Shivrajsingh chouhan
-
‘రాహుల్.. రామలింగంలా మాట్లాడుతున్నారు’
భోపాల్ : తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రైతు రుణమాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ విమర్శలు సంధించారు. ‘మంద్‌సౌర్‌లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు త్రీ ఇడియట్స్ సినిమాలోని రామలింగం కామెడీలా ఉందంటూ’ ఆయన ఎద్దేవా చేశారు. ‘త్రీ ఇడియట్స్ సినిమాలో ఎవరో రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని రామలింగం అనే విద్యార్థి చదివి నవ్వులపాలవుతాడు. అలాగే రాహుల్ గాంధీ కూడా తనకు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని బట్టీ పట్టి ఇక్కడ(మంద్‌సౌర్‌లో) చదివారు. ఆయన మాటలు పూర్తిగా నాటకీయం, అపరిపక్వమైనవి. అదొక స్క్రిప్ట్ అని స్పష్టంగా తెలిసిపోతోంది. అందులో నిజాలు, గణాంకాలు ఏమీ లేవు. మంద్‌సౌర్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొస్తామని రాహుల్ చెప్పారు. ఆ విషయం గురించి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వారం క్రితమే ప్రస్తావించారంటూ సారంగ్’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘రాహుల్ గాంధీ మాట్లాడుతున్నది ఫుడ్ చెయిన్ గురించి కాదు.. ఫ్రాడ్ చెయిన్ గురించి అందులో ముఖ్యపాత్రధారి రాబర్ట్ వాద్రా అంటూ సారంగ్ ఆరోపించారు. ఆర్థిక భరోసా ఇస్తున్నాం... రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా పది రోజుల్లోగా రైతు రుణమాఫీ చేయడం అంత తేలికగ్గా సాధ్యమయ్యే విషయం కాదని సారంగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మా ప్రభుత్వం రైతులకు వడ్డీలేని రుణాలు అందిస్తూ.. ఆర్థిక భరోసా కల్పిస్తోందని తెలిపారు. మేడ్ ఇన్ మంద్సౌర్... మేడ్ ఇన్ మంద్సౌర్ పేరిట సెల్ ఫోన్ల తయారీ యూనిట్ నెలకొల్పుతామంటూ రాహుల్ చెప్పడం విడ్డూరంగా ఉందని సారంగ్ వ్యాఖ్యానించారు. రాహుల్ ముందు మేడిన్ అమేథీపై దృష్టిసారించాలంటూ హితవు పలికారు. కాగా మంద్సౌర్ జిల్లా పిప్లియా మండీలో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. -
దీక్ష కొనసాగింపుపై నేడు సీఎం నిర్ణయం!
రెండోరోజూ కొనసాగిన చౌహాన్ దీక్ష మధ్యప్రదేశ్‌లో శాంతిస్థాపనే లక్ష్యంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహార్ రెండోరోజూ ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. భోపాల్‌లోని దసరా మైదానంలో ఆయన దీక్ష కొనసాగుతోంది. మంత్రివర్గమంతా ఆయన వెంటే ఉంది. దీక్షాస్థలి వద్దే ఉన్నతాధికారులతో సీఎం చౌహాన్ సమావేశమై.. పరిపాలనను పర్యవేక్షించారు. వందలాది మంది రైతులు దీక్షాస్థలికి తరలివచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం ప్రకటించారు. సీఎం నిరాహార దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని.. తమ గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తే చాలని అన్నదాతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. నిరాహార దీక్ష కొనసాగింపుపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటన తర్వాత మధ్యప్రదేశ్ వ్యాప్తంగా చెలరేగిన హింస నేపథ్యంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నిరాహార దీక్షకు దిగారు. -
సోనియా గాంధీపై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేసినందుకుగాను శివరాజ్‌సింగ్ సోనియాపై రూ. 10 కోట్ల రూపాయలకు దావా వేశారు. సోనియాతో పాటు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాంతిలాల్ భూరియాకు నోటీసులు పంపారు. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలు, ఆరోపణలుతో రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు పంపాయి. మోడీకి ఇటీవల ఈసీ నోటీసు జారీ చేసింది.