- కిరాణా వ్యాపారం 80 శాతం తగ్గిందంటున్న దుకాణదారులు,
- తిండికి పరిమితి విధించుకుంటున్న పేద, దిగువ మధ్యతరగతి వర్గాలు
- నోరారా తినడానికి నోచక, ఆదరవులుకు, అల్పాహారాలకు సీలింగ్
పెద్దనోట్ల రద్దు పెదవికీ చేటే
Published Sat, Nov 26 2016 12:31 AM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
‘ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతాయి’ అన్నది నానుడి. ‘బళ్లు ఓడలవడం మాటెలా ఉన్నా, పెద్ద నోట్ల రద్దు దెబ్బకు ఓడలు బళ్లయిన వాస్తవం దాదాపు దిగువ మధ్యతరగతి, పేదవర్గాల కుటుంబాలన్నింటిలో కనిపిస్తోంది. ఉదయం ఒకటి లేదా రెండు అల్పాహారాలు, మధ్యాహ్నం ఓ కూరా, ఓ వేపుడూ, రసం లేదా సాంబారు, మధ్యాహ్నం ఒకటిరెండు చిరుతిళ్లు, రాత్రికి కూడా ఇంచుమించు ఒకటికి మించిన ఆధరవులతో తృప్తిగా భోంచేసిన వారే ఇప్పుడు రుచులకు కోత పెట్టుకుంటున్నారు. అల్పాహారం ఆరగించే వేళ కూడా అన్నమే తిని, సరిపెట్టుకుంటున్నారు. ఇక.. అలవాటైన జిహ్వను పంటిబిగువున అదుపు చేసుకుని, సాయంత్రపు స్నాక్స్‌కు స్వస్తి చెపుతున్నారు.
సాక్షి, రాజమహేంద్రవరం :
నోట్ల రద్దు పర్యవసానాలు కాలాన్ని తాత, ముత్తాతల నాటికి నెట్టి ఎందరితోనే తిరిగి చద్దన్నాన్ని తినిపించేలా ఉన్నాయి. పెద్దనోట్ల రద్దు, అవసరమైన మేరకు నగదు అందుబాటులో లేకపోవడం, రెండువేల నోట్లు ఉన్నా చిల్లర లేకపోవడంతో ప్రజలు.. ముఖ్యంగా దిగువ మధ్యతరగతి వారు, పేదవర్గాలు నిత్యావసరాల్లో.. చివరికి తిండి విషయంలోనూ పొదుపు మంత్రం పాటిస్తున్నారు. భోజనంలో వేపుడుతోపాటు సాంబార్ ఘుమఘుమలు, మషాళా ఘాట్లూ
పెద్దనోట్ల రద్దు కారణంగా తగ్గిపోయాయి. వారంలో మూడు సార్లు ముద్దపప్పు చేసేవారు ఇప్పుడు ఒకసారి మాత్రమే చేసుకుంటున్నారు. దోసె, ఇడ్లీ వంటి టిఫిన్లు తగ్గిపోయాయి. వారంలో కనీసం నాలుగు రోజులు తినే టిఫి¯ŒS స్థానాన్ని అన్నం ఆక్రమించింది. ప్రజలు నిత్యావసరాల వాడకాన్ని 80 శాతం మేర తగ్గించుకుంటున్నారు.
బోసిపోతున్న పచారీ కొట్లు
రూ.వెయ్యి, రూ.500 నోట్ల రద్దు సామాన్య, మధ్యతరగతి జీవనాన్ని అతలాకుతలం చేయడంతోపాటు వ్యాపార వర్గాన్ని తీవ్ర నష్టాల పాలే్జసింది. ఇతర వ్యాపారాలు ఎలా ఉన్నా కిరాణా దుకాణాలు పెద్దనోట్ల రద్దు కారణంగా బోసిపోతున్నాయి. ప్రజలు కొనుగోళ్లు తగ్గిం చుకోవడం, వచ్చిన వారు రూ.500 నోట్లు ఇస్తుండడం తో వ్యాపారాలు తగ్గిపోయాయి. రూ.రెండువేల నోట్లు అందుబాటులోకి వచ్చినా వాటి మారకానికి అవసరమైన చిల్లర లేకపోవడంతో వ్యాపారులకు ఏమి చేయా లో దిక్కుతోచడంలేదు. రూ.రెండు, మూడు వందలకు సరుకులు కొంటే మిగతా రూ.1700 చిల్లర రూ.100, రూ.50 నోట్ల రూపంలో ఇవ్వాల్సి వస్తుండడంతో బేరా న్ని వదిలేసుకుంటున్నారు. సరుకులు ఇవ్వడానికి క న్నా రెండువేల నోటుకు చిల్లర ఇవ్వడానికి ఆలస్యమవుతోం దని వాపోతున్నారు. మరో వైపు నగదు ఉన్నా అవసరాలు తీరడం లేదన్న ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
నెలవారీ ఖర్చులు భరించేదెలా?
ఇతర వస్తువుల కొనుగోలు ఎలా ఉన్నా నిత్యావసరాలు మాత్రం ప్రజలకు తప్పనిసరి. పన్ను పరిధిలోకి వచ్చే కిరాణా హోల్‌సేల్, రిటైల్ దుకాణాలు రాజమహేంద్రవరంలో దాదాపు 1000, కాకినాడలో 900, అమలాపురంలో 700 ఉన్నాయి. ఇలా ప్రతి పట్టణంలోనూ ఉన్నాయి. పన్ను పరిధిలోకి రాని దుకాణాలు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. పెద్దనోట్ల రద్దుతో ఈ దుకాణాల్లో దాదాపు 80 శాతం బేరాలు తగ్గడంతో వ్యా పారులు విలవిలలాడుతున్నారు. ఈ నెల దుకాణం అ ద్దె, విద్యుత్ బిల్లు, సిబ్బంది జీతభత్యాలు చెల్లించేం దు కు సరిపడా ఆదాయం కూడా రాని పరిస్థితి నెలకొం దని రాజమహేంద్రవరానికి చెందిన వ్యాపారి సుబ్బారావునాయుడు వాపోయారు.
స్వైపింగ్ కార్డుల కోసం ఎదురుచూపులు
కిరాణా దుకాణాల్లో డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో వ్యాపారులు స్వైపింగ్ యంత్రాలు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. గత వారం కలెక్టర్ అధ్యక్షతన కిరాణా వ్యాపారులు, బ్యాంకర్ల సమావేశం జరిగింది. స్వెపింగ్ కార్డులు తీసుకోవడానికి వ్యాపారులు సమ్మతించి బ్యాంకులకు దరఖాస్తులు పం పినా ఇప్పటి వరకూ అందలేదు. పలుమార్లు బ్యాంకు అధికారులను కలసినా ఇదిగో అదిగో అంటున్నారే తప్ప యంత్రాలివ్వడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
బేరాలు తగ్గిపోయాయి
వ్యాపారం ఈ నెల 80 శాతం తగ్గింది. రూ.500 తీసుకోవడం లేదు. కొనుగోలుదారులు రూ.500 తీసుకుంటారా అని అడిగి లేదంటే వెళ్లిపోతున్నారు. రెండువేల నోట్లు ఇస్తున్నా చిల్లర కొరత వేధిస్తోంది. ఉన్నంత వరకు ఇస్తున్నాం. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియడం లేదు.
– ఎం. మల్లేశ్వరరావు, శ్రీదేవీవినాయక కిరాణా, జనరల్ స్టోర్, రాజమహేంద్రవరం
స్వైపింగ్ కార్డులెక్కడ?
పెద్దనోట్ల రద్దు నాటి నుంచి వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించాలంటున్నారు. స్వైపింగ్ యంత్రాలు కావాలని బ్యాంకులకు దరఖాస్తులు పెట్టుకున్నా ఇప్పటి రాలేదు. ఓ వైపు అధికారులు రోజూ ఫో¯ŒS చేసి అడుగుతున్నారు.
– గ్రంధి రామకృష్ణ, సెక్రటరీ, శ్రీవెంకటేశ్వర జనరల్ మార్కెట్, రాజమహేంద్రవరం
పొదుపుగా వాడుకుంటున్నాం
దుకాణాల వద్ద పెద్దనోట్లు తీసుకోవడంలేదు. రెండువేల నోట్లకు చిల్లర దొరకడంలేదు. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు చిల్లర సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితి మారే వరకు నిత్యావసరాలను పొదుపుగా వాడుకోవడం తప్ప చేయగలిగింది లేదు.
– ఐ.మణికుమారి, సీతంపేట, రాజమహేంద్రవరం
Advertisement
Advertisement