రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా
స్వలింగ సంపర్కంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రాందేవ్ పై మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పరువు నష్టం దావా వేశారు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు స్వలింగ సంపర్కులు కాబట్టే దీనికి మద్దతు తెలుపుతున్నారని రాందేమ్ వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ, మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ద్వివేది పరువు నష్టం నోటీస్ పంపారు.
రాందేవ్ వారంలోగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణలు చెబుతూ రాందేవ్ రాతపూర్వకంగా పత్రిక ప్రకటన ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.