని.. కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే మారుస్తామని అన్నారు. ఇన్నాళ్లుగా పెండింగులో పడిపోయిన మిగిలిన పనిని పూర్తిచేయడానికి శనివారాన్ని ఉపయోగించుకుంటామని ఆయన తెలిపారు. -
2.5 లక్షలు దాటిన వివరాలివ్వండి
-
మెనీ ప్రాబ్లమ్స్..!
• అన్నదాతలకు అందని ‘సహకారం’ • డీసీసీబీలో పాత నోట్ల మార్పిడి • నిలిపివేతతో తంటాలు ఇబ్బందుల్లో రైతులు కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. పెద్ద నోట్ల మార్పిడికి, ఖాతాలో ఉన్న డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రజలు తెల్లవారుజాము నుంచే బ్యాంకుల వద్ద బారులుదీరాల్సిన పరిస్థితులు నెల కొన్నారుు. కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయలను రద్దు చేయడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ఎనిమిదో రోజు బుధవారం కూడా నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరవ కముందే క్యూలో నిల్చుంటున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టినా గంటలోపే ఖాళీ అవుతున్నారుు. బ్యాంకుల్లో పెద్ద నోట్లు మార్పిడి చేస్తున్నప్పటికీ కేవలం రెండు వేల రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో చిల్లర కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండ -
నోట్లు మార్చాలని వృద్ధులపై నక్సల్స్ ఒత్తిడి
జార్ఖండ్: జార్ఖండ్‌లోని నక్సల్స్ తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను మార్పిడి చేయాలంటూ వృద్ధులను బలవంతపెడుతున్నట్లు తేలింది. నక్సల్స్ ప్రభావిత లతేహర్ జిల్లాలో కోట్లాది రూపారుుల నల్లధనాన్ని.. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2.5 లక్షల చొప్పున తమ అకౌంట్లలో జమ చేయాలంటూ వృద్ధులపై నక్సలైట్లు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయాన్ని లాతేహర్ ఎస్పీ అనూప్ బిర్తరే ధ్రువీకరించారు. పాత నోట్లను మార్చుకునేందుకు నక్సలైట్లు గ్రామస్తులను వాడుకుంటున్నారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో వృద్ధులే కాక, యువకుల పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కొందరు నక్సల్స్ సానుభూతిపరులు ఈ నోట్ల మార్పిడి వెనుక ఉన్నట్లు పేర్కొన్నారు. -
2.5 లక్షలు దాటిన వివరాలివ్వండి
• బ్యాంకులు, పోస్టాఫీసులకు కేంద్రం ఆదేశం • ఐటీ శాఖకు నివేదించాలని నిర్దేశం న్యూఢిల్లీ: నోట్ల మార్పిడికి ఉన్న 50 రోజుల గడువులోగా రూ.2.50 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసే వారి వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలని కేంద్రం అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులను ఆదేశించింది. కరెంటు ఖాతాల్లో అరుుతే రూ.12.50 లక్షల డిపాజిట్లు దాటితే వివరాలు వెల్లడించాలని పేర్కొంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30లోగా ఒక్కరోజులో రూ. 50 వేలు లేదా ఈ గడువులోగా రూ. 2.50 లక్షలకన్నా ఎక్కువ నగదు డిపాజిట్లు చేసిన ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఒక వ్యక్తికి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జరిగిన ఈ డిపాజిట్ల వివరాలను తెలపాలంటూ ఆర్థిక శాఖ బ్యాంకులు, పోస్టాఫీసుల వార్షిక సమాచార రిటర్నుల (ఏఐఆర్) ఫైలింగ్ నిబంధనలను సవరిస్తూ నోటిఫై చేసింది. ఆయా ఆర్థిక లావాదేవీల వివరాలను 2017, జనవరి 31 నాటికల్లా సమర్పించాలంది. ఇంతకుముందు ఐటీ శాఖ ఏడాదిలో రూ.10 లక్షల డిపాజిట్లు దాటిన ఖాతాల వివరాల గురించే అడిగేది. లెక్కల్లోచూపని పెద్ద మొత్తాల్లోని డబ్బు డిపాజిట్ చేస్తే పన్ను చట్టాల ప్రకారం 30 శాతం పన్ను, 12 శాతం వడ్డీ, 200 శాతం జరిమానా విధించే అవకాశముంది. నిజారుుతీపరులను వేధించడం తమ ఉద్దేశం కాదని, అక్రమంగా డబ్బుదాచుకున్న వారిపైనే చర్యలుంటాయని పన్ను విభాగం అధికారులు చెప్పారు. 50 రోజులు దాటిన తర్వాత ఈ వివరాలను పరిశీలిస్తామని, ఐటీ రిటర్నులతో వివరాలు సరిపోలుస్తామన్నారు. చాంతాడంత క్యూలు.. నోట్ల మార్పిడి కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద తోపులాటలు, చాంతాడంత క్యూలు కొనసాగుతూనే ఉన్నారుు. చాలామంది గంటల తరబడి క్యూల్లో నిలబడి విసిగివేసారిపోరుు కనపడుతున్నారు. ఆర్థిక శాఖ, పార్లమెంటు హౌస్ వద్ద ఏటీఎంల వద్ద కూడా భారీ క్యూలు దర్శనమిచ్చారుు. నోట్ల ఇక్కట్లతో దేశవ్యాప్తంగా బుధవారం 7 మంది చనిపోయారు. జార్ఖండ్‌లో ముగ్గురు, యూపీలో ఇద్దరు, ఢిల్లీలో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు మృత్యువాత పడ్డారు. మరో వారం ఇబ్బందులే.. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత సమస్య కనీసం మరో వారం కొనసాగుతుందని నిఘా నివేదిక వెల్లడించింది. సరిపడా నగదు చలామణిలో లేదని నిఘా, హోం శాఖ అధికారులు చెప్పారు. వీలైనంత త్వరగా ఏటీఎంలన్నీ పనిచేస్తేగానీ భారీ క్యూల బెడద తప్పదన్నారు. ఏటీఎంలలో రూ.500, 2,000 నోట్లను పెట్టేందుకురెండు వారాలు పట్టే అవకాశముంది. కొందరు పదేపదే బ్యాంకుల్లో నగదును మార్చుకుంటున్న నేపథ్యంలో నగదు మార్చుకునే వారి వేలుపై గుర్తువేసే ప్రక్రియ మొదలైంది. స్వాగతించిన సుబ్బారావు పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు స్వాగతించారు. దీనివల్ల పెట్టుబడులు పెరుగుతాయని, ద్రవ్యోల్బణం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. -
బ్యాంకుకు వచ్చి నోట్లు మార్చుకున్న పవన్
-
ఐదో రోజూ తప్పని ‘నోటు’ తిప్పలు!
-
‘నోట్ల’ కోసం టవరెక్కిన యువకుడు
నోట్ల మార్పిడి అవస్థలు భరించలేక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్‌లో ఖాజా అనే యువకుడు సెల్‌టవరెక్కాడు. ఖాజా వద్ద రూ.15 వేల విలువైన పెద్ద నోట్లు ఉన్నారుు. వాటిని మార్పించుకోవడానికి శనివారం సంగారెడ్డిలోని ఎస్బీఐకి వెళ్లాడు. రద్దీ కారణంగా వీలుగాక ఇంటికి వచ్చేశాడు. డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారని, అత్యవసరానికి చేతిలో డబ్బులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు, పలువురు నేతలు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో దిగాడు. -
తప్పని ‘నోటు’ తిప్పలు!
• ఆదివారమూ బ్యాంకులు, ఏటీఎంల వద్దే పడిగాపులు • నాలుగైదు గంటల పాటు క్యూలైన్లలోనే.. • నగదు నింపిన గంటలోనే ఖాళీ అవుతున్న ఏటీఎంలు • రూ.2 వేల నోట్లను వినియోగించుకోలేక జనం వెతలు • నేడు బ్యాంకులకు సెలవుతో పెరగనున్న సమస్యలు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల కష్టాలతో రాజధాని లో సాధారణ జనజీవనం దాదాపుగా స్తంభించి పోతోంది. ఆదివారం సెలవు రోజున ఇంటిపట్టున ఉండాల్సిన జనం.. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చిల్లర వర్తకులు, ఫుట్‌పాత్, వీధి వ్యాపారులు సైతం చిల్లర ఇవ్వలేక సరుకులు అమ్ముకోలేని పరిస్థితిలో చిక్కుకుపోయారు. బ్యాంకుల వద్ద నగదు మార్పిడికి రూ.4 వేల వరకు అవకాశమున్నా.. భారీగా జనం రావడంతో పలు బ్యాంకుల్లో రూ.2 వేలతోనే సరిపెట్టారు. చెక్కుతో రూ.10 వేల వరకు డ్రా చేసే అవకాశమున్నా.. నగదు నిల్వలు లేవంటూ పలు బ్యాంకులు చేతులెత్తేయడంతో వినియోగదారులు గగ్గోలు పెట్టారు. చాలా వరకు బ్యాంకుల్లో చెక్కుతో పదివేల నగదుగా.. ఆరు వేలకు మూడు రూ.2వేల నోట్లు, మిగతా నాలుగువేలకు రూ.100 నోట్లు ఇచ్చారు. కానీ రూ.2 వేల నోట్లను బహిరంగ మార్కెట్లో మార్చుకునేందుకు సామన్యులు నానా అవస్థలు పడ్డారు. ఇక కొన్ని బ్యాంకుల్లో టోకెన్లు మాత్రమే ఇచ్చి.. నగదు కోసం మరుసటి రోజు రావాలని సూచించడం గమనార్హం. పెట్రోలు బంకుల్లో రూ.500, రూ.వెరుు్య నోట్లను తీసుకుంటున్నా.. చిల్లర ఇవ్వలేమని, ఆ పూర్తి మొత్తానికి పెట్రోల్, డీజిల్ పోరుుంచుకోవాలని స్పష్టం చేస్తున్నారు. గంటలోనే ఏటీఎంలు ఖాళీ.. హైదరాబాద్ మహా నగరం పరిధిలో ఏడు వేల ఏ టీఎం కేంద్రాలున్నా.. ఎక్కడా నగదు అందుబా టులో ఉండడం లేదు. ఏటీఎంలలో నగదు నింపిన గంటలోపే ఖాళీ అరుుపోతున్నారుు. మరో రెండు వారాలు ఇదే దుస్థితి ఉంటుందనే సమాచారంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సాధారణంగా ఆదివారాల్లో సందర్శకులతో కిటకిటలాడే పార్కులకు.. నోట్ల దెబ్బతగిలి వెలవెలబోయారుు. భారీగా బకారుుల వసూళ్లు నోట్ల రద్దు ప్రభావంతో పలు ప్రభుత్వ విభాగాలకు మొండి బకారుులు వసూలవుతుండడం విశేషం. ఆదివారం జీహెచ్ఎంసీకి రూ.10 కోట్లు ఆస్తిపన్ను, జల మండలికి రూ.3.1 కోట్ల మేర నీటిబిల్లులు, సీపీడీసీఎల్‌కు రూ.14 కోట్లు పెండింగ్ బిల్లులు వసూలరుునట్లు ఆయా విభాగాల అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు కూడా పెండింగ్ బిల్లుల చెల్లింపులకు పాత రూ.500, వెరుు్య నోట్లను స్వీకరిస్తామన్నారు. సెలవుతో పెరగనున్న ఇక్కట్లు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో జనం కష్టాలు మరింతగా పెరగనున్నారుు. సోమవారం కార్తీక పౌర్ణమి కావడం, నోట్లకు ఇబ్బంది ఉండడంతో.. పూజలకు అవసరమైన పూలు, పండ్లు, ఇతర సామగ్రి ధరలను వ్యాపారులు అమాంతం పెంచివేశారు. ఇక పెద్ద నోట్ల ప్రభావం మటన్, చికెన్ దుకాణాలపైనా పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మాంసం విక్రయాలు సగానికి పైగా తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి మార్కెట్ బంద్! ఆదివారం మలక్‌పేట్ మార్కెట్‌కు ఉల్లి తీసుకువ చ్చిన రైతులు వెంటనే డబ్బు చెల్లించాలని వ్యా పారులను ఒత్తిడి చేశారు. కానీ నోట్ల సమస్య కారణంగా వ్యాపారులు చెల్లింపులు చేయలేక పోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు నిలి పివేస్తున్నట్లు ఉల్లి హోల్‌సేల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి ప్రకటించారు. ఈ విష యమై అధికారులకు సైతం సమాచారం ఇచ్చామ ని, రైతులు సహకరించాలని పేర్కొన్నారు. జనం విలవిల.. సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నోట్ల పాట్లు తప్పడం లేదు. క్షేత్రస్థారుులో జనం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. అవసరాలకు సొమ్ము కోసం ఏటీఎంల ముందు పడిగాపులు పడుతున్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్న వారైతే తీవ్రంగా ఆందోళనలో కూరుకుపోతున్నారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రులకు వెళుతున్నవారు చేతిలో డబ్బుల్లేక విలవిల్లాడుతున్నారు. ఎక్కడిక్కడ పనులు నిలిచిపోరుు కూలీలు అవస్థలు పడుతున్నారు. నేతన్నల గోస.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్రోత్పత్తిదారులు ప్రతి శనివారం నేత కార్మికులకు కూలి డబ్బు చెల్లిస్తారు. ఈ సారి అంతా రూ.వెరుు్య, రూ.500 నోట్లను ఇవ్వడంతో కార్మికులు.. ఆ నోట్లను మార్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్లతో, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో బ్యాంకుల ముందు క్యూ కట్టారు. మరోవైపు పెద్ద నోట్లతో పన్నులు, బకారుుల చెల్లింపులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో మున్సిపల్, ‘సెస్’, గ్రామ పంచాయతీ, రవాణా శాఖలకు సిరిసిల్ల పరిధిలో రూ.2.5 కోట్ల వరకు వసూలయ్యారుు. పెద్దపల్లి జిల్లాలో ‘నోటు’ పాట్లు తప్పలేదు. రూ.100 నోట్లు, కొత్తనోట్ల కోసం జనం బారులు తీరుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రైవేట్‌గా నిర్వహించే చిట్టీలు, గిరిగిరి ఫైనాన్స దందాలు నిలిచిపోయారుు. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో బ్యాంకుల వద్ద సొమ్ము విత్‌డ్రా చేసుకునే వారికంటే డిపాజిట్ దారులే ఎక్కువగా కనిపించారు. వివిధ పన్నులు, విద్యుత్ బిల్లుల రూపంలోనూ సుమారు రూ.50కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. ఇక బ్యాంకుల్లో ఇస్తున్న రూ.2వేల నోట్లు తీసుకెళ్తే చిల్లర ఇవ్వడం లేదని.. తమకు రూ.100, రూ.50, రూ.20నోట్లు కావాలని ఆయా బ్యాంకుల్లో సిబ్బందిని ప్రజలు వేడుకోవడం కనిపించింది. వికారాబాద్ జిల్లాలోనూ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద చాంతాడంత క్యూలు దర్శనమిచ్చారుు. పరిగిలో సాయంత్రం ఐదు గంటలకే బ్యాంకులు మూసేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రి 8 గంటల వరకు బ్యాంకులు తెరిచే ఉంచాలని జనం డిమాండ్ చేశారు. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో ప్రజలకు చిల్లర తిప్పలు తప్ప లేదు. సూర్యాపేట పట్టణంలోని పలు బ్యాంకులను నోట్లు అరుుపోయాయంటూ మధ్యాహ్నమే మూసివేశారు. -
ఆందోళన చెందొద్దు
డిసెంబర్ 31 వరకు నోట్లు మార్చుకోవచ్చు టోల్‌ప్లాజాల్లో టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు శని, ఆదివారాల్లో బ్యాంక్ సేవలు సమస్యలెదురైతే 1090, 1091ను సంప్రదించండి బ్యాంకర్లు, వ్యాపార సంస్థల ప్రతినిధుల సమావేశంలో ఎస్పీ నెల్లూరు(క్రైమ్): డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.500, రూ.1,000 నోట్లు మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటి నుంచే కొందరు అవి చెల్లవని ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోన్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ విశాల్‌గున్నీ స్పష్టం చేశారు. నగరంలోని ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాలులో ఆయన బుధవారం రాత్రి బ్యాంక్ అధికారులు, పోస్ట్‌మాస్టర్ జనరల్, చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్యూనియన్లు, వ్యాపారసంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. అనంతరం‡ ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. అయితే వాటిని రద్దు చేసినా నోట్ల విలువ మారదన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఎవరైనా ప్రజలు తమ అవసరాలకు రూ. 500, రూ 1,000 నోట్లు నిర్ణీత గడవు లోపల ఇస్తే వ్యాపార వర్గాలు, బ్యాంక్‌లు తీసుకోవాలని సూచించారు. ప్రజలు నోట్ల మార్పిడితో సహా అన్ని లావాదేవీలు సజవుగా జరిగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని వర్గాలతో కలిసి సమన్వయంతో పని చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సీనియర్ బ్యాంక్ అధికారులు ఆర్బీఐ నిబంధనల మేరకు అదనపు కౌంటర్లు, అదనపు సమయంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని ఆర్టీసీ, రైల్వేస్టేషన్లు, మీసేవ, హాస్పిటల్స్‌తో పాటు అన్నీ నిత్యావసర విభాగాల వ్యాపార సంస్థల్లో రూ. 500, రూ1000నోట్లు స్వీకరించబడుతాయన్నారు. 11వ తేదీ వరకు టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అన్నీ బ్యాంకులు ప్రజల సౌకర్యం కోసం శని, ఆదివారాల్లో కూడా పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1090, 1091లకు ఫోనుచేయ్యవచ్చని తగిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఎఎస్పీ బి. శరత్‌బాబు, బ్యాంక్ సీనియర్ అధికారులు, పోస్టుమాస్టర్ జనరల్, చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.