పెద్దనోట్ల రద్దుపై యోగాగురు ఏమన్నారంటే?
న్యూఢిల్లీ : బ్లాక్మనీపై ఉక్కుపాదంగా, అవినీతిని, టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ఆకస్మాతుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై ఓ వైపు ఘాటైన విమర్శలు వస్తుండగా.. యోగ గురు రామ్దేవ్ బాబా ప్రధాని పక్షాన నిలిచారు. మన వ్యవస్థకు పట్టిన చీడను నిర్మూలిస్తున్న క్రమంలో ప్రజలందరూ కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు.
రూ.500, రూ.1000 నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయంతో నల్లధనం, అవినీతి, తీవ్రవాదం, నకిలీ నోట్ల వ్యాపారాలకు తీవ్రంగా దెబ్బకొట్టనుందని తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని వ్యాఖ్యానించారు. మేదంతా-మెడిసిటీ నిర్వహించిన ఇంటర్నేషనల్ కారొనరీ కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు.
రూ.100 నోట్లను సేకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది ప్రజలు, ప్రధాని తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంతోనే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిందించడం కంటే, సిస్టమ్ క్లీన్ అప్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, భారత జవాన్లు మనకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటారని, వారాల కొద్దీ నిద్రాహారాలు మానేసి పనిచేస్తుంటారని చెప్పారు. ఇప్పుడు మనం చేయాలేమా? అని ప్రశ్నించారు.
జాతీ సంక్షేమం దష్ట్యా కొన్ని రోజులు ఈ తిప్పలను మనం ఎదుర్కోలేమా? అని రామ్ దేవ్ బాబా ప్రశ్నించారు. స్వాతంత్ర్యానంతరం మొదటిసారి ఓ బలమైన రాజకీయ నాయకుడిని చూస్తున్నామని, ల్యాండ్ మాఫియా, పొలిటికల్ మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా వ్యతిరేకిస్తున్నా, ఎవరికీ తలొగ్గకుండా ఈ సంచలన నిర్ణయం ప్రధాని అమలుచేస్తున్నారని ప్రశసించారు.