Ramdev
-
ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ ఆశారాం బాపు: మూడవ తరగతి బాబా రామ్‌దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్ ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? -
మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటర్ల దాతృత్వం
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రమోటర్లు సమాజ సేవ కోసం 10 శాతం వాటాలను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రమోటింగ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్, ప్రమోటర్ రామ్‌దేవ్ అగర్వాల్ చెరో ఐదు శాతం (చెరో 73,97,556 షేర్లు) చొప్పున కంపెనీ ఈక్విటీలో వాటాలను విరాళంగా ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటన విడుదల చేసింది. శుక్రవారం నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూ.12,161 కోట్లు కాగా, ఈ ప్రకారం 10 శాతం వాటాల విలువ రూ.1,216 కోట్లుగా ఉండనుంది. ఈ మొత్తాన్ని వచ్చే పదేళ్లలోపు లేదా అంతకంటే ముందుగానే ఖర్చు చేయనున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు సమాచారం ఇచి్చంది. ఇప్పటికే మన దేశం నుంచి విప్రోప్రేమ్‌జీ, గౌతమ్ అదానీ, శివ్‌నాడార్, నందన్ నీలేకని తదితరులు సమాజం కోసం పెద్ద మొత్తంలో విరాళలను ప్రకటించగా, వారి సరసన మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ ప్రమోటర్లు కూడా చేరినట్టయింది. మరోవైపు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ తన నిర్వహణలోని బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని గ్లైడ్ టెక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి విక్రయించేందుకు నిర్ణయించడం గమనార్హం. గ్లైడ్ టెక్ అనేది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్‌కు పూర్తి అనుబంధ సంస్థగా ఉంది. అలాగే అనుబంధ సంస్థ కింద ఉన్న సంపద నిర్వహణ వ్యాపారాన్ని మాతృసంస్థ మోతీలాల్ ఓస్వా ల్ ఫైనాన్షియల్‌కు మార్చేందుకు నిర్ణయించింది. -
యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
Ramdev Land Rover Defender 130: యోగా గురువు ,పతంజలి ఆయుర్వేదానికి చెందిన రామ్‌దేవ్ ఖరీదైన కారును కొనుగోలు చేశారా? దాదాపు 1.5 కోట్ల విలువైన కారును డ్రైవ్ చేస్తున్నవీడియో ఒకటి ప్రస్తుం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు నడుపుతూ రామ్‌దేవ్ దర్జా ఒలకబోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆయన ఇతర లగ్జరీకార్ల కలెక్షన్స్, పతంజలి సంపద హాట్‌టాపిక్‌గా నిలిచింది. లగ్జరీ కార్ల కలెక్షన్ యోగా గురు రామ్‌దేవ్ కార్ల కలెక్షన్ కూడా ఆసక్తికరం. మహీంద్రా XUV700, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ ఎవోక్ , జాగ్వార్ XJLలాంటి లగ్జరీ కార్లు అతని గ్యారేజ్‌లో ఉన్నాయి. మహీంద్రా నుంచి ల్యాండ్ రోవర్ కి ప్రమోట్ అయ్యారంటూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు బాబా రామ్‌దేవ్ ఎప్పుడూ భారతీయ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ విదేశీ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారంటూ నెటిజన్లు మండి పడుతున్నారు.రామ్‌దేవ్‌బాబా నేతృత్వంలోని పతంజలి మార్కెట్ క్యాప్ రూ. 46,000కోట్లు. (చాట్‌జీపీటీ ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్, రిజిస్ట్రేషన్స్ షురూ!) వీడియోలో కనిపిస్తున్న ఎస్యూవీ సెడోనా రెడ్ కారును రాందేవ్ కొన్నారా అనేది స్పష్టత లేదు. ఇండియాలో ల్యాండ్ రోవర్ డిఫెండర్130 రేంజ్-టాపర్ అండ్ బిగ్గెస్ట్ కారు. కాగా సెడోనా రెడ్ కలర్ ఆప్షన్ డిఫెండర్ 130 2023 ఎడిషన్ ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ అయింది. డెలివరీలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వెర్షన్‌గా కొనసాగింపుగా తీసుకొచ్చిన డిఫెండర్ 130 అదే వీల్‌బేస్‌ను కలిగి ఉంది, అయితే కంపెనీ వెబ్సైట్ ప్రకారం, బాడీ 340 మిమీ పొడవు ఉంటుంది. మూడు వరుస సీట్లు, ఇంటిగ్రేటెడ్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన సింగిల్-పాడ్ LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 11.4-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హీటింగ్, కూలింగ్,మెమరీ ఫంక్షన్లతో కూడిన 14-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా లాంటి ఇతర ఫీచర్లున్నాయి. (ట్విటర్ కొత్త లోగో: ఉద్యోగులు అరెస్ట్, వీడియో వైరల్) View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) -
లాండ్ రోవర్ డిఫెండర్‌లో బాబా రామ్‌దేవ్.. వీడియో వైరల్..
డెహ్రాడూన్: యోగాగురు, పంతజలి ఆయుర్వేద అధినేత బాబా రామ్‌దేవ్ ఇటీవల హరిద్వార్‌లో సరికొత్త కారులో ప్రయాణించారు. ఇటీవలే విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130లో రామ్‌దేవ్ ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎరుపు వర్ణంలో ఉన్న ఈ కారు ధర రూ.1.5 కోట్లకు పైనే ఉంటుంది. ఇటీవల ఇండియాలో విడుదలైన లాండ్ రోవర్ డిఫెండర్ 130 కారులో వెళ్తూ బాబా రామ్‌దేవ్ కనిపించారు. ఇండియాలో ఉన్న లాండ్ రోవర్ బ్రాండ్‌లో డిఫెండర్ 130 అత్యంత మంచి ఫీచర్లను కలిగి ఉంది. ఈ కారు డోర్ ఓపెన్ చేసిన రామ్‌దేవ్.. లోపలి భాగాన్ని ఓసారి పరిశీలించారు. కొత్తగా కనిపిస్తున్న కారు డ్రైవర్ సీటులో కూర్చుని నడుపుకుంటూ వెళ్లారు. అయితే.. ఇటీవలే కొన్నట్లు కొత్తగా కనిపిస్తున్న ఈ కారుకు నంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. View this post on Instagram A post shared by Automobili Ardent India ®️ (@automobiliardent) డిఫెండర్ 130 అనేది 2023 ఆరంభంలోనే విడుదలైన మోడల్ కారు. కేవలం రెడ్ కలర్లో మాత్రమే విడుదలైంది. అయితే.. ఇండియాలో ఇటీవలే దీని డెలివరీ సర్వీసులు ప్రారంభమయ్యాయి. డిఫెండర్ 110 వర్షన్‌కు అడ్వాన్సుడ్‌గా డిఫెండర్ 130 విడుదలైంది. బాడీ 340 ఎంఎం పొడవు గల బాడీ ఉండటమే పాత మోడల్‌కు దీనికి ఉన్న తేడా. ఇదీ చదవండి: పరమ శివున్ని పెళ్లి చేసుకున్న యువతి.. ఎందుకంటే..? -
ఆ రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా?
న్యూఢిల్లీ: అల్లోపతి వైద్య విధానం మీద అనుచిత వ్యాఖ్యలు చేసి భారీ విమర్శలు మూటగట్టుకున్న తర్వాత క్షమాపణలు చెప్పిన యోగా గురు రాందేవ్ బాబా సోమవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) 25 ప్రశ్నలు సంధించారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటివాటికి శాశ్వత పరిష్కారం అల్లోపతి వద్ద ఉందా అంటూ ప్రారంభించారు. అల్లోపతికి కేవలం 200 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందన్నారు. థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఆస్తమా వంటి రోగాలకు ఫార్మా ఇండస్ట్రీలో శాశ్వత పరిష్కారం ఉందా అని ప్రశ్నించారు. కొలెస్టరాల్‌కు, మైగ్రేన్‌కు, అమ్నీసియాకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని చికిత్స ఉందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గుండెలో ఏర్పడే రంధ్రాలకు నొప్పి లేకుండా చికిత్స చేయగలరా అని అడిగారు. వయస్సును వెనక్కు మళ్లేలా చేసి హీమోగ్లోబిన్ను పెంచే చికిత్స ఉందా అన్నారు. అల్లోపతి అన్నింటికి సమాధానం ఇస్తే డాక్టర్లకు ఏ రోగమూ రాకూడదని అభిప్రాయపడ్డారు. -
కోల్గేట్, ప్యాంటీన్, నెస్లేలకు బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు. మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం. -
లాలూకు రామ్‌దేవ్ యోగా పాఠాలు
పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా పెరోల్‌పై పాట్నాలోని తన ఇంటికి వచ్చారు. పెరోల్‌పై ఇంటికి వచ్చిన ఆయనకి ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్య చికిత్సల కోసం ఆరు వారాల బెయిల్ కూడా కోర్టు మంజూరుచేసింది. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. యోగా గురు రాందేవ్ బాబా కూడా లాలూను పరామర్శించారు. ‘ ఆరు వారాల బెయిల్ మంజూరైనందుకు అభినందనలు లాలూ జీ. యోగా చేస్తూ మీకు మీరుగా ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించండి’ అని రాందేవ్ సూచించారు. పశువుల దాణా కుంభకోణ కేసుల్లో రాంచిలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ, గుండె, కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. గత వారం క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయనకు ప్రత్యేక చికిత్స కూడా అందించారు. ఇటీవలే ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంటికి వచ్చిన ఈయనకు ఆరోగ్య విషయాలపై ప్రముఖులు పలు సూచనలు చేస్తున్నారు. కాగ, 2016లో కూడా రాందేవ్, ఢిల్లీలో జరిగిన యోగా సెషన్‌కు లాలూను ఆహ్వానించారు. రాందేవ్ బీజేపీకి సన్నిహితుడు కావడంతో, లాలూ ఆయనతో అంటిముట్టన్నట్టు ఉంటారు. దాణా కేసుల్లో తనని జైలులో పెట్టడం బీజేపీ కుట్రనేనని లాలూ ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఓ సారి రాందేవ్‌పై లాలూ చమత్కరాలు కూడా చేశారు. 2011లో ఓ ఆందోళన చేపట్టిన రాందేవ్ బాబా, పోలీసులు రావడంతో, స్టేజీపై నుంచే పారిపోయారు. దీన్ని కోట్ చేస్తూ.. రామ్‌లీలా మైదాన్‌లో రాందేవ్ యోగసనాలు చేయమంటారు కానీ పోలీసులు వస్తే మాత్రం ఆయన జంప్ అయి పోతారు అని లాలూ జోకులు పేల్చారు. -
పీఓకేను స్వాధీనం చేసుకోవాలి: రాందేవ్
మోతిహారి: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను భారత్ వెంటనే తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. పాక్ నుంచి తలెత్తుతున్న అన్ని సమస్యలకు అదే మూలకారణమని అభిప్రాయపడ్డారు. అలాగే పీఓకేలోని అన్ని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేయాలని కోరారు. చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ నిర్వహించిన మూడు రోజుల యోగా కార్య క్రమంలో చివరి రోజైన శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భారత్ పాక్ సరిహద్దు ల్లో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులు అజహర్ మసూద్, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం లను సజీవంగా లేదా వారి మృతదేహాలనైనా భారత్‌కు అప్పగించాలని రాందేవ్ పాక్‌ను డిమాండ్ చేశారు. మద్యపానాన్ని నిషేధిం చాలని నిర్ణయించిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. యోగాను రాజకీయ ఎజెండాగా చూడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
మరోసారి వార్తల్లో రాందేవ్ బాబా
లక్నో: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ మరోసారి విదేశీ బహుళజాతి సంస్థలపై తన దాడిని ఎక్కు పెట్టారు. రాబోయే అయిదేళ్లలో దేశంనుంచి వీటిని తరిమి కొడతామంటూ ఆయన నిలిచారు. తమ కన్జ్యూమర్ ఉత్పత్తుల ద్వారా ఎంఎన్‌సీలను దేశంనుంచి తరిమివేస్తామని రాందేవ్ హెచ్చరించారు. ఆ వైపుగా తమ పతంజలి ఉత్పత్తులు పయనిస్తున్నాయని బహుళజాతి సంస్థ దోపిడీనుంచి త్వరలో దేశానికి విముక్తి కల్పిస్తామని రాందేవ్ ప్రకటించారు. యోగి భరత్ భూషణ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశీ బహుళజాతి సంస్థలు దేశం అభివృద్ధి కోసం పనిచేయడంలేదని, వారి ఏకైక లక్ష్యమే భారత్‌ను దోచుకోవడమేనని బాబా మండిపడ్డారు. దోపిడియే ప్రధాన ఉద్దేశ్యంతో దేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎంఎన్‌సీలను ఆయన పోల్చారు. తాము తదుపరి ఐదేళ్ళలో భారతీయ మార్కెట్ నుంచి తరిమివేస్తామన్నారు. ఎంఎన్సీల నుంచి భారతదేశాన్ని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే దేశంలోని రైతులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తుందని చెప్పారు. పతంజలి ఆధ్వర్యంలో రైతులకు తాజా ఉత్పాదకాలపైనా, వివిధ నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడంపై అవగాహన కల్పిస్తామన్నారు. దీంతోపాటుగా రైతులకు గిట్టుబాటు ధరలను అందిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై రాందేవ్ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు సత్సంబంధాలను ఏర్పరచుకుంటోందన్నారు. -
పెద్దనోట్ల రద్దు భారీ కుంభకోణం-రాందేవ్
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ డీమానిటేజేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకర్ల అవినీతి లక్షల కోట్ల కుంభకోణానికి దారి తీయనుందని ఘాటుగా విమర్శించారు. రూ.3-4లక్షల కోట్ల కుంభకోణానికి దారి తీయనుందని వ్యాఖ్యానించారు.పెద్దనోట్ల రద్దు ప్రక్రియను ఇంకా బాగా అమలు చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ని బ్యాంకర్లు తప్పు దారి పట్టించారన్నారు. అంతేకాదు బీజేపీతో తన సాన్నిహిత్యం ఇక పాతమాట అని రాందేవ్ వ్యాఖ్యానించడం విశేషం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానికి తమ మద్దతును తెలిపిన రాందేవ్ జైపూర్ లో ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. మోదీ అవినీతి బ్యాంకర్ల చేతిలో చిక్కారు. నగదు సరఫరా ఒక సమస్య కాదు, కానీ నగదు అవినీతి మార్గం పట్టడమే సమస్య అని రాందేవ్ వ్యాఖ్యానించినట్టు నివేదించింది. మరోవైపు ఇటీవల ప్రతిపక్ష రాజకీయ నాయకులు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ , జేడీయూ నేత లాలూ ప్రసాద్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే దీనిపై వ్యాఖ్యానించిడానికి రాం దేవ్ అనుచరులు నిరాకరించారు. పెద్దనోట్ల రద్దు తర్వాత పేదల కష్టాలు, వారి అసంతృప్తి, పెరుగుతున్న అసహనం నేపథ్యంలో ఇలా వ్యాఖ్యానించారన్నారు. కాగా నాణ్యతలేని ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాందేవ్ బాబా పతంజలి కంపెనీకి కోర్టు రూ.11 లక్షల జరిమానా విధించింది. 2012లో హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన ఈ కేసులో నాణ్యత ప్రమాణాలు పాటించడంలేదని అప్పుడే నిరూపితమైంది. అయితే గత నాలుగేళ్లుగా నానుతున్న ఈ కేసుపై భారీ జరిమానా విధించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. -
పెద్దనోట్ల రద్దుపై యోగాగురు ఏమన్నారంటే?
న్యూఢిల్లీ : బ్లాక్‌మనీపై ఉక్కుపాదంగా, అవినీతిని, టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ఆకస్మాతుగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయంపై ఓ వైపు ఘాటైన విమర్శలు వస్తుండగా.. యోగ గురు రామ్‌దేవ్ బాబా ప్రధాని పక్షాన నిలిచారు. మన వ్యవస్థకు పట్టిన చీడను నిర్మూలిస్తున్న క్రమంలో ప్రజలందరూ కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు. రూ.500, రూ.1000 నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేస్తున్నట్టు తీసుకున్న నిర్ణయంతో నల్లధనం, అవినీతి, తీవ్రవాదం, నకిలీ నోట్ల వ్యాపారాలకు తీవ్రంగా దెబ్బకొట్టనుందని తెలిపారు. ఇవన్నీ ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని వ్యాఖ్యానించారు. మేదంతా-మెడిసిటీ నిర్వహించిన ఇంటర్నేషనల్ కారొనరీ కాంగ్రెస్‌లో ఆయన మాట్లాడారు. రూ.100 నోట్లను సేకరించడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొంతమంది ప్రజలు, ప్రధాని తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంతోనే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని నిందిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని నిందించడం కంటే, సిస్టమ్ క్లీన్ అప్‌లో ప్రజలు ప్రభుత్వానికి సహకరిస్తే బాగుంటుందని పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు, భారత జవాన్లు మనకోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంటారని, వారాల కొద్దీ నిద్రాహారాలు మానేసి పనిచేస్తుంటారని చెప్పారు. ఇప్పుడు మనం చేయాలేమా? అని ప్రశ్నించారు. జాతీ సంక్షేమం దష్ట్యా కొన్ని రోజులు ఈ తిప్పలను మనం ఎదుర్కోలేమా? అని రామ్ దేవ్ బాబా ప్రశ్నించారు. స్వాతంత్ర్యానంతరం మొదటిసారి ఓ బలమైన రాజకీయ నాయకుడిని చూస్తున్నామని, ల్యాండ్ మాఫియా, పొలిటికల్ మాఫియా, ఇంటర్నేషనల్ మాఫియా వ్యతిరేకిస్తున్నా, ఎవరికీ తలొగ్గకుండా ఈ సంచలన నిర్ణయం ప్రధాని అమలుచేస్తున్నారని ప్రశసించారు. -
బాబా 'జీన్స్' కమింగ్ సూన్..
హరిద్వార్ : పతంజలి బ్రాండ్స్‌తో మార్కెట్లో దూసుకెళ్తున్న రాందేవ్ బాబా, బట్టల సామ్రాజ్యాన్ని కూడా స్థాపించనున్నారట. మల్టీ కోర్ "స్వదేశీ" కన్సూమర్ గూడ్స్‌లో బట్టల ఉత్పత్తులను ప్రారంభించనున్నారు. పరిధాన్ పేరుతో ఈ సామ్రాజ్యాన్ని స్థాపించి, జీన్స్, ఆఫీసులకు అనుగుణమైన బట్టలను అందించనున్నారు. అదేవిధంగా గ్లోబల్‌గా కూడా తన సత్తా చాటాలని రాందేవ్ ప్లాన్ చేస్తున్నారు. బంగ్లాదేశ్, ఆఫ్రికాలో మొదట ప్లాంట్లను స్థాపించి, అనంతరం యూరప్, యూఎస్‌లో తన బిజినెస్‌లను విస్తరించనున్నట్టు రాందేవ్ చెబుతున్నారు. పురుషులకు, మహిళలకు ఇద్దరకూ అనువైన బట్టలను తయారుచేయనున్నామని రాందేవ్ తెలిపారు. కేవలం భారతీయ సంప్రదాయ దుస్తులనే కాక, జీన్స్ లాంటి మోడ్రన్ దుస్తులు కూడా తయారుచేయనున్నట్టు ప్రకటించారు. దేశీ జీన్స్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించబోతున్నామని తెలిపారు. లుథియానాలోని మంచి తయారీదారులు ఉన్నారని, ఇతర చేనేత సెంటర్లు ఈ దుస్తులను డిజైన్ చేయనున్నట్టు చెప్పారు. హరిద్వార్ శివార్లో విశాలమైన ప్రాంగణంలో రాందేవ్ తన స్నేహితుడు ఆచార్య బాలకృష్ణన్‌తో కలిసి ఓ సంస్థను నిర్వర్తిస్తున్నారు. ఇదేమాదిరి బంగ్లాదేశ్‌లో పతంజలి ఉత్పత్తుల తయారీకి మిశ్రమ ప్యాక్టరీని ఏర్పాటుచేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే నేపాల్ మార్కెట్లో తాము ప్రవేశించామని, బంగ్లాదేశ్ అనంతరం ఆఫ్రికా మార్కెట్ లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. దేశీయ మార్కెట్ పరిస్థితులతో సరితూగే ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదట తమ వ్యాపారాల వృద్ధి చేపడతామని రాందేవ్ ఆశాభావం వ్యక్తంచేశారు. స్టేజ్2 అనంతరం యూరప్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో బహుళ జాతీయ కంపెనీలతో పోటీకి సిద్ధమవుతామని ప్రకటించారు. హెర్బల్ టూత్ పేస్టులు మొదలుకుని, నూడుల్స్, హెల్త్ డ్రింక్స్ వంటి వివిధ రకాల ఉత్పత్తుల వరకు మొత్తం 800 పైగా ప్రొడక్ట్స్ పతంజలి బ్రాండ్‌పై మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో పాగా వేసుకున్న కంపెనీలకు పతంజలి ఉత్పత్తులు వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. -
పీవోకే విముక్తికి ప్రచారం చేపట్టండి..!
రోఠక్ః పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) విముక్తికోసం భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి.. యోగాగురు రామ్ దేవ్ బాబా విన్నవించారు. ఎన్నికల్లో ఐఎస్ ఐ రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ స్థానికుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో పీవోకే విముక్తికోసం ప్రయత్నించాలని రామ్ దేవ్ ప్రధానిని కోరారు. పాకిస్తాన్ లాంటి దేశమే కశ్మీర్ ను ఆక్రమించగల్గినప్పుడు గొప్ప దేశమైన భారత్ ఎందుకు చూస్తూ ఊరుకోవాలని బాబా ప్రశ్నించారు. జూలై లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ స్థానికులు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగా గురు రామ్ దేవ్ స్పందించారు. పీవోకే విముక్తికోసం ప్రయత్నించేందుకు వెంటనే ప్రచారం చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. కశ్మీర్ ఎలాగైనా తమ సొంతమేననడానికి నవాజ్ షరీఫ్ కు ఎన్నిగుండెలంటూ ప్రశ్నించారు. కశ్మీర్ లోని మన ప్రజలు కేవలం చెప్పుకోడానికేనన్నట్లుందని, పాకిస్తాన్ వారిని ఇప్పటికే ఆక్రమించేంసిందని అన్నారు. గొప్పదేశమైన భారత్ లోని భూభాగాన్ని పాక్ ఆక్రమిస్తుంటే చూస్తూ నెమ్మదిగా ఊరుకునేది లేదన్నారు. పీవోకే ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ ఆగ్రహించిన నీలం వ్యాలీ ప్రాంతంలోని స్థానికులు ఏకంగా పాకిస్తానీ జెండాను సైతం తగులబెట్టి, ఆందోళనలు చేపట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో స్థానికులకు సహకరించి, ఆక్రమిత కశ్మీర్ విముక్తికి ప్రచారం చేపట్టాలని రామ్ దేవ్ బాబా ప్రధానిని కోరారు. -
బీఎస్ఎఫ్ సిబ్బందికి యోగా శిక్షణ!
హరిద్వార్ః దేశంలోనే అతిపెద్ద కాపలా శక్తిగా ఉన్న సరిహద్దు భద్రతా బలగాల (బీఎస్ ఎఫ్) కు యోగాలో శిక్షణనిస్తున్నారు. గురు రాందేవ్ బాబా శిక్షణలో సుమారు 1900 మంది కి ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించారు. శరీరానికి మెదడుకు మధ్య సమన్వయాన్ని కుదిర్చి, సమతుల్యతకు ఎంతగానో సహకరించే యోగా...ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు తీవ్రమైన ఒత్తిడితో, కష్టించి పనిచేయాల్సిన సరిహద్దు భద్రతా బలగాలకు సైతం యోగా శిక్షణనిచ్చేందుకు నిర్ణయించారు. బీఎస్ఎఫ్ సిబ్బందికి పదిరోజులపాటు కొనసాగే యోగా శిక్షణా కార్యక్రమం శనివారం హరిద్వార్ లో ప్రారంభమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఏపీ మహేశ్వరి ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరగుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. సిబ్బందికి ఇచ్చే శిక్షణలో భాగంగా యోగాను కూడా నేర్పించనున్నట్లు ఇటీవల ఢిల్లీలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కె కె శర్మ వెల్లడించారు. తమ బలగాలకు యోగాలో కూడా తర్ఫీదునిచ్చేందుకు నిర్ణయించామని, ప్రతి ప్లాటూన్ లోనూ ఓ శిక్షకుడు ఉండేట్లుగా పారామిలటరీ బలగాలకు శిక్షణనివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్లాటూన్ లోని ఒక్కో టీమ్ సుమారు 35 మంది సిబ్బందితో కూడి ఉండేట్లుగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఒత్తిడినుంచి ఉపశమనం కలిగించేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందని తాజా సెషన్ ప్రారంభం సందర్భంగా బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. సరిహద్దు కాపలా విధులు నిర్వహించడంలో భాగంగా బీఎస్ఎఫ్ లో పనిచేసే పురుషులు, మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో విధినిర్వహణ ఎంతో కఠినంగా ఉంటుందని ఆ పరిస్థితుల్లో పనిచేసేవారికి యోగా ఒత్తిడిని తగ్గించే మంచి ఆయుధంగా పనిచేస్తుందని వివరించారు. -
కోట్ల టర్నోవర్ దిశగా రాందేవ్ 'పతంజలి'
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సారధ్యంలోని పతంజలి గ్రూపు 10,000 కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యంతో దూసుకు పోతోంది. మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలో పాలతోపాటు మరిన్ని పాల ఉత్పత్తులు, పశువుల దాణా, ప్రకృతి సిద్ధమైన ఎరువులు మార్కెట్లోకి విడుదల చేస్తామని బాబా రాందేవ్ ఆదివారం చండీగడ్ లో ప్రకటించారు. దీనికోసం కంపెనీ మూడు లేదా నాలుగు ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులు అందించడంతో పాటు రైతుల సాధికారత కోసం సహజ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నట్టు రాందేవ్ చెప్పారు. యూరియా లేకుండా పశు దాణాతోపాటు సహజ సిద్ధమైన ఎరువులనూ పెద్ద ఎత్తున తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పతంజలి గ్రూపు టర్నోవర్ రూ.10,000 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. అటు సంచలనాత్మకంగా మారిన పతంజలి ఆవనూనె ప్రచార ప్రకటనపై కూడా రాం దేవ్ స్పందించారు. ఆ ప్రకటన నిలిపివేసినట్టు చెప్పారు. కేవలం రసాయన ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆయిల్ ప్రజలకు అనారోగ్యకరమైందని మాత్రమే తాము చెప్పామన్నారు. జండు, డాబర్, హమ్ దర్ద్ లాంటి వాటిని తాము టేక్ ఓవర్ చేయమని తెలిపారు. దేశీయ కంపెనీలు వృద్ధి చెందాలన్నారు. దేశీయ కంపెనీల మధ్య పోటీకి బదులుగా అంతర్జాతీయ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో పిండి, ఔషధం, బియ్యం సహా దాదాపు 250కి పైగా ఉత్పత్తులను 'నో లాభం నో నష్టం' పద్ధతిలో విక్రయించినట్టు చెప్పారు. దేశంలో సరఫరా అవుతున్న పశువుల ఆహారంలో 1-4శాతం యూరియా, 50 శాతం కంటే ఎక్కువ బోవిన్ ఉంటోందని, ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. అందుకే పతంజలి గ్రూప్ పంటలకు సూక్ష్మ పోషక, విటమిన్లు కలిగిన సహజ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. తాము ఆరు రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. సహజ మందులు, సహజ ఆహారం, సహజ సౌందర్య సాధనాలు, పాల ఉత్పత్తులు , పశువుల దాణా, సహజ ఎరువుల ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయరు చేయనున్నట్టు పేర్కొన్నారు అనారోగ్యకరమైన ఉత్పత్తులను పతంజలి ఎపుడూ తయారు చేయదని స్పష్టం చేశారు. అలాగే మద్యం, మాంసాహారం మానవులకు హాని చేస్తాయన్నారు. అలాగే తాము బ్రెడ్ తయారు చేయడంలేదని తెలిపారు. -
రామ్‌దేవ్‌పై గోద్రెజ్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్ పై ప్రముఖ పారిశ్రామిక వేత్త, గోద్రేజ్ గ్రూప్ ఛైర్మన్ ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమ విభాగం ఐఎంసీ మంగళవారం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ లో మాట్లాడిన గోద్రేజ్ రామ్‌దేవ్ పేరు వల్లే పతంజలి నడుస్తోంది తప్ప, వారి ఎఫ్ ఎం సీజీ ఉత్పత్తులకు తమతో పోటీలేదన్నారు. ఆయన ఇమేజ్, పరపతి మూలంగా యోగా, ఆయుర్వేద ఉత్పత్తులు బావున్నాయి తప్ప మిగిలిన వాటికి అంత సీన్ లేదని తేల్చి పారేశారు. నెయ్యి, తేనె వంటి సాధారణ ఉత్పత్తులు మాత్రమే మార్కెట్లో అధికంగా అమ్మడవుతున్నాయని పేర్కొన్నారు. విలువ ఆధారిత విభాగంలో ఆ సంస్థ వాటా చాలా తక్కువని గోద్రెజ్ స్పష్టం చేశారు. కేవలం టాయిలెట్ సబ్బుల విభాగంలోనే కన్జూమర్ ప్రోడక్ట్స్ తో పోటీ పడుతోందన్నారు. ఈ విభాగంలో పతంజలి ప్రాతినిధ్యం చాలా తక్కువ అని వెల్లడించారు. డీజిల్ వాహనాలు నిషేధం వ్యతిరేకంగా మాట్లాడిన ఆది గోద్రేజ్ నిషేధానికి బదులుగా కాలుష్యాన్ని తగ్గించేందుకు, భూతాపాన్ని నిరోధించేందుకు టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం పొడిగింపుపై సానుకూలంగా మాట్లాడారు. అలాగే ప్రస్తుతం కుంగిపోయిన రియాల్టీ రంగానికి జిఎస్టి బిల్లు బూస్ట్ ఇస్తుందని తెలిపారు. కాగా మ్యాగీ నూడల్స్ వివాదం తరువాత పతంజలి ఆదాయం రూ.5000 కోట్ల మైలురాయిని దాటడం.. ఎఫ్ఎమ్సీజీ రంగంలో చర్చనీయాంశమైంది. దీనిపై బ్రోకరేజి సంస్థలు, ఎనలిస్టులు 2020 నాటికి సంస్థ ఆదాయం 20,000 కోట్లకు చేరుతుందని అంచనావేసిన సంగతి తెలిసిందే. -
ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బీజేపీకి ఇబ్బందే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పగ్గాలను సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ చేపడితే బీజేపీకి ఇబ్బందేనని యోగా గురువు రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీ బాధ్యతను ప్రియాంకకు అప్పగించాలని పలువురు పార్టీ కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రియాంక క్రియా శీలకంగా వ్యవహరిస్తే బీజేపీ మరింత కష్ట పడాల్సి వస్తుందని ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో సోనియా గాంధీ తన పట్ల వ్యవహిరించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన స్పష్టం చేశారు. -
నెస్లేను తరిమేస్తా, కోల్గేట్కు గేట్ పెడతా
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు ఆహార పదార్థాల వ్యాపార రంగంలోనూ తిరుగులేని బిజినెస్ మ్యాన్‌గా దూసుకుపోతున్నారు. పతంజలి గ్రూప్ ప్రొడక్ట్స్‌తో ఇప్పటికే కోల్గేట్, నెస్లే వంటి బహుళ జాతి సంస్థలకు ఎసరు పెట్టిన ఆయన తాజాగా మరో శపథం చేశారు. దేశం నుంచి 'నెస్లే' పక్షిని తరిమేస్తానని, 'కోల్గేట్'కు దేశంలోకి రాకుండా గేటు పెట్టేస్తానని, వాటిని భారత్‌లో లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10వేల కోట్ల టర్నవర్ సాధించడమే పతంజలి కంపెనీ లక్ష్యమని ఆయన మంగళవారం ప్రకటించారు. పతంజలి సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ గా మారిందని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. రాందేవ్ 2012 మార్చి నుంచి పతంజలి కంపెనీ ద్వారా పలు ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ప్రొడక్ట్స్‌ను దేశంలో మార్కెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టూత్ పేస్ట్, న్యూడిల్స్, నెయ్యి వంటి పలు రకాల ఉత్పత్తులతో పతంజలి కంపెనీ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఈ కంపెనీ 2011-12లో రూ. 446 కోట్లు, 2012-13లో రూ. 850 కోట్లు, 2013-14లో రూ. 1200 కోట్లు, 2014-15లో రూ. 2006 కోట్ల టర్నోవర్ సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 150 శాతం వృద్ధితో రూ. ఐదువేల కోట్ల టర్నోవర్‌ను పతంజలి గ్రూప్ సాధించనుంది. -
'బ్రోకర్ లా వ్యవహరిస్తున్న బాబా'
హరిద్వార్: ఉత్తరాఖండ్ లో రాజకీయ అనిశ్చితికి యోగా గురువు రాందేవ్ కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆయన బీజేపీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు, కాషాయ పార్టీకి మధ్య బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రాందేవ్, అమిత్ షా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉత్తరాఖండ్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ ఆరోపించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో రాందేవ్ టచ్ లో ఉన్నారనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అసంతృప్త ఎమ్మెల్యేలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారని అన్నారు. రాందేవ్ తీరుతో స్వాములకే కాదు ఉత్తరాఖండ్ కు చెడ్డపేరు వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఏజెంట్ మాదిరిగానే కాకుండా పార్టీ కార్యకర్తలా కూడా వ్యహరిస్తున్నారని కిశోర్ ఉపాధ్యాయ మండిపడ్డారు. ఉత్తరాఖండ్ రాజకీయాల్లో తాను జోక్యం చేసుకోలేదని రాందేవ్ తెలిపారు. ఏ ఒక్క ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తతో తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు. అమిత్ షా, నరేంద్ర మోదీని స్వతంత్రంగా పనిచేసుకోవాలని సూచించారు. గురువారం హరిద్వార్ లో పూలతో రాందేవ్ హోలీ వేడుకలు జరుపుకున్నారు. -
ద్రోహులను సమర్ధించడం కూడా రాజద్రోహమే
న్యూఢిల్లీ: జేఎన్‌యూ వివాదం అంతకంతకూ ఉధృత రూపం దాలుస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దేశ ద్రోహం కేసు పెట్టడాన్ని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా సమర్ధించారు. దేశద్రోహులను సమర్ధించడంకూడా రాజద్రోహం కిందికి వస్తుందని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారికి వత్తాసు పలకడం, వారితో స్నేహం చేయడాన్ని ఆయన తప్పు బట్టారు. అటు రాజ్యంగపరంగాగానీ, ఇటు ఆధ్యాత్మికపరంగా గానీ సమర్ధనీయం కాదంటూ రాందేవ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని నేరంగానే పరిగణించాలన్నారు. ఇప్పటికే ఈ వివాదంలో కన్హయ కుమార్, యూనివర్శిటీ మాజీ అధ్యాపకుడు గిలానీలపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. అదే క్రమంలో జేఎన్‌యూ విద్యార్ధులకు మద్దతు పలికిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసుపై విచారించేందుకు అలహాబాద్ కోర్టు అంగీకరించింది. భారతీయ శిక్షా స్మృతి (200 సెక్షన్) ప్రకారం రాహుల్‌పై వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సుశీల్ కుమార్ ఆదేశించడంతో మరింత అగ్గి రాజుకుంది. ఇదిఇలా ఉంటే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి దేశరాజధాని నగరంలో శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ నేతృత్వంలో పలువురు సీనియర్ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. -
రామ్‌దేవ్ నూడుల్స్ ఉండగా.. మిగతావి దండగ!
►ఆటా నూడుల్స్ విడుదల చేసిన పతంజలి ఆయుర్వేద ►సోషల్ మీడియాలో ఇప్పటికే రాందేవ్ నూడుల్స్ హల్చల్ ►మ్యాగీకి ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటున్న యోగా గురు మ్యాగీ నూడుల్స్ నిషేధానికి గురైనప్పటి నుంచి పిల్లలకు స్నాక్ ఐటం ఏం పెట్టాలో తెలియక తికమక పడుతున్న తల్లులకు.. రెండు నిమిషాల్లో కడుపు నింపే ఆహారం దూరమైపోయిందని బాధపడుతున్న బ్యాచిలర్లకు తియ్యటి శుభవార్త. విదేశీ మ్యాగీకి ప్రత్యామ్నాయంగా ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా.. స్వచ్ఛమైన స్వదేశీ ఆటా (గోధుమ పిండి) నూడుల్స్ తయారుచేయించి మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్లరసాలను ఉత్పతత్తి చేస్తున్న తమ సంస్థ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్.. కొత్తగా ఆటా నూడుల్స్ తయారుచేస్తున్నదని, ఇందులో ఒక్క ఔన్సు కూడా మైదా(పిండి)ని కలపలేదని, ఇది మ్యాగీ స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉండగలదని రామ్‌దేవ్ అన్నారు. గురువారం హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో రామ్‌దేవ్ ఆటా నూడుల్స్ ఉత్పత్తుల విక్రయాలను ఆయన ప్రారంభించారు. కాగా, ఇప్పటికే వీటిని తిన్నవారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పారు.. 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అని. మోతాదుకు మించి సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని తేలడంతో దేశవ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. -
రాందేవ్ మందుపై నిషేధం
భోపాల్: యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన వివాదాస్పద మెడిసిన్ పుత్రజీవక్ను ఎక్కడా అమ్మకాలు జరపొద్దని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. దాని పేరు మార్చేవరకు ఎవరు అమ్మకాలు జరపొద్దని స్పష్టం చేసింది. పుత్ర జీవక్ వాడితే మగ సంతానం కలుగుతుందని దాని విక్రయదారులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కేసీ త్యాగి పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తిన విషయం తెలిసిందే. పుత్ర జీవక్ ప్యాకెట్లు పార్లమెంటుకు తెచ్చిమరీ ఈ వివాదం లేవనెత్తారు. ఇది పెద్ద దుమారాన్ని లేపింది. అయితే, అది కేవలం మొక్క పేరు మాత్రమేనని, తమ మెడిసిన్ వాడితే మగ సంతానం కలుగుతుందని తాము ఎక్కడా చెప్పలేదని రాందేవ్ ప్రత్యేక వివరణ ఇచ్చారు కూడా. కానీ, ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఈ మందుల ఉత్పత్తి విషయంలో, కొనుగోలు, అమ్మకాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ చెప్పిన నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో దీనిపై నిషేధం విధించారు. -
రాందేవ్ మెడిసిన్‌పై సభలో దుమారం
-
రాందేవ్ మెడిసిన్‌పై సభలో దుమారం
న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ ఆయుర్వేద మెడిసిన్‌పై రాజ్యసభలో పెద్ద దుమారం రేగింది. ఈ మెడిసిన్ ఉపయోగించేవారికి మగ సంతానం కలుగుతుందని తయారీ దారులు ప్రకటించడాన్ని రాజ్యసభలోని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, రాజ్యాంగేతరమైన చర్యగా పేర్కొంటూ దానిని వెంటనే నిషేధించి తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్‌ను అందిస్తోంది. దీనిని వాడిన వారికి మగ సంతానం కలుగుతోందని ప్రచారం చేస్తోంది. అయితే, దీనిపై జేడీయ ఎంపీ కేసీ త్యాగి సభలో ఈ ప్యాకెట్ ను ప్రదర్శిస్తూ దీనిని తాను దివ్యా మెడిసిన్ షాపులో తెచ్చానని, మగ పిల్లలు పుడతారని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14న తాను దీనిని తీసుకొన్నట్లు రశీదును కూడా సభలో ప్రదర్శించారు. రాందేవ్ పేరును ప్రస్తావించకుండా నిజంగా దేశాన్ని ఒక డైనమిక్ నాయకుడు పాలిస్తుంటే నరేంద్రమోదీ ఇప్పుడావిషయాన్ని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆ ప్యాకెట్ ను తీసుకెళ్లి ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అందజేశారు. దాని ఉత్పత్తిని వెంటనే నిలిపివేసి లైసెన్సు రద్దు చేయాలని కోరారు. దీనిపై కొంత చర్చ జరిగినా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికార పక్షం స్పీకర్‌తో ప్రకటన చేయించింది. -
బాబా రాందేవ్‌కు కేబినెట్ హోదా
చండీగఢ్: బాబా రాందేవ్‌కు హరియాణా ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించిం ది. యోగా, ఆయుర్వేదాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్‌గా నియమితుడైన బాబా రాందేవ్‌కు కేబినెట్ మంత్రికి సమాన హోదా కల్పించాలని సోమవారం హర్యానా మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్ మంత్రికి సమాన హోదా ఇచ్చినప్పటికీ.. కేబినెట్ మంత్రి పొందే వేతన సౌకర్యాలు రాందేవ్ పొందలేరని, ప్రొటోకాల్ సౌకర్యాలు మాత్రం పొందుతారని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో యోగా, ఆయుర్వేదాలకు ప్రాచుర్యం కల్పించేందుకు పతంజలి యోగపీఠ్తో త్వరలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నామని హరియాణా మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. -
కాంగ్రెస్‌పై ప్రతీకారంతోనే రామ్‌దేవ్ బీజేపీ జపం
మాజీ సన్నిహితుడి ఆరోపణ పనాజీ: కాంగ్రెస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకే యోగా గురువు బాబా రాందేవ్ బీజేపీకి మద్దతిస్తున్నారని ఆయన మాజీ సన్నిహితుడు, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు దినేష్ వాఘేలా ఆరోపించారు. 2011లో ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరాహార దీక్ష సందర్భంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరించిన తీరుతో బాబా ప్రతీకారేచ్ఛతో ఉన్నారని చెప్పారు. దినేష్ వాఘేలా పార్లమెంట్ ఎన్నికల్లో అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. రాందేవ్ బాబా స్థాపించిన భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సభ్యుడిగా పని చేశారు. బాబా తన చర్యలకు పశ్చాత్తాప పడక తప్పదని వాఘేలా హెచ్చరించారు. ‘వ్యవస్థలో మార్పు తెచ్చేందుకే భారత్ స్వాభిమాన్ ట్రస్టులో చేరా. ఆ తరువాత నిజంగా ఎవరిలోనైనా మార్పు వచ్చిందంటే అది బాబా రాందేవ్‌లోనే’ అని వాఘేలా వ్యాఖ్యానించారు. అయితే దేశాన్ని జాగృతం చేసినందుకు బాబాను తాను ఇప్పటికీ గౌరవిస్తానని చెప్పారు. -
కాంగ్రెస్ చేతిలో తోలుబొమ్మలా మారకు: రాందేవ్
చండీఘడ్: బీజేపీలో కలిసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దారులు వెతుకుతోందని యోగా గురువు రాందేవ్ బాబా విమర్శించారు. ఆప్ ప్రజల మద్దతు కోల్పోయిందని రాందేవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించడంలో ఆప్ నేతలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేపట్టారన్నారు. చండీఘడ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్టాడుతూ.. దేశానికి మోడీ ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని రాందేవ్ అన్నారు. మోడీతో చేతులు కలపడానికి కేజ్రీవాల్ సిద్దపడితే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని ఆయన అన్నారు. అవినీతి పోరాట ఉద్యమంలో తాను కేజ్రీవాల్ కు మద్దతు తెలిపానని ఆయన అన్నారు. వ్యవస్థను మార్చేందుకు ఉద్యమించిన కేజ్రీవాల్ దారి తప్పారని రాందేవ్ విమర్శించారు. అంతేకాకుండా కాంగ్రెస్ చేతిలో తోలుబొమ్మలా మారకు అని కేజ్రీవాల్ కు రాందేవ్ సూచించారు. -
రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా
స్వలింగ సంపర్కంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రాందేవ్ పై మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పరువు నష్టం దావా వేశారు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు స్వలింగ సంపర్కులు కాబట్టే దీనికి మద్దతు తెలుపుతున్నారని రాందేమ్ వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ, మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ద్వివేది పరువు నష్టం నోటీస్ పంపారు. రాందేవ్ వారంలోగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణలు చెబుతూ రాందేవ్ రాతపూర్వకంగా పత్రిక ప్రకటన ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అరవింద్ కేజ్రీవాల్ శిష్యుడి విధి నిర్వర్తించలేదు: రాందేవ్ బాబా
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై యోగా గురువు రాందేవ్ బాబా మండిపడ్డారు. లోక్‌పాల్ బిల్లు విషయంలో అన్నాహజారేతో విభేదించడాన్ని ఆయన వ్యతిరేకించారు. శిష్యుడి విధులను కేజ్రీవాల్ నిర్వర్తించలేదన్నారు. అన్నాకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని మీరట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విమర్శించారు. అన్నా హజారే ఆమోదించిన బిల్లును వ్యతిరేకించడం ద్వారా గురుశిష్య పరంపరకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ వెళ్లారన్నారు. అలాగే ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి అరవింద్ కేజ్రీవాల్ సిగ్గుపడటం కూడా సరికాదని రాందేవ్ చెప్పారు. ఆయన బాధ్యతలను తప్పించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ స్వలింగ సంపర్కానికి మద్దతు ఇవ్వడాన్ని రాందేవ్ తీవ్రంగా విమర్శించారు. సుప్రీం తీర్పును విమర్శించడం ద్వారా ఆ పార్టీ ప్రజల మద్దతును కోల్పోయిందని చెప్పారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న నరేంద్రమోడీ వ్యాఖ్యలను సమర్థించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని తెలిపారు. -
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం: రాందేవ్
త్వరలో జరిగే మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తవుతుందని యోగా గురు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని, వందలోపు మాత్రమే ఎంపీ సీట్లు వస్తాయని రాందేవ్ చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మధ్య పోలిక పెట్టరాదని అన్నారు. ఒకరు తన కుటుంబం కోసం రాజకీయాల్లోకి వచ్చారని, మరొకరు తన బాధ్యతలను నిర్వర్తించేందుకు కష్టపడుతున్నారని రాందేవ్ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోకి చేరుతారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఏ రాజకీయా పార్టీకీ మద్దతు ఇవ్వబోనని, చేరే ఉద్దేశ్యం కూడా లేదని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ భాగస్వామిగా లేనని, భవిష్యత్‌లోనూ ఉండబోనని రాందేవ్ తెలిపారు. -
రాందేవ్ తమ్ముడిపై కిడ్నాప్ కేసు.. కుట్ర ఉందన్న బాబా
యోగా గురువు రాందేవ్ బాబా తమ్ముడు రాం భరత్‌పై ఉత్తరాఖండ్ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఆశ్రమానికి చెందిన ఓ మాజీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి తమ స్వాధీనంలో ఉంచుకున్నారంటూ ఈ కేసు నమోదు చేశారు. తన మనవడు నితిన్ త్యాగిని రాం భరత్ కిడ్నాప్ చేశాడంటూ సోమ్ దత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాందేవ్‌కు చెందిన పతంజలి యోగపీఠంలో నితిన్‌పై దాడి జరిగిందని కన్ఖల్ పోలీసు స్టేషన్ సీఐ చంద్రమోహన్ నేగి తెలిపారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు కూడా ఆయన చెప్పారు. అయితే.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర అని రాందేవ్ బాబా మండిపడ్డారు. తన పర్యటనల ద్వారా కాంగ్రెస్ పార్టీని తాను దెబ్బతీస్తున్నాననే ఇలా చేశారన్నారు. తన తమ్ముడు తప్పించుకుపోయే వ్యక్తి కాదని, పోలీసులు ఇంతవరకు అతడిని విచారణకే పిలవలేదని ఆయన అన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం తమ ఆశ్రమంలో రూ. 25 లక్షల విలువైన మిషన్ విడిభాగాలను త్యాగి దొంగిలించాడని రాందేవ్ ప్రతినిధి ఎస్కే తిజరావాలా తెలిపారు. -
రాహుల్ గాంధీ 'ఓ అమాయకపు బాలుడు'
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వేదికలు ఎక్కి చేసే ఉపన్యాసాలన్ని ఎవరో రాసి ఇస్తే తప్ప సొంతంగా ఆయన ఏమీ మాట్లాడలేరని సమాజవాది పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజాంఖాన్ విమర్శించారు. యూపీ పర్యటనలో భాగంగా రాహుల్ యువరాజు కొత మిషన్లు, ప్లైవుడ్ ప్యాక్టరీల వద్ద ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఓ అమాయకపు బాలుడుగా ఆయన అభివర్ణించారు. అదే విషయాన్ని గతంలో యోగా గురువు రామదేవ్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. గత రాత్రి బుదన్లో అజాంఖాన్ విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఈ సందర్భంగా ఖండించారు. దేశంలో మత ఘర్షణలకు కాంగ్రెస్ పార్టీయే అజ్యం పోసిందని ఆయన మండిపడ్డారు. ఓ విధంగా చెప్పాలంటే భారత్‌లో మతఘర్షణలకు కాంగ్రెస్ పార్టీ పునాదులు వేసిందని అజాంఖాన్ ఆరోపించారు. -
షరతులతో రామ్‌దేవ్ యోగా శిబిరానికి అనుమతి
న్యూఢిల్లీ: నగరంలో యోగా గురువు రామ్‌దేవ్ యోగా శిబిరం నిర్వహించడానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే ఈ శిబిరాన్ని ఎలాంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ద్వారకా, నాంగ్లోయ్, శాస్త్రీ పార్క్‌లలో రామ్‌దేవ్ శిబిరాలు ఏర్పాటయ్యాయి. ద్వారకాలో గురువారం నుంచి రామ్‌దేవ్ నడిపే యోగా శిబిరానికి అనుమతి ఇవ్వరాదంటూ దాఖలైన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. యోగా శిబిర కార్యకలాపాలను విడియో తీయాలని ప్రధాన ఎన్నికల అధికారి విజయ్ దేవ్ అధికారులను ఆదేశించారు. యోగా శిబిర నిర్వహణకు సంబంధించి తనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు అందినట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంది కాబట్టి శిబిరాలపై ఎన్నికల సంఘం కన్నేసి ఉంటుందని ఆయనన్నారు. యోగా శిబిరాల ప్రారంభ, ముగింపు వేడుకలను రాజకీయ నేతలతో జరుపరాదని. వేదికపై రాజకీయ నేతలు ప్రసంగాలు ఇవ్వరాదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు లిఖిత ఫిర్యాదు అందినట్లయితే చర్య తీసుకుంటామని కమిషన్ హెచ్చరించింది. యోగా శిబిరంలో ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రచార సామగ్రిని పంచిపెట్టరాదని, శిబిరం ఏ వ్యక్తి రాజకీయ ప్రచారానికి వేదిక కాకుండా చూడాలని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. శిబిర నిర్వాహకులతో పాటు, ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల కమిషన్ ఆంక్షలను ఉల్లంఘించినట్లయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద చర్య తీసుకుంటామని హెచ్చరించింది. యోగా శిబిర నిర్వహణకు ఇచ్చిన అనుమతిని కూడా ఉపసంహరించుకోవడానికి వెనుకాడబోమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. యోగా శిబిరం నుంచి ఏదైనా రాజకీయ సందేశం ప్రత్యక్షంగా, లేదా పరోక్షంగా వెలువడినట్లయితే ఎన్నికల కమిషన్ దానిని తీవ్రంగా పరిగణిస్తుందని, మొత్తం ఖర్చును ఎన్నికల ప్రచార వ్యయంలో చేరుస్తామని హెచ్చరించింది. ఈ ఎన్నికల వ్యయాన్ని అభ్యర్థి ఖర్చులో చేరుస్తారు. ఎన్నికల కమిషన్ విధించిన అన్ని ఆంక్షలకు లోబడి శిబిరం నిర్వహిస్తామని నిర్వాకుల నుంచి హామీ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ స్థానిక అధికారులను ఆదేశించింది. -
బాబా రామ్‌దేవ్‌కు స్వేచ్ఛ
లండన్: దాదాపు రెండు రోజులుగా విచారణ పేరుతో తమ నిర్బంధంలో ఉంచిన యోగా గురు రామ్‌దేవ్‌ను బ్రిటన్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు శనివారం విడుదల చేశారు. యోగా శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం లండన్ చేరుకున్న ఆయనను కస్టమ్స్ అధికారులు హీత్రూ విమానాశ్రయంలో నిలిపేశారు. నిర్బంధానికి తగిన కారణాలేమీ చెప్పకుండానే ఆయనను మొదటిరోజు ఆరుగంటలపైనే విచారించారు. బిజినెస్ వీసాపై గాకుండా సందర్శకుల వీసాపై ప్రయాణించడంపైనే అధికారులు ఆయనను ప్రశ్నించారని సమాచారం. శనివారం సాయంత్రం భారత సంతతికి చెందిన ఎంపీ కీత్ వాజ్‌తో కలిసి హీత్రూ విమానాశ్రయానికి వచ్చిన రామ్‌దేవ్, చీఫ్ ఇమిగ్రేషన్ అధికారిని కలిశారు. సుమారు 20 నిమిషాలపాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం అధికారులు ఆయన స్వేచ్ఛగా బ్రిటన్‌లో తన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని స్పష్టంచేశారు. అధికారుల ప్రకటన తర్వాత రామ్‌దేవ్ విలేకరులతో మాట్లాడుతూ, తన నిర్బంధం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ హస్తం ఉండవచ్చని అన్నారు. అంతకు ముందు ఈ విషయంపై స్పందించడానికి బ్రిటన్ హోం శాఖ నిరాకరించింది. బ్రిటన్‌లో యోగా శిబిరాల నిర్వహణతో పాటు పతంజలి యోగాపీఠ్ (బ్రిటన్) ట్రస్టు కార్యక్రమాల్లో రామ్‌దేవ్ ప్రసంగించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా శనివారం సాయంత్రం లండన్‌లోని లాంప్టాన్ పార్కులో ప్రవాసభారతీయుల సదస్సులో రామ్‌దేవ్ కీలక ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. అయితే విమానాశ్రయంలో నిర్బంధం విషయం కొలిక్కి వచ్చేవరకు ఆ కార్యక్రమం నిలిపేశారు. రామ్‌దేవ్ నిర్బంధం తీవ్రమైన విషయమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా స్పందించాలని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కోరారు. -
లండన్ ఎయిర్‌పోర్టులో 8 గంటలు రాందేవ్ నిర్బంధం
యోగా గురు బాబా రాందేవ్‌కు ఇంగ్లండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్బంధించారు. శనివారం రాందేవ్‌ను విడిచిపెట్టినట్టు ఆయన ప్రతినిధి ఎస్.కె.తేజరావాలా తెలిపారు. వేధింపులకు గురైనట్టు 'స్వామీజీ' భావించారని తెలిపారు. కస్టమ్స్ అధికారులు రాందేవ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. బ్రిటన్‌కు విజట్ వీసాపై వచ్చారా లేక బిజినెస్ వీసాపైనా అన్న విషయం గురించి ఆరా తీశారు. ఆయన వెంట తీసుకెళ్లిన ఆయుర్వేద మందుల గురించి ప్రశ్నించారు. రాందేవ్ తన వెంట నాలుగు జతల దుస్తులు, కొన్ని మందులు, పుస్తకాలు తీసుకెళ్లారు. 'తనను ఎందుకు నిర్బంధించారని బాబా పలుసార్లు అధికారులను ప్రశ్నించారు. జీవితంలో ఎప్పుడూ నేరం, అనైతిక పనులు చేయలేదని చెప్పారు. ఐతే అధికారులకు ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు' అని తేజరావాలా చెప్పారు. 125 కోట్ల భారతీయులందరికీ ఇది అవమానకర సంఘటన అని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడేళ్లుగా బాబా పలుసార్లు ఇంగ్లండ్ వెళ్లి యోగా తరగతులు నిర్వహించారని తెలిపారు. పతంజలి యోగ పీఠం నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు.