defamation notice
-
పరువు నష్టం దావా నోటీసులు పంపిన పెద్దిరెడ్డి
తిరుపతి, సాక్షి: మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో తనపై జరిగిన విష ప్రచారంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆ ప్రచారం చేసిన పత్రికలు, మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీసులు పంపించారు. ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్ కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులు పంపించినట్లు సమాచారం, ఇందులో ఈనాడు, ఈటీవీ 50 కోట్ల రూపాయలు, మహా న్యూస్ కు 50 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి న్యాయ పరంగా బుద్ధి చెప్తానని ఇదివరకే ఆయన ప్రకటించారు. ఇప్పుడు నోటీసులు పంపగా.. అతి త్వరలో ఆయన కేసు వేస్తారని ఆయన తరఫు న్యాయవాదులు అంటున్నారు. -
నటికి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు పంపిన సుఖేష్
ముంబై: మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సుఖేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి ఛాహత్ ఖన్నాకు రూ.100కోట్ల పరువు నష్టం దావా నోటీసులు పంపాడు. తనపై చేసిన ఆరోపణలకు వారం రోజుల్లో క్షమాపణలు చెప్పాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కావాలని అతని తరఫు న్యాయవాది హెచ్చరించాడు. ఛాహత్ ఖాన్నా చేసిన ఆరోపణల వల్ల సుఖేష్ పరువు పోయిందని, మానసికంగా వేధనకు గురయ్యాడని న్యాయవాది పేర్కొన్నాడు. పలు బాలీవుడ్ సినిమాలతో పాటు, సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఛాహత్ ఖన్నా. ముఖ్యంగా 'బడే అచ్చే లగ్తే హై' సీరియల్‌తో బాగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుఖేశ్ తనను కూడా మోసం చేసేందుకు ప్రయత్నించాడని, తిహార్ జైల్లో అతడ్ని కలిసినప్పుడు పెళ్లి చేసుకుంటాని ప్రపోజ్ చేశాడని ఆరోపించింది. 'ఢిల్లీలో ఈవెంట్ ఉందని చెప్పి ఏంజెల్ ఖాన్(పింకీ ఇరానీ) అనే మహిళ నన్ను తీసుకెళ్లింది. తీహార్ జైలు రోడ్డు మార్గం నుంచి వెళ్లాలని పేర్కొంది. ఆ తర్వాత జైలు వద్ద ఆపి లోపలికి తీసుకెళ్లింది. అక్కడ సుఖేష్ చంద్రశేఖర్ నన్ను కలిశాడు. బ్రాండెడ్ షర్టు వేసుకొని బాగా సెంటు రాసుకొని మెడలో గోల్డ్ చైన్ ధరించి ఉన్నాడు. తాను ఓ సౌత్ ఇండియా టీవీ ఛానల్ ఓనర్నని, జే జయలలిత మేనల్లుడినని పరిచయం చేసుకున్నాడు. ఈవీఎం ట్యాంపరింగ్ కేసులో ఆరెస్టయ్యానన్నాడు. అసలు నన్ను ఇక్కడకు ఎందుకు పిలిపించారు? ఆరు నెలల బిడ్డను వదిలేసి వచ్చా అని నేను చెప్పా. అప్పుడు అతను నేనంటే ఇష్టం ఇన్నాడు. బడే అచ్చే లగ్తే హై సీరియల్లో నా నటన చూసి ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. దీంతో నేను అతనిపై అరిచా. నాకు పెళ్లైంది. ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా. నా భర్త నాకు సరైనోడు కాదని, తాను ఎంతగానో ప్రేమిస్తున్నాని సుఖేష్ చెప్పాడు. నేను కోపంతో అక్కడి నుంచి వచ్చేశా. ఆ తర్వాత నేను తిహార్ జైలుకు వెళ్లిన వీడియో చూపించి ఒకరు రూ.10లక్షలు ఇవ్వమని బెదిరించారు. దీంతో నేను జైలుకు వెళ్లిన విషయం ఎవరికీ తెలియవద్దని, తన పెళ్లిపై ప్రభావం పడొద్దని ఆ డబ్బు వాళ్లకు ఇచ్చేశా. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. నా భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. నేను ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది. కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటి నుంచి నేను బయటపడాలనుకున్నా.' అని ఛాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా.. సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొన్నారు. చదవండి: మైనర్‌తో బాడీ మసాజ్ చేయించుకున్న క్రికెట్ కోచ్ -
అక్తర్ కొంప ముంచిన హర్భజన్.. దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పీటీవీ
Shoaib Akhtar Gets 100 Million Defamation Notice By PTV: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌కు అదే దేశానికి చెందిన ప్రముఖ క్రీడా ఛానల్ పీటీవీ(పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్) దిమ్మతిరిగిపోయే షాకిచ్చింది. అక్తర్‌పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ముందస్తు సమాచారం లేకుండా ఛానల్ నుంచి వైదొలిగాడని, నిబంధనలకు విరుద్ధంగా టీ20 ప్రపంచకప్-2021 వేదిక అయిన దుబాయ్ విడిచి వెళ్లిపోయాడని, తద్వారా తమ సంస్థకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందంటూ పీటీవీ.. అక్తర్‌కు నోటీసులు జారీ చేసింది. అక్తర్.. భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఓ ఇండియన్ టీవీ షోలో పాల్గొనడం వల్ల తమకు నష్టం కలిగిందని పీటీవీ నోటీసుల్లో పేర్కొంది. ఇందుకుగాను అక్తర్ తన మూడు నెలల జీతం(రూ. 33, 33, 000)తో పాటు నష్టపరిహారంగా రూ. 10 కోట్లు చెల్లించాలంటూ దావా వేసింది. ఇలా జరగని పక్షంలో అక్తర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 26న జరిగిన మ్యాచ్ అనంతరం నిర్వహించిన పీటీవీ లైవ్ షోలో అక్తర్‌కు ఘోర అవమానం జరిగింది. ఆ లైవ్ షోలో ప్రముఖ పాకస్థానీ వ్యాఖ్యాత, హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్ అక్తర్‌ను లైవ్ లోనుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఊహించని ఈ పరిణామంతో షాక్‌కు గురైన అక్తర్.. మైక్‌ను విసిరేసి షో నుంచి వాకౌట్ చేశాడు. అనంతరం ఆ టీవీ ఛానల్‌తో తనకున్న ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకున్నాడు. చదవండి: T20 WC 2021: అక్తర్‌కు ఘోర అవమానం.. లైవ్‌లో పరువు తీసిన హోస్ట్ -
అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ టెలివిజన్ కార్పొరేషన్ (పీటీఈ) తమ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు 10 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు ఇచ్చింది. పీటీఈ నుంచి అక్తర్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వైదొగలడమే కాక ఒప్పంద నిబంధనలకు విరుధంగా టీ20 ప్రపంచకప్ ప్రసార నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయాడంటూ పీటీవీ నోటీస్‌లో ఆరోపించింది. అంతేకాదు మూడు నెలల వ్రాతపూర్వక నోటీసు లేదా చెల్లింపుల ద్వారా అతని ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు ఇరుపక్షాలకు ఉంటుంది. (చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!) కానీ అక్తర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాజీనామా చేయడంతో తమ సంస్థకు భారీ నష్టాలు చవిచూసినట్లు నోటిస్లో పేర్కొంది. పైగా అక్తర్ భారత క్రికెటర్ హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక భారతీయ టీవీ షోలో కనిపించడం కూడా తమ సంస్థకి కోలుకోలేని నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ మేరకు పీటీవీ మూడు నెలల జీతానికి సమానమైన రూ. 33,33,000 మొత్తంతో పాటు నష్టపరిహారంగా 10 కోట్ల రూపాయలు చెల్లించాలని పీటీవీ నోటిస్లో అక్తర్‌ను కోరింది. ఈ మేరకు అక్తర్ చెల్లించనట్లయితే పీటీసీ చట్టపరమైన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. (చదవండి: అక్కడ అలా కొట్టుకోవడమే ఆచారమటా!!) -
బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు
డెహ్రడూన్: కరోనా వైరస్‌ను నియంత్రించడంతో అల్లోపతి వైద్యం విఫలం చెందిందని యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి వైద్యంపై నమ్మకం లేదని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యాఖ్యలపై భారత వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్-ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి పరిహారంగా రూ.వెయ్యి కోట్లు డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ పరువు నష్టం దావా వేసింది. రూ.వెయ్యి చెల్లించాలని ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలపై రాందేవ్ బాబా క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేయకపోయినా.. 15 రోజుల్లో రాతపూర్వక క్షమాపణ చెప్పకపోయినా రాందేవ్ బాబా రూ.1000 కోట్ల పరువు నష్టం చెల్లించాలని ఐఎంఏ పరువు నష్టం దావా ఫిర్యాదులో పేర్కొంది. దీంతోపాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్‌కు లేఖ రాసింది. రాందేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
రాకేష్ మాస్టర్‌పై మాధవీలత ఫైర్
సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రాకేష్ మాస్టర్‌పై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ మాస్టర్ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఈ నటి అతడి వ్యాఖ్యలను తనను ఎంతగానో బాధించాయన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసినందుకు గాను సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తానన్నారు. రాకేష్ మాస్టర్‌ను ఉపేక్షించేది లేదని కోర్టు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించేలా చేస్తానని హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదని, అతడికి పరువునష్టం కేసు ద్వారానే సమాధానం చెప్పబోతున్నట్లు వివరించారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ, న్యాయవాది రాంచంద్రరావు దిశానిర్దేశంలో ముందుకు వెళ్లబోతున్నట్లు మాధవీ లత తెలిపారు. ఇక గత కొన్ని రోజులుగా రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారాడు. అతడి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ వర్గాల్లో పలు చర్చలకు కారణమవుతున్నాడు. ఇప్పటికే రాకేష్ మాస్టర్‌కు శ్రీరెడ్డి లీగల్ నోటీస్ పంపించగా తాజాగా మాధవీలత కూడా అదే మార్గంలో వెళ్లనుంది. మరి ఈ నోటీస్‌లపై రాకేష్ మాస్టర్ మరేం కామెంట్స్ చేస్తాడో వేచిచూడాలి. చదవండి: తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్ ఈశ్వర్,అల్లా,జీసస్‌లపై ఒట్టేసిన వర్మ -
మోదీకి పరువు నష్టం నోటీసులు
కోల్కత్తా: ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పరువు నష్టం నోటీసులు ఇచ్చారు. ప్రచారంలో భాగంగా మోదీ తనపై నిరుపణలేని ఆరోపణలు చేశారని, వ్యక్తిగతంగా తనను కించపరిచేలా మాట్లాడారని తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్లో ఈనెల 15న జరిగిన ఎన్నికల ర్యాలీలో అభిషేక్‌పై మోదీ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన అభిషేక్ పరువునష్టం కేసు వేశారు. డైమండ్ హార్బర్ నియోజవర్గం నుంచి టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ పోటీచేస్తూండగా.. బీజేపీ నుంచి నీలాంజన్ రాయ్ బరిలో నిలిచారు. నీలాంజన్ రాయ్ తరఫున ఈనెల 15న ప్రచారం చేసిన మోదీ, మమతా, ఆమె మేనల్లుడు పాలనను చిత్రహింసల పాలనగా పేర్కొన్నారు. ప్రజలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలిచి వారికి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 'పశ్చిమబెంగాల్లో గూండాక్రసీగా డెమోక్రసీ మారింది. టీఎంసీ గూండాలు ప్రజల జీవితాలను నరకప్రాయం చేశారు. గూండాక్రసీకి త్వరలో తెరపడనుంది' అని మోదీ అన్నారు. -
క్షమాపణ చెప్పకుంటే రూ. 5 కోట్లు కట్టండి
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాక్ రక్షణమంత్రి దస్తగీర్‌కు రూ.5.70 కోట్ల(10 కోట్ల పాకిస్తానీ రూపాయలు) పరువునష్టం నోటీసులిచ్చాడు. ‘పాఠశాల విద్యార్థులపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరపకుండా ఉండేందుకే జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు విరాళాలపై నిషేధం విధిస్తున్నాం’ అని ఇటీవల దస్తగీర్ అన్నారు. దీంతో ‘ఈ విషయమై నా క్లయింట్(సయీద్)కు 14 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణ చెపాల్పి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని దస్తగీర్ మాటివ్వాలి. లేదంటే పాకిస్తాన్ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద కోర్టును ఆశ్రయిస్తాం’ అని సయీద్ న్యాయవాది నోటీసులు జారీచేశారు. -
తెలంగాణ, ఏపీలకు కోర్టు ధిక్కార నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. జిల్లా స్థాయిలో పోలీసు ఫిర్యాదు విభాగం, రాష్ట్ర స్థాయిలో సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా నేటి వరకు ఏర్పాటు చేయలేదంటూ ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధి ఎన్.ఎస్.చంద్రశేఖర్ లేఖను హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార పిటిషన్‌గా పరిగణించింది. ఎందువల్ల గత ఆదేశాల్ని అమలు చేయలేదో 4 వారాల్లో వివరణ ఇవ్వాలని, ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో తెలియజేయాలని న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఆదేశించారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు. పోలీసు అధికారులపై వచ్చే ఆరోపణల ఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో పోలీస్ ఫిర్యాదు విభాగం, పోలీసు చర్యల కారణంగా ఇబ్బందిపడే జనం సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో పోలీస్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలని గతంలోని ఆదేశాలను రెండు ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయని ఆ లేఖలో పేర్కొన్నారు. విచారణ 4 వారాలకు వాయిదా పడింది. -
రాందేవ్ పై కాంగ్రెస్ పరువు నష్టం దావా
స్వలింగ సంపర్కంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు బాబా రాందేవ్ పై మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు పరువు నష్టం దావా వేశారు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు స్వలింగ సంపర్కులు కాబట్టే దీనికి మద్దతు తెలుపుతున్నారని రాందేమ్ వ్యాఖ్యానించినట్టు కథనాలు వెలువడ్డాయి. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయ, మానవ హక్కుల విభాగం ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ ద్వివేది పరువు నష్టం నోటీస్ పంపారు. రాందేవ్ వారంలోగా తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి క్షమాపణలు చెబుతూ రాందేవ్ రాతపూర్వకంగా పత్రిక ప్రకటన ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సోనియాపై రూ.10కోట్ల దావా!
భోపాల్: అసత్య ఆరోపణలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆయన భార్య సాధనాసింగ్ నోటీసు జారీ చేశా రు. చౌహాన్‌ల ఇంట డబ్బులను లెక్కించే మెషిన్ ఉందని, ముఖ్యమంత్రి తన సమీప బంధువులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారంటూ పత్రికల్లో, ఇంటర్నెట్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు ఇవ్వడంతో చౌహాన్ దంపతులు చర్య లు చేపట్టారు. ఆరోపణలను వెనక్కి తీసుకుంటూ 15రోజుల్లోగా ప్రకటన లివ్వకపోతే రూ.10కోట్ల మేర పరువు నష్టం వాటిల్లిందంటూ వ్యాజ్యం వేస్తామన్నారు. -
సోనియా గాంధీపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసినందుకుగాను శివరాజ్‌సింగ్ సోనియాపై రూ. 10 కోట్ల రూపాయలకు దావా వేశారు. సోనియాతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాకు నోటీసులు పంపారు. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు, ఆరోపణలుతో రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపాయి. మోడీకి ఇటీవల ఈసీ నోటీసు జారీ చేసింది.