నోట్ల మార్పిడికి ఉన్న 50 రోజుల గడువులోగా రూ.2.50 లక్షల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసే వారి వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలని కేంద్రం అన్ని బ్యాంకులు, పోస్టాఫీసులను ఆదేశించింది. కరెంటు ఖాతాల్లో అరుుతే రూ.12.50 లక్షల డిపాజిట్లు దాటితే వివరాలు వెల్లడించాలని పేర్కొంది. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30లోగా ఒక్కరోజులో రూ. 50 వేలు లేదా ఈ గడువులోగా రూ. 2.50 లక్షలకన్నా ఎక్కువ నగదు డిపాజిట్లు చేసిన ఖాతాల వివరాలు ఇవ్వాలని బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులకు జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.