high denomination notes
-
2వేల నోటు ముద్రణ ఆపేసిన ఆర్బీఐ!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండువేల రూపాయల నోటు ముద్రణను ఆపివేసినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. మనీలాండరింగ్‌ను తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. పన్నుల ఎగవేతకు, అక్రమ ఆస్తులు దాచిపెట్టేందుకు 2వేల రూపాయల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తుంది. దీనిని ఆరికట్టేందుకు కేంద్రం 2వేల రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేసింది. తాజా నిర్ణయంతో ముద్రణ ఆగిపోయినా కూడా రెండు వేల రూపాయల నోట్లు చెలామణీలోనే ఉండనున్నాయి. మొత్తం 18.03లక్షల కోట్ల రూపాయల డబ్బు చెలామణీలో ఉండగా, అందులో 37 శాతం (6.73లక్షల కోట్లు) 2వేల రూపాయల నోట్లు ఉండగా, 43 శాతం 500 రూపాయల నోట్లు ఉన్నాయి. కాగా, భారత్‌లో బ్లాక్‌మనీని ఆరికట్టడానికి 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న బీజేపీ సర్కార్.. అప్పుడు వాడుకలో ఉన్న 1000, 500 రూపాయల నోట్లను రద్దుచేసింది. వాటి స్థానంలో 2వేల రూపాయల నోటును తీసుకువచ్చింది. కాగా, గత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోట్లను కేంద్రం ఉపసంహరించనుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. -
2000 నోటు ముద్రణ ఆపేసిన ఆర్బీఐ!
-
పెద్దనోట్ల రద్దుతో తగ్గిన రుణాల మంజూరు
గుత్తిరూరల్ : ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రబీ సీజన్లో బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాల మంజూరు 40 శాతం మాత్రమే పూర్తయినట్లు లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ జయశంకర్ అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాల బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు మేనేజర్ జయశంకర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు రూ.4,400 కోట్ల రుణాలు చెల్లించి ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరామన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ రూ.382 కోట్లు రుణాలను అందించామని మార్చి ఆఖరు లోగా రూ.931 కోట్ల రుణాలు చెల్లించి లక్ష్యం పూర్తి చేయాలని ఆయన బ్యాంకర్లకు ఆదేశించారు. 2017–18లో సబ్సిడీ రుణాల మంజూరుకు ఓబీఎంఎస్ అనే పోర్టల్‌లో నమోదు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. వెలుగు, మెప్మా క్రెడిట్ లింకేజ్ త్వరగా లింక్ చేయాలన్నారు. రుణాల రెన్యూవల్‌లను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఆర్ఎం జయసింహారెడ్డి, గుత్తి సిండికేట్ బ్యాంకు ఫీల్డ్ అధికారిణి పుష్పవాణి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి రత్నకుమార్, ఏసీలు నాగరాజు, మల్లికార్జున, వెలుగు, మెప్మా సిబ్బంది బ్యాంకు మిత్ర రాజు పాల్గొన్నారు. -
పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య
– కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ధర్నా కర్నూలు (న్యూసిటీ): పెద్దనోట్ల రద్దు అనాలోచిత చర్య అని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కుబేరుల కోసమే పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. బీజేపీ పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు. డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో దేశానికి కీడు జరిగిందన్నారు. నగదు కొరతతో రైతులు పంటలు సాగు చేసుకోలేకపోయారని.. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో వంద మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇప్పటికి 50 రోజుల గడువు దాటినా పరిస్థితి చక్కబడలేదన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, డీసీసీ ఉపాధ్యక్షుడు పెద్దారెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అంజాద్ అలీఖాన్, డీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, డీసీసీ కార్యదర్శులు పర్ల రమణారెడ్డి, వై ప్రభాకర్‌రెడ్డి, విజయల్రెడ్డి, జావీద్ తదితరులు పాల్గొన్నారు. -
‘చిన్న’బోయిన ‘పెద్ద’ పండుగ
‘సంక్రాంతి’పై పెద్దనోట్ల రద్దు ప్రభావం ∙వెలవెలబోతున్న వస్త్ర దుకాణాలు ∙భారీగా తగ్గిన బంగారం కొనుగోళ్లు ∙పల్లెల్లో కానరాని సంప్రదాయ శోభ ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ సమాజంలోనైనా ఎవరి రోజువారీ జీవితక్రమం వారికి ఉంటుంది. వారి వారి వృత్తివ్యాపకాలను బట్టి ఆ క్రమంలో ఎవరి నిత్యానుభవాలు వారికి ఉంటాయి. అయితే ఒకేరోజు ఓ జాతి జీవితం మొత్తాన్ని ఉత్తేజభరితంగా మార్చేవి పండుగలే. తెలుగు జాతి జరుపుకొనే పండుగల్లో విలక్షణమైనది.. ‘పెద్ద పండుగ’ అనే పర్యాయపదంతో తన స్థాయిని చాటుకునే సంక్రాంతి. తెలిమంచు పరుచుకునే వేకువలను హరిదాసు కీర్తనలకు వేదికలుగా; వాకిళ్లను నెలముగ్గులు విరిసే పూదోటలుగా; లోగిళ్లను ఆనందపు కొలువులుగా మార్చే సంక్రాంతి ఏటా ‘హేమంతంలో వచ్చే వసంతం’ అని చెప్పొచ్చు. జీవనోపాధి రీత్యా పుట్టినగడ్డలను వీడి, ఎక్కడెక్కడికో వెళ్లిన వారు, స్థిరపడిన వారు.. ధనిక, పేద తేడా లేకుండా... తల్లికోడి రెక్కల సందిట చేరే పిల్లల్లా సొంత ఊళ్లకు చేరే పండుగ సంక్రాంతి. ఏటా జనవరి నెల నడుమన తెలుగుజాతి జరుపుకొనే ‘మూడురోజుల మహోత్సవం’ ఈ ఏడాది కళ తప్పింది. సూర్యోదయానికి ముందే తూరుపున పొడసూపే వెలుగురేకల్లా.. ఏటా ఇప్పటికే ఊరూవాడా పెద్ద పండుగ సందడి కనిపించేది. పెద్దనోట్ల రద్దుతో యావద్భారతంపై పరుచుకున్న క్రీనీడ సంక్రాంతి పైనా పడింది. ఈ నేపథ్యంలో ఆ పరిణామాన్నీ, కళావిహీనంగా మారిన వాతావరణాన్నీ వివరిస్తూ.. ‘సాక్షి’ ఫోకస్.... రిపోర్టింగ్ : పెనుబోతుల విజయ్‌కుమార్, మండపేట మండపేట : తెలుగు వారి సంస్కృతీ సాంప్రదాయాలకు శోభాయమానంగా అద్దం పట్టే సంక్రాంతి ఈ ఏడాది కళ తప్పింది. పెద్దనోట్ల రద్దుతో ఇప్పటికే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు వెలవెలబోగా ఆ ప్రభావం ఇప్పుడు పెద్ద పండుగపైనా పడుతోంది. నోట్ల రద్దు జరిగి రెండు నెలలైనా ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో గాడిన పడకపోవడంతో ఆశించిన స్థాయిలో పండుగ అమ్మకాలు లేక వ్యాపారులు అయోమయంలో ఉన్నారు. కొత్తగా ఇంటికి వచ్చే అల్లుళ్లకు కానుకలిచ్చేదెలా అన్న ఆలోచనలో పేద, మధ్యతరగతి కుటుంబాల వారున్నారు. సంక్రాంతి పల్లె వాసుల పండుగ. ప్రధానంగా రైతుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలతో నాలుగు రోజుల పాటు ఆబాలగోపాలాన్ని అలరించే పెద్ద పండుగకు జిల్లాలోని పల్లెలు పెట్టింది పేరు. జిల్లాలో అధికశాతం మంది వ్యవసాయాధారిత కుటుంబాల వారే. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షలకు పైగా రైతులు ఉన్నట్టు అంచనా. ఈ నేపథ్యంలో జిల్లాలో వాడవాడలా సంక్రాంతి పండును ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పంట చేతికొచ్చిన ఆనందంలో ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకొంటారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పట్టణాలు, దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా సంక్రాంతికి స్వస్థలాలకు తిరిగిరావడం పరిపాటి. పితృదేవతలను గుర్తుచేసుకుంటూ వారికి తర్పణాలు ఇవ్వడంతో పాటు వారి పేరుమీద దుస్తులు, బియ్యం పంపిణీ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఏడాదిపాటు తమకు సేవలందించిన కులవృత్తుల వారికి యజమానులు ధాన్యం, నగదు రూపంలో కానుకలు అందజేస్తారు. తమకు పాడినిచ్చే పశువులకు పూజలు నిర్వహించడం, గ్రామ దేవతలకు నైవేద్యాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ధనుర్మాసం ప్రారంభం నుంచే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలవుతుంది. తెలతెలవారుతూనే హరినామ సంకీర్తనలతో హరిదాసులు, ఇంటి ముంగిళ్లను ముత్యాల ముగ్గులతో తీర్చిదిద్దే పల్లెపడుచులు, డూడూ బసవన్నలు చేసే విన్యాసాలు, ‘పప్పుదాకలో పడిపోతున్నా’నంటూ కూనిరాగాలు తీసే కొమ్మదాసులు, ఏడాదికోమారంటూ సంక్రాంతి కళాకారులు చేసే సందడి, ‘ఎప్పుడెప్పుడు పండుగా ఏడాది పండుగ’ అంటూ భోగిమంటలకు పిడకల వేటలో చిన్నారుల కోలాహలం ఇవన్నీ సంక్రాంతి శోభలో ఒక భాగమైతే.. సంక్రాంతిని పురస్కరించుకుని ఇళ్లకు బూజులు దులిపి పెయింటింగ్స్ వేయించడం మొదలు ఇంటికి వచ్చే బంధువుల కోసం పిండి వంటల తయారీ, నూతన వస్రా్తల కొనుగోలు, తమతమ ఇళ్లు, పొలాలు తదితర వాటిలో పనిచేసే సిబ్బందికి వస్రా్తలు, సంక్రాంతి కానుకలు అందజేయడం వంటివన్నీ ఆర్థిక లావాదేవీలతోనే ముడిపడి ఉంటాయి. కొత్తగా పెళ్లిళ్లు జరిగిన ఇళ్లల్లో సంక్రాంతి సందడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇంటికి వచ్చే అల్లుడికి బంగారం, వస్తు రూపంలో పండుగ కానుక అందజేయడం ఆనవాయితీ. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో కోట్లాది రూపాయలు మేర వాణిజ్యం జరుగుతుంటుంది. ఏడాదిలో 11 నెలలు జరిగే వ్యాపారం ఒకటైతే క్రిస్మస్ నుంచి సంక్రాంతి పండుగ వరకు జరిగే వ్యాపారం ఒక ఎత్తని వ్యాపారవర్గాలంటున్నాయి. కానుకలిచ్చేదెలా ? కొత్తగా పెళ్లిళ్లు జరిగిన పేద, మధ్యతరగతి కుటుంంబాల్లో అత్తమామల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నోట్ల రద్దుతో కిందమీద పడి పెళ్లి చేస్తే ఇప్పుడు ఇంటికొచ్చే కొత్త అల్లుడికి కానుక ఎలా పెట్టాలన్న ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్నారు. పెళ్లయిన తర్వాత తొలిసారి పండుగకు వచ్చే అల్లుళ్లకు బంగారం, వాహన రూపాల్లో కానుకలు ఇవ్వడం పరిపాటి. ధాన్యం డబ్బులు చేతికందక కానుకలిచ్చేదెలాగని రైతువర్గాల వారు కొట్టుమిట్టాడుతున్నారు. ఏటా సంక్రాంతి సీజ¯ŒSలో కోట్లాది రూపాయలు మేర బంగారం అమ్మకాలు జరిగేవి. వినియోగదారులతో కిటకిటలాడే జ్యూయలరీ షాపులు ఈసారి అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. 25 శాతం కూడా జరగని వ్యాపారం పెద్దనోట్ల రద్దు ప్రభావంతో ఇప్పటికే క్రిస్మస్, నూతన సంవత్సర వ్యాపారం చాలా వరకు తగ్గిపోయింది. ఆయా పండుగల సందర్భంగా జిల్లాలో వాణిజ్య కేంద్రాలైన రాజమహేంద్రవరం, కాకినాడలతో పాటు అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, తుని, పెద్దాపురం తదితర పట్టణాల్లో ఏటా జరిగే వ్యాపారంతో పోలిస్తే 25 శాతం మేర వ్యాపారం కూడా జరగలేదు. వస్త్ర వ్యాపారంతో పాటు పెద్ద ఎత్తున టీవీలు, ఫ్రిజ్‌లు తదితర విద్యుత్ గృహోపకరణాలు, సెల్ఫోన్లు అమ్మే వారు రకరకాల ఆఫర్లతో ముందుకు వస్తుంటారు. ఏటా ఈ సీజ¯ŒSలో జనంతో కిక్కిరిసి ఉండే నగర, పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య కూడళ్లు, రోడ్లు ఇప్పుడు అమ్మకాలు లేక వెలవెలబోతున్నాయి. పెద్ద పండుగపై గంపెడాశలు పెట్టుకుంటే ఇప్పుడు ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. పండుగ అమ్మకాల కోసం తెచ్చిన స్టాకులు ఉండిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. రైతుల చేతికి పూర్తిస్థాయిలో సొమ్ములు లేకపోవడమే వ్యాపారాల క్షీణతకు కారణమంటున్నారు. కర్షకుల ఇంట కొరవడ్డ హర్షం ఈ సంక్రాంతికి రైతుల ఇంట పండుగ కాంతులు కరువయ్యాయి. పెద్ద పండుగ వాణిజ్యం అంతా చాలా వరకు తొలకరి ఫలసాయంపైనే ఆధారపడుతుంది. వాతావరణం అనుకూలించడంతో మంచి దిగుబడులు వచ్చాయన్న ఆనందాన్ని పెద్దనోట్ల రద్దు సంక్షోభం ఆవిరి చేసింది. మద్దతు ధరకు మించి ధాన్యం కొనుగోళ్లు జరిగినా చేతికి చిల్లిగవ్వ దక్కని పరిస్థితి. బ్యాంకు ఖాతాల్లో సొమ్ములున్నా రూ.రెండు వేల కోసం రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి. తొలకరి సాగు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చేదారి లేక, దాళ్వా సాగుకు పెట్టుబడులు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే రబీ నాట్లు పూర్తికావాల్సి ఉండగా పెట్టుబడులు పెట్టేందుకు సొమ్ములేక సాగు తీవ్ర జాప్యమవుతోంది. దీంతో రైతుల ఇంట పండుగ కాంతులు కరువవుతున్నాయి. తాజాగా ఏటీఏంలలో రూ.4,500 వరకు విత్‌డ్రాయల్‌కు అనుమతినిచ్చిన నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత ఫర్వాలేదనిపిస్తున్నా, పల్లెల్లో చాలా వరకు నగదు సంక్షోభం కొనసాగుతోంది. ఏటీఎంలు లేక నగదు కోసం బ్యాంకుల వద్ద పల్లె ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. చాలా మంది ఇంటికి పెయింటింగ్స్ కూడా వేయించలేని పరిస్థితులతో పెయింటింగ్ వర్కర్లకు ఉపాధి కరువైంది. బ్యాంకుల చుట్టూ తిరగడమే పనిగా ఉంది.. ‘నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ధాన్యం అమ్మినా నగదు ఇంకా చేతికి రానే లేదు. బ్యాంకుల చుట్టూ తిరగడమే సరిపోతోంది. తొలకరి పంట అపులింకా తీర్చనే లేదు. దాళ్వా పెట్టుబడులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మొన్న ఆగస్టు చివర్లో మా అమ్మాయి పెళ్లి చేశాను. ఇప్పుడేమో పండగ వచ్చేస్తోంది. అల్లుడికి, వియ్యపు వారికి బట్టలు పెట్టాలి. ఇంకా లాంఛనాలు ఉంటాయి. పెళ్లి జరిగిన ఇల్లు కావడంతో మొదటి పండుగను బాగా జరుపుకుందామనుకున్నాం. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు మామిడికుదురు మండలం నగరానికి చెందిన మేడిచర్ల సుబ్బారావు. ఇది ఆయన ఒక్కడి ఆవేదనే కాదు.. పెద్ద పండుగ దగ్గరకొస్తున్న వేళ జిల్లావ్యాప్తంగా ఎంతోమంది రైతుల ఆక్రోశం ఇది. మట్టిని మథించి, సృష్టించిన పంటను అమ్మినా చేతిలో చిల్లిగవ్వ లేక, రెండో పంటకు పెట్టుబడులు లేక ఇబ్బందులు పడుతున్నా తరతరాలు వస్తున్న పెద్ద పండుగ సాంప్రదాయాన్ని ఏదోవిధంగా కొనసాగించుకోవాలన్న తపనతో వ్యవసాయాధారిత పేద, మధ్యతరగతి కుటుంబాల వారు అగచాట్లు పడుతున్నారు. అంతంత మాత్రంగానే జరుపుకోవాలి.. పెద్ద నోట్ల దెబ్బతో ఈ ఏడాది సంక్రాంతి పండుగ వాతావరణం కనిపించడం లేదు. నాలుగు ఎకరాలు సాగుచేస్తే ఆ నగదు సుమారు రూ.లక్ష బ్యాంకు ఖాతాలో పడింది. తీరా బ్యాంకుకు వెళితే రూ.2వేలు, రూ.4వేలు చొప్పున ఇచ్చారు. పాత బాకీలు కట్టలేదు. ఇబ్బందులు తీరలేదు. రూ.24 వేలు చొప్పున ఒకేసారి ఇస్తే బాగుండేది. రబీ పనులకు సంబంధించి నగదు బ్యాంకు ఖాతా నుంచి తీసుకోడానికి వీలు లేక తీవ్ర ఇబ్బందులతో వెద సాగు చేపట్టాను. మరో మూడు, నాలుగు రోజుల్లో హైదరాబాద్ నుంచి అల్లుడు, కూతురు వస్తున్నారు. చేతిలో నగదు లేక ఈ పండుగ అంతంతమాత్రంగా జరుపుకోవాల్సి వస్తుంది. – పంపన సూర్యనారాయణ, రైతు, కాండ్రేగుల, పెదపూడి మండలం నగదు రహితంతో ఆనందం దూరం నా సొంత వ్యవసాయం 5 ఎకరాలతో పాటు మరో 25 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. శిస్తులతో పాటు కూలీలకు పండుగ డబ్బులు ఇవ్వాలంటే అప్పు దొరికే పరిస్థితిలేదు. నగదు రహిత లావాదేవీల పుణ్యమాని రైతుల కుటుంబాల్లో సంక్రాంతి ఆనందం కరువైంది. బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వక, అప్పులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాం. రబీ సీజ¯ŒSలో పెట్టుబడికి సోమ్ములు లేక అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ఏటా సంక్రాంతి పండుగ ఎంతో సరదాగా జరుపుకునేవాళ్లం. ఈ ఏడాది పండుగ వస్తుందన్న ఆనందం లేదు. – ముదునూరి సత్యనారాయణరాజు, రైతు, ఆత్రేయపురం పనుల్లేక ఖాళీగా ఉన్నాం.. సంక్రాంతికి నెలరోజుల ముందు నుంచి పెయింటింగ్ వర్కర్లకు ఖాళీ ఉండేది కాదు. ఉన్న వాళ్లం సరిపోక బయటి నుంచి కూలీలను పెట్టుకునేవాళ్లం. ఇప్పు డా పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో చేతిలో డబ్బుల్లేక చాలామంది పెయింటింగ్స్ వేయించడం లేదు. వర్కర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. – కొల్లి విశ్వనాథం, జగ్జీవన్‌రామ్ పెయింటింగ్ వర్కర్స్ సంఘం వ్యవస్థాపకుడు, మండపేట బంగారం అమ్మకాలు తగ్గిపోయాయి.. సంక్రాంతి సీజ¯ŒSలో అల్లుళ్లకు కానుకలుగా పెట్టేందుకు ఎక్కువగా ఆర్డర్లు వచ్చేవి. ఉంగరాలు, గొలుసులు, బ్రాస్లెట్లు తదితర బంగారు వస్తువుల అమ్మకాలు ఎక్కువగా జరిగేవి. ఈ సారి తయారీకి వచ్చే ఆర్డర్లు, అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే 25 శాతం కూడా వ్యాపారం జరగడం లేదు. – మహంతి అసిరినాయుడు, జ్యూయలరీ షాపు, మండపేట నెలరోజుల పనికి కూలిడబ్బులు లేవు.. నెల రోజులుగా కూలి పనులకు వెళుతున్నాం. రైతుల నుంచి రూ.10 వేల వరకు కూలి సొమ్ములు రావాల్సి ఉంది. పండగేమో దగ్గరకు వచ్చేస్తోంది. ఇంటికి బంధువులు వస్తారు. మేము కొత్త బట్టలు తీసుకోవాలి. పిండివంటలు చేయించుకోవాలి. నెలరోజుల పాటు పనిచేసిన డబ్బులేవు. రైతుల దగ్గర పంట డబ్బులు లేక కూలీలు అందరూ ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారు. – కాపారపు దుర్గారావు, వ్యవసాయ కూలీ, మర్రిపాక, జగ్గంపేట మండలం పండుగ జరుపుకోవడం పెద్ద కష్టమే.. సంక్రాంతి పండుగను జరుపుకోవడం పెద్ద కష్టంగానే ఉంది. నెల రోజుల క్రితమే మా కుమార్తెకు వివాహం చేశాం. అప్పట్లో పెద్దనోట్ల రద్దుతో బ్యాంకు నుంచి మా డబ్బులు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రెండునెలలైనా ఇంకా ఇబ్బందులు అలానే ఉన్నాయి. ఈ పండుగ బాగా చేసుకోవాలనుకున్నాం. పరిస్థితిలో మార్పురాకపోవడం సమస్యగా ఉంది. – పి.విద్యారావు, చెల్లూరు, రాయవరం మండలం పంట అమ్మినా చేత పైకం లేదు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తెతో కూడిన కుటుంబం మాది. మూడు ఎకరాల్లో పంట పండించా ను. పంటను ఒబ్బిడి చేసుకుని దాదాపు వంద బస్తాలు కమీష¯ŒS ఏజెంటు ద్వారా మిల్లర్‌కు విక్రయిం చాను. ధాన్యానికి రావాల్సిన సొమ్ములను మిల్లర్ ఖాతాలో వేశారు. డబ్బులు పడి రెండు వారాలు కావస్తున్నా పెద్ద నోట్ల రద్దుతో విత్ డ్రాల పరిమితులతో డబ్బులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. చెమటోడ్చి పండించి నా వచ్చే పండుగలకు పైసల్లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాం. డబ్బులందక కూలీలకు వేతనాలు పూర్తిగా ఇవ్వలేదు. ఎరువుల దుకాణంలో అప్పు అలానే ఉంది. పండక్కి పిల్లలకు నూతన వస్రా్తలు కొనలేదు. ఇంట్లో పండుగ సరుకు లు కొనలేదు. మూడు ఎకరాల రైతునై ఉండీ, 100 బస్తాలు పండించిన ధీమా ఉండి.. చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితి ఏర్పడింది. – అరిగెల సత్యనారాయణ, భీమనపల్లి శివారు సుదాపాలెం, ఉప్పలగుప్తంమండలం -
బ్యాంకర్ల బెంబేలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సీబీఐ కేసులతో బ్యాంకు అధికారుల్లో వణుకు మొదలైంది. పెద్దనోట్ల రద్దు తర్వాత మూడు రోజులపాటు బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించి కేసులు నమోదు చేసిన సంగతి విదితమే. ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో చిక్కుకున్న వారంతా తణుకు పరిధిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాదారులే. అయితే, జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున నల్లధనాన్ని మార్పిడి చేశారు. వీరిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకునే ప్రయత్నం మొదలు కాలేదు. తణుకు కేంద్రంగా ఇద్దరు ఎమ్మెల్యేలు నల్లధనాన్ని తెలుపు చేశారన్న పక్కా ఆధారాలు సీబీఐ వద్ద ఉన్నా.. వాటిపై దృష్టి పెట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ప్రజాప్రతి నిధులు వివిధ మార్గాల్లో నల్లధనాన్ని మార్చగా, ఎక్కువ మంది బ్యాంకర్ల ద్వారా కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు ప్రచారం సాగుతోంది. తాడేపల్లిగూడెంలో అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత తన అనుచరులు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వారి ద్వారా బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లలో పెద్ద మొత్తంలో సొమ్ములను డిపాజిట్టు చేయించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని, ఇంటికి రూ.లక్ష నుంచి రూ. 2.50 లక్షల వరకు పాత నోట్లను ఇచ్చారు. వీటిని మూడు బ్యాంకుల్లో జనధన్ ఖాతాలకు, డ్వాక్రా ఖాతాలకు, సేవింగ్స్ ఖాతాలకు మళ్లించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందడంతో దీనిపైనా సీబీఐ దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎస్బీఐ, ఇతర ప్రధాన బ్యాంకులతోపాటు పలు ప్రైవేటు బ్యాంకుల అధికారులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని సొమ్మును తెలుపు చేసుకోగలిగారు. ఇదిలావుంటే.. పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసిన వ్యవహారంపై సీబీఐ దృష్టి సారించింది. తణుకు ఎస్బీఐ కేంద్రంగా జరిగిన అక్రమ లావాదేవీలు తాజాగా వెలుగు చూడటంతో ఇందుకు సహకరించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కేవీ కృష్ణారావుపై ఆర్బీఐ అధికారులు వేటు వేసిన విషయం విదితమే. ఈ వ్యవహారంలో ఒకే రోజు రూ.2.49 కోట్లు విత్‌డ్రాకు సహకరించిన బ్యాంకు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేయడం సంచలనం రేకెత్తించింది. వీరితోపాటు తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యాపారుల పైనా కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల తణుకు పట్టణంలో కొందరు వ్యాపారులు, బిల్డర్లతోపాటు బ్యాంకు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్దఎత్తున అక్రమాలు గుర్తించినట్టు సమాచారం. అంతేకాకుండా వీరి నుంచి కీలక డాక్యుమెంట్లు సైతం స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా ఆర్బీఐ, సీబీఐ అధికారులు జిల్లావ్యాప్తంగా నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో తమ వ్యవహారాలు బయటకు పొక్కకుండా పలువురు ప్రజాప్రతినిధులు జాగ్రత్త పడుతుండగా.. ఎటుతిరిగి ఎటు వస్తుందోనని జిల్లాలోని బ్యాంకుల అధికారుల్లో కొందరు ఆందోళన చెందుతున్నారు. -
వాహన కొనుగోళ్లు ఢమాల్
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ... - ద్విచక్రవాహనాలపై ఎక్కువ ప్రభావం - మిగతా వాహనాలకూ తగ్గిన డిమాండ్ అనంతపురంలోని శ్రీకంఠం సర్కిల్ సమీపంలో ఉన్న ద్విచక్రవాహన షోరూంలో రెండు నెలల వ్యవధిలో దాదాపు 50 శాతం వ్యాపారం పడిపోయింది. 2015 నవంబర్‌లో 845 వాహనాలు, డిసెంబర్లో 638 వాహనాలను విక్రయించిన నిర్వాహకులు 2016 నవంబర్‌లో 509, డిసెంబర్లో 260 వాహనాలు మాత్రమే విక్రయించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని షోరూంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. - అనంతపురం సెంట్రల్ పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని ప్రజల వద్ద నగదు లావాదేవీలు పూర్తిగా మందగించాయి. బ్యాంకులు ఇచ్చే డబ్బులు కనీస అవసరాలకే సరిపోవడం లేదు. దీంతో ప్రజలు సౌకర్యాలపై వెచ్చించే ఖర్చులను పూర్తిగా తగ్గించేశారని తెలుస్తోంది. మనిషి జీవితంలో వాహనం ఒక భాగమైంది. ప్రతి పనికీ వాహనం వినియోగించే పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్థోమతను బట్టి ద్విచక్రవాహనం, కార్లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో సరుకు రవాణాకు ఉపయోగించే వాహనాలు కూడా పెరిగాయి. ప్రతి ఏడాదీ వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. 2008లో 1,49,670 ఉన్న ద్విచక్రవాహనాలు నేటికి 2.22,603 చేరుకున్నాయి. ఆటోలు, కార్లు, లారీలు ఇలా అన్ని వాహనాలూ 2008కి నేటికీ రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ప్రతి నెలా వందల్లో, ప్రతి ఏడాదీ వేలల్లో వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మందగించిన కొనుగోళ్లు పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన తర్వాత వాహన కొనుగోళ్లు పూర్తిగా మందగించాయి. ఎక్కువ శాతం సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు వినియోగించే వాహనాలపై ప్రభావం చూపింది. మరికొన్ని నెలల పాటు ఈ ప్రభావం ఇలాగే ఉంటుందని వాహన షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు. నెలవారీగా ప్రధానమైన వాహన కొనుగోళ్లలో వ్యత్యాసం ఇలా... వాహనాల రకం 2015 అక్టోబర్ 2015 అక్టోబర్ 2015 నవంబర్ 2016 అక్టోబర్ 2016 నవంబర్ 2016 డిసెంబర్ మోటారు కారు 156 0 221 204 207 97 ఆటో రిక్షాలు 232 219 286 238 280 135 గూడ్స్ వాహనాలు 163 124 145 138 210 57 ద్విచక్రవాహనాలు 2712 3867 3768 2795 3652 1158 ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది వాహనాల కొనుగోళ్లు గతంతో పోలిస్తే తగ్గాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలపై ఎక్కువ ప్రభావం చూపింది. దీనివలన రిజిస్ట్రేషన్, ఇతర పన్నులు రాక ప్రభుత్వానికి ఆదాయం కూడా కొంతమేర తగ్గింది. - శ్రీధర్, ఆర్టీఓ, అనంతపురం -
పెద్దనోట్ల రద్దుపై శ్వేతపత్రం విడుదలచేయాలి
పీసీసీ ప్రధాన కార్యదర్శి రుద్రరాజు అమలాపురం టౌన్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత 50 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత నల్ల ధనాన్ని వెనక్కి తీసుకోగలిగింది...? తదితర పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు డిమాండు చేశారు. నోట్ల రద్దు తర్వాత ప్రజల నగదు కష్టనష్టాలకు నిరసనగా ఈనెల 6 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. నోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ పార్టీ పలు రూపాల్లో సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం కోరినా ఇవ్వకుండా ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. ప్రజల ఇబ్బందులకు నిరసనగా కాంగ్రెస్ ఉద్యమం మాదిరిగా పలు దశల్లో పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టనుందన్నారు. ఈ నెల 6,7 తేదీల్లో ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఘెరావ్‌లు, ముట్టడి, ధర్నాలు వంటి నిరసనలు చేపట్టనున్నామన్నారు. అలాగే 9న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ఖాళీ కంచాల ప్రదర్శనతో నిరసన తెలపనున్నారని వివరించారు. విత్ డ్రాలపై ఉన్న పరిమితులు తక్షణమే ఎత్తి వేయాలని రుద్రరాజు డిమాండు చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి ముషిణి రామకృష్ణారావు, పీసీసీ కార్యదర్శి కల్వకొలను తాతాజీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నోట్ల రద్దుతో అభివృద్ధి వెనక్కి
ప్యాపిలి: పెద్ద నోట్ల రద్దుతో దేశ అభివృద్ధి ఆగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టణ సమీపంలో బోరెడ్డి పుల్లారెడ్డి ఫ్యాక్టరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నుట్లు ప్రకటించగానే పేదల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందన్నారు. పెద్ద నోట్లు మార్చుకోవడానికి కొత్తనోట్లకు చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా బీజేపీ నేతల ఇళ్లల్లో మాత్రం శుభకార్యాలు అంగరంగ వైభవంగా సాగడంతో మతలబు ఏమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు వ్యవహారంలో పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవరికీ లేదని 2019లో తిరిగి కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. వచ్చే నెల 11న మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహావిష్కరణకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్యాపిలి రానున్నట్లు చెప్పారు. అనంతరం విగ్రహ ఏర్పాటు స్థలాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బోరెడ్డి పుల్లారెడ్డి, ప్యాపిలి, హుసేనాపురం సింగిల్ విండో అధ్యక్షుడు చిన్న వెంకటరెడ్డి, సీమ సుధాకర్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గడ్డం భువనేశ్వరరెడ్డి, న్యాయవాది నాగభూషణంరెడ్డి, సీనియర్ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, బోరెడ్డి రాము పాల్గొన్నారు. -
నగదు కరువై..నిద్రకు వెలియై..!
- రాత్రి పూటా ఏటీఎంల వద్ద పడిగాపులు - 45 రోజులవుతున్నా మారని తీరు - కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు.. కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్లు రద్దు చేసి ఇప్పటికి నెలన్నర రోజులు అవుతున్నా.. నగదు కష్టాలు తీరడం లేదు. వేలాది మంది పగలు పనులకు వెళ్తూ..రాత్రిళ్లు ఏటీఎంల దగ్గరు పడిగాపులు కాస్తూ నిద్రకు దూరం అవుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు..ఇతర అన్ని వర్గాల వారు ఉన్న డబ్బును బ్యాంకుల్లో దాచుకున్నారు. దాచుకున్న డబ్బును తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. జిల్లాలో బుధవారం స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచీలతో పాటు వివిధ బ్రాంచీల్లో నో క్యాష్ అంటూ బోర్డులు దర్శనమిచ్చాయి. కొన్ని బ్యాంకుల్లో నగదు ఉన్నా ఇచ్చేది రూ.2వేల నుంచి 6వేల వరకే. ఇప్పటికే నగదు కోసం క్యూలో నిలబడి అస్వస్థతకు గురై జిల్లాలో ఇద్దురు వృద్ధులు మృత్యువాత పడ్డారు. ప్రతి రోజూ లైన్లో గంటల తరబడి నిలబడలేక అస్వస్థతకు గురువుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 34 బ్యాంకులకు 445 బ్రాంచీలు ఉన్నాయి. బుధవారం 375 బ్రాంచీల్లో నగదు లేదు. జిల్లా మొత్తంగా 485 ఏటీఎంలు ఉండగా బుధవారం 20 మాత్రమే పనిచేశాయి. వారంలో రూ.24వేలు తీసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించినా.. నగదు కొరతతో రూ.4000 కూడా తీసుకోలేకపోతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థిథఙఅధ్వానంగా ఉంది. సగటు జీవి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో ప్రజల దగ్గర ఉన్న డబ్బు 8వేల కోట్లు ఇప్పటి వరకు డిపాజిట్లుగా బ్యాంకులకు వచ్చాయి. జిల్లాకు వచ్చిన కొత్త కరెన్సీ రూ. 1000 కోట్లకు మించలేదు. -
అదో తుగ్లక్ చర్య
పెద్ద నోట్ల రద్దుపై ఉభయ గోదావరి జిల్లాల వర్తకుల విమర్శ రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాలని పిలుపు దానవాయిపేట / కోటగుమ్మం (రాజమహేం ద్రవరం) : పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ తుగ్లక్ చర్య అని వర్తక సంఘాలు, వివిధ పార్టీల నేతలు విమర్శించారు. రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆదివారం ఉభయ గోదావరి జిల్లాల వర్తకుల సదస్సు నిర్వహించారు. 86 శాతం నగదును రద్దు చేసే ఆలోచన ఉన్నప్పుడు, తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆవిధంగా ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. ప్రధాని చర్య కారణంగా 90 శాతం వ్యాపారం నష్టంలో నడుస్తోందని చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై దశలవారీగా ఉద్యమించాలని తీర్మానించారు. ఎక్కువ అవినీతి ప్రభుత్వ అధికారులవద్దే జరుగుతోందని ఆరోపించారు. ఆర్బీఐ కూడా అవకతవకలకు పాల్పడుతోందన్నారు. సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలు అవినీతి డిపార్ట్మెంట్లుగా మారాయన్నారు. వర్తక రంగంలో వివిధ వర్గాలవారు, పలు రాజకీయ పార్టీలకు చెందినవారు ఉన్నప్పటికీ.. వర్తకులకు సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఉద్యమించాలని పలువురు హితవు పలికారు. వర్తకులకు ఏ సమస్య తలెత్తినా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలంటే రాజమహేంద్రవరమే ప్రధాన కేంద్రమని, ఇక్కడి నుంచే ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాణిజ్యం అస్తవ్యస్తంగా మారింది పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వర్తక, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారుల నుంచి చిన్న పరిశమ్రల వరకూ మూతపడే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సామాన్యులను బలి పశువులను చేసింది. – అశోక్‌కుమార్‌జైన్, కన్వీనర్, ఏపీ ఫెడరేష¯ŒS ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ వ్యాపారాలు సన్నగిల్లాయి చిల్లర సమస్యతో వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి. షాపుల అద్దెలు, గుమస్తాల జీతాలు ఇవ్వలేక వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. అధికారులు త్వరితగతిన స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసుకోవాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – గ్రంధి బాబ్జీ, కాకినాడ ఛాంబర్ అధ్యక్షుడు అనాలోచిత నిర్ణయం నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయం. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని పేదల బతుకుల్ని రోడ్డున పడేశారు. పెద్దలు ఒడ్డున పడ్డారు. మా వ్యాపారాలు పూర్తిగా నిలిచిపోయాయి. – కాలెపు రామచంద్రరావు, ఛాంబర్ గౌరవ కార్యదర్శి -
నోట్ల రద్దు ఓ నాటకం
- సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ విమర్శ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చేందుకు నోట్లను రద్దు చేసి నాటకం ఆడుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ విమర్శించారు. కేంద్రంలోని మంత్రులు, వారి అనుకూల వ్యాపారులకు ఆర్బీఐ ప్రింటింగ్ ప్రెస్సుల నుంచే కొత్తగా ముద్రించిన నోట్లు వెళ్తున్నాయంటే ఎంతో లోపకారీ ఒప్పందాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇంతవరకు బ్యాంకుల ముందు పేదలే క్యూలలో నిలబడి డబ్బులు తీసుకుంటున్నారని, ఒక్క ధనవంతుడు బ్యాంకు ముందు నిలబడ్డాడని ఆయన ప్రశ్నించారు. తమ ఖాతాల్లో ఉన్న డబ్బులను తీసుకోవడానికి వెళ్లిన వృద్ధులు, వయోజనులు, పేదలు నూరుమందికిపైగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్య భవన్లో టి. రమేష్‌కుమార్ అధ్యక్షత సీపీఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. జిల్లాలో పార్టీ నిర్వహించిన పాదయాత్రల సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలను రూపొందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి కే.ప్రభాకరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ.రాజశేఖర్, బీ.రామాంజనేయులు, పీఎస్ రాధాకృష్ణ పాల్గొన్నారు. -
దేశ ప్రయోజనాల కోసమే పెద్ద నోట్ల రద్దు
బీజేపీ సమన్వయకర్త రఘురామ్ మామిడికుదురు : దేశ ప్రయోజనాల కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్ పేర్కొన్నారు. ‘నల్ల ధనం నిర్మూలన–దేశ ప్రయోజనాలు’ అనే అంశంపై శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు భవిష్యత్తులో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు స్వాగతిస్తుండగా స్వార్థపరులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం బంగారం జోలికి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం తరువాత కొనుగోలు చేసిన బంగారం లెక్కలు మాత్రమే సేకరిస్తోందన్నారు. నగదు రహిత సేవలతో కలిగే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, మెండా ఆదినారాయణ, చెరుకూరి గోపాలకృష్ణ, రావూరి సుధ, కొల్లు సూర్యారావు, గాడి సత్తిబాబు, నక్కా త్రిలోచనరావు తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దుతో పేదలకే ఇబ్బందులు
- నోట్లు చెల్లవని చెప్పే హక్కు ఎవరికీ ఉండదు - మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి ఆళ్లగడ్డ : ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను చెల్లుబాటు కావని చెప్పే హక్కు ఎవరికీ ఉండదని మాజీ ఎంపీ గంగులప్రతాపరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నోట్లు విడుదల చేసే సమయంలో ప్రతి నోటుపై ఈ నోటు విలువ తగ్గకుండా చూసే బాధ్యత మాది అని ప్రమాణం చేసి రిజర్వు బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుందన్నారు. అంటే ఈ నోటు విలువతో ప్రభుత్వం బాండు రాసిచ్చినట్లేనని ఆయన పేర్కొన్నారు. అలాంటి నోట్లు చెల్లవని చెప్పేందుకు రాజ్యంగాం ప్రకారం ఎవరికీ హక్కు లేదన్నారు. దొంగనోట్లు తప్ప దేశంలో చెలామనిలో ఉన్న నోట్లన్నీ రిజర్వు బ్యాంకు ముద్రించినవేనని, ప్రతి నోటుకు నోటు బదులు ఇచ్చేందుకు కావలసినంత గడువు ఇవ్వాల్సిందేనన్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా నోట్లు రద్దు చేయడంతో సామాన్యులు నానా యాతన పడుతున్నారన్నారు. దేశంలో అత్యధికులు, గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు, నిరక్ష్యరాస్యులేన్నారని, ఇలాంటి దేశంలో ఒక్కసారిగా మార్పు తీసుకురావాలనుకోవడం కుదరదన్నారు. ప్రజలు తిరగబడలేదు, వారిలో అలజడి లేదనుకుంటే పొరపాటన్నారు. ప్రజలు సహనం కోల్పోయి ఆగ్రహానికి గురైతే వారిని అదుపు చేయడం, వ్యవస్త చిన్నాభిన్నమైతే సరిదిద్దడం ఎవరితరము కాదనే విషయం తెలుసుకోవాలని గంగుల పేర్కొన్నారు. -
నెలరోజులైనా..అవే కష్టాలు
- పెన్షనర్ల అవస్థలు వర్ణనాతీతం కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద నోట్ల రద్దు ప్రకటించి నేటికి సరిగ్గా నెల రోజులు అయింది. గత నెల 8న పెద్దనోట్లు రద్దును కేంద్రం ప్రకటించగా, 9వ తేదీ అమలులోకి వచ్చింది. కాని ప్రజలకు మాత్రం సమస్యలు తీరలేదు. బ్లాక్‌మనీ కలిగిన వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గానీ నోట్ల రద్దుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం కష్టాలు తీరడం లేదు. ‘‘నగదు కేవలం రూ.40 లక్షలు మాత్రమే వచ్చింది. 400 మందికి మాత్రమే రూ.10వేల ప్రకారం చెల్లిస్తాం. ఈ నెలలో తీసుకున్న వారికి మళ్లీ చెల్లించం’’ అని బ్యాంకుల ఎదుట అధికారులు బోర్డులు పెడుతున్నారు. దీన్ని బట్టి నగదు కొరత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. బుధవారం ఎస్బీఐ, ఆంధ్రబ్యాంకులకు నగదు రావడంతో అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు. కొన్ని బ్యాంకుల్లో రూ.10వేల ప్రకారం నగదు ఇవ్వగా, మరికొన్ని బ్యాంకుల్లో రూ.2000లతో సరిపెట్టారు. కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచీకి దాదాపు వెయ్యి మంది ఉద్యోగులు తరలి రావడంతో బ్యాంకు పరిసరాలు కిటకిటలాడాయి. ఒకటో తేదీ గడచిపోయి వారం రోజులు అయినా ఉద్యోగులు 50 శాతం మంది జీతంలో ఒక్క రూపాయి కూడ లీసుకోలేదు. పెన్షనర్ల కష్టాలు మరింత దయనీయంగా ఉన్నాయి. బ్యాంకులకు ఉద్యోగులు, పెన్షనర్లు, పించన్‌దారులు పోటెత్తుతున్నా.. బ్యాంకుల్లో వృద్ధులు, వికలాంగులకు కనీస సదుపాయాలు లేవు. గంటల తరబడి వరుసల్లో నిలబడ లేక వీరు అల్లాడుతున్నారు. బ్యాంకర్లు వీరిపై ఎలాంటి కరుణ చూపకపోగా చులకనగా మాట్లాడుతుండటంతో తీవ్ర అగ్రహం వ్యక్తం అవుతోంది. పెన్షన్‌దారులను ట్రెజరీ బ్రాంచీ మేనేజన్ నిర్లక్ష్యం చేస్తుండటటంపై జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం నాయకుడు నాగేశ్వరరావు మేనేజర్‌పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. వీరందురూ మీలాగనే ఉద్యోగులే... వృద్ధులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడరా అంటూ మేనేజర్‌ను నిలదీశారు. ఇన్ని సమస్యలా... కె.నరసప్ప, పెన్షనర్ అసరాలేనిదే నడువ లేను. నేను వైద్యశాఖలో పని చేసి రిటైర్ అయ్యాను. పెన్షన్ కింద రూ.10,500 వస్తుంది. ఈ మొత్తాన్ని తీసుకోవడానికి తలప్రాణం తోకకు వస్తోంది. కలెక్టరేట్లోని ట్రెజరీ బ్రాంచీకి ఉదయం 9 గంటలకు వచ్చాను. పట్టించుకునే వారులేరు. ఇక్కడ ఉన్న మందిని చూస్తే అస్సలు బ్యాంకులోకి వెళ్లగలుగుతానా అనే భయం పట్టుకుంది. వృద్ధుళకు ప్రత్యేక లైన్ పెట్టి త్వరగా నగదు ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులపై ఉన్నా.. పట్టించుకోకపోవడం లేదు. ఇన్ని కష్టాలు ఎప్పుడూ పడలేదు: శేషన్న, పెన్షనర్ పెన్షన్ తీసుకోవడంలో ఇన్ని సమస్యలు ఎపుడూ ఎదుర్కోలేదు. మూడు రోజులుగా నగదు కోసం బ్యాంకు చుట్టు తిరుగుతన్నాం. నగదు లేదని వెనక్కి పంపుతున్నారు. ఈ రోజు రూ.10వేల ప్రకారం ఇస్తామని బోర్డు పెట్టారు. వయో వృద్ధులను పట్టించుకనే పరిస్థితిలేదు. వృద్ధులను నేరుగా బ్యాంకులోపలికి పంపి వేగంగా నగదు చెల్లించే ఏర్పాటు చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. -
ఢాబాలపై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్
-
పాత నోట్లకు కొత్త నోట్లు
- రూ.7 కోట్లకు భేరం - పోలీసులను పరుగులు పెట్టించిన ఘనులు - తెల్లవారుజామున 5 గంటల వరకు గాలింపు ఎమ్మిగనూరురూరల్: పెద్ద నోట్ల రద్దు కొందరికి సంకటంగా మారితే మరికొందరికి ఆదాయ వనరు అయింది. పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామంటూ కొందరు మరి కొందరికితో ఫోన్లో భేరమాడడం, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన ఘటన శనివారం ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. దీనిపై అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున 5 గంటల వరకు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విశ్వనీయ సమాచారం మేరకు... ‘తమ మద్ద కొత్త కరెన్సీ నోట్లున్నాయి.. 20 శాతం కమీషన్ ఇస్తే రూ. 7కోట్ల వరకు పాత నోట్లు మార్చి ఇస్తాం’ అంటూ ఎమ్మిగనూరుకు చెందిన కొందరు వ్యక్తులు కొలిమిగుండ్ల, హైదరాబాద్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారితో ఫోన్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఫోన్ సంభాషణల విషయం తెలుసుకున్న ఎస్పీ క్రైం పార్టీ పోలీసులు ట్రాప్ చేశారు. ‘ఎన్నికోట్ల పాత నోట్లు తెచ్చినా మేము మార్చి ఇస్తాం’ అంటూ ఎమ్మిగనూరు వాసులు చెప్పగా ’రూ. 3కోట్లకు కావాలి’ అని వారు చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు వారిని నోట్లతో వచ్చి ఎమ్మిగనూరు బస్టాండ్‌లో ఉండాలని సూచించారు’. ఇందుకు సంబంధించి ఎస్పీ నుంచి సమాచారం రావడంతో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు అర్ధరాత్రి పట్టణానికి చేరుకొని స్థానిక సీఐ, ఎస్ఐలతో బస్టాండ్, లాడ్జ్లను గాలించారు. పోలీసులు పట్టణంలో తిరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తి పట్టణానికి వచ్చిన కొత్త వ్యక్తులకు సమాచారం అందించటంతో వారు రాత్రికి రాత్రే మంత్రాలయం వెళ్లడం, అక్కడ కూడా పోలీసులు గాలించడం జరిగిపోయింది. చివరకు పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి దగ్గర తనిఖీ చేయగా డబ్బులు దొరకకపోవడంతో పోలీసు ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు తెలిసింది. పెద్ద ఎత్తున నోట్లు మార్పిడి జరుగుతుందని రేగిన కలకలం చివరికి రెండు గ్రూపులకు చెందిన వారి దగ్గర డబ్బులు లేవని చీటింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది. విషయంపై పట్టణ ఎస్ఐ కె.హరిప్రసాద్‌ను 'సాక్షి' వివరణ కొరగా డబ్బులు మారుస్తామని చీటింగ్ చేసిన కేసులో పట్టణానికి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అవసరం అధికం.. నగదు అల్పం
- అన్ని వర్గాల వారికి అవస్థలే - ఆదివారం సెలవు కావడంతో శనివారం బ్యాంకులకు జనాల వెల్లువ - జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు ఏ మూలకు సరిపోని వైనం - ఖాతాల్లో నగదు నిల్వలు ఉన్నా.. తప్పని కష్టాలు కర్నూలు(అగ్రికల్చర్): పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరతతో అల్లాడుతున్న వేతన జీవులకు డిసెంబర్ ఒకటో తేదీ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నెల మొదటి వారం కావడంతో జనానికి నగదు అవసరాలు పెరిగాయి. జిల్లా ప్రజల నుంచి కనీసం రూ. 400 కోట్ల మేరకు డిమాండ్ ఉండగా వచ్చింది కేవలం రూ.160 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఒకటి నుంచి ఐదారు తేదీల వరకు ఉద్యోగులకు మాత్రమే కాదు... అన్ని వర్గాల వారికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో శనివారం ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర అన్ని వర్గాల వారు బ్యాంకులకు పోటెత్తారు. ఈ క్రమంలో జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు ఏ మూలకూ సరిపోలేదు. ఆంధ్రబ్యాంకుకు రూ.100, ఎస్బీఐకి 60 కోట్లు రాగా ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా వివిధ బ్యాంకులకు పంపిణీ చేశారు. దీంతో ఆయా బ్యాంకుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు, ఇతర వర్గాల వారికి రూ.4వేల నుంచి రూ.10వేల వరకు అందించారు. తర్వాత నగదు కాస్త ఖాళీ కావడంతో ఎప్పటిలాగే మధ్యాహ్నం తర్వాత నో క్యాష్ బోర్డులు పెట్టారు. నగదు లేకపోవడం, ఉద్యోగులు, పింఛన్ దారులు పోటెత్తడంతో వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది బ్యాంకులను మూసేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో నగదు కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రజల ఖాతాలు అధికంగా వీటిలోనే ఉండడంతో బ్యాంకుల సిబ్బంది జనానికి సమాధానం చెప్పుకోలేక అల్లాడుతున్నారు. కలెక్టరేట్లోని ట్రెజరీ బ్రాంచికి ఉద్యోగులు, పెన్షన్ దారుల తాకిడి మరింత పెరగడంతో బయట ఉన్న ఏపీఎంఐపీ కార్యాలయం వరకు క్యూ కట్టారు. ఈ పరిస్థితి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఉండటం గమనార్హం. కొన్ని ఆంధ్రబ్యాంకు, ఎస్బీఐ ఏటీఎంలు మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఏటీఎంలు మూత పడ్డాయి. ప్రధాన బ్యాంకులు ఎస్బీఐ, ఆంధ్రబ్యాంకుల్లోనే నగదు లేక 90 శాతం ఏటీఎంలను మూసేశారు. కర్నూలులో పట్టుమని 10 ఏటీఎంలు కూడా పనిచేయకపోవడం, వాటి దగ్గర వందలాదిగా జనం క్యూకట్టడం నిత్యకృత్యమైంది. కర్నూలు ఎస్బీఐ మెయిన్ బ్రాంచి దగ్గరి ఏటీఎంలో నగదు పెట్టడంతో అన్ని వర్గాల వారు అక్కడ పోటెత్తారు. పెట్టిన నగదు మధ్యాహ్నానికి ఖాళీ కావడంతో నిరాశకు గురయ్యారు. ఖాతాల్లో నగదు నిల్వలున్నా... తీరని కష్టాలు.... ఉద్యోగులు, పెన్షనర్లు, ఎన్టీఆర్ బరోసా పింఛన్ దారులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి బ్యాంకుల్లో కు ఖాతాల్లో జీతాలు జమ చేశారు. బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలున్నా కష్టాలు మాత్రం తీరడం లేదు. వారంలో రూ.24 వేలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది. డిమాండ్‌కు తగ్గట్టు నగదు సరఫరా చేస్తేనే ప్రజలకు ఇబ్బందులు తీరతాయి. -
పింఛనుకు వందపాట్లు!
బ్యాంకుల్లో జమ చేస్తే సరా - ఇప్పటికీ ఖాతాలు తెరిచేందుకు అవస్థలు - ఖాతాల్లోని సొమ్ము తీసుకునేందుకు తప్పని తిప్పలు - రూ.2వేల నోట్లే ఉన్నాయంటున్న బ్యాంకర్లు - వృద్ధులు, వితంతువుల, వికలాంగుల పాట్లు వర్ణనాతీతం - 3వ తేదీ గడిచినా అందని మొత్తం వెల్దుర్తి గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు ఎల్లమ్మ. రూ.1000 వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రతి నెలా 1వ తేదీన పింఛను తీసుకునేది. ఈసారి ఆ మొత్తం ఆంధ్రా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రూ.500, రూ.100 నోట్లు లేవని,, బుధవారం రావాలని బ్యాంకు అధికారులు చెప్పి పంపించారు. అత్యవసరంగా మందులు కొనాల్సి ఉందని చెప్పినా తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. కర్నూలు(అగ్రికల్చర్)/కోడుమూరు రూరల్/వెల్దుర్తి రూరల్/ఆలూరు రూరల్: సామాజిక భద్రత పింఛనుదారుల పరిస్థితి దారుణంగా మారింది. పింఛను మొత్తం బ్యాంకుల్లో వేసినా తీసుకునే అవకాశం లేకపోవడం నిరాశకు గురి చేస్తోంది. జిల్లాలో పింఛను తీసుకునే వారి సంఖ్య 3.09 లక్షలు. వీరిలో 95 శాతం మందికి పింఛనే ఆధారం. ప్రతి నెలా ఒకటవ తేదీ కోసం ఎదురుచూడటం వీరికి పరిపాటి. ఆ రోజు ఆనందం అంతాఇంతా కాదు. ఆకు వక్క, టీ కాఫీ ఖర్చులకు ఈ డబ్బు వీరికి ఎంతో ఉపయోగం. అలాంటిది ఈనెలలో మూడు రోజులు గడిచినా డబ్బు చేతికి అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు.. చేనేత కార్మికులు.. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న పింఛను అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉన్నవి రూ.2వేల నోట్లు మాత్రమే కావడంతో.. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు రూ.1000 ప్రకారం.. వికలాంగులకు గరిష్టంగా రూ.1500 చొప్పున పింఛను ఇవ్వాల్సి ఉండటం సమస్యకు కారణమవుతోంది. చిల్లర లేని కారణంగా బ్యాంకుల్లో మూడు, నాలుగు రోజుల తర్వాత రమ్మని చెబుతుండటంతో పింఛనర్ల వెతలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితి ఒకరిద్దరిది కాదు.. సుమారు 2లక్షల మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. శనివారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని బ్యాంకులకు పింఛన్‌దారులు భారీగా తరలివచ్చారు. తుగ్గలి, కోడుమూరు తదితర కొన్ని మండలాల్లో ఒకరిద్దరికి కలిపి రూ.2వేలు నోటు ఇచ్చి మీరే పంచుకోండని చెప్పడం గమనార్హం. ఖాతాలకు 2.15లక్షల పింఛన్లే జమ జిల్లాలో దాదాపు 3.10 లక్షల పింఛన్లు ఉండగా.. శనివారం సాయంత్రం వరకు అధికారుల లెక్కల ప్రకారం 2.15 లక్షల పింఛన్ల అమౌంటు బ్యాంకు ఖాతాలకు జమ అయింది. అయితే డబ్బు తీసుకునే అవకాశం మాత్రం లేకపోయింది. అందరితో పాటు వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వరుసలో ఉండి కౌంటర్ వద్దకు పోయినా అన్నీ రూ.2వేల నోట్లే ఉన్నాయనే సమాధానం వస్తోంది. బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంటే సమస్యలు తీరవు కదా అంటూ పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాతాలు ప్రారంభించేదెప్పుడు బ్యాంకర్లకు ఖాతాలు ప్రారంభించే తీరికలేకుండా పోయింది. జిల్లాలో 60వేల మంది పింఛనుదారులకు బ్యాంకు అకౌంట్లు లేవు. బిజినెస్ కరస్పాండెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, వెలుగు సిబ్బంది పింఛనుదారుల నుంచి ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకొని ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకులకు పోతే ఇదిగో.. ఇక్కడ చూడండి, ఎంత రద్దీ ఉందో అంటూ పక్కన పెడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25వేల మంది పింఛనుదారుల వివరాలు సేకరించి ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకులకు సమర్పించినా వాటిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వీరికి ఈ నెల పింఛను ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక బ్యాంకు ఖాతాలు ఉన్నా పింఛను మొత్తం జమ కాని పింఛను దారులు పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. -
హర్తాళ్ సక్సెస్!
మూతపడిన దుకాణాలు, విద్యాసంస్థలు – ఎక్కడికక్కడ నేతలను అరెస్టు చేసిన పోలీసులు – ఉదయం నుంచే బస్ డిపోల ఎదుట నేతల బైఠాయింపు – బ్యాంకులకు మినహాయింపు – అయినా తెరుచుకోని ఏటీఎంలు – బ్యాంకుల్లోనూ దర్శనమిచ్చిన నో క్యాష్ బోర్డులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితులను పరిష్కరించాలంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్తాళ్ కార్యక్రమం విజయవంతమయింది. సోమవారం తెల్లవారుజాము నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలు బస్టాండులోకి వెళ్లి హర్తాళ్ నిర్వహించారు. బస్‌డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా నిరసన చేపట్టారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. అయితే, పోలీసులు మాత్రం ఉదయాన్నే ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్లకు తరలించారు. మరోవైపు నోట్ల రద్దుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు బంద్ నిర్వహించాయి. ఎక్కడికక్కడ వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసన నుంచి బ్యాంకులకు మినహాయింపునిచ్చారు. అయినప్పటికీ నోట్ల రద్దు కష్టాలు యథావిధిగా కొనసాగాయి. నగదు రాకపోవడంతో ఏటీఎంలు తెరుచుకోలేదు. బ్యాంకుల్లో కూడా నోక్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. బనగానపల్లె నియోజకవర్గంలో కార్తీకమాసం చివరి సోమవారం సందర్భంగా హర్తాళ్ నుంచి మినహాయింపునిచ్చారు. కర్నూలులో ఉదయం 6 గంటలకే వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వామపక్ష నేతలు, కార్యకర్తలు బస్టాండు వద్దకు చేరుకుని బస్సులు డిపోల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత బస్టాండు వద్ద నిరసనలో పాల్గొన్నారు. నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని గౌరు డిమాండ్ చేశారు. అంతకు ముందు ఉదయం 9 గంటలకు పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్సీపీ నేతలను హఫీజ్‌ఖాన్, సురేందర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. వామపక్ష కార్యకర్తలు జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించగా.. పోలీసులు అరెస్టు చేశారు. -
రేపు వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకస్మికంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారని సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు ప్రభాకరరెడ్డి, రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో నల్లకుబేరులెవరూ ఇబ్బంది పడటం లేదన్నారు. ఇప్పటికే నోట్ల మార్పిడిలో దేశవ్యాప్తంగా 70 మంది సామాన్యులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య భవన్లో ఈనెల 28న నిర్వహించనున్న భారత్ బంద్ విజయంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. 86 శాతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న «భారత్ బంద్‌కు ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, ఎస్‌యూసీఐ(సీ) జిల్లా నాయకులు నాగన్న, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నాయకులు చక్రవర్తి, సీపీఎం నాయకులు గౌస్‌దేశాయ్, ఇ.పుల్లారెడ్డి, సీపీఐ నాయకులు మనోహర్ మాణిక్యం పాల్గొన్నారు. -
బంద్‌కు వైఎస్ఆర్సీపీ మద్దతు
– జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడి కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సోమవారం తలపెట్టిన బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు. పార్టీ శాసన సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జీలు.. స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమై బంద్‌లో భాగస్వాములు కావాలని సూచించారు. నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్రం చేపట్టే ఎలాంటి చర్యలనైనా వైఎస్ఆర్సీసీ సమర్థిస్తుందన్నారు. అయితే ముందు చూపు లేకుండా..సరైన చిల్లర నగదును విడుదల చేయకుండా ఆ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు 18 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో తలపెట్టిన బంద్‌కు మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు. బంద్‌పై ప్రజలను చైతన్యపరిచేందుకు బైక్‌ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ వర్గాలకు సూచించారు. -
పెద్ద నోట్లు చెల్లక.. వైద్యం అందక..
యాదాద్రి భువ నగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం గౌరా యపల్లికి చెందిన సూరారాం చంద్రం (55) కొద్దిరో జులుగా తీవ్ర జ్వరంతో బాధ పడుతు న్నాడు. చేతిలో పెద్ద నోట్లు న్నారుు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళితే చిల్లర కావాలన్నారు. మరో ఆస్పత్రికి వెళ్లినా ఇదే పరిస్థితి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు సరిగా పట్టించుకోకపోవడంతో సరైన వైద్యం అందలేదు. ఇంటికి తిరిగివచ్చిన రాంచంద్రం గురువారం ఉదయం తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మరణించాడు. పెద్ద నోట్లు చెల్లక సకాలంలో వైద్యం అందక తన భర్త మరణించాడని రాంచంద్రం భార్య ఎల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. -
పెద్దనోట్ల రద్దు పెదవికీ చేటే
కిరాణా వ్యాపారం 80 శాతం తగ్గిందంటున్న దుకాణదారులు, తిండికి పరిమితి విధించుకుంటున్న పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు నోరారా తినడానికి నోచక, ఆదరవులుకు, అల్పాహారాలకు సీలింగ్ ‘ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతాయి’ అన్నది నానుడి. ‘బళ్లు ఓడలవడం మాటెలా ఉన్నా, పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ఓడలు బళ్లయిన వాస్తవం దాదాపు దిగువ మధ్యతరగతి, పేదవర్గాల కుటుంబాలన్నింటిలో కనిపిస్తోంది. ఉదయం ఒకటి లేదా రెండు అల్పాహారాలు, మధ్యాహ్నం ఓ కూరా, ఓ వేపుడూ, రసం లేదా సాంబారు, మధ్యాహ్నం ఒకటిరెండు చిరుతిళ్లు, రాత్రికి కూడా ఇంచుమించు ఒకటికి మించిన ఆధరవులతో తృప్తిగా భోంచేసిన వారే ఇప్పుడు రుచులకు కోత పెట్టుకుంటున్నారు. అల్పాహారం ఆరగించే వేళ కూడా అన్నమే తిని, సరిపెట్టుకుంటున్నారు. ఇక.. అలవాటైన జిహ్వను పంటిబిగువున అదుపు చేసుకుని, సాయంత్రపు స్నాక్స్‌కు స్వస్తి చెపుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : నోట్ల రద్దు పర్యవసానాలు కాలాన్ని తాత, ముత్తాతల నాటికి నెట్టి ఎందరితోనే తిరిగి చద్దన్నాన్ని తినిపించేలా ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, అవసరమైన మేరకు నగదు అందుబాటులో లేకపోవడం, రెండువేల నోట్లు ఉన్నా చిల్లర లేకపోవడంతో ప్రజలు.. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వారు, పేదవర్గాలు నిత్యావసరాల్లో.. చివరికి తిండి విషయంలోనూ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. భోజనంలో వేపుడుతోపాటు సాంబార్ ఘుమఘుమలు, మషాళా ఘాట్లూ పెద్దనోట్ల రద్దు కారణంగా తగ్గిపోయాయి. వారంలో మూడు సార్లు ముద్దపప్పు చేసేవారు ఇప్పుడు ఒకసారి మాత్రమే చేసుకుంటున్నారు. దోసె, ఇడ్లీ వంటి టిఫిన్లు తగ్గిపోయాయి. వారంలో కనీసం నాలుగు రోజులు తినే టిఫి¯ŒS స్థానాన్ని అన్నం ఆక్రమించింది. ప్రజలు నిత్యావసరాల వాడకాన్ని 80 శాతం మేర తగ్గించుకుంటున్నారు. బోసిపోతున్న పచారీ కొట్లు రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దు సామాన్య, మధ్యతరగతి జీవనాన్ని అతలాకుతలం చేయడంతోపాటు వ్యాపార వర్గాన్ని తీవ్ర నష్టాల పాలే్జసింది. ఇతర వ్యాపారాలు ఎలా ఉన్నా కిరాణా దుకాణాలు పెద్దనోట్ల రద్దు కారణంగా బోసిపోతున్నాయి. ప్రజలు కొనుగోళ్లు తగ్గిం చుకోవడం, వచ్చిన వారు రూ.500 నోట్లు ఇస్తుండడం తో వ్యాపారాలు తగ్గిపోయాయి. రూ.రెండువేల నోట్లు అందుబాటులోకి వచ్చినా వాటి మారకానికి అవసరమైన చిల్లర లేకపోవడంతో వ్యాపారులకు ఏమి చేయా లో దిక్కుతోచడంలేదు. రూ.రెండు, మూడు వందలకు సరుకులు కొంటే మిగతా రూ.1700 చిల్లర రూ.100, రూ.50 నోట్ల రూపంలో ఇవ్వాల్సి వస్తుండడంతో బేరా న్ని వదిలేసుకుంటున్నారు. సరుకులు ఇవ్వడానికి క న్నా రెండువేల నోటుకు చిల్లర ఇవ్వడానికి ఆలస్యమవుతోం దని వాపోతున్నారు. మరో వైపు నగదు ఉన్నా అవసరాలు తీరడం లేదన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. నెలవారీ ఖర్చులు భరించేదెలా? ఇతర వస్తువుల కొనుగోలు ఎలా ఉన్నా నిత్యావసరాలు మాత్రం ప్రజలకు తప్పనిసరి. పన్ను పరిధిలోకి వచ్చే కిరాణా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు రాజమహేంద్రవరంలో దాదాపు 1000, కాకినాడలో 900, అమలాపురంలో 700 ఉన్నాయి. ఇలా ప్రతి పట్టణంలోనూ ఉన్నాయి. పన్ను పరిధిలోకి రాని దుకాణాలు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. పెద్దనోట్ల రద్దుతో ఈ దుకాణాల్లో దాదాపు 80 శాతం బేరాలు తగ్గడంతో వ్యా పారులు విలవిలలాడుతున్నారు. ఈ నెల దుకాణం అ ద్దె, విద్యుత్ బిల్లు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించేం దు కు సరిపడా ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొం దని రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారి సుబ్బారావునాయుడు వాపోయారు. స్వైపింగ్ కార్డుల కోసం ఎదురుచూపులు కిరాణా దుకాణాల్లో డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు స్వైపింగ్ యంత్రాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. గత వారం కలెక్టర్ అధ్యక్షతన కిరాణా వ్యాపారులు, బ్యాంకర్ల సమావేశం జరిగింది. స్వెపింగ్ కార్డులు తీసుకోవడానికి వ్యాపారులు సమ్మతించి బ్యాంకులకు దరఖాస్తులు పం పినా ఇప్పటి వరకూ అందలేదు. పలుమార్లు బ్యాంకు అధికారులను కలసినా ఇదిగో అదిగో అంటున్నారే తప్ప యంత్రాలివ్వడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. బేరాలు తగ్గిపోయాయి వ్యాపారం ఈ నెల 80 శాతం తగ్గింది. రూ.500 తీసుకోవడం లేదు. కొనుగోలుదారులు రూ.500 తీసుకుంటారా అని అడిగి లేదంటే వెళ్లిపోతున్నారు. రెండువేల నోట్లు ఇస్తున్నా చిల్లర కొరత వేధిస్తోంది. ఉన్నంత వరకు ఇస్తున్నాం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియడం లేదు. – ఎం. మల్లేశ్వరరావు, శ్రీదేవీవినాయక కిరాణా, జనరల్ స్టోర్, రాజమహేంద్రవరం స్వైపింగ్ కార్డులెక్కడ? పెద్దనోట్ల రద్దు నాటి నుంచి వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించాలంటున్నారు. స్వైపింగ్ యంత్రాలు కావాలని బ్యాంకులకు దరఖాస్తులు పెట్టుకున్నా ఇప్పటి రాలేదు. ఓ వైపు అధికారులు రోజూ ఫో¯ŒS చేసి అడుగుతున్నారు. – గ్రంధి రామకృష్ణ, సెక్రటరీ, శ్రీవెంకటేశ్వర జనరల్ మార్కెట్, రాజమహేంద్రవరం పొదుపుగా వాడుకుంటున్నాం దుకాణాల వద్ద పెద్దనోట్లు తీసుకోవడంలేదు. రెండువేల నోట్లకు చిల్లర దొరకడంలేదు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు చిల్లర సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితి మారే వరకు నిత్యావసరాలను పొదుపుగా వాడుకోవడం తప్ప చేయగలిగింది లేదు. – ఐ.మణికుమారి, సీతంపేట, రాజమహేంద్రవరం -
రూ.50 లక్షల పెద్దనోట్లు స్వాధీనం
బెంగళూరు (బనశంకరి) : బెంగళూరులోని కళాసీపాళ్య పోలీసులు గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, రూ.50 లక్షల విలువైన పెద్దనోట్లను స్వాధీనం చేసుకున్నారు. చిక్కపేటేకు చెందిన మనోజ్ కుమార్ సింగ్, ప్రతాప్ స్థానిక రెసిడెన్సీరోడ్డులో టెక్స్టైల్స్ దుకాణాలు నిర్వహిస్తున్నారు. వీరిలో మనోజ్‌కుమార్‌సింగ్ రియల్ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలను సంప్రదించి 30 శాతం కమీషన్‌పై బ్లాక్‌మనీని వైట్ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో నిఘా పెట్టారు. గురువారం నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తుండగా మనోజ్‌తో పాటు ప్రతాప్‌ను అరెస్ట్ చేశారు. అలాగే మరొక వ్యక్తిని, ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
నోట్ల రద్దుతో రైతులు అతలాకుతలం
* వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగ నాగార్జున, లేళ్ళ అప్పిరెడ్డి * చేతికందిన పంట మట్టిపాలు * పంటను కాపాడుకోలేకపోతున్న దైన్యం ఇంటూరు (అమృతలూరు): పెద్దనోట్ల రద్దుతో రైతులు అతలాకుతమవుతున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మండలంలోని ఇంటూరులో గురువారం వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి వీరభద్ర శ్రీనివాసరెడ్డి (వాసు) గృహంలో పార్టీ నాయకులతో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ వ్యవసాయ తరుణంలో కూలీలకు కూలిడబ్బులు చెల్లించేందుకు కూడా చేతిలో చిల్లర నోట్లు లేక రైతులు సతమతమవుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లు చెల్లవనడంతో రైతాంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ధ్వజమెత్తారు. బ్యాంకుల ద్వారా వారానికి రూ.25 వేలు ఇస్తున్నామని ఊదరగొట్టి, వ్యవసాయ రైతులకు ఆటంకం కలిగించమని చెబుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ అమలు చేస్తున్నారో జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యవసాయం దండగ అన్నట్టుగా వ్యవహారం.. రెండో పంటకు అదును దాటడంతో రైతుల్లో కలవరం మొదలైందన్నారు. నోట్ల రద్దు కారణంగా కనీసం విత్తనాలు కొనలేని పరిస్థితి దాపురించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు 90 శాతం అపరాలు మినుము, పెసర విత్తనాలు సబ్సిడీపై ఇచ్చారని గుర్తు చేశారు. రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలు ఇవ్వకపోవడమే కాక, నాణ్యమైన విత్తనాలు కూడా దొరకడం లేదని, నకిలీ విత్తనాలతో రైతుల నోట్లో మట్టి కొడుతున్నారన్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఒకసారి స్వాగతిస్తున్నామని, రెండోసారి తిరస్కరిస్తున్నామని, మూడోసారి కలత చెందానని అనడం ఆయన స్థాయికి తగదన్నారు. రైతులకు వ్యవసాయం దండగ అన్నట్టుగానే చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు సంక్షోభంలో ఉండడంతో కోతలు అర్థాంతరంగా ఆగిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ధాన్యాన్ని కొనిచ్చే ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం సమస్యలపై ప్రభుత్వం చోద్యం చూస్తుంటే.. రైతాంగం తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రైతులతో పెట్టుకుంటే ప్రభుత్వాలకు చరిత్ర లేకుండా చేస్తారన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
‘కేంద్రం అసమర్థతతోనే ప్రజలు కష్టాలు’
అనంతపురం సెంట్రల్ : పెద్ద నోట్లను రద్దు చేయడానికి ముందు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, దీంతోనే ప్రజలకు కష్టాలని మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. అనంతపురం పాతూరులోని గాంధీ విగ్రహం ఎదుట వ్యాపారుల ఇబ్బందులను బుధవారం ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాడిపత్రి బస్టాండ్‌లోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీసీసీ అధికార ప్రతినిధి రమణ, డీసీసీ నగర అధ్యక్షుడు దాదాగాంధీ, యువజన కాంగ్రెస్ నాయకులు జనార్దన్‌రెడ్డి, గోవర్దన్ పాల్గొన్నారు. -
అందుకోండి మొబైల్‌క్యాష్..
పీవోఎస్ పాయింట్లతో డబ్బులు చెల్లింపు ► ఎస్బీఐ ఆధ్వర్యంలో సేవలు ► ఖాతాదారులకు ఆసరాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ బిజినెస్ : పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచి బ్యాంకుల ఎదుట బారెడు క్యూలైన్లు.. ఏటీఎంలలో గంటల్లోనే డబ్బులు నిండుకోవడంతో జనం పాట్లు అన్నీ ఇన్నీ కా వు. గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూసి మన వంతు వచ్చేసరికి నగదు ఖాళీ అరుుతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డబ్బులు తీసుకుని బ్యాంకులు మన దగ్గరికే వస్తే ఎలా ఉం టుంది..! ఎడారిలో ఒయాసిస్ కనిపించి నంత సంబరం చేసుకుంటాం!! ప్రజల నగ దు కష్టాలను కొంతైనా తీర్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొబైల్‌క్యాష్ ఎట్ పీవోఎస్ పారుుంట్లు ఏర్పాటు చేశారు. స్టేబ్ బ్యాంక్ ఏటీఎం కార్డుదారులకు రూ.వెరుు్య అందిస్తున్నారు. ఆరు రోజులుగా పీవోఎస్ మిషన్ల ద్వారా నగరంలో సేవలు అందిస్తున్నారు. కరీంనగర్‌తోపాటు జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఐదు కేంద్రాల ఈ సేవలందిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్ఎం శోభ తెలిపారు. ఈ సేవలందుకున్న వినియోగదారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. అవసరాలు తీర్చుతున్నాయి.. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు దొరక్క చాలా ఇబ్బందవుతుంది. నేను పనిమీద కరీంనగర్ వచ్చాను. ఎక్కడా పెద్దనోట్లు చెల్లడం లేదు. ఎస్బీఐ అందిస్తున్న ఈ సేవలు చాలా బాగున్నాయి. రద్దీగా ఉండే బస్టాండ్‌లో ఏర్పాటు చేయడంతో ప్రజలు అవసరాలు తీర్చుతున్నాయి. - విష్ణు, సిరిసిల్ల ఏటీఎంలు ఖాళీ... చిల్లర లేక చాలా ఇబ్బందులు పడుతున్నం. ఖాతాల్లో నగదు డ్రా చేసుకుందామని అన్ని ఏటీఎంలు తిరిగినా ఎక్కడ డబ్బులు లేవు. చివరికి బస్టాండ్ వద్దకు రాగానే ఇది కనిపించింది. ఏంటని తెలుసుకుంటే డబ్బులు ఇస్తున్నామన్నారు. ఎక్కడ తిరిగినా డబ్బులు దొరకని పరిస్థితిలో మన వద్దకే ఇలా రావడం ఆశ్చర్యం కలిగించింది. - ఎండీ ఇలియాస్, కరీంనగర్ ఎస్బీఐ సేవలు అద్భుతం మా ఊరు నుంచి కరీంనగర్‌కు పనిమీద వచ్చిన. కరీంనగర్ మొత్తం తిరిగినా ఏటీఎంలు ఎక్కడా పనిచేస్తలేవు. చివరికి బస్టాండ్‌కి వచ్చేసరికి ఎస్బీఐ వినియోగదారులకు డబ్బులిస్తున్నారు. పీవోఎస్ మిషన్‌తో ఏటీంఎం కార్డు ద్వారా రూ.వెరుు్య ఇచ్చారు . - అంజయ్య, గన్నేరువరం ఖాతాదారులకు అండగా.. ఖాతాదారుల ఇబ్బందులు తొలగించి కొంతవరకు అండగా నిల్చేందుకే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నగరంలో అక్కడక్కడ మొబైల్ క్యాష్ ఎట్ పీవోఎస్ పారుుంట్ల తో ఏటీఎం కార్డు ద్వారా రూ.వెరుు్య నగదు చెల్లిస్తున్నాం. చా లా మంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు. - ఎం.శ్రీనివాసమూర్తి, మేనేజర్, ఎస్బీఐ (ఆర్బీవో, సీఎస్ అండ్ సీఎం) -
మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
- ఒకటి నుంచి అమలు కర్నూలు(హాస్పిటల్): వచ్చే నెల ఒకటో తేదీ నాటికి అన్ని మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్(ఈ - పాస్)లను తప్పనిసరి చేస్తూ ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒ.కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కెమిస్ట్ భవన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బ్యాంకు అధికారులు, కెమిస్ట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద ప్రస్తుతం కేవలం 10 శాతం మాత్రమే నగదు ఉందన్నారు. ఈ కారణంగా మెడికల్‌షాపు నిర్వాహకులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 2వేలకు పైగా హోల్‌సేల్, రిటైల్ కెమిస్ట్లున్నారని, వీరందరూ తప్పనిసరిగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనన్నారు. మిషన్లు ఏర్పాటు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్ అలి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఖాతా నుంచి రూ. 23 వేలు మాయం
గోనెగండ్ల: పెద్ద నోట్ల మార్పిడితో భయాందోళన చెందిన ఓ రైతు తన వద్ద ఉన్న నోట్లను బ్యాంకులో వేస్తే ఓ గుర్తు తెలియని వ్యక్తి దర్జాగా డ్రా చేసుకున్నాడు. బ్యాంక్ అధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న రైతు పోలీసులను ఆశ్రయించాడు.తిప్పనూరు గ్రామానికి చెందిన చాకలి రంగన్న ఇటీవల పత్తిని విక్రయించాడు. పెద్ద నోట్ల రద్దుతో హెచ్.కైరవాడి కెనరా బ్యాంక్‌లోని తన అకౌంట్ నెంబర్ 1816108007023కు ఈనెల 10వ తేదీన రూ.49వేలు, 12వ తేదీన రూ.11.500 జమ చేశాడు. అయితే ఆన్లైన్లో బెంగళూరు, గుర్గావ్ ప్రాంతాల నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఏటీం కార్డుపై నంబరు తీసుకొని ఈనెల 17వ తేదీ నుంచి 19 వరకు బాధితుడి అకౌంట్లోని రూ.23,800తో ఆన్లైన్ షాపింగ్ చేశాడు. ప్రతి రోజు కొంత నగదు అకౌంట్ ద్వారా విత్ డ్రా అవుతుంటే బ్యాంక్ మేనేజర్ బాలచంద్ర గుర్తించి రైతును ఆరా తీశాడు. అయితే తాను నగదును విత్‌డ్రా చేయలేదని ఆ నగదు ఎలా డ్రా అవుతుందో తెలియదని రైతు చెప్పడంతో విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి మాయం చేసినట్లు తెలుసుకున్నారు. మేనేజర్ సూచన మేరకు రైతు రంగన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకే ఇక్కట్లు
– ఆంధ్రా బ్యాంకు ఎదుట ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ అనంతపురం అగ్రికల్చర్ : నల్లధనం నిర్మూలన పేరుతో పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య వర్గాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక కోర్టు రోడ్డులోని ఆంధ్రాబ్యాంకు ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త నోట్లు పెద్ద ఎత్తున చెలామణిలోకి వచ్చే వరకు పాత నోట్లను కొనసాగించాలన్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నా కనీస అవసరాలకు కూడా డబ్బు లభించడం లేదన్నారు. బ్యాంకుల వద్ద నిలబడి ఇప్పటివరకు 70 మంది, పనిఒత్తిడితో 11 మంది బ్యాంకు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా పార్లమెంటులో కనీసం మృతులకు సంతాపం కూడా తెలపకపోవడం దారుణమన్నారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం, భాగస్వామ్య పక్షాలకు చెందిన నాయకులు ముందుగానే తెలిసిందన్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 16 నుంచి 28 లోగా రూ.20.57 లక్షల కోట్లు డిపాజిట్లు చేశారని గుర్తు చేశారు. సీపీఎం నాయకులు గోపాల్, నాగేంద్రకుమార్, ఆర్వీనాయుడు, రామిరెడ్డి ,చండ్రాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుతో పేదలకు ఇబ్బందులు
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు క్షమించరు – వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య కర్నూలు(ఓల్డ్‌సిటీ): నలధనాన్ని అడ్డుకట్ట వేస్తామంటూ ప్రధాని మోదీ రూ. 500, 1000 నోట్లను రద్దు చేసి పేదలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య అన్నారు. మంగళవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మొదట్నుంచీ కార్పొరేట్ వ్యక్తులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, నోట్ల రద్దు నిర్ణయం కూడా వారికి మేలు చేసేలా ఉందన్నారు. ఎలాంటి ముందుజాగ్రత్తలు తీసుకోకుండ నోట్ల రద్దు చేయడంతో 11 మంది బ్యాంకు ఉద్యోగులు, 50 నుంచి 60 మంది సామాన్యుల ప్రాణాలు పోయాయన్నారు. దీనికి కారకులు ఎవరని ప్రశ్నించారు. నల్లకుబేరులపై సర్జికల్ దాడులంటే పేద, మధ్యతరగతి ప్రజలపై చేశారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు మంచి నిర్ణయమంటూ, తన వల్లే ఇది జరిగిందని మొదట్లో గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తున్నాడని మండిపడ్డారు. ప్రధాని, ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు క్షేమించరని చెప్పారు. సమావేశంలో కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డోర్‌డెలివరీ!
* ప్రజాప్రతినిధి అండతో నోట్ల మార్పిడి దందా * విజయవాడ కేంద్రంగా సాగుతున్న రాకెట్ * 30శాతం కమీషన్‌పై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నోట్ల మార్పిడి * పోలీసుల అదుపులో ఓ ముఠా * కేసు నీరుగార్చేందుకు రాజకీయ ఒత్తిళ్లు ! ‘రూ.లక్ష పాత నోట్లకు... రూ.70వేలు కొత్త నోట్లు... మంచి తరుణం మించిన దొరకదు.. వెంటనే రండి... ఎంతైనా మారుస్తాం.. మీకు అనువైన ప్రాంతానికే వస్తాం. ఏదైనా ఇబ్బంది వస్తే అన్న చూసుకుంటారు..’ ఇదీ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా సాగుతున్న నోట్ల మార్పిడి దందా. పెద్ద నోట్ల రద్దును అవకాశంగా తీసుకుని విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరులు భారీ దందాకు తెరతీశారు. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితో కొందరు బ్యాంకు అధికారులు వీరికి సహకరిస్తున్నారు. దీంతో బ్యాంకుల నుంచి దొడ్డిదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసుకున్నారు. అనంతరం ఐదు ముఠాలుగా ఏర్పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నోట్లమార్పిడికి తెరతీశారు. కోట్లలో నోట్లు మారుస్తూ భారీగా కమీషన్లు జేబులో వేసుకుంటున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడ నగరంలో వివాదాస్పదుడిగా గుర్తింపు పొందిన ఓ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఐదుగురు సర్వం తామై నోట్ల మార్పిడి దందాను సాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న బడాబాబులు, వ్యాపారులతో మంతనాలు సాగిస్తున్నారు. 30 శాతం కమీషన్ఇస్తే... పెద్ద నోట్లను మార్పిడి చేసి కొత్త రూ.2వేల నోట్లు ఇస్తామని చెబుతున్నారు. ప్రధానంగా మద్యం, ఇసుక, వడ్డీ, బంగారం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని యథేచ్ఛగా కరెన్సీ దందా సాగిస్తున్నారు. అన్ని కొత్త నోట్లు ఎలా వచ్చాయంటే.. టీడీపీ ప్రజాప్రతినిధి పరపతిని ఉపయోగించి బ్యాంకుల నుంచి కొత్త నోట్లను దొడ్డిదారిలో మార్పిడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమరావతి పరిధిలో కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు దొడ్డిదారిలో భారీగా పెద్ద నోట్లు మార్పిడి చేసినట్లు ఇప్పటికే రిజర్వు బ్యాంకు గుర్తించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వారం రోజుల్లోనే రూ.9,650 కోట్లు మార్పిడి చేయడం గమనార్హం. కొందరు బ్యాంకర్లు అడ్డదారిలో బడాబాబులకు నోట్లు మార్పిడి చేయడం వల్లే ఇది సాధ్యమైందని ఆర్బీఐ ప్రాథమికంగా గుర్తించింది. విజయవాడలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సన్నిహితులతో కూడిన రాకెట్‌కే అడ్డదారిలో భారీగా నోట్లు మార్పిడి చేసినట్లు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. పోలీసుల అదుపులో ఓ ముఠా ! నోట్ల మార్పిడి దందాపై సమాచారం అందడంలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలోని ఓ ప్రాంతంలో నోట్ల మార్పిడి కోసం నిరీక్షిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వారిలో టీడీపీ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు కూడా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఐదుగురిని విచారించడం ద్వారా మొత్తం రాకెట్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు ! నోట్ల మార్పిడి ముఠాను అదుపులోకి తీసుకున్నారని తెలిసిన వెంటనే సదరు టీడీపీ ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు. తన ముఖ్య అనుచరుడిని విడిచిపెట్టాలని... మిగిలిన వారిపై కూడా నామమాత్రంగా కేసు నమోదు చేయాలని ఆయన ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. నగదు మార్పిడి ఇలా.. సెల్ఫోన్ల ద్వారా తమ పని సాగిస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు దిన పత్రికపై తేదీ కనిపించేలా కొత్త రూ.2వేల నోట్ల కట్టలను ఉంచి ఫొటో తీసి వాట్సాప్ ద్వారా పంపుతారు. తద్వారా అవి కొత్త నోట్లు అని నిర్ధారణ అవుతుంది. అనంతరం 30శాతం కమీషన్‌పై ఓ చోటకు చేరుకుని నోట్లు మార్పిడి చేస్తున్నారు. ఇలా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలకు చెందిన నల్లకుబేరులు భారీగా నోట్లు మార్చుకున్నారు. మంత్రులదీ అదేదారి! నోట్ల మార్పిడిలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా తమ అనుచరులకు సాయం చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి లిక్కర్ సిండికేట్లతో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని అనుచరులు నోట్లు మార్చుకుని కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మంత్రి అండ ఉండటంతో ఆయన అనుచరులను కొందరు రియల్టర్లు, లిక్కర్ వ్యాపారులు సంప్రదించి గుట్టు చప్పుడుకాకుండా పెద్దనోట్లకుకమీషన్పై మార్చుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోనూ.... గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి రైతులకు రుణాలుగా ఇవ్వాల్సిన కొత్తనోట్లను తన అనుచరులకు ఇప్పించినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధి తన పరిధిలో ఉన్న పాల కేంద్రాల్లో పాత నోట్లు తీసుకోకుండా కట్టడి చేస్తూ... కౌంటర్లలో వచ్చే కొత్తనోట్లను తమ ఖాతాలో వేయించుకుని, తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకులకు జమ చేయిస్తున్నారని సమాచారం. ఒక సీనియర్ ప్రజాప్రతినిధి కుమారుడు కూడా ప్రస్తుతం ఇదే పనిలో బిజీబిజీగా ఉన్న ట్లు తెలిసింది. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ యువరత్నం వివిధ వ్యాపార రంగాలకు చెందిన నల్లకుబేరులను కలిసి ఎన్ని కోట్ల రూపాయలైనా మార్చేస్తామని, 20 శాతం కమీషన్ ఇవ్వాలని చెబుతున్నట్లు సమాచారం. -
ఏ ‘నోటా’ విన్నా..!
అవే కష్టాలు..తొలగని ఇబ్బందులు - పెద్దనోట్ల రద్దుతో విలవిల్లాడుతున్న జనం - ఆదివారం పనిచేయని బ్యాంకులు - మూతపడిన ఏటీఎంలు - తీరని అత్యవసరాలు.. కర్నూలు(అగ్రికల్చర్): పెద్దనోట్ల రద్దు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి..చిల్లర దొరకక ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఆదివారం బ్యాంకులు పనిచేయకపోవడం, ఏటీఎంలు మూతపడడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం గ్రామీణ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు తీసుకోవడానికి ఆంక్షలు విధించడంతో పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో కొత్త రూ. 500 నోట్లు అందుబాటులోకి రాకపోగా..రూ. 100 నోట్లు కూడా లభ్యం కావడం గగనమైంది. అందుబాటులోకి వచ్చిన రూ.2000 నోట్లకు చిల్లర దొరకడం కష్టమయింది. వెరసి దినసరి ఖర్చులకు అవసరమైన డబ్బులు లేక అల్లాడాల్సి వస్తోంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఎప్పుడూ చూడ లేదని రైతులు వాపోతున్నారు. కొరవడిన సహకారం.. రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు జిల్లా సహకార కేంద్రబ్యాంకు, పీఏసీఎస్‌ల్లో నోట్ల మార్పిడి జరగడం లేదు. డిపాజిట్లు స్వీకరించకపోవడంతో గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు పెరిగాయి. పెద్దనోట్ల రద్దు రోజు నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు స్తంభించిపోయాయి. కర్నూలు మార్కెట్లో ఉల్లి కొనుగోళ్లు ప్రారంభించినప్పటికి మిగిలిన వ్యవసాయ ఉత్పత్తుల క్రయ, విక్రయాలు మొదలు కాలేదు. మార్కెట్ల బంద్‌తో హమాలీలు, కాటాదారులు, కూలీలకు ఉఫాది కరువైంది. కొనుగోళ్లు బంద్.. వ్యవసాయ మార్కెట్ కమిటీలలో లావాదేవీలు సాఫీగా కొనసాగడానికి వీలుగా రూ.50వేల వరకు నగదు తీసుకునే అవకాశం ఉన్నా..బ్యాంకుల్లో డబ్బు లేకపోవడం వల్ల ఇది సాధ్యం కాలేదు. ఎస్బీఐ, ఆంధ్రబ్యాంకు, విజయబ్యాంకులకు కరెన్సీ చస్ట్‌లు ఉండటంతో వీటిలో అంత ఇబ్బంది లేదు. మిగిలిన అన్ని బ్యాంకుల్లో కొరత తీవ్రంగా ఉంది. రూ.50వేల తీసుకోవాలని పోతే డబ్బులు లేవంటూ అరకొరగా ఇస్తున్నారు. ఇవి ఏ మూలకు సరిపోతాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తాము పండించిన పంట ఉత్పత్తులు కొనండి... నగదు రూపంలో10శాతం మాత్రమే ఇవ్వండి.. మిగిలిన మొత్తాన్ని చెక్‌ల రూంలో ఇచ్చి సరేనని రైతులు పేర్కొంటున్నా...నగదు లభ్యం కావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ, సి. క్యాంపు రైతు బజార్లో మినీ ఏటీఎంలు ఏర్పాటు చేసినా.. 100 నోట్లు కేవలం 10 మాత్రమే వస్తున్నాయి. ఇబ్బందులు మరిన్ని రోజులు నగదు లభ్యత సాధారణ స్థాయికి రావాలంటే కనీసం నెల రోజులు పట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఏదో విధంగా మార్కెట్లు పనిచేసే విధంగా చూసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా ఇప్పట్లో నగదు అవసరం అయినంత ఇవ్వలేమంటూ బ్యాంకర్లు చేతులెత్తేస్తున్నారు. రైతుల పరిస్థితి, మార్కెటింగ్ మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఏర్పడింది. జన్‌ధన్ ఖాతాలకు డిమాండ్.... పెద్ద నోట్లు రద్దుతో జన్‌ధన్ ఖాతాలకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో 6లక్షల ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే 50 శాతం ఖాతాల్లో రూ.50వేల వరకు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు వీటిపై దృష్టి సారించాయి. -
పడిగాపులు
పనులు మానుకుని బ్యాంక్‌లు, ఏటీఎంల వద్ద ఎదురుచూపులు.. తీవ్రమవుతున్న నగదు కష్టాలు.. 30 శాతం కమీష¯ŒSతో పెద్ద నోట్ల మార్పిడి.. పెరుగుతున్న మోసాలు.. ఇదీ ప్రస్తుతం జిల్లాలో పెద్ద నోట్ల రద్దు ప్రభావం.. సాక్షి ప్రతినిధి, ఏలూరు : కరెన్సీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పనులు మానుకుని రోజంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నా నగదు అందుబాటులోకి రావడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య పరిష్కారం కాకపోగా తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. శనివారం జిల్లాలోని బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. శనివారం డబ్బు మార్పిడిని సీనియర్ సిటిజన్లకు మాత్రమే పరిమితం చేయడంతో మిగి లిన వారు నగదు లభించక ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం వరకూ డబ్బు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపుగా అన్ని ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్ని ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు పెట్టగా, మరికొన్ని ఏటీఎంల షట్టర్లను మూసేశారు. దళారుల వల ఆదాయ పన్ను శాఖకు చెల్లించే 30 శాతం నగదు తమకు కమీష¯ŒSగా ఇస్తే చాలు.. రద్దయిన నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామంటూ దళారులు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ ఈ దందా కొనసాగుతోంది. ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, ఖాతాల్లో నగదు జమను రూ.2.50 లక్షలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎగువ మధ్య తరగతికి చెందిన వారు తమ అవసరాల కోసం ఇళ్లలో దాచుకున్న పాత పెద్ద నోట్లను మార్చుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. భూములు, ఫ్లాట్లు కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బును ఇప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియక దళారులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాంకు మేనేజర్లు కూడా ఈ దళారులతో కుమ్మక్కైనట్టు వార్తలు వస్తున్నాయి. సందట్లో సడేమియా మరోవైపు వృద్ధులను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆచంటలో ఆంధ్రాబ్యాంక్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లిన వృద్ధురాలి నుంచి రూ.49 వేలు దొంగిలించుకుపోయారు. బాలంవారిపాలెంకు చెందిన ముంగండ వీరరాఘవులు (65) అనే వృద్ధురాలు డ్వాక్రా సంఘంలో వచ్చిన రుణం, ఆమె దాచుకున్న డబ్బులు కలిపి తన ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా ఆ సొమ్మును దొంగలు అపహరించుకు పోయారు. జీలుగుమిల్లికి చెందిన వ్యాపారి రూ.34 లక్షలు నేరుగా బ్యాంక్ మేనేజర్‌కు కమీష¯ŒS ఇచ్చి మార్చుకున్నట్టు ప్రచారం ఉంది. మరోవైపు రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి వాటిని అమాయకులకు అంటగడుతున్నారు. జిల్లాలో వరసగా ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండటంతో అసలు నోటు ఇచ్చినా తీసుకోవడానికి వ్యాపారులు సంశయిస్తున్న పరిస్థితి కనబడుతోంది. -
పెద్దనోట్లతో పన్ను చెల్లించొచ్చు
అనంతపురం : వాణిజ్య పన్నుల శాఖకు సంబం«ధించి అన్ని ఆర్థిక లావాదేవీలు పెద్దనోట్లతో (పాత రూ. 1000, 500) చెల్లించవచ్చని, ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారని, అసిస్టెంట్ కమిషనర్ శేషాద్రి తెలిపారు. పన్నులు, అపరాధ రుసుం, సీఫీజు, వడ్డీ తదితర మొత్తాలను వ్యాపారులు పాత నోట్లతోనే చెల్లించవచ్చని చెప్పారు. చలానా ద్వారా నేరుగా బ్యాంకులో్ల చెల్లింవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నోట్లు నిండుకున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పది రోజుల తర్వాత కూడా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు నగదు లేదన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు సైతం చాలావరకు మూతపడే ఉన్నాయి. వాటిలో పెడుతున్న నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. వాటివద్ద కూడా ‘అవుటాఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’ అనే బోర్డులు వేలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో శుక్రవారం నాటికి రూ.100 నోట్లు దాదాపు నిండుకున్నాయి. చాలా బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ‘నగదు నిండుకున్నందుకు చింతిస్తున్నా’మంటూ బ్యాంకుల ఎదుట బోర్డులు పెట్టి తలుపుల్ని మూసేస్తున్నారు. నిఘా పెరిగింది ప్రైవేటు బ్యాంకులు అప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరిచి నల్లధనాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటి లావాదేవీలపై ఇంటెలిజె¯Œ్స విభాగం నిఘా పెట్టింది. జ¯ŒSధ¯ŒS ఖాతాలతోపాటు రుణాలు చెల్లిస్తున్న డ్వాక్రా మహిళల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని బ్యాంకుల్లో జరిగే రోజువారీ లావాదేవీలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ముల వివరాలు, నోట్ల మార్పిడికి సంబంధించిన పూర్తి వివరాలు పంపాలని ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలొ చ్చాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన సీసీ పుటేజీ ఆర్బీఐకు అందజేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టాఫీసు, బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేయడంతో.. వ్యక్తిగత ఖాతాల్లోని సొమ్ముల్ని ఏటీఎంల ద్వారా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. చాలామంది తమవద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడం తలకుమించిన భారంగా మారింది. దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. పలుచోట్ల కమీష¯ŒS తీసుకుని చిల్లర ఇస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని పేదలు, కూలీలు తమకు వేతనం రూపంలో ఇచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, కిరాణా దుకాణాలలో సరుకుల కొనుగోలుకు కూపన్లు ఇస్తామని ప్రకటించినా.. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో అన్ని వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. ఒక్క స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖల్లో మాత్రమే నగదు నిల్వలు ఉంటుండగా, వాటి శాఖల్లో మాత్రం సొమ్ములు ఉండటం లేదు. దీంతో ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచిల వద్ద రద్దీ కనబడుతోంది. పాలకోడేరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శుక్రవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మేనేజర్ సరిగా సమాధానం చెప్పడం లేదంటూ ఖాతాదారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. -
నోట్లు నిండుకున్నాయ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పది రోజుల తర్వాత కూడా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. బ్యాంకుల ముందు నగదు లేదన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఏటీఎంలు సైతం చాలావరకు మూతపడే ఉన్నాయి. వాటిలో పెడుతున్న నగదు గంటలోనే ఖాళీ అవుతోంది. వాటివద్ద కూడా ‘అవుటాఫ్ సర్వీస్’, ‘నో క్యాష్’ అనే బోర్డులు వేలాడుతున్నాయి. జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో శుక్రవారం నాటికి రూ.100 నోట్లు దాదాపు నిండుకున్నాయి. చాలా బ్యాంకులు డిపాజిట్లు తీసుకోవడానికే పరిమితం అవుతున్నాయి. ‘నగదు నిండుకున్నందుకు చింతిస్తున్నా’మంటూ బ్యాంకుల ఎదుట బోర్డులు పెట్టి తలుపుల్ని మూసేస్తున్నారు. నిఘా పెరిగింది ప్రైవేటు బ్యాంకులు అప్పటికప్పుడు కొత్త ఖాతాలు తెరిచి నల్లధనాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో వాటి లావాదేవీలపై ఇంటెలిజె¯Œ్స విభాగం నిఘా పెట్టింది. జ¯ŒSధ¯ŒS ఖాతాలతోపాటు రుణాలు చెల్లిస్తున్న డ్వాక్రా మహిళల గురించి కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. జిల్లాలోని బ్యాంకుల్లో జరిగే రోజువారీ లావాదేవీలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఖాతాల నుంచి తీసుకున్న సొమ్ముల వివరాలు, నోట్ల మార్పిడికి సంబంధించిన పూర్తి వివరాలు పంపాలని ఆర్బీఐ నుంచి బ్యాంకులకు ఆదేశాలొ చ్చాయి. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో జరిగే లావాదేవీలకు సంబంధించిన సీసీ పుటేజీ ఆర్బీఐకు అందజేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోస్టాఫీసు, బ్యాంకుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేయడంతో.. వ్యక్తిగత ఖాతాల్లోని సొమ్ముల్ని ఏటీఎంల ద్వారా తీసుకునే వారి సంఖ్య పెరిగింది. చాలామంది తమవద్ద ఉన్న రూ.2 వేల నోట్లను మార్చుకోవడం తలకుమించిన భారంగా మారింది. దుకాణాల్లో రూ.2 వేల నోట్లు తీసుకోవడానికి వ్యాపారులు ససేమిరా అంటున్నారు. పలుచోట్ల కమీష¯ŒS తీసుకుని చిల్లర ఇస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బ్యాంకు ఖాతాలు లేని పేదలు, కూలీలు తమకు వేతనం రూపంలో ఇచ్చిన పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ పెద్దనోట్లు తీసుకుని కూరగాయలు, కిరాణా దుకాణాలలో సరుకుల కొనుగోలుకు కూపన్లు ఇస్తామని ప్రకటించినా.. పూర్తిగా అందుబాటులోకి రాలేదు. బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడంతో అన్ని వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్తంభించింది. ఒక్క స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖల్లో మాత్రమే నగదు నిల్వలు ఉంటుండగా, వాటి శాఖల్లో మాత్రం సొమ్ములు ఉండటం లేదు. దీంతో ఎస్బీఐ మెయి¯ŒS బ్రాంచిల వద్ద రద్దీ కనబడుతోంది. పాలకోడేరు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద శుక్రవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మేనేజర్ సరిగా సమాధానం చెప్పడం లేదంటూ ఖాతాదారులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. -
భార్యకు పెద్దనోట్లతో భరణం, భర్తకు జైలు
కోల్‌కతా: విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యకు భరణం కింద రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను చెల్లించిన భర్త జైలుపాలయ్యాడు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కోల్‌కతాకు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ ఏడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. విడాకుల కోసం దరఖాస్తు చేయగా కోర్టులో కేసు నడుస్తోంది. మనోవర్తి కింద నెలకు 8 వేల రూపాయల చొప్పున భార్యకు చెల్లించాల్సిందిగా గతంలో కోర్టు ఆదేశించింది. కాగా నాలుగేళ్లుగా ఆయన భరణం చెల్లించలేదు. ఈ నెల నాటికి ఆయన మొత్తం 2.25 లక్షల రూపాయలు భార్యకు చెల్లించాల్సి వచ్చింది. భరణం చెల్లించకపోయిన విషయాన్ని ఆయన భార్య కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఈ నెల 8వ తేదీ నాటికి ఈ మొత్తం నగదు ఆమెకు ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. రిటైర్డ్ ఇంజినీర్ తరపున ఆయన సోదరుడు కోర్టు విచారణకు హాజరయ్యాడు. సోదరుడి భార్యకు ఇవ్వాల్సిన భరణంలో రెండు లక్షల రూపాయలు కోర్టులో చెల్లించాడు. ఇవన్నీ 500, 1000 రూపాయల నోట్లు. అయితే రద్దయిన ఈ నోట్లను తీసుకునేందుకు రిటైర్డ్ ఇంజనీర్ భార్య తిరస్కరించింది. చట్టపరంగా చెల్లుబాటులో ఉన్న నోట్లను ఇవ్వాలని కోరింది. ఆమె వాదనకు జడ్జి కూడా అభ్యంతరం చెప్పలేదు. పెద్ద నోట్లను రద్దు చేసినా వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని రిటైర్డ్ ఇంజినీర్ తరఫు న్యాయవాది వాదించినా ఆమె అంగీకరించలేదు. చెక్, డీడీ రూపంలో ఇస్తామన్నా ఒప్పుకోలేదు. దీంతో గడువులోపల భరణం చెల్లించడంలో విఫలమైన రిటైర్డ్ ఇంజినీర్‌కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. -
పెద్ద నోట్ల రద్దు బాబుకు ముందే తెలుసా ?
-
హుండీలు నిండుతున్నాయి
• ఆలయాలకు పోటెత్తుతున్న పెద్ద నోట్లు • కానుకలుగా సమర్పించుకుంటున్న ‘పెద్ద భక్తులు’ • భక్తుల సంఖ్య తగ్గుతున్నా భారీ ఆదాయం! సాక్షి, హైదరాబాద్: కార్తీక సోమవారం. శివునికి రుద్రాభిషేకం చేయాలి. టికెట్ రూ.300. ఓ భక్తుడు రూ.500 నోటిచ్చాడు. రూ.200 తిరిగివ్వడానికి సిబ్బం దికి చిల్లర దొరకలేదు. చిల్లర బదులు 8 లడ్డూ ప్రసాదాలను భక్తుని చేతిలో పెట్టారు. అన్ని వద్దని, చిల్లరే ఇవ్వాలని కోరినా చేతులెత్తేశారు! మరో భక్తుడు అమ్మవారికి కుంకుమార్చన చేరుుంచాడు. టికెట్ రుసుము పోను మిగతా చిల్లర సిబ్బంది ఇవ్వలేకపోయారు. దాంతో సదరు భక్తుడు ఆ మొత్తాన్ని ఆలయానికే విరాళంగా ఇచ్చేశాడు!! ఇంకో ఆలయంలో మూడు హుండీలూ ఒక్కసారిగా నిండిపోయారుు. రూ.1,000, రూ.500 నోట్లు నిండుగా నిండి, చోటు చాలక బయటికి హుండీల్లోంచి బయటికే కనిపిస్తున్నారుు. దాంతో ఎప్పట్నుంచో మూలపడి ఉన్న పాత హుండీ దుమ్ముదులిపి తెచ్చిపెడితే అదీ నిండిపోరుుంది!! రాష్ట్రంలో భక్తి భావం ఉప్పొంగుతోంది. భగవంతునికి భక్తులు భారీగా కానుకలు సమర్పించుకుంటున్నారు. ఇష్టాలయాలకు బారులుతీరి మరీ హుండీలను నోట్లతో నింపేస్తున్నారు. చిన్న దేవాలయాల్లో కూడా హుండీలు ఇట్టే నిండిపోతున్నారుు! అంతా పెద్ద నోట్ల రద్దు ఫలితం!! రూ.1,000, 500 నోట్లను భారీగా పోగేసుకున్న ‘పెద్ద’భక్తులు వాటిని భారీగా ఆలయాలకు సమర్పిస్తున్నారు. విరాళంగా ఇస్తే పేర్లు వెల్లడించాల్సి వస్తుందని నోట్ల కట్టల రూపంలోనే హుండీల్లో వేసేస్తున్నారు. దాంతో హుండీలు చకచకా నిండిపోతున్నారుు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోన ప్రధాన దేవాలయమైన కాళేశ్వరంలో దాదాపు నాలుగు హుండీలూ పూర్తిగా నిండిపోయారుు. ఇక్కడ సాధారణంగా మూడు నెలలకోసారి హుండీలు తెరుస్తారు. ఉత్సవాలు, పండుగలప్పుడైనా నెలకోసారే తెరుస్తారు. ఇప్పుడు అంతకంటే ముందే హుండీలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి లక్ష్మినరసింహస్వామి ఆలయంలోనూ హుం డీలు బరువెక్కారుు. వాటిని తెరిచి నాలుగు రోజులే కావడం విశేషం! రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! విచిత్రమేమిటంటే, చిల్లర సమస్యతో ప్రయాణాలు ఇబ్బందికరంగా మారి సాధారణ రోజుల కంటే అన్ని ఆలయాలకూ భక్తుల రద్దీ ఇప్పుడు కాస్త తగ్గింది. ఆ లెక్కన హుండీ ఆదాయం తగ్గాల్సింది పోరుు సీన్ రివర్సవుతోంది! రద్దరుున పెద్ద నోట్లు భారీగా ఉండి, బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు లేని ‘భక్తులు’అందులో వీలైనంత మొత్తాన్ని దేవుళ్లకు సమర్పించేస్తున్నారు. సాధారణంగా రోజుకు రూ.లక్షన్నర దాకా ఉండే భద్రాచలం రామాలయం హుండీయేతర ఆదాయం ఐదారు రోజులుగా రూ.ఐదున్నర లక్షలు దాటుతోం ది! అరుుతే, రద్దరుున పెద్ద నోట్లు ప్రస్తుతానికి చెల్లుతాయంటూ కేంద్రం ప్రకటించిన జాబి తాలో ఆలయాలు లేకపోవడంతో వాటికి ఇలా వచ్చిపడుతున్న నోట్ల చెల్లుబాటుపై అయోమయం నెలకొంది. వీటిని డిసెంబరు 31లోపు మార్చుకోవాల్సి ఉండటంతో ఎప్పటికప్పుడు బ్యాంకుల్లో జమ చేయాల్సిందిగా ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ తాజాగా ఆలయాలన్నింటికీ సర్క్యులర్ ఇచ్చారు. తద్వారా బ్యాంకుల నుంచి అభ్యంతరాలేమైనా వస్తే తదుపరి కార్యాచరణకు సమయం చిక్కుతుందన్నది శాఖ ఆలోచన. చిల్లర చిక్కులు మరోవైపు ఆలయ సిబ్బందిని చిల్లర చిక్కులు వేధిస్తున్నారుు. సేవలు, పూజాదికాల కోసం భక్తులు రూ.1,000, 500 నోట్లే ఇస్తుండటంతో చిల్లర ఇవ్వడం వారి తరం కావడం లేదు. దాంతో చిల్లరకు బదులు ప్రసాదం ఇచ్చి సరిపెడుతున్నారు. మరికొందరికి భవిష్యత్తు సేవల కోసం అడ్వాన్సుగా పేర్లు రాసి రశీదులిస్తున్నారు. ఇంకొందరు భక్తులు ఆ మొత్తాన్ని విరాళంగా సమర్పిస్తున్నారు. ఇంకోవైపు రోజువారి ఆలయ ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోవటం కూడా సిబ్బందికి సమస్యగానే మారింది. బ్యాంకు నుంచి రోజువారి నగదు విత్‌డ్రాకు పరిమితి ఉండటం, గంటల తరబడి లైన్లలో నుంచోవాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నారుు. హైదరాబాద్ శివారులోని కీసరగుట్ట వంటి ఆలయాల్లో సాధారణంగా ఘనంగా జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలు ఈసారి ఇలాంటి కారణాలతో వెలవెలబోయారుు. -
రియల్‌కు ‘పెద్ద’ షాక్!
యాచారం: రియల్ వ్యాపారానికి ‘పెద్ద’ షాక్ తగిలింది. ప్లాట్ల ధరలు నెల క్రితంతో పోలిస్తే 30 శాతానికి పైగా పడిపోయాయి. స్థానికంగా ఫార్మాసిటీ ఏర్పాటు కావడం.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తున్న మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేశారు. దీనికోసం రూ.కోట్లలో ఖర్చు చేశారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యాచారం, మాల్ కేంద్రాల్లోని ప్లాట్లు రోజుకు 50 నుంచి 100 వరకు రిజిస్ట్రేషన్ చేసేవారు. రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో నాలుగు రోజులుగా పూర్తిగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలూ మూత పడ్డాయి. పడిపోయిన ధరలు యాచారం, మాల్ కేంద్రాల్లో 60కి పైగా వెంచర్లను ఏర్పాటు చేశారు. యాచారంలో గజం ధర రూ. 2 వేల నుంచి రూ.10 వేలకు పైగా ఉండగా... మాల్లో గజం ధర రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. యాచారం, మాల్, నందివనపర్తి, గునుగల్, తక్కళ్లపల్లి, నల్లవెల్లి, తమ్మలోనిగూడ, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో వందలాది ప్లాట్ల కొనుగోలుకు ప్రజలు భారీగా అడ్వాన్స్ లు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు.. భవిష్యత్తులో ధరలు మరింత పతనమవుతాయనే బెంగతో వ్యాపారులు అడ్వాన్సులు ఇచ్చిన వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అటు నుంచి స్పందన ఉండడం లేదు. యాచారం, మాల్ కేంద్రాల్లోనే ప్రజలు రూ.15 కోట్లకు పైగా అడ్వాన్స్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రిజిస్ట్రేషన్లకు సిద్ధమవుతున్న వారు పెద్ద నోట్లు ఇస్తామని చెబుతుండడంతో వ్యాపారులు కంగుతింటున్నారు. -
పెద్దనోట్ల రద్దుపై యోగాగురు ఏమన్నారంటే?
న్యూఢిల్లీ : బ్లాక్‌మనీపై ఉక్కుపాదంగా, అవినీతిని, టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ఆకస్మాతుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై ఓ వైపు ఘాటైన విమర్శలు వస్తుండగా.. యోగ గురు రామ్‌దేవ్ బాబా ప్రధాని పక్షాన నిలిచారు. మన వ్యవస్థకు పట్టిన చీడను నిర్మూలిస్తున్న క్రమంలో ప్రజలందరూ కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు. రూ.500, రూ.1000 నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయంతో నల్లధనం, అవినీతి, తీవ్రవాదం, నకిలీ నోట్ల వ్యాపారాలకు తీవ్రంగా దెబ్బకొట్టనుందని తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని వ్యాఖ్యానించారు. మేదంతా-మెడిసిటీ నిర్వహించిన ఇంటర్నేషనల్ కారొనరీ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. రూ.100 నోట్లను సేకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది ప్రజలు, ప్రధాని తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంతోనే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిందించడం కంటే, సిస్టమ్ క్లీన్ అప్‌లో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, భారత జవాన్లు మనకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటారని, వారాల కొద్దీ నిద్రాహారాలు మానేసి పనిచేస్తుంటారని చెప్పారు. ఇప్పుడు మనం చేయాలేమా? అని ప్రశ్నించారు. జాతీ సంక్షేమం దష్ట్యా కొన్ని రోజులు ఈ తిప్పలను మనం ఎదుర్కోలేమా? అని రామ్ దేవ్ బాబా ప్రశ్నించారు. స్వాతంత్ర్యానంతరం మొదటిసారి ఓ బలమైన రాజకీయ నాయకుడిని చూస్తున్నామని, ల్యాండ్ మాఫియా, పొలిటికల్ మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా వ్యతిరేకిస్తున్నా, ఎవరికీ తలొగ్గకుండా ఈ సంచలన నిర్ణయం ప్రధాని అమలుచేస్తున్నారని ప్రశసించారు. -
‘నోట్ల’ కోసం టవరెక్కిన యువకుడు
నోట్ల మార్పిడి అవస్థలు భరించలేక సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్‌లో ఖాజా అనే యువకుడు సెల్‌టవరెక్కాడు. ఖాజా వద్ద రూ.15 వేల విలువైన పెద్ద నోట్లు ఉన్నారుు. వాటిని మార్పించుకోవడానికి శనివారం సంగారెడ్డిలోని ఎస్బీఐకి వెళ్లాడు. రద్దీ కారణంగా వీలుగాక ఇంటికి వచ్చేశాడు. డబ్బులు మార్చుకోవడానికి బ్యాంకు అధికారులు నిరాకరించారని, అత్యవసరానికి చేతిలో డబ్బులు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు. పోలీసులు, పలువురు నేతలు అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో దిగాడు. -
రెండురోజుల్లో పెళ్లి.. ‘పైసల’ కోసం పాట్లు
గార్ల: రెండు రోజుల్లో పెళ్లి.. బట్టలు తీసుకోవాలి.. అవసరమైన సామాన్లు.. కూరగాయలు కొనాలి.. చేతి నిండా డబ్బులున్నా కొనలేని పరిస్థితి.. ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఆ కుటుంబం మొత్తం బ్యాంకుల దగ్గర పడిగాపులు పడాల్సి వస్తోంది. విచిత్రమేంటంటే ఆఖరికి పెళ్లి కూతురు కూడా బ్యాంకు దగ్గర కొత్త నోట్ల కోసం క్యూలో నిల్చొవాల్సి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని మైసా ఐలేశ్ ఆవేదన ఇది.. ‘నా కూతురు శ్రావణి పెళ్లి రెండు రోజుల్లో ఉందని బ్యాంకు మేనేజర్‌ను వేడుకున్నా.. ఫలితం లేకుండా పోరుుంది. పెద్దనోట్ల రద్దుతో మా బిడ్డ పెళ్లి వారుుదా వేసుకోవాల్సి వస్తోంది. కనీసం పెళ్లిళ్లు, శుభ, అశుభ కార్యాలు నిర్వహించే వారిైకైనా నోట్ల మార్పిడి విషయంలో ప్రభుత్వం వెసులు బాటు కల్పించాలి’ అని కోరాడు. -
సామాన్యులకు పెద్ద కష్టాలు
(సాక్షి ప్రతినిధి, అనంతపురం ) పెద్దనోట్ల రద్దు సామాన్యుల పాలిట శిక్షగా మారింది. వాటిని రద్దు చేసిన కేంద్రం, ఆర్బీఐ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాతపెద్దనోట్లు చెల్లకపోవడం, చిల్లర లేకపోవడంతో సామాన్యుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ఉద్యోగులు, కూలీలు, గృహిణులు మొత్తం అన్ని పనులు వదిలేసి బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొంటున్నారు. అయినా సమస్య తీరడం లేదు. నిత్యావసరాలు, మందుల కొనుగోలు, ఇతర ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా చేతులెత్తేసిన బ్యాంకర్లు కరెన్సీ మార్పిడి విషయంలో బ్యాంకర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఈ నెల ఎనిమిదిన నోట్లరద్దుపై ప్రకటన చేసిన కేంద్రం.. 11 నుంచి ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయని ప్రకటించింది. అయితే.. జిల్లా వ్యాప్తంగా కొన్ని ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. దాదాపు 80శాతం ఏటీఎంల ముందు ’అవుట్ ఆఫ్ సర్వీసు’ అని బోర్డు కన్పిస్తోంది. రూ.వందనోట్లు పెట్టి, ఏటీఎంలు పనిచేసేలా చర్యలు తీసుకున్నా సామాన్యులకు కాస్త ఇబ్బందులు తప్పేవి. మరో 2–3 వారాలు ఏటీఎంలలో ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఎస్బీఐ, ఆంధ్రా, సిండికేట్‌తో పాటు పది బ్యాంకుల్లోనే నగదు మార్పిడి చేస్తున్నారు. తక్కిన 14 బ్యాంకుల్లో నగదు రాలేదని చెబుతున్నారు. అనివార్యంగా అన్నివర్గాల వారు నగదు కోసం బ్యాంకుల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. తీరా బ్యాంకర్లు రెండు రూ.2 వేల నోట్లు చేతిలో పెడుతున్నారు. రూ.500 నోట్లు ఇంకా బ్యాంకులకు చేరలేదు. మరోవైపు రూ.2వేల నోట్లను దుకాణదారులు ఎక్కడా తీసుకోవం లేదు. రూ.2 వేలకు సరుకు కొనుగోలు చేస్తే సరి. లేదంటే చిల్లర లేదని నిరాకరిస్తున్నారు. విజయవాడ, హైదరాబాద్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది కరెన్సీని అపార్ట్మెంట్లు, వీధుల్లోకి తీసుకెళ్లి ’మొబైల్ ఏటీఎం’ తరహాలో పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ’అనంత’లోనూ అన్ని బ్యాంకులు చేపడితే ప్రజలకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. సామాన్యుల వేదన ఆరురోజులుగా సామాన్యులు చిల్లర కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. దాదాపు అన్ని ఇళ్లలో వందనోట్లు స్వల్పంగా ఉంటే, రూ.500 నోట్లు అధికంగా ఉన్నాయి. వీటిని మార్పిడి చేసుకోలేని వాళ్లు కిరాణా కోట్లకు వెళితే.. అక్కడా తీసుకోవడం లేదు. రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. అనారోగ్యం కారణంగా రోజూ మందులు వేసుకోవాల్సిన వారి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. వీరు రద్దయిన పెద్దనోట్లతో మందుల దుకాణాలకు వెళితే, వాటిని తీసుకోవడం లేదు. ఆదివారం చికెన్, మట¯ŒS కొనుగోలుకూ కరెన్సీ కష్టాలు ఎదురయ్యాయి. కిలో మటన్ రూ.450 ఉంటే, కొందరు రూ.500 చొప్పున విక్రయించారు. చివరకు మందుబాబులకూ నోట్ల సెగ తాకింది. మద్యం దుకాణాల వల్ల పాతనోట్లు చెల్లవు అని బోర్డులు పెట్టారు. దీంతో కొంతమంది.. వ్యాపారులతో వాదనకు దిగారు. పాతనోట్లు తీసుకుని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని వాదులాడారు. అయినా వ్యాపారులు వినలేదు. కొందరు మాత్రం రూ.300 మద్యానికి రూ.500 నోటు తీసుకుని చిల్లర లేదని చెప్పి పంపేశారు. -
పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య
- కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి నంద్యాల: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం తొందర పాటు చర్య అని 20 సూత్రాల కమిషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి విమర్శించారు. పీసీసీ కార్యదర్శి డాక్టర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై కేంద్రం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. బ్యాంకులను, డబ్బును సిద్ధం చేసి నిషేధాన్ని ప్రకటించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు. రూ.2వేల నోటు కూడా గందరగోళానికి గురి చేస్తుందని చెప్పారు. దీని వల్ల సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఈ ఇబ్బందులను త్వరితంగా తొలగించాలని కోరారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19వ తేదీ కోడుమూరులో నిర్వహించే రైతు సదస్సుకు జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర నేత నాగమధుయాదవ్, కడప జిల్లా కాంగ్రెస్ నేత ధ్రువకుమార్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లగిశెట్టి సుబ్బగురుమూర్తి పాల్గొన్నారు. -
భారీగా తగ్గనున్న ఈఎంఐలు..!
ముంబై: నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ500,రూ.1000 నిషేధ నిర్ణయం దీర్ఘకాలంలో గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలుంటాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బ్యాంకులు అందజేసే రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయని, తద్వారా ఈఎంఐల భారం కూడా తగ్గనుందని విశ్లేషిస్తున్నారు. ఈ పెద్దనోట్ల రద్దుతో అన్ని బ్యాంకుల్లో డిపాజిట్లు విపరీతంగా పెరగనున్నా యంటున్నారు. అయితే గత రెండేళ్లుగా క్షీణిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు మరింత పతనమవుతాయని భావిస్తున్నారు. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్పకాలంలో తక్కువగానే ఉన్నప్పటికీ, తక్కువ వడ్డీ రేట్లు తక్కువ ఈఎంఐల ప్రభావంతో దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. వినియోగదారుల చేతిలో తక్కువ నగదు నిల్వలు, ద్రవ్యోల్బణం క్షీణత, బ్యాంకుల వద్ద పెరిగిన మూల ధన నిల్వలు ఈ పరిస్థితికి దోహదపడనున్నాయని అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణ క్షీణతకారణంగా ముందు ముందు వడ్డీరేట్లు మరింత దిగి వచ్చే అవకాశం ఉందని ఔట్ లుక్ ఏసియా క్యాపిటల్ సీఈవో మనోజ్ నాగ్ పాల్అభప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించనుందన్నారు. నోట్ల ఉపసంహరణ కారణంగా ఖాతాదారుల్లో ఖాతాలో నగదు నిల్వలు భారీగా పెరగనున్నాయని మరో ఎనలిస్టు అజయ్ బగ్గా చెబుతున్నారు. కనీసం నాలుగునుంచి అయిదు లక్షల కోట్ల రూపాయలకు పెరగనున్నాయన్నారు. గణాంకాల ప్రకారం ప్రస్తుతం చెలమాణీలోఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 85 శాతం (17లక్షల కోట్లు) వాటా నిషేధిత నోట్లదే. కాగా పెద్ద నోట్ల రద్దుతో సాధారణ స్థాయి కంటే సగటున రెండు, మూడు రెట్లు అధికంగా దాదాపు అన్ని శాఖల్లో డిపాజిట్లు నమోదుకానున్నట్టు బ్యాంకుర్లు కూడా అంచనావేస్తున్నారు. రెండు, మూడో అంచె పట్టణాల్లోని మధ్య తరగతి వర్గం, ఉద్యోగులు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్న ధోరణి నెలకొందని, ఇది మరికొన్న రోజులు కొనసాగవచ్చని ఆశిస్తున్న సంగతి తెలిసిందే. -
బ్యాంకు ముందు భక్తకోటి
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు పెద్ద నోట్ల ఇబ్బందుల నంచి కొంత ఊరట లభించింది. నగదు డిపాజిట్ చేసేందుకు భక్తులు, స్థానికులు గురువారం తిరుమలలోని బ్యాంకుల్లో బారులు తీరారు. రూ.500 , రూ.1,000 నోట్లు డిపాజిట్ చేసి, రూ.4 వేల చొప్పున 100 నోట్లు తీసుకున్నారు. తిరుమలలోని అన్ని ప్రధాన బ్యాంకులు, పోస్టాఫీసు వద్ద సందడి కనిపించింది. భక్తులకు నగదు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు. ఈ మేరకు తిరుమలలోని ఆంధ్రాబ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం, సబ్ మేనేజర్ రాజగోపాల్ ఏఎన్సీ, పద్మావతి, టీబీసీ నగదు రీఫండ్ కౌంటర్ల వద్ద రూ.100 కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. -
పెద్దనోట్ల చిచ్చు
• ఉరేసుకొని మహిళ ఆత్మహత్య • పెద్ద నోట్లు చెల్లవని ఆత్మహత్య చేసుకుందన్న కుమారుడు • డబ్బుల కోసం హత్య చేశారంటున్న మృతురాలి కూతుళ్లు • 12 ఎకరాలు అమ్మగా కుటుంబానికి వచ్చిన రూ.54 లక్షలు • ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడిన తల్లి • కుటుంబ కలహాల వల్లే..: కలెక్టర్ • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సాక్షి, మహబూబాబాద్: ఆ కుటుంబం తమకున్న 12 ఎకరాల భూమిని అమ్ముకుంది.. రూ.54 లక్షలు వచ్చాయి.. ఈ డబ్బు ఎవరి ఖాతాలో వేయాలన్నదానిపై తల్లీ, కొడుకుల మధ్య గొడవ మొదలైంది.. ఇంతలో ఆ ఇంట్లో ‘పెద్ద నోట్ల’ రద్దుతో పిడుగు పడింది.. ఏమైందో ఏమోగానీ రాత్రికిరాత్రే తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భూమి అమ్మగా వచ్చిన డబ్బులు ఇక చెల్లవన్న ఆందోళనతోనే తన తల్లి చనిపోరుుందని కొడుకు చెబుతుండగా.. సొమ్ము కోసం అతడే చంపేశాడని ఆమె కూతుళ్లు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని శనిగపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్బులపై గొడవ శనిగపురానికి చెందిన కందుకూరి ఉపేంద్ర చారి, వినోద(55) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యారుు. వీరికి ముడుపుగల్లు గ్రామంలో 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని ఈ ఏడాది జనవరిలో విక్రరుుంచగా రూ.56 లక్షలు వచ్చారుు. ఆ తర్వాత ఉపేంద్రాచారి అనారోగ్యానికి గురికావడంతో వైద్యం కోసం కొంత డబ్బును ఖర్చు చేశారు. మిగిలిన రూ.45.5 లక్షలతో దగ్గర్లో ఎక్కడైనా భూమి కొనుగోలు చేద్దామని డబ్బులను ఇంట్లోనే దాచుకున్నారు. ఈ డబ్బు విషయంపై కుమారుడు శ్రీనివాస్‌కు, ఉపేంద్రచారి, వినోద మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నారుు. భూమి డబ్బులను తమ పేరిట బ్యాంకులో ఉన్న జారుుంట్ అకౌంట్లో జమచేద్దామని ఉపేంద్రచారి, వినోద అంటుండగా.. తన అకౌంట్లోనే జమ చేసుకుంటానని కొడుకు గొడవ పడుతున్నాడు. ఈ డబ్బుల విషయమై వినోద తన కూతుళ్లతో ఫోన్లో మాట్లాడుతుండేది. పెద్దనోట్ల రద్దుతో ముదిరిన లొల్లి కేంద్రం రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేయడంతో ఉపేంద్రచారి కుటుంబంలో గొడవలు మరింత పెరిగారుు. భూమి అమ్మగానే డబ్బుల్ని బ్యాంక్‌లో జమ చేస్తే బాగుండు కదా అంటూ గొడవపడ్డారు. ఆ డబ్బులో కొంత కూతుళ్లకు కూడా ఇవ్వాలని వినోద పట్టు బట్టింది. వాళ్లకెందుకని శ్రీనివాస్.. తల్లి వినోదను నిలదీశాడు. ఈ గొడవలోనే ఆమెను బుధవారం రాత్రి ఇంట్లోంచి బయటకు నెట్టేశాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె రాత్రి ఉరేసుకొని చనిపోరుుంది. తాము ఒంటిగంట సమయంలో అలికిడికి లేచిచూసే సరికే చనిపోరుు కనిపించిందని శ్రీనివాస్ చెప్పాడు. గురువారం ఉదయం వినోద కూతుళ్లు వచ్చి తల్లిని శ్రీనివాసే హత్య చేశాడని ఆరోపించారు. పోలీసులు వినోద మృతదేహాన్ని మహబూబాబాద్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలు సోదరుడు ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ రూరల్ పోలీసులు అనుమానాస్పదం మృతిగా కేసు నమోదు చేశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న భర్త వినోద భర్త ఉపేంద్రకు ఏడాదిన్నర క్రితం బ్రెరుున్ స్ట్రోక్ వచ్చింది. ఆరు నెలల క్రితం రెండు కిడ్నీలు ఫెరుుల్ అయ్యారుు. ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతుంది. కుమారుడు శ్రీనివాస్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మధ్యవర్తి వద్దకు డబ్బులు తల్లి మృతిపై కుమారుడు శ్రీనివాస్, కూతుళ్లు శశికళ, మాధవి గొడవడ్డారు. డబ్బుల కోసమే తల్లిని శ్రీనివాస్, ఆయన భార్య హత్య చేశారని శశికళ, మాధవి పోలీసులకు చెప్పారు. దీంతో పెద్దమనుషుల పంచాయతీ తర్వాత బీరువా తాళాన్ని తెరిచి ఓ మధ్యవర్తి వద్ద డబ్బు ఉంచారు. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అన్న అంశంపై పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాతే తేలుతుందని పోలీసులు అంటున్నారు. డబ్బులపై చర్చించుకున్నాం ఇంట్లో ఉన్న డబ్బులు చెల్లవనే విషయంపై అమ్మ, నేను, నాన్న చర్చించుకున్నాం. ఆ డబ్బులను ఎలా బ్యాంక్‌లో వేయాలని మాట్లాడుకున్నాం. కొద్దికొద్దిగా బ్యాంకులో వేద్దాం అని రాత్రి నిర్ణరుుంచుకున్నం. ఇంతలోనే అర్ధరాత్రి అమ్మ ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. - శ్రీనివాస్, కుమారుడు కుటుంబ కలహాల వల్లే.. వినోద కుటుంబ కలహాలతోనే మృతి చెందింది. కరెన్సీ మార్పిడి గురించి కాదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. - ప్రీతిమీనా, జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ -
పెద్ద నోట్లతో బిల్లులు చెల్లించండి
– నేటి అర్ధరాత్రి వరకే గడువు : ఎస్ఈ కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ బిల్లులను, పాత బకాయిలను పెద్ద నోట్లతో చెల్లించవచ్చని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ కర్నూలు ఆపరేషన్స్ ఎస్ఈ జి.భార్గవ రాముడు సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు రూ.500, రూ.1000 నోట్లతో బిల్లులు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై దొర ఉత్వర్వులు జారీ చేశారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకవేళ అధిక మొత్తం చెల్లించినా వచ్చే నెలల బిల్లుల్లో సరి చేస్తామన్నారు. -
భారీ ఆఫర్ కొట్టేసిన ఎల్ అండ్ టి
లక్నో: ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి భారీ ఆఫర్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థ మరో కీలక ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంది. బిహార్‌లో గంగానదిపై కొత్త వంతెన నిర్మాణం కోసం రూ 3,115 కోట్ల ఆర్డర్ దక్కించుకుంది. కొరియన్ సంస్థ దేవూ (ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్) భాగస్వామ్యంలో ఈ జాయింట్ వెంచర్ ను ఎల్ అండ్ టి చేపట్టింది. గంగానదిపై ప్రతిష్ఠాత్మక బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టును సంస్థ ఎగరేసుకుపోయింది. బిహార్ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (బిఎస్డీసిఎల్) నుంచి రూ 3,115 కోట్ల విలువైన ప్రాజెక్టును దక్కించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ పౌర నిర్మాణ రంగలో ఇది తమకు దక్కిన భారీ ముఖ్యమైన విజయమని ఎల్ అండ్ టి డిప్యూటీ ఎండీ సుబ్రహ్మణ్యన్ చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులను ఆశిస్తున్నామని సంస్థ పేర్కొంది. గంగా నదిపై ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ ఆర్డర్ చేపట్టినట్టు తెలిపారు.