
‘నోట్ల’ కోసం టవరెక్కిన యువకుడు
నోట్ల మార్పిడి అవస్థలు భరించలేక సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలం గొంగ్లూర్‌లో ఖాజా అనే యువకుడు సెల్‌టవరెక్కాడు.
నోట్ల మార్పిడి అవస్థలు భరించలేక సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలం గొంగ్లూర్‌లో ఖాజా అనే యువకుడు సెల్‌టవరెక్కాడు. ఖాజా వద్ద రూ.15 వేల విలువైన పెద్ద నోట్లు ఉన్నారుు. వాటిని మార్పించుకోవడానికి శనివారం సంగారెడ్డిలోని ఎస్‌బీఐకి వెళ్లాడు. రద్దీ కారణంగా వీలుగాక ఇంటికి వచ్చేశాడు. డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారని, అత్యవసరానికి చేతిలో డబ్బులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు, పలువురు నేతలు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో దిగాడు.