దీక్ష కొనసాగింపుపై నేడు సీఎం నిర్ణయం!
రెండోరోజూ కొనసాగిన చౌహాన్ దీక్ష
మధ్యప్రదేశ్‌లో శాంతిస్థాపనే లక్ష్యంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహార్ రెండోరోజూ ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. భోపాల్‌లోని దసరా మైదానంలో ఆయన దీక్ష కొనసాగుతోంది. మంత్రివర్గమంతా ఆయన వెంటే ఉంది. దీక్షాస్థలి వద్దే ఉన్నతాధికారులతో సీఎం చౌహాన్ సమావేశమై.. పరిపాలనను పర్యవేక్షించారు. వందలాది మంది రైతులు దీక్షాస్థలికి తరలివచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం ప్రకటించారు.
సీఎం నిరాహార దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని.. తమ గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తే చాలని అన్నదాతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. నిరాహార దీక్ష కొనసాగింపుపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటన తర్వాత మధ్యప్రదేశ్ వ్యాప్తంగా చెలరేగిన హింస నేపథ్యంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నిరాహార దీక్షకు దిగారు.