సోనియా గాంధీపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్సింగ్ చౌహాన్ పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసినందుకుగాను శివరాజ్సింగ్ సోనియాపై రూ. 10 కోట్ల రూపాయలకు దావా వేశారు. సోనియాతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాకు నోటీసులు పంపారు.
లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు, ఆరోపణలుతో రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపాయి. మోడీకి ఇటీవల ఈసీ నోటీసు జారీ చేసింది.