శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం: రాందేవ్
త్వరలో జరిగే మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, చత్తీస్గఢ్ శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తవుతుందని యోగా గురు బాబా రాందేవ్ జోస్యం చెప్పారు. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఘోరంగా దెబ్బతింటుందని, వందలోపు మాత్రమే ఎంపీ సీట్లు వస్తాయని రాందేవ్ చెప్పారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మధ్య పోలిక పెట్టరాదని అన్నారు. ఒకరు తన కుటుంబం కోసం రాజకీయాల్లోకి వచ్చారని, మరొకరు తన బాధ్యతలను నిర్వర్తించేందుకు కష్టపడుతున్నారని రాందేవ్ వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోకి చేరుతారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఏ రాజకీయా పార్టీకీ మద్దతు ఇవ్వబోనని, చేరే ఉద్దేశ్యం కూడా లేదని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ భాగస్వామిగా లేనని, భవిష్యత్లోనూ ఉండబోనని రాందేవ్ తెలిపారు.