madyapradesh
-
చేపల వేటకు వెళ్లినట్లుగా అక్కడ వజ్రాల వేటకు వెళ్తారు
‘కేజీఎఫ్’ సినిమాలలో బంగారం వేటలో ఎంతోమంది బక్క జీవుల జీవితాలు ఆవిరైపోతాయి. అయితే అది సినిమా. ‘పన్నా’ అనేది మాత్రం నిజం. ‘కేజీఎఫ్’లో పెద్ద విలన్లు పేదవాళ్లను బలవంతంగా బంగారు గనుల్లో దింపుతారు. అయితే మధ్యప్రదేశ్‌లోని పన్నాలో మాత్రం ఎంతోమంది పేదవాళ్లు స్వచ్ఛందగా వజ్రాల వేటలోకి దిగుతున్నారు. ఎంతమందిని అదృష్టం భుజం తట్టిందో తెలియదుగానీ దురదృష్టం మాత్రం వారి ఇంటి దగ్గర భద్రంగా ఉంటుంది....‘ఈరోజు నా భర్త శుభవార్తతో వస్తాడేమో’ అని భర్త రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది భగవతి.‘మా అబ్బాయికి విలువైన వజ్రం దొరకాలి’ అని ముక్కోటి దేవతలను మొక్కుకుంటుంది సీమ. ‘ఎప్పుడూ మీరే కష్టపడతారా....నేను కూడా ఈరోజు మీతోపాటు వస్తాను’ అని భర్త, అత్తమామల తోపాటు వజ్రాల వేటకు వెళుతుంది ఆశ.మత్స్యకారులు రోజూ చేపల వేటకు వెళ్లినట్లు అక్కడి ప్రజలు వజ్రాల వేటకు వెళతారు!మధ్యప్రదేశ్‌లోని ‘పన్నా’ దేశంలోని అత్యంత వెనకబడిన ప్రాంతాలలో ఒకటి. నీటికొరత నుంచి నిరుద్యోగం వరకు ఎన్నో సమస్యలు ఉన్న ఈ ప్రాంతం పేదరికానికి పెట్టింది పేరు. పేదరికం మాట ఎలా ఉన్నా ఈ ప్రాంతం వజ్రాల నిల్వలకు నిలయంగా ప్రసిద్ధి ΄పొందింది.ఒకప్పుడు అరుదైన ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని వజ్రాల గనులు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మితిమీరిన మైనింగ్ కారణంగా నిల్వలు క్షీణించాయి. అయినప్పటికీ ఆశావహ వ్యక్తులు వజ్రాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. తెల్లవారు జామునే తవ్వకాలు మొదలుపెడతారు. సూర్యాస్తమయం వరకు వజ్రాల కోసం జల్లెడ పడుతూనే ఉంటారు. ఈ పనిలో ప్రతి కుటుంబానికి వారి కుటుంబసభ్యులు సహాయంగా ఉంటారు. ఇందులో మహిళలు కూడా ఉంటారు. చాలామందికి వజ్రాల వేట అనేది తరతరాల కుటుంబ సంప్రదాయం. ‘వజ్రాల గురించి వెదకని రోజు నేను అనారోగ్యానికి గురవుతాను. ఇదొక మత్తుమందులాంటిది’ అంటాడు 67 సంవత్సరాల ప్రకాశ్ శర్మ. నిజానికి ఇది ప్రకాష్ మాటే కాదు...ఆ ప్రాంతంలోని వేలాది మంది ఆశావహుల మనసులో మాట! చిన్న డౌట్: ‘పన్నా’పై సినిమా వాళ్ల దృష్టి ఎందుకుపడలేదో? ప్చ్..! (చదవండి: ఆ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు లామా థెరపీని అందిస్తుందట..!) -
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
భోపాల్: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ యూనిట్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి 'గోవింద్ మాలూ' గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకుడు గురువారం తెలిపారు. బుధవారం భోపాల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేశారు. ఆ తరువాత ఇంటి వద్ద గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు పేర్కొన్నారు.గుండెపోటు రావడంతోనే హుటాహుటిగా గోవింద్ మాలూను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాలూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఉదయం ఇండోర్ చేరుకున్నారు.గోవింద్ మాలూ బీజేపీకి పెద్ద ఆస్తి అని మోహన్ యాదవ్ అన్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో మాలూ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధపడ్డాను. పార్టీకి సంబంధించిన అనేక బాధ్యతలు ఆయన నిర్వహించారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శి హితానంద్, ఇతర సీనియర్ నేతలు కూడా మాలూ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.మాలూ బీజేపీ రాష్ట్ర విభాగానికి మీడియా ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు స్థానిక వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ రివ్యూలు రాశారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తరుణంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ హోమంత్రి రాంనివాస్ రావత్ బీజేపీలో చేరడం చర్చాంశనీయంగా మారింది.ఆరుసార్లు ఎమ్మెల్యేగామధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ రాహుల్‌గాంధీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో సుమారు వెయ్యి మంది మద్దతుదారులతో బీజేపీలో చేరారు. సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర పార్టీ చీఫ్ వీడీ శర్మ, మాజీ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. రావత్ విజయపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకులలో ఒకరు.బీజేపీలోకి కమల్ నాథ్ సన్నిహితుడు కాగా,ఎన్నికలు ప్రకటించిన తర్వాత బీజేపీలో చేరిన రెండో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావత్. మార్చి 29న మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు అత్యంత సన్నిహితుడు, అమర్వాడ ఎమ్మెల్యే కమలేష్ షా బీజేపీలో చేరారునామినేషన్ ఉపసంహరణ.. ఆపై బీజేపీలోకి జంప్మధ్యప్రదేశ్ ఇండోర్‌లో మే 13న లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ 29న ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కొన్ని గంటల్లోనే బీజేపీలో చేరారు. కాగా, బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీపై కాంగ్రెస్ నేత అక్షయ్ కాంతి బామ్‌ను రంగంలోకి దించింది. అనూహ్యంత్ అక్షయ్ కాంతి బామ్ బీజేపీ చెంతకు చేరడం మధ్యప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది. -
ఆ మాంత్రికుడు ఎక్కడున్నాడు: ప్రధాని మోదీ
భోపాల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లూ ఈ రాయల్ మాంత్రికుడు ఎక్కడ దాక్కున్నాడని రాహుల్‌ను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. దేశంలో పేదరికాన్ని ఒకే ఒక్క దెబ్బకు లేకుండా చేస్తానన్న రాహుల్ వ్యాఖ్యలను ప్రధాని ఎద్దేవా చేశారు. ఆదివారం(ఏప్రిల్14) మధ్యప్రదేశ్‌లోని హొషాంగాబాద్లో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మేనిఫెస్టోలోని ప్రతీ హామీ దేశాన్ని దివాతా తీయిస్తుందని హెచ్చరించారు. కాగా, గత వారం రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఒకే ఒక దెబ్బతో దేశంలో పేదరికాన్ని లేకుండా చేస్తామన్నారు.‘మీరు గనుక దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే మీ ఖాతాల్లోకి లక్ష రూపాయాలు వచ్చి పడతాయి. డబ్బులు వస్తూనే ఉంటాయి మీ ఖాకతాల్లోకి. ఒకే ఒక్క దెబ్బకు పేదరికం లేకుండా పోవాలి’అని రాహుల్ ప్రజలకు హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుంటుంబాల్లోని మహిళలకు ఒక్కొక్కరికి ఖాతాల్లో లక్ష రూపాయల చొప్పున జమ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల -
ఎవరికీ అవకాశాలకు కొదువలేదు.. బీజేపీలో చేరండి - మధ్యప్రదేశ్ సీఎం
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న మధ్యప్రదేశ్ సీఎం 'మోహన్ యాదవ్'.. యాదవ సామాజికవర్గాన్ని బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. నేను మీ మధ్య మాట్లాడటానికి వచ్చానని, ప్రస్తుతం విజయవంతమైన ప్రధాని నాయకత్వంలో మన సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఇది ఒక పెద్ద అవకాశమని ప్రస్తావించారు. యాదవ్ మహాకుంభ్‌లో ఎంపీ సీఎం పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని ఉద్దేశించి.. ఒకే కుటుంబం (యాదవ్) సొసైటీకి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తారని నమ్ముతారు, కానీ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థను ప్రజలు వదిలిపెట్టినందుకు నేను సంతోషిస్తున్నానన్నారు. నిరుపేద కుటుంబంలో ఒకరిని, యాదవ్ కుటుంబంలో ఒకరిని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. బీజేపీలో ఎవరికీ అవకాశాల కొరత లేదని ఎంపీ సీఎం అన్నారు. యూపీలో తన పర్యటనలు చాలా మందిని కలవరపెడుతున్నాయని, మరోసారి అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి అన్నారు. ఎవరికి సమస్యలు వచ్చినా.. మీరు పిలిస్తే వస్తాను అని మోహన్ యాదవ్ అన్నారు. మోహన్ యాదవ్ లక్నోలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ కమలం వికసిస్తుంది, 400 సీట్లను దాటాలన్న ప్రధాని సంకల్పం నెరవేరుతుందనటానికి మీ ఉత్సాహమే నిదర్శనమని అన్నారు. యాదవ సమాజ ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి జీవిత పోరాటాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేడు దేశం మొత్తం సనాతన సంస్కృతిని శ్రీరాముడు, కృష్ణుడి సంస్కృతిగా పరిగణించడం నాకు సంతోషంగా ఉంది. ఎన్ని సవాళ్లు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా, మన సంస్కృతిని కాపాడుకోవాలని మోహన్ యాదవ్ అన్నారు. -
కమల్‌నాథ్ బాటలో ఎంపీ మనీష్ తీవారీ?
కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పార్టీ మారబోతున్నారని వర్తాలు వెలువడ్డాయి. ఆయన కాంగ్రెస్‌కు రాజానామా చేసి.. బీజేపీలో చేరుబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆయన ఆఫీసు వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఎంపీ మనీష్ తివారీపై జరుగుతున్న పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించింది. అదంతా అసత్య ప్రచారమని స్పష్టం చేసింది. బీజేపీలో చేరి.. లూథియానా స్థానంలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ‘మనీష్ పార్టీ మారి బీజేపీలో చేరుతారనేది నిరధారమైన విషయం. ఆయన తన నియోజకవర్గంలో పూర్తి దృష్టి పెట్టారు. గత రాత్రి మనీష్ తివారీ తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు’ అని ఎంపీ కార్యాలయం పేర్కొంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్, ఇతర ఎంపీలు కూడా లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ మీద వచ్చిన ప్రచారాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితూ పట్వారీ ఖండించారు. కమల్‌నాథ్‌పై జరుగుతున్న ప్రచారం నిరాధారమైందని స్పష్టం చేశారు. కనీసం కలలో కూడా కమల్‌నాథ్ బీజేపీలో చేరరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్, తన కొడుకు నకుల్‌తో శనివారం ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీ పార్టీలో చేరటం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. ఇక.. కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ లోక్‌సభ ఎన్నికల్లో తగిన ప్రభావం చూపలేకపోతుందని రాజకీయా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
మధ్యప్రదేశ్ సీఎం ప్రమాణస్వీకారం..హాజరైన ప్రధాని మోదీ
భోపాల్:మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా,బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితర ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. కాగా, ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవ్డా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎం,డిప్యూటీ సీఎంలతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌కు బీజేపీ ఈసారి మధ్యప్రదేశ్ సీఎంగా అవకాశం కల్పించింది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ మార్పు చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్‌తో సూత్రధారి పరార్ -
యాదవ్‌కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్!
భోపాల్:మధప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్‌యాదవ్ ఎంపిక వెనుక బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతోనే యాదవ్ వర్గానికి చెందిన నేతను సీఎం పదవికి ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌తో పాటు బీహార్‌లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు స్టేట్లలో యాదవ జనాభా డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌ను బీజేపీ మధ్యప్రదేశ్‌కు సీఎంను చేస్తోందని పొలిటికల్ పండిట్లు విశ్లేషిస్తున్నారు. అంతేగాక మోహన్ యాదవ్ భార్య ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కావడంతో ఆయనను సీఎం చేస్తే ఆ ప్రభావం అక్కడ కచ్చితంగా ఉంటుందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మోహన్ యాదవ్ మామయ్య యూపీలోని సుల్తాన్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి మొత్తం 120 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పవర్లోకి రావాలనేది కమలనాథుల టార్గెట్ అని స్పష్టమవుతోంది. మోహన్ యాదవ్ ఎంపికతో యాదవ్ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, బీహార్‌లో ఆర్జేడీని లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్ వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలు మాత్రమే పాటిస్తానని వెల్లడించారు. తానొక పార్టీ కార్యకర్తను మాత్రమేనని పేర్కొన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 230 స్థానాలకు గాను 163 సీట్లను కైవసం చేసుకుని అధికారాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. 2018లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లను సాధించగా.. ఈ సారి ఎన్నికల్లో ఆ సంఖ్య మరింత తగ్గింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం అభ్యర్థి అనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా సమష్టిగా ముందుకెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీని ప్రధాన ముఖచిత్రంగా చూపిస్తూ ప్రజల వద్దకు వెళ్లింది. ఈ సారి ఎన్నికల్లో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. సీఎం రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్‌కు కాకుండా వేరే వ్యక్తిగా సీఎం పదవి ఇస్తారని పుకార్లు పుట్టాయి. అటు.. శివరాజ్ సింగ్నే సీఎం గా ఉండాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీఎం పదవిపై తాజాగా శివరాజ్ సింగ్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదు: కమల్ నాథ్ -
'ఎమ్మెల్యేలకు సొంతూళ్లలో 50 ఓట్లు కూడా రాలేదు'
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అవకతవకలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. తమ నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాతే మాట్లాడతానని చెప్పారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే స్బందించారు. చిప్ ఉన్న ఎలాంటి యంత్రాన్నైనా హ్యాక్ చేయవచ్చని ఆయన అన్నారు. ఈవీఎంల విశ్వసనీయతపై ఆయన అనుమానాలను వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 సీట్లకు గాను బీజేపీ 163 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 66 సీట్లకే పరిమితమైంది. Any Machine with a Chip can be hacked. I have opposed voting by EVM since 2003. Can we allow our Indian Democracy to be controlled by Professional Hackers! This is the Fundamental Question which all Political Parties have to address to. Hon ECI and Hon Supreme Court would you… https://t.co/8dnBNJjVTQ — digvijaya singh (@digvijaya_28) December 5, 2023 మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీని సూచించాయి. కానీ వాస్తవంగా బీజేపీ పూర్తి ఏకపక్ష మెజారిటీని సాధించింది. ఈ ఫలితంపై కాంగ్రెస్ నాయకులతో పార్టీ ప్రచార సారథి ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. భారీ అపజయం వెనకు ఉన్న కారణాలను విశ్లేషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నట్లు కనిపించినప్పటికీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా ఉన్నాయని కమల్ నాథ్ చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లలో కనీసం 50 ఓట్లు కూడా రాలేదని చెబుతున్నారు. నిజానికి ఇది ఎలా సాధ్యమైతుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Rajasthan Politics : రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారు: మోదీ
సాక్షి, హైదరాబాద్: అవినీతి, కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పారని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు ఒక హెచ్చరికలాంటిదని అన్నారు.దేశాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్‌కు మోదీ హెచ్చరించారు. దేశంలో నేడు మూడు రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. జీఎస్టీ వసూళ్లు రికార్డ్ సృష్టిస్తున్నాయని మోదీ తెలిపారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు. ఈ విజయం 2024 విజయానికి బాటలు వేసిందని తెలిపారు. అన్ని రంగాల్లో దేశం ముందుకు దూసుకెళుతోందని తెలిపారు. ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లకుగాను బీజేపీ 164 సీట్లను సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 65 సీట్లకు పరిమితమైంది. రాజస్థాన్‌లో 199 సీట్లకు గాను బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కేవలం 69 సీట్లను మాత్రమే గెలిచింది. ఇతరులు మరో 15 సీట్లను సొంతం చేసుకున్నారు. అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతే.. మొత్తం 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లను సాధించింది. కాంగ్రెస్ 35కే పరిమితమైంది. ఇతరులు 1 సీటును సాధించారు. -
Madhya Pradesh Exit Poll 2023: మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్: విజయం ఎవరిదంటే..?
భోపాల్: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల(నవంబర్‌లో) వివిధ దశల్లో పోలింగ్ ముగిసింది. అన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై ఉంది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి సర్వే ఏజెన్సీల ద్వారా ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు. అయితే.. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఉంది. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP), గోండ్వానా గంతంత్ర పార్టీ (GGP) సంకీర్ణంగా పోటీలో ఉన్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే..? ఎగ్జిట్ పోల్ ద్వారా అంచనా వేయబడిన సంఖ్యలు కేవలం అంచనా కోసం మాత్రమే. ఎందుకంటే వాస్తవ గణాంకాలు అంచనా వేసిన వాటి కంటే చాలా భిన్నంగా కూడా ఉండవచ్చు. ఓటరు ఒక సర్వే ఏజెన్సీ అడిగినప్పుడు ఓటు వేసిన అభ్యర్థి పేరు వెల్లడించకపోవచ్చు. వేరే పేరు చెప్పవచ్చు. వివిధ ఏజెన్సీలకు వేర్వేరు సమాధానాలు ఇవ్వవచ్చు. పీపుల్స్ పల్స్ సర్వే మొత్తం స్థానాలు-230 కాంగ్రెస్-117 నుంచి 139 బీజేపీ -91 నుంచి 113 ఇతరులు- 0 నుంచి 8 న్యూస్ 18 సర్వే మొత్తం స్థానాలు-230 బీజేపీ -112 కాంగ్రెస్- 113 ఇతరులు- 5 సీఎన్ఎన్ సర్వే మొత్తం స్థానాలు-230 బీజేపీ-116 కాంగ్రెస్-111 ఇతరులు-3 జన్ కీ బాత్ సర్వే మొత్తం స్థానాలు-230 బీజేపీ- 100-123 కాంగ్రెస్- 102-125 ఇతరులు- 05 రిపబ్లిక్ టీవీ-Matrize మొత్తం స్థానాలు-230 బీజేపీ- 118-130 కాంగ్రెస్- 97-107 ఇతరులు-0-2 పోల్ స్టార్ట్ మొత్తం స్థానాలు-230 బీజేపీ- 106-116 కాంగ్రెస్- 111-121 ఇతరులు- 0-6 దేనిక్ భాస్కర్ మొత్తం స్థానాలు-230 బీజేపీ-95-115 కాంగ్రెస్-105-120 News 24-Todays Chanakya మొత్తం స్థానాలు-230 బీజేపీ-151 కాంగ్రెస్-74 ఎగ్జిట్‌పోల్స్ పూర్తి పట్టిక కోసం.. -
సీఎం శివరాజ్ సింగ్ మంచి నటుడు: కమల్‌నాథ్
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కమల్‌నాథ్ అన్నారు. అయితే సీఎం కుర్చీపోయినా శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉద్యోగానికి ఢోకా లేదని నాథ్ చెప్పారు. శివరాజ్‌సింగ్ మంచి నటుడని, సీఎం పదవి పోయిన తర్వాత ముంబై వెళ్లి సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని కమల్‌నాథ్ చమత్కరించారు. సాగర్ జిల్లాలోని రేహ్లీ అసెంబ్లీ స్థానంలో ప్రచారం సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఇంటికెళ్లడానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన శివరాజ్‌సింగ్ కనీసం బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా నింపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ మళ్లీ శివరాజ్‌సింగ్ చౌహాన్ హామీల మెషీన్ డబుల్ స్పీడ్‌తో పనిచేస్తోందని, దీనిని ప్రజలు గమనించాలని కమల్‌నాథ్ కోరారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 17న పోలింగ్ జరగనుంది. గతంలో సీఎంగా పనిచేసిన కమల్‌నాథ్ కాంగ్రెస్ తరపున మళ్లీ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఇదీ చదవండి..కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది -
కాంగ్రెస్ నేతలవి సినిమా డైలాగులు : ప్రధాని మోదీ
రాట్లం: కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రధాని మోదీ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. శనివారం మధ్యప్రదేశ్ రాట్లంలో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల డైలాగులు, ప్రకటనలు,వారి క్యారెక్టర్లు అన్నీ సినిమా తరహాలోనే ఉంటాయని చమత్కరించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో బట్టలు చింపుకునే పోటీ జరుగుతోందని మోదీ అన్నారు. డిసెంబర్3న ఎన్నికల రిజల్ట్ రాగానే ఇది మరింత తీవ్రం అవుతుందని చెప్పారు.కాంగ్రెస్ నేతలకు చాన్సిస్తే ప్రజల ఒంటి మీద కూడా బట్టలు చింపేస్తారని హెచ్చరించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కుర్చీ కోసం కొట్టుకోవడం లేదన్నారు పీఎం మోదీ. వాళ్లు వారి కొడుకుల కోసం కొట్టుకుంటున్నారని చెప్పారు. భవిష్యత్తులో ఎవరి కొడుకు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలనేది వారి తపన అని ఎద్దేవా చేశారు.కాగా, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఇద్దరు అగ్రనేతలు కమల్‌నాథ్, దిగ్విజయసింగ్ మధ్య అంతర్గత పోరు జరుగుతున్నవిషయం తెలిసిందే -
మధ్యప్రదేశ్ బాలిక మృతి.. కేసులో మరో మలుపు! ఇంతకీ ఏం జరిగింది ?
కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పెద్దపల్లి జిల్లాలో మధ్యప్రదేశ్ బాలిక కేసు మరో మలుపు తిరిగింది. ఆగస్టు 14వ తేదీ రాత్రి బాలికపై సామూహిక లైంగికదాడి జరిగిందని, దాంతో అమ్మాయి అనారోగ్యం పాలై, మరణించిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బాలిక ఒంటిపై గాయాలున్న మాట వాస్తవమే గానీ, లైంగికదాడి జరిగినట్లుగా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదన్న విషయం సంచలనం రేపుతోంది. ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే రామగుండం పోలీసులు స్పందించారు. గోదావరిఖని, పెద్దపల్లి ఏసీపీలు, పెద్దపల్లి డీసీపీలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన సీపీ రెమా రాజేశ్వరి కేసును స్వయంగా పర్యవేక్షించారు. అసలు అనారోగ్యంతో ఉన్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా ఎందుకు తరలించాల్సి వచ్చింది? వీరికి వాహనం ఎవరు సమకూర్చారు? తనపై కొందరు లైంగికదాడి జరిపారు.. అంటూ బాలిక చెబుతున్న ఆడియోలో వాస్తవమెంత? తదితర విషయాలపై దాదాపు 48 గంటల సుదీర్ఘ సాంకేతిక, శాసీ్త్రయ దర్యాప్తు తర్వాత రామగుండం పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది. ఇంట్లో వారే కొట్టారా? విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట శివారులోని అక్కాబావల వద్దకు మధ్యప్రదేశ్ నుంచి బాలిక వచ్చింది. ఆమె మరణానికి ముందు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఇవి ఎవ రు చేశారు? అన్నదానిపై స్పష్టత లేదు. బాలికను కుటుంబసభ్యులు లేదా తెలిసినవారే తీవ్రంగా కొట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆరోజు తనను తీవ్రంగా కొట్టడంపై బాలిక మనస్తాపానికి గురైంది. అది తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకుందేమోనని అనుమానిస్తున్నారు. బాలిక చివరిసారిగా కనిపించిన పరిస్థితులు ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆమె ఆగస్టు 14 మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇంట్లో లేదు. ఆ సమయంలో ఏం చేసింది? అన్నదాని పై పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో బాలిక పురుగుల మందు షాపుల ముందు, రాత్రి 8 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ చెరువు వద్ద కూడా కనిపించిందని సమాచారం. అర్ధరాత్రి చెరువు వద్ద ఏం చేస్తున్నావని కొందరు మందలించడంతో అక్కడి నుంచి బస్టాండ్ వైపు వెళ్లినట్లు తెలిసింది. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది కాబట్టే.. ఈ రెండు ప్రాంతాల్లో కనిపించిందని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి నుంచి బస్టాండ్ వద్దకు బాలిక సంచరించిన ప్రాంతాల్లో మొత్తం 15 మంది ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రాత్రి 11 తర్వాత ఇంటికి చేరిన బాలిక.. అస్వస్థతకు గురైంది. వెంటనే బాలిక బంధువులు కారు మాట్లాడుకొని, ఆమెను హుటాహుటిన మధ్యప్రదేశ్‌లోని బాల్ఘాట్ జిల్లా కజ్రీ గ్రామానికి తరలించారు. మార్గమధ్యలో వాంతులు చేసుకుంది. విషయం తెలుసుకున్న రామగుండం పోలీసులు అక్కడి ఎస్పీని సంప్రదించారు. తొలుత బాలిక మరణించిన విషయాన్ని ధ్రువీకరించుకున్నాక అంత్యక్రియలు జరపకుండా ఆపగలిగారు. అంత్యక్రియలు ఆపేది లేదంటూ ఆమె బంధువులు వాదనకు దిగారు. ఎంతో శ్రమిస్తే గానీ.. వారు దారికి రాలేదు. ఎట్టకేలకు బాలిక మృతదేహానికి అక్కడ స్థానిక ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, తిరిగి సెకండ్ ఒపీనియన్ కోసం గాంధీ ఆస్పత్రికి మరోసారి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. గాయపరిచింది ఎవరు? బాలిక ఒంటిపై గాయాలున్నాయి తప్పితే, లైంగికదాడి జరిగినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిసింది. మరి ఆమెను మరణించేంత స్థాయిలో గాయపరిచింది ఎవరు? అసలు ఆగస్టు 14 మధ్యాహ్నం ఏం జరిగింది? బాలిక ఎవరితో ఘర్షణ పడింది? ఆమైపై ఎవరు దాడి చేసి ఉంటారు? అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సామూహిక లైంగికదాడి జరిగిందని ప్రచారం కావడం, అందులోనూ బాధితురాలు మైనర్ కావడంతో విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అన్ని బృందాల పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఇంతవరకూ దర్యాప్తు పురోగతిలో ఏ విషయాన్ని మీడియాతో పంచుకోలేదు. ఈ క్రమంలోనే అమ్మాయి మాట్లాడిందని చెబుతున్న ఆడియో విడుదల చేసిన వారిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించినట్లు తెలిసింది. వారు చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని సమాచారం. గాంధీ ఆస్పత్రి నుంచి నివేదిక వస్తేగానీ.. పోలీసులు ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేసేలా లేరు. ఆ నివేదికలో ఏం ఉంటుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. -
పరీక్షలని పండగ చేసుకోండి! దెబ్బకు ఎగ్జామ్ ఫోబియా పరార్
పరీక్షలు వస్తున్నాయంటే పట్టాలపై పరుగులు తీయాల్సిన రైళ్లు మన గుండెల్లో పరుగెత్తిన రోజులు ఇప్పటికీ గుర్తుంటాయి. తరాలు మారినా పరీక్షల సమయంలో ఒత్తిడి, భయం మారలేదు. పరీక్షల మాట ఎలా ఉన్నా పండగ అంటే బోలెడు సంతోషం వస్తుంది. అందుకే ‘పరీక్షలను పండగ చేసుకోండి. సంతోషం మీ దగ్గర ఉంటే సక్సెస్ మీ దగ్గర ఉన్నట్లే’ అంటున్నారు మధ్యప్రదేశ్‌కు చెందిన అధర్వ, ప్రణయ్ అనే ఇద్దరు మిత్రులు... ఎంతోమంది విద్యార్థుల్లాగే అధర్వ, ప్రణయ్‌లకు పరీక్షలకు రెండు,మూడు రోజుల ముందు హడావిడిగా పుస్తకాలు పట్టుకోవడం అలవాటు. లాస్ట్–మినిట్ రివిజన్ వల్ల గందరగోళానికి గురైన రోజులు ఎన్నో ఉన్నాయి. కట్ చేస్తే.... ఇంజనీరింగ్ చదవడం కోసం ప్రణయ్ ముంబై, అధర్వ చెన్నై వెళ్లారు. ఎవరి దారులు వారివి అయిపోయాయి. చాలారోజుల తరువాత కలుసుకున్నప్పుడు వారి మధ్య ‘ఎగ్జామ్స్ సమయంలో స్టూడెంట్స్’ అనే బరువైన ప్రస్తావన వచ్చింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ధైర్యం ఇవ్వడానికి, ఉత్సాహం అందించడానికి తమ వంతుగా ఏదైనా చేయాలని ఆలోచించారు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే ‘పఢ్‌లే’ (చదువు కో) అనే యూట్యూబ్ చానల్, వెబ్సైట్. స్టూడెంట్స్‌కు ఉచితంగా అందుబాటులో ఉండే తమ చానల్, వెబ్సైట్లు ఎడ్యుకేషనల్ మెటీరియల్‌కు స్టోర్హౌజ్గా ఉండాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే నోట్స్, లెక్చర్స్, స్టడీ టిప్స్...ఇలా ఎన్నో అంశాలకు ఈ ‘పఢ్‌లే’ వేదికగా మారింది. ప్రకటనలు, డొనేషన్లు తమకు ప్రధాన ఆదాయ వనరు. ‘ఎన్నో రంగాలలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చినా విద్యావ్యవస్థలో మాత్రం రావడం లేదు. బోధన అనేది యాంత్రికం అయితే విద్యార్థులకు అయోమయమే మిగులుతుంది. అది వారి భవిష్యత్‌పై ప్రభావం చూపుతుంది. పరీక్షలు అంటే స్టూడెంట్స్ భయపడే రోజులు కాదు, సంతోషంతో గంతులు వేసే రోజులు రావాలి’ అంటాడు అధర్వ. ఎంత జటిలమైన విషయాన్ని అయినా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఎన్నో దారులు ఉన్నాయి. కొందరు ఆ దారుల గురించి కనీసం ఆలోచించరు. కొందరు ఆ దారుల గురించి వెదుకుతారు. ఈ కోవకు చెందిన వారే అధర్వ, ప్రణయ్‌లు. ‘కాన్సెప్ట్‌లను అర్థం చేయించాలంటే విద్యార్థులకు కంఫర్ట్‌గా ఉన్న భాషలో చెప్పాలి. ఇంటర్నెట్లో ప్రతి సబ్జెక్ట్ మీద ఎంతో కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే స్టూడెంట్స్ చేతితో రాసుకున్న నోట్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు’ అంటాడు ప్రణయ్. 8,9,10 తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఇద్దరు మిత్రులు కాన్సెప్ట్‌లకు సంబంధించిన నోట్స్ రాసుకున్నారు. వాటిని స్కానింగ్ చేసి తమ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. దీంతో పాటు ఫన్నీ వీడియోలతో, మీమ్స్‌తో జటిలమైన కాన్సెప్ట్‌లను అర్థం చేయించడం మొదలుపెట్టారు. ఈ ఫార్మట్ సూపర్ సక్సెస్ అయింది, ‘పదవ తరగతి చదివే మా అబ్బాయి ఆదిత్య చదువులో వెనకబడ్డాడు. నేను అతడికి అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నప్పటికీ ఆఫీస్ పనుల వల్ల అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఆదిత్య తరచుగా ప ఢ్లే చానల్ చూసేవాడు. అక్కడ ఎన్నో నేర్చుకున్నాడు. ఇప్పుడు బాగా చదువుతున్నాడు’ అంటున్నాడు ఇండోర్‌కు చెందిన కుమార్ అనే పేరెంట్.‘ఇక చదవడం నా వల్ల కాదు’ అనుకున్న సమయంలో మీ యూట్యూబ్ చానల్ చూశాను. నేను జటిలం అనుకున్న ఏన్నో విషయాలు చాలా సులభంగా అర్థమయ్యాయి. ఇప్పుడు నాకు ఎంతో ధైర్యంగా ఉంది’ అని ఈ ఇద్దరు మిత్రులను కలిసి చెప్పిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ‘పఢ్‌లే’గా మొదలైన తమ యూట్యూబ్ చానల్ ఇప్పుడు ‘జస్ట్ పఢ్‌లే’గా మారింది. 1.5 మిలియన్ల సబ్స్క్రైబర్స్తో దూసుకువెళుతోంది. (చదవండి: ఎవ్వరైనా అంతరిక్షంలో చనిపోతే శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు) -
మూడేళ్లుగా రిలేషన్షిప్..చివరికి ప్రియురాలిని చంపి, పరుపులో కుక్కి..
ముంబైలో 37 ఏళ్ల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. గత రెండు రోజులుగా వస్తున్న దుర్గంధాన్ని భరించలేక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ముంబైలోని సీతాసదన్ సోసైటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...27 ఏళ్ల హర్దిక్ షా, మేఘా ధన్సింగ్ తోర్వి అనే మహిళతో మూడేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. గత ఆరు నెలలుగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే సీతాసదన్ సోసైటీలో కొత్త ఇంటికి మారారు. ఐతే మేఘ నర్సుగా పనిచేస్తోంది. కాగా, హార్దిక్ నిరుద్యోగి. ఇంటి ఖర్చులను భరించేది మేఘానే. దీంతో ఈ విషయమై తరుచు గొడవపడేవారు. ఒక రోజు ఆ గొడవ కాస్త తీవ్రస్థాయికి చేరుకోవడంతో క్షణికావేశంలో హర్ధిక్ మేఘాను చంపి పరుపులో కుక్కి ఉంచాడు. ఆ తర్వాత హర్దిక ఖర్చులకు డబ్బుల కోసం ఇంట్లోని వస్తువును అమ్మేసి పరారయ్యేందుకు ప్లాన్ వేశాడు. అయితే గత రెండు రోజులుగా విపరీతమైన దుర్గంధం రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా మేఘా విగత జీవిగా ఉండటాన్ని గమనించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ జంట ఇటీవలే అద్దెకు వచ్చాని, తరుచు గొడపడుతుంటారని అపార్టెమెంట్ వాసులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయడం ప్రారంభించి..హార్దిక్ ఫోన్‌ని ట్రేస్ చేయడం ప్రారంభించారు పోలీసులు. అతను ఇంట్లోని వస్తువులను అమ్మేసి రైలులో పారిపోతున్నట్లు తెలియడంతో అధికారులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు హార్ధిక్‌ని మధ్యప్రదేశ్ నాగ్డాలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దాబాలోని ఫ్రీజర్‌లో 25 ఏళ్ల యువతి మృతదేహం కలకలం) -
పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే!
పులికి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. అచ్చం అలానే ఒక వైరల్ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది యువకులు పులితో సెల్ఫీ తీసుకునేందుకు దాని వెంట పడతారు. వాస్తవానికి అది పట్టించు కోకుండా రోడ్డు దాటుకుని వెళ్లిపోతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే వాళ్ల పని ఔట్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో చోటు చేసుకుంది. ఐతే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ట్విట్టర్లో షేర్ చేస్తూ...పులి మిమ్మల్ని వెంబడించాలనుకోలేదు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దయచేసి ప్రమాదకరమైన క్రూర మృగాలతో సెల్ఫీలు తీసుకునేందుకు యత్నించకండి. ఇలాంటి అత్యుత్సాహన్ని మానుకోండి అని యువతను హెచ్చరించారు. Remember that if you see a large carnivore, it wanted you to see it. It never wanted to be chased. The tiger can maul you to death feeling threatened. Please don’t resort to this wired behaviour. pic.twitter.com/e0ikR90aTB — Susanta Nanda (@susantananda3) October 6, 2022 (చదవండి: 80 ఏళ్ల అష్టదిగ్గజాలు స్కైడైవింగ్తో... గిన్నిస్ రికార్డు) -
షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చక్‌దేపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్థానిక మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్డను శుభ్రం చేయమని బలవంతం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వారంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థినులంటూ పలు కథనలు వచ్చాయి. ఐతే ఆ వార్తన్నింటిని జిల్లా విధ్యాధికారి సోనమ్ జైన్ ఖండించారు. విచారణలో ఆ బాలికలు తాము మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు మురికిగా ఉన్నందున చేతిపంపు నుంచి నీటిని తెచ్చిపోశామని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆ బాలికలు, వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు జైన్ వెల్లడించారు. ఐతే ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ విషయంపై గుణ జిల్లా కలెక్టర్‌ను విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాఠశాల విదయాశాఖ బృదం పాఠశాలకు చేరుకుని ప్రత్యేక విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేగాతు ఈ ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సిసోడియా పేర్కొన్నారు. यह तस्वीरें बेहद आपत्तिजनक है… मामाजी की सरकार में स्कूल में भाँजियो से शौचालय साफ़ करवाया जा रहा है.. तस्वीरें गुना ज़िले के बमोरी के चकदेवपुर के प्राथमिक- माध्यमिक स्कूल की है…. “ बेटी पढ़ाओ “ अभियान की हक़ीक़त… pic.twitter.com/UweK7emh8l — Narendra Saluja (@NarendraSaluja) September 22, 2022 (చదవండి: భారీ వర్షాలు..స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం) -
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్‌గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
రాజధానిలో మధ్యప్రదేశ్ పోలీసుల దాడి
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ భారీ చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న అక్కడి పోలీసులు నగరంలో దాడి చేశారు. ఆ నేరానికి బాధ్యులైన ఇద్దరు దొంగలను పట్టుకుని తీసుకెళ్లారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ చోరుల విషయం తెలుసుకున్న ఇక్కడి పోలీసులు స్థానికంగా ఏమైనా నేరాలు చేశారా? అనేది ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని కమలనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడే చిన్న చిన్న యంత్రాలు విక్రయించే వ్యాపారం చేశారు. కోవిడ్ నేపథ్యంలో అమలైన లాక్డౌన్ ఫలితంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో మూసేసి తమ స్వస్థలానికి వచ్చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి హైదరాబాద్‌కు చెందిన వసీమ్‌తో ఇండోర్‌లో పరిచయం ఏర్పడింది. వీరి పరిస్థితిని గమనించిన వసీమ్ తాను చెప్పినట్లు చోరీలు చేస్తే తేలిగ్గా డబ్బు సంపాదించవచ్చని, అప్పులు తీర్చడమే కాకుండా జల్సాగా బతకవచ్చని చెప్పాడు. అందుకు వీరు అంగీకరించడంతో పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ ద్వారా పట్టుకుంటారనే విషయం వారికి చెప్పిన వసీమ్ టార్గెట్ చేసిన ప్రాంతానికి కనీసం పది కిలోమీటర్ల దూరంలోనే ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయాలని సలహా ఇచ్చాడు. ఆపై సంప్రదింపులు జరపడానికంటూ ఆన్లైన్లో చైనా నుంచి అత్యాధునిక వాకీటాకీలు ఖరీదు చేయించాడు. చోరీ చేయాల్సిన ప్రాంతానికి చేరుకోవడానికి ముందే ఈ గ్యాంగ్ కొన్ని కార్లను ఎంపిక చేసుకుని వాటి ఫొటోలు, వివరాలు తెలుసుకునేది. వీటి ఆధారంగా ఆ కార్లకు సంబంధించి ఫాస్ట్‌ట్యాగ్స్ సమీకరించుకునేది. ఆపై అదే మోడల్ కారును అద్దెకు తీసుకుని తాము టార్గెట్ చేసిన ప్రాంతానికి చేరుకుని చోరీ చేసేది. వసీమ్ మాత్రం నేరుగా నేరంలో పాల్గొనకుండా వీరికి సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన మొత్తాన్ని అంతా సమానంగా పంచుకునే వారు. ఈ పంథాలో మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్‌లు భోపాల్‌లోని కమలనగర్, ఇండోర్‌లోని సాయి సంపద ఏరియాలతో కొన్ని నేరాలు చేశారు. గత నెల్లో ఇండోర్‌లోని ఎంఐజీ ప్రాంతంలో నివసించే వ్యాపారి స్వస్తిక్ అగర్వాల్ ఇంట్లో రూ.50 లక్షల సొత్తు తస్కరించారు. వసీమ్ సలహా మేరకు నగరానికి వచ్చేసిన మహ్మద్ షరీఫ్, మహ్మద్ నసీమ్ షేక్‌పేట్ ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. వసీమ్ సూచనలతో ఇక్కడా కొన్ని నేరాలు చేసినట్లు తెలుస్తోంది. వీరి కోసం గాలింపు చేపట్టిన ఇండోర్‌లోని ఎంఐజీ పోలీసులు వారి భార్యల కదలికలపై నిఘా ఉంచారు. ఇటీవల వీరు తమ భార్యల్ని షేక్‌పేటకు పిలిపించుకున్నారు. అలా వీరి ఆచూకీ కనిపెట్టిన ఎంఐజీ పోలీసులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. పరారీలో ఉన్న వసీమ్ కోసం గాలిస్తున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న ఇక్కడి అధికారులు స్థానికంగా చేసిన నేరాలపై ఆరా తీస్తున్నారు. (చదవండి: ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి.. ఆత్మహత్యలా? ప్రమాదమా?) -
ముగ్గురు పిల్లల తల్లిని బెల్ట్‌తో కొట్టి...భర్తని భుజాలపై మోసుకుని వెళ్లేలా శిక్షించారు!
ప్రజలను రక్షించేందుకు పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. భార్యభర్తల్లో.. ఇద్దరిలో ఎవరి వల్ల అయిన సమస్య ఉంటే పెద్దలకు చెప్పి పరిష్కరించుకోవడమే లేక కోర్టు ద్వారానో సమస్య పరిష్కరించుకోవడం వంటవి చేయాలి. అంతేగానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఘోరంగా అవమానించి శిక్షించడం వంటివి చేయకూడదు. దీని వల్ల ఇద్దరి జీవితాలు నాశనమవ్వడమే కాకుండా కటకటాల పాలవ్వడం జరుగుతుంది. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి భార్య తప్పుచేసిందని ఆమె పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడంటే...వినేందుకు, చూసేందుకు అత్యంత జుగుప్సకరమైన దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకెళ్తే...మద్యప్రదేశ్‌లోని ఒక గ్రామంలో గిరిజన మహిళను దారుణంగా హింసించి బహిరంగంగా అవమానించారు. ముగ్గురు పిల్లల తల్లి అయిన ఆ మహిళను పాక్షికంగా బట్టలు విప్పించి.. బెల్ట్‌తోనూ, కొరడాతోనూ దారుణంగా కొట్టి కిందపడేసి హింసించారు. అంతటితో ఆగకుండా బూట్ల దండవేసి అవమానించారు. ఆ తర్వాత ఆమె తన భర్తను భుజాలపై మోసుకుని ఊరంతా తిరిగేలా దారుణమైన శిక్ష విధించారు. ఈ ఘటన దేవాస్ జిల్లాలోని బోర్‌పదవ్ గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...బోర్‌పదవ్ గ్రామంలోని ఒక వ్యక్తి తన భార్య ఇంట్లోంచి వెళ్లిపోయిందంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె అదే గ్రామంలో తన ప్రియుడి ఇంట్లో కనిపించింది. వివాహమై మరోకరితో సంబంధం పెట్టుకుందన్న కోపంతో అతను బహిరంగంగా తన భార్యను అవమానించి, కొట్టి హింసించాడు. స్థానికులు సైతం ఆమెను రక్షించేందుకు ముందుకు రాలేదు. ఐతే ఒక వృద్ధ జంట ఆ మహిళను రక్షించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆ మహిళను రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన సుమారు 12 మంది నిందుతులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ క్రూరమైన ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In Madhya Pradesh's Dewas district, people brutally beat up a "Tribal Woman" just because she went with her lover. Aren't we living in a free country @ChouhanShivraj ?? What was her fault?? Where is NDA's candidate for President election, Draupadi Murmu?? Why is she SILENT?? pic.twitter.com/o3afyRtW6U — Rajasthan Congress Sevadal (@SevadalRJ) July 4, 2022 (చదవండి: మరో వ్యక్తితో ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే ప్రియుడి ఆత్మహత్య) -
భిక్షాటనతో భార్యకు ఊహించని సర్ప్రైజ్: వీడియో వైరల్
ఓ వ్యక్తి తనకు నచ్చిన బైక్ కోసం చిల్లర డబ్బలు పోగు చేసి మరీ కొనుకున్న ఉదంతాన్ని ఇటీవల చూశాం. ఇష్టమైన వాటిని పొందడం కోసం కష్టపడి సంపాదించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఖరీదైన వస్తువులు కొనుక్కున్న సందర్భాలూ చూశాం. అవన్నీ ఒక ఎత్తైయితే ఇక్కడొక యాచకుడు భార్య కోసం అత్యంత ఖరీదైన బైక్ కొన్నాడు. అదీ కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బుతో కొనడం విశేషం. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన సంతోష్ కుమార్ సాహు అనే యాచకుడు శారీరకంగా వికలాంగుడు. దీంతో అతను అన్నింటికీ తన భార్య మున్నిపైనే ఆధారపడుతుంటాడు. అధ్వాన్నమైన రోడ్డుపై తన ట్రై సైకిల్ని భార్య నెట్టలేక ఇబ్బందిపడుతుండటం సాహు చూస్తుంటాడు. అదీగాక ఈ సైకిల్ నెడుతుంటే వెన్ను నొప్పి వస్తుందంటూ సాహు భార్య తరుచు బాధుపడుతుండేది. దీంతో ఆమె కోసం ఎలాగైన మంచి బైక్ కొనాలని నిశ్చయించకున్నాడు. అనుకున్నదే తడవుగా గత నాలుగేళ్లుగా బస్ స్టేషన్లు, దేవాలయాలు, మసీదులలో భిక్షాటన చేసి చాలా డబ్బు సంపాదించాడు. ఈ మేరకు అతను సూమారు రూ. 90 వేలు ఖరీదు చేసే మోపెడ్‌ని కొని తన భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ జంట ఇప్పుడూ ఈ కొత్త మోపెడ్ పై సియోని, భోపాల్, ఇండోర్ వంటి ప్రాంతాలకు వెళ్లాలని తెగ ప్లాన్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. A beggar from Chhindwara in Madhya Pradesh bought a moped worth Rs 90,000 for his wife after she complained of backache @ndtv@ndtvindia pic.twitter.com/9srzxKrFCx — Anurag Dwary (@Anurag_Dwary) May 25, 2022 (చదవండి: ఒంటి చేత్తో క్లైంబింగ్ వాల్ని అధిరోహించిన మహిళ.. వీడియో వైరల్) -
వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్‌లో బంధువులు
Bride marries sister's groom: ఇటీవల కాలంలో వివాహాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. వధువు వరుడుకి సర్ప్రైజ్ ఇచ్చేలా డ్యాన్స్‌లు చేయడం వంటివి ఇటీవల పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఇదంతా ఒకత్తైయితే ఒకేసారి వివాహం చేసుకుంటున్నామని ఆనందంగా ఉన్న ఈ అక్కాచెల్లెళ్లకు ఒక ఊహించని చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకెళ్తే... మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రమేష్ లాల్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు నికిత, కరిష్మాలకు వేర్వేరు కుటుంబాలకు చెందిన యువకులతో వివాహం నిశ్చయించాడు. ఈ మేరకు రమేష్ తన కుమార్తెలిద్దరికి ఒకేసారి వివాహం నిర్వహించాడు. ఐతే సరిగ్గా పెళ్లితంతు సమయంలో కరెంట్ పోయింది. అదీగాక వధువరులు మేలి ముసుగు ధరించి ఉన్నారు. పైగా ఒకేరకమైన పెళ్లి దుస్తులు ధరించడంతో ముహుర్త ఘట్టం వద్దకు వచ్చే వరకు కూడా అక్కడున్న బంధువులెవరికీ ఎవరూ ఎవర్నీ పెళ్లి చేసుకుంటున్నారో అర్థం కాలేదు. అయితే ఇంతలో వివాహతంతు కూడా ముగిసిపోయింది. ఆయా జంటలకు కూడా తమ తమ ఇంటికి చేరుకునేవరకు తాము ఎవర్ని పెళ్లి చేసుకున్నాం అనేది తెలియకపోవడం విచిత్రం. పాపం ఆయా కుటుంబాల వాళ్లు కూడా వధువరులు మారిపోయారనే విషయాన్ని వివాహతంతు ముగిసిపోయే వరకు గుర్తించలేదు. దీంతో కాసేపు ఆయా కుటుంబాల మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. ఐతే ఆయా జంటలు మరోసారి వివాహం జరిపించాలని పెద్దలను కోరడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది. (చదవండి: పారిపోతూ.. విధి నుంచి తప్పించుకోలేకపోయాడు) -
లాఠీ లాక్కుని మరీ పోలీసునే చితక్కొట్టిన ఘనుడు... వైరల్ వీడియో
Man Snatches Cop's Baton: కొంతమంది అధికారులు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే...మరికొంతమంది అత్యంత సౌమ్యంగా ఉంటారు. అయితే కొంతమంది వ్యక్తులు అధికారులు అన్న భయం గానీ ఏమీ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత అధికారుల ఆగ్రహానికి గురై ఊచలెక్కెడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జై ప్రకాష్ జైస్వాల్ అనే కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి దాడి చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులెవరు కనీసం ఆ దాడిని వారించే సాహసం కూడా చేయలేదు. పోలీసుల కథనం ప్రకారం .... దినేష్ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్ బైక్‌తో కానిస్టేబుల్ జై ప్రకాశ్ మోటార్ బైక్‌ని ఢీ కొట్టాడు. దీంతో కానిస్టేబుల్ దినేష్‌తో బైక్ జాగ్రత్తగా నడుపు అన్నాడు. అంతే కోపంతో ఆ కానిస్టేబుల్ లాఠీని లాక్కుని మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడకి కానిస్టేబుల్ చాలా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు కూడా. కానీ దినేష్ మాత్రం కానిస్టేబుల్ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. In Indore Police constable Jai Prakash Jaiswal assaulted in full public view accused has been arrested @ndtv @ndtvindia pic.twitter.com/NElwWSXOXq — Anurag Dwary (@Anurag_Dwary) April 9, 2022 (చదవండి: మహిళా అభిమానికి బలవంతంగా ముద్దు పెట్టబోయిన ర్యాపర్) -
భోపాల్ స్టడీ... మత్తుకు రెడీ
సాక్షి హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విద్యాభ్యాసానికి, గంజాయి సహా ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నారు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు. ఇటీవల తాము అరెస్టు చేసిన, కౌన్సెలింగ్ చేసిన వారిలో అనేక మందికి భోపాల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పాటు లోతుగా ఆరా తీస్తున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. బీటెక్‌లోనే గంజాయికి అలవాటు పడి.. హష్ ఆయిల్ దందాకు సంబంధించిన వారం రోజుల వ్యవధిలో హెచ్–న్యూ అధికారులు.. దంపతులుగా చెప్పుకుంటున్న ఇద్దరిని అరెస్టు చేశారు. బోయిన్పల్లి కేసుకు సంబంధించి మదన్ మానేకర్, కొండపనేని మాన్సీలను కటకటాల్లోకి పంపారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన మాన్సీ కుటుంబం కొన్నేళ్ల క్రితం వ్యవసాయం కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్ శివార్లకు వలసవెళ్లింది. మాన్సీ విద్యాభ్యాసం కొంత మధ్యప్రదేశ్‌లో సాగింది. భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చదివింది. అప్పట్లోనే గంజాయికి అలవాటు పడింది. నగరంలోని మల్టీ నేషనల్ ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో సిటీకి వచ్చి గంజాయితో పాటు హష్ ఆయిల్ సేవించడం, దందా చేయడం మొదలెట్టింది. తన సహోద్యోగులతో పాటు స్నేహితులు, పరిచయస్తులకు గంజాయి, హష్ ఆయిల్ నింపిన సిగరెట్లు అలవాటు చేసింది. విక్రేతగా మారి.. నల్లగొండలో పని చేస్తున్న రిజర్వ్ సబ్–ఇన్స్పెక్టర్ కుమారుడు వి.లక్ష్మీపతి కొన్నాళ్లు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించినా... మొదటి సంవత్సరం పూర్తికాకుండానే మానేశాడు. దీంతో అతడి తండ్రి భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేర్చారు. అక్కడ ఉండగానే గంజాయికి అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రేతగా మారి హష్ ఆయిల్ దందాలోకి దిగి ఈ స్థాయికి ‘ఎదిగాడు’. వీరిద్దరు మాత్రమే కాదు భోపాల్ లింకులతో మరికొన్ని ఉదంతాలు ఇటీవల హెచ్–న్యూ దృష్టికి వచ్చాయి. ఈ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల విక్రేతలతో పాటు వినియోగదారులను పట్టుకుంటున్నారు. పదేపదే వినియోగిస్తున్న, మరికొందరికి అలవాటు చేస్తున్న వారిని అరెస్టు చేస్తున్నారు. ఒకటిరెండుసార్లు మాత్రమే వారికి మారే అవకాశం ఇస్తూ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపుతున్నారు. బయటపడుతున్న లింకులు.. గడిచిన నెల రోజులుగా ఇలా కౌన్సెలింగ్ చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో అనేకమందికి భోపాల్ విద్యాభ్యాసం లింకులు బయటకు వచ్చాయి. అక్కడ చదువుతున్న రోజుల్లోనే ఈ మత్తుపదార్థాలకు అలవాటుపడ్డామంటూ వాళ్లు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంపై హెచ్–న్యూ ప్రత్యేక దృష్టి పెట్టింది. వివిధ మార్గాల్లో భోపాల్‌లోని విద్యాసంస్థలు, వాటిలోని విద్యార్థుల స్థితిగతులను తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రాథమిక పరిశీలన నేపథ్యంలో నగర అధికారులకు కొన్ని కీలకాంశాలు తెలిశాయి. భోపాల్‌లో విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వినియోగం పెరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడి వైద్యుల వద్దకు వస్తున్న మత్తు బానిసల్లో 15 నుంచి 17 సంవత్సరాల వాళ్లూ ఉంటున్నట్లు తెలుసుకున్నారు. క్షుణ్నంగా అధ్యయనం చేయడం కోసం త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ పంపాలని యోచిస్తున్నారు. ఆ తర్వాతే ఈ అంశంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. మాన్సీ ఫ్యామిలీ మహారాష్ట్రకు వలస వెళ్లగా.. ఆ రాష్ట్రంలోని తుల్జాపూర్ పరిసర ప్రాంతానికి చెందిన మదన్ మానేకర్ కుటుంబం బతుకుతెరువు కోసం నాచారానికి వచ్చింది. ఇతడి స్నేహితుడైన టాటూ దుకాణం నిర్వాహకుడు సోని ద్వారా మాన్సీతో పరిచయమైంది. కొ న్నాళ్లు సోనితో కలిసి ఉన్న మాన్సీ మియాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో అతడు అరెస్టు కావడంతో మదన్‌తో కలిసి జీవిస్తోందని, ఇటీవల అతడిని వివాహం చేసుకున్నట్లు చెబుతోందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
కూరగాయాల దుకాణం నడుపుతున్న కోతి!: వైరల్ వీడియో
In This Video Monkey Sitting At A Vegetable Shop: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. మనుషులను కాపాడిన వీడియోలు, దాడి చేసిన వీడియోలు చూశాం. జంతువులు మనుషులును అనుకరిస్తాయని అందరికీ తెలుసు. కానీ మనుషలు మాదిరిగా వ్యాపారం చేసే జంతువులు గురించి విన్నారా!. విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఒక కూరగాయాల దుకాణంలోకి కోతి చొరబడింది. కూరగాయలమ్ముకునే వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోగానే ఆ కోతి అతని స్థానంలోకి వచ్చి కుర్చొంది. దుకాణదారుడి మాదిరిగా కూరగాయాలు అమ్ముతున్నట్లుగా నటిస్తూనే కూరగాయలను తినేసింది. ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరైన సరే కోతి కూరగాయాల దుకాణం నడుపుతుందని అనుకుంటారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది. కాగా మా దగ్గర విపరీతమైన కోతుల బెడద ఉందని.. అవి ఇలా దుకాణంలోకి చొరబడి వస్తువులను పాడుచేయడం లేదా ఎత్తుకుపోవడం చేస్తుంటాయని స్థానికులు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by GNTTV (@goodnewstoday) (చదవండి: ఔను! ఆ పబ్‌లో దెయ్యాలు ఉన్నాయి ! డెవిల్ వైరల్ వీడియో) -
మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!
కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు. అంతేకాదు మాజీ సర్పంచ్ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్ భార్య ప్రగతి జంకర్... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధికారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్‌ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..
Professor thrashes Principal inside his office: కొంతమంది పది మందికి బోధించే వృత్తిలో ఉండి కూడా అసలు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా దాడులు చేస్తారు. పైగా కనీసం తమ ఉనికిని కూడా మరిచిపోయి వొళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అతను ఒక ప్రొఫెసర్ అయ్యి ఉండి ప్రిన్స్‌పాల్‌పై అమానుషంగా దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే.. ఉజ్జయినిలోని ఘట్టియాలోని దివంగత నాగులాల్ మాలవ్య ప్రభుత్వ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రహ్మదీప్ అలునె. అయితే ఏంజరిగిందో తెలియదు గాని ప్రొఫెసర్ బ్రహ్మదీప్ ప్రిన్సిపాల్ డాక్టర్ శేఖర్ మేడంవార్ పై ఆగ్రహంతో దాడి చేశాడు. అంతేగాదు ఈ ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఈ వీడియోలో ప్రోఫెసర్ బ్రహ్మదీప్ కోపంతో ప్రిన్స్‌పాల్‌పై ఒక వస్తువును విసిరాడు. పైగా ఆగ్రహంతో ఊగిపోతూ అతని వద్దకు వచ్చి చేతులతో దాడి చేసినట్లు కనిపించింది. అంతేకాదు ఆ వీడియోలో బయటి నుంచి కొంతమంది వచ్చి ఆ ప్రొఫెసర్ని వెనక్కి లాగి కొద్దిసేపు సద్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ఆ ప్రొఫెసర్ని వెళ్లిపోమని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా కోపంతో అక్కడే కుర్చిలాక్కుని మరీ కుర్చున్నాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్వచ్ఛందంగా ఆ ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు ప్రిన్స్‌పాల్ శేఖర్ మాట్లాడుతూ..."ఆ ప్రొఫెసర్ బదిలిపై భోపాల్ నుంచి ఉజ్జయిని కాలేజికి వచ్చారని తెలిపారు. అంతేగాక అతను రోజు 5 కి.మీ దూరం నడిచి మరి కాలేజీకి వస్తాడన్నారు. అయితే మాకు సిబ్బంది తక్కువుగా ఉన్నారని, పైగా కాలేజీని కూడా వ్యాక్సిన్ కేంద్రగా మారుస్తున్నారనే విషయం గురించి మాట్లాడేందుకు పిలిచాను. అయతే అతను మాత్రం ఆగ్రహానికిలోనై దుర్భాషలాడుతూ కొట్టడం మొదలు పెట్టాడని చెప్పారు. (చదవండి: ఆడమ్ ఆలోచన.. ప్రపంచంలోనే అతి పొడవైన సైకిల్‌గా గిన్నిస్ రికార్డు!) An assistant professor was booked for allegedly beating up principal of a Government College in Ujjain @ndtv @ndtvindia pic.twitter.com/egom5OIVjA— Anurag Dwary (@Anurag_Dwary) January 19, 2022 -
పేదోడి ఇంట్లో గవర్నర్ భోజనం.. ఆపై రూ.14 వేలు బిల్లు చేతిలో పెట్టారు!
Madhya Pradesh Man Gets Rs 14 000 Bill : మధ్యప్రదేశ్‌లోన విదిషా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివాసీ బుధ్రామ్ ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే అతనికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అధికారులు పక్కా ఇల్లు కట్టించారు. ఈ మేరకు గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటి తాళం చెవిని అందజేశారు. అంతేకాదు బుధ్రామ్‌తో కలిసి భోంచేశారు. గవర్నర్ తన ఇంట్లో భోజనం చేయడంతో బుధ్రామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదంతా ఒకటైతే.. గవర్నర్ వెళ్లిపోయాక కొంతమంది అధికారులు సదరు ఆదివాసీ చేతిలో రూ. 14వేల బిల్లు చేతిలో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) వివరాల్లోకి వెళితే.. గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. అతని నిరాడంబరమైన ఇంటికి కొత్త గేట్, ఫ్యాన్లను అమర్చారు. అయితే బుధ్రామ్ అవన్ని ఏర్పాటు చేసేంత సొమ్ము తన వద్ద లేదని ముందుగానే అధికారులకు చెప్పాడు. అయినప్పటికీ అధికారులు పర్వలేదంటూ అన్ని వారే ఏర్పాటు చేశారు. ఈ మేరకు గవర్నర్ రావడం బుధ్రామ్‌తో కలిసి ఇంట్లో భోజనం చేయడం, ఫోటోలు దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే కాసేపటి తర్వాత పంచాయతీ సభ్యులు, పార్టీ అభిమానులను బుధ్రామ్ ఆదివాసి వద్దకు వచ్చి గేటుకు రూ 14,000 కట్టాలి డబ్బుల ఇవ్వమని అడిగారు. దీంతో బుధ్రామ్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే ఆ గేటును తాను పెట్టించుకునే వాడిని కాదన్నాడు. బుద్రామ్కు ఎదురైన సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వార్ మొదలైంది. దీనిపై అర్బన్ డెవలప్మెంట్ మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సదరు ఆదివాసీ వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేయడానికి చూసిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. (చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!) -
గిట్టుబాటు ధర లేక 160 కేజీల ఉల్లిపాయల్ని తగలబెట్టిన రైతు!!
మధ్యప్రదేశ్‌లోని ఒక యువ రైతు రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందసౌర్ బహిరంగ వేలంలో 160 కిలోల వెల్లుల్లిని తగలబెట్టి తన పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించలేదన్న విషయాన్ని బహిరంగంగా వ్యక్తం చేశాడు. డియోలీకి చెందిన శంకర్ సిర్ఫిరా తన ఉత్పత్తులను మందసౌర్ మండిలో హోల్‌సేల్ వ్యాపారులకు విక్రయించడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నిరాశకు గురై ఈచర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత రైతు 'జై జవాన్ జై కిసాన్' అంటూ నినాదం చేశాడు. అయితే మండిలోని సిబ్బంది ఇతర రైతులు వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో హోల్‌సేల్ మార్కెట్లో ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించారు. (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) ఈ మేరకు రైతు మాట్లాడుతూ..."నేను ఇక్కడ వెల్లుల్లి పంటను రవాణా చేయడానికి రూ. ఐదు వేల రూపాయాలు ఖర్చు పెట్టాను. కానీ కొనుగోలుదారుల నుండి రూ. 1,100 మాత్రమే పొందుతున్నాను. అందువల్ల కాల్చడం మంచిది అనిపించి ఇలా చేశాను. అంతేకాదు నేను వెల్లుల్లిని పండించడానికి రూ. 2.5 లక్షలు ఖర్చు చేశాను. అయితే నాకు మార్కెట్ ధర ప్రకారం కేవలం రూ.1 లక్ష మాత్రమే వచ్చింది," అని ఆవేదనగా శంకర్ చెప్పారు. ఈ క్రమంలో రైతును విచారణ కోసం పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే పోలీస్ స్టేషన్ ఇన్చార్జి జితేంద్ర పాఠక్ ఇతర రైతుల ఉత్పత్తులకు అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు కాబట్టి ఆ రైతు పై ఎటువంటి కేసు నమోదు చేయలేదని అన్నారు. ఏదిఏమైన రైతులు సరైన గిట్టుబాటు ధర లభించక ఆగ్రహంతో పంటను దహనం చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. (చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!) A young #Farmers Shankar Sirfira set ablaze around 160 kg garlic produce on not getting adequate price from traders during open auction in the Mandsaur Mandi @ndtv @ndtvindia pic.twitter.com/90wdDA7OR8 — Anurag Dwary (@Anurag_Dwary) December 19, 2021 -
Bhopal Mass Suicide: నా కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు..వాళ్లని వదిలిపెట్టొద్దు!
మధ్యప్రదేశ్: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అప్పుల వేధింపులు తట్టుకోలేక గత గురువారం విషంతాగి మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడిన సంగతి తెలిసందే. ఐతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చివరి వ్యక్తి కూడా సోమవారం ఉదయం మృతి చెందడంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని పిపలానీ ప్రాంతానికి చెందిన సంజీవ్ జోషి (47), అతని తల్లి నందిని (67), భార్య అర్చన (45), వారి సంతానం గ్రీష్మ (21), పూర్వి (16) కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని నవంబర్ 25 (గురువారం) రాత్రి సేవించారు. ఆటోమొబైల్ విడిభాగాల దుఖానం నడిపే జోషి వాట్సాప్ లైవ్ స్ట్రీమ్‌లో తమ మరణాలకు కారణమైనవారి పేర్లను తెలుపుతూ కుటుంబంగా విషంతీసుకోవడాన్ని వీడియో తీసి వాట్సప్‌లో పంపించాడు. సూసైడ్‌నోట్‌ను ఇంటి గోడపై అంటించారు కూడా. ఇద్దరు కుమార్తెలు వేర్వేరుగా సూసైట్ నోట్లను వాట్సప్‌లో పంపారు. సైంటిస్ట్ అవ్వడం తన కలని ఒకరు, ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకున్నట్లు మరొకరు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. తమ కలలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయని కూడా నోట్లో తెలిపారు. సమాచారం అందుకున్న బంధువులు, పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించగా.. వేర్వేరు సమయాల్లో కుటుంబం మొత్తం మృతి చెందారని ఒక పోలీస్ అధికారి స్థానిక మీడియాకు తెలియజేశారు. కాగా ఈ కేసు విచారణలో అప్పులిచ్చిన వారిలో నలుగురు మహిళలను అరెస్ట్ చేసినట్లు, మిగిలిన వారినికూడా అదుపులోకి తీసుకుంటామని ఏఎస్పీ రాజేష్ సింగ్ భదౌరియా మీడియాకు తెలిపారు. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
అది బైక్ ? లేక ఇంకేదైనానా!
మధ్యప్రదేశ్: పెట్రోల్ ధరలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో ప్రజలు ఈ ధరలకు భయపడి ఎవరికీ నచ్చిన రీతిలో వారు ప్రయణించడమో లేక ప్రయాణాలను మానుకోవడం వంటి పనులు చేస్తున్నారు. కానీ బయటకీ వెళ్లకపోతే వాళ్లకు జీవోపాధి కష్టమైపోతుంది కూడా. అయితే వీటన్నింటికీ చక్కని పరిష్కారం చూపించాలనుకున్నాడో వ్యక్తి. అంతేకాదండోయ్ బైక్ మీద తొమ్మది మందిని తీసుకువెళ్ల గలిగేలా బైక్‌ని తయారు చేశాడు చూడండి. ఎవరతను ఎక్కడ జరిగిందో అని కుతూహలంగా ఉన్నారా. (చదవండి: కంగారులో బ్రేకు, యాక్సలరేటర్, పెడల్‌ని కలిపి నొక్కాడు..ఇక అంతే !) వివరాల్లోకెళ్లితే....ఒక వ్యక్తి మోటర్ బైక్‌ను విమానంలా నడుపుతున్నాడు. ఇదేంటి విమానంలా అని సందేహించకండి. అసలు ఏం చేశాడంటే...దానికి రెక్కల్లగా ఉండేలా చెక్క పలకలు జతచేసి వాటిపై కాళ్ళు చాపి కూర్చున్న వ్యక్తుల సమూహంతో. అతను బైక్‌పై ఇద్దరు, ముగ్గురు కాదు ఏకంగా తొమ్మిది మందిని కూర్చోబెట్టుకుని గ్రామీణ ప్రాంతంలోని రహదారిపై డ్రైవ్ చేస్తున్నాడు. అతను తన సహచరుల బరువుతో బైక్‌ను బ్యాలెన్స్ చేస్తూ విమానంలా కదిలాడు. అయితే దీనికి సంబంధించిన వీడియోతోపాటు "ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌ను ఆకాశానికి ఎత్తినప్పుడు, ప్రజలు కొత్త జుగాద్ విమానాన్ని తయారు చేశారు" అనే క్యాప్షన్‌తో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ "ఇలాంటి జుగాద్ విమానాన్ని తయారు చేయకండి. పైగా వాళ్లంతా హెల్మెట్లు ధరించలేదు కాబట్లి ఏదైనా ప్రమాదానికి గురై అవకాశం ఉంది. అంతేకాదు ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించేలా బైక్‌పై ఎక్కవ మందిప్రయాణించకూడదు. " అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ?) सरकार ने पेट्रोल-डीज़ल को आसमान पर पहुचाया तो जनता ने भी नया जुगाड़ हवाई जहाज बना लिया.. pic.twitter.com/YvnjzdS1uP — Jaivardhan Singh (@JVSinghINC) October 27, 2021 -
కాంగ్రెస్ నేత దారుణ హత్య.. విచారణకు మాజీ సీఎం డిమాండ్
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం చత్తార్పూర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లాలోని గువారా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంద్ర ప్రతాప్ సింగ్ పర్మార్‌ను దుండగులు అతి సమీపం నుంచి ఛాతీపై కాల్పులు జరిపి హతమార్చారు. మంగళవారం రాత్రి ఇంద్ర ప్రతాప్.. మిత్రులతో కలిసి స్థానికంగా ఉండే ఓ హోటల్ ముందు నిలబడి ఉండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. స్థానికులు హుటాహుటిన అతనిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. కాగా, ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉండే సీసీ టీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఆరుగురిపై కేసులు నమోదు చేసి గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాతకక్షలే ఇంద్ర ప్రతాప్ హత్యకు కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా తమ నేత ఇంద్ర ప్రతాప్ హత్యతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన అనుచరులు ఆసుపత్రిని ధ్వంసం చేసి, పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సృష్టించారు. ఇంద్ర ప్రతాప్ హత్యపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
31 మంది ఉద్యోగలకు కరోనా పాజిటివ్
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశలో కోవిడ్ నియంత్రణ లేని పట్టణాల్లో ఇండోర్ ఒకటి. తాజాగా రాష్ట్రంలో ఇండోర్ పట్టణంలోని ఆభరణాల దుకాణంలో 31 మంది ఉద్యోగులకు కరోనా సోకడంతో దాన్ని మూసివేశారు. ప్రస్తుత పరిస్థితిపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాడియా విలేకరులతో మాట్లాడుతూ.. గత వారం నుంచి దుకాణాన్ని సందర్శించిన వారిని అలానే వైరస్ సోకిన సిబ్బంది, కస్టమర్లను గుర్తించడం ప్రారంభించామన్నారు. వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు లేదా కోవిడ్ ఇతర లక్షణాలు ఉన్నాయా అని పరీక్షిస్తున్నామన్నారు. ఆభరణాల షోరూమ్ ని శుభ్రం చేస్తున్నామని, అది పూర్తయిన తర్వాత మాత్రమే తిరిగి తెరుస్తారని అధికారులు తెలిపారు. గత కొన్ని నెలలతో పోల్చితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది దీపావళి, ధన్సార్ పండుగలను జరుపుకున్నారు. పండగ సందర్భంగా చాలా మంది షాపింగ్మాల్స్ని సందర్శించారు. దీని వలన కరోనా వ్యాప్తి పెరిగిందని అలానే ఢిల్లీ, ముంబై నుంచి వచ్చిన పర్యాటకులు, ప్రజలు మాస్క్ లేకుండా వీధుల్లో తిరుగుతూ, ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 1.86 లక్షలకు పైగా కరోనా బారిన పడగా 1,200 మంది మరణించారు. ఇండోర్ లో నిన్న ఒక్కరోజే 194 కొత్త కేసులు వెలుగు చూశాయి. -
భారీగా ఓటింగ్.. విజయం మాదే
భోపాల్: ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జోస్యం చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మంగళవారం 28 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భారీగా ఓటింగ్ జరిగిందని, బీజేపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం తథ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి వెంటాడుతున్నా మధ్యప్రదేశ్ ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని.. ఇది మన ప్రజాస్వామ్యం గొప్పదనమని చౌహాన్ తెలిపారు. ఓటర్లు అందరూ తమ ఓటును ఉత్సాహంగా బీజేపీకే వేశారని ఆశాభావం వ్యక్తం చేశారు. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీని వీడి 22 మంది అనుచరులతో బీజేపీలో చేరారు. ఆ సమయంలో ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. వీటితో పాటు ఇది వరకు ఖాళీగా ఉన్న సీట్లను కలిపి 28 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభత్వం కూలిపోయి, శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. రాష్ట్రంలో ఉన్న రైతులను, నిరుద్యోగులను, మహిళలను, కమల్‌నాథ్ ప్రభుత్వం మోసం చేసిందని, అలాంటి పార్టీకి బుద్ధి చెప్పడానికే తాను పార్టీ మారినట్లు సింధియా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన ఉప ఎన్నికల్లో 57.09 శాతం పోలింగ్ జరిగింది. అత్యధికంగా అగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 80.46 శాతం ఓటింగ్ నమోదైంది. సుమవలి నియోజకవర్గంలో అత్యల్పంగా 41.79 శాతంగా ఓటింగ్ జరిగిందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. బిహార్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలతో పాటు పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 10న వెల్లడించనున్నారు. వీటిలో కనీసం తొమ్మిది స్థానాలు గెలిస్తేనే శివరాజ్ సింగ్ ప్రభుత్వం నిలువనుంది. మెజారిటీ కొంచెం అటు ఇటు అయితే మళ్లీ కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టొచ్చు. -
16వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన మహళ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఈ ఘటన చూసిన తరువాత సమాజం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 45 ఏళ్ల మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ అధిక రక్తస్రావం కావడంతో మరణించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్వర్ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి. అయితే ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోకపోవడంతో తన తల్లి ఇలా పిల్లల్ని కంటూ వచ్చిందని మృతురాలి కూతురు సవిత తెలిపింది. ‘నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను. కానీ అమ్మ వినలేదు. వారం రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో అధిక రక్తస్రావం కావడంతో మరణించింది’ అని సవిత తెలిపింది. ఇక విషయంపై ఆ ప్రాంత మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఆమె 1997లో మొదటి సంతానానికి జన్మనిచ్చిందని తరువాత ఆమె కలలకు, జన్మనిచ్చిందని అలా ఇప్పటికి కొనసాగిస్తూనే ఉందని తెలిపారు. ఆమెకు చాలా సార్లు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆపరేషన్ చేయించుకోవాలని కోరామని తెలిపారు. కానీ ఆమె తన భర్త, అత్తమామలకు భయపడ చేయించుకోవాలని వివరించారు. ఇక తన 15వ కానుపు తరువాత చేయించుకోమని కోరగా ఆమె మోనోపోలి దశకు చేరుకోబోతున్నానని ఇక అవసరం లేదని సుఖ్రాని మొండిగా వ్యవహరించిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయంపై ఆమె భర్తను ప్రశ్నించగా ఈ వయసులో ఆమె పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకోవాలంటే భయపడిందని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన సమాజంలో ఇంకా మార్పు రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. చిన్నకుటుంబం మేలు అని ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నా కొంత మంది ఇప్పటికీ మూఢనమ్మకాలతో ముందుకు సాగుతున్నారు. చదవండి: బెజవాడ మహేష్ హత్య : చేధించిన పోలీసులు -
ఆ స్నేహపాశం తెగిపోలేదు..
కులం, మతం అనేవి ఉంటాయని కొంచెం వయసు వచ్చాక తెలుస్తుంది. ‘మీరేవిట్లు’ అని ఎవరో అడుగుతారు. ఇంటికొచ్చి అమ్మను అడుగుతాం ‘అమ్మా.. మీరేవిట్లు అంటే ఏంటి?!’ అని. కొన్నాళ్లు ఆ కన్ఫ్యూజన్ వేధిస్తుంటుంది. అందరూ ఒకేలా ఉండకుండా ఏంటిది! అని. బెస్ట్ ఫ్రెండ్ రహీమ్ గాడు మసీదుకు వెళతాడని తెలిసినా.. ఎందుకు వాళ్లింట్లో వాళ్లు గుడికి రారు అనే సందేహం అప్పటి వరకు కేశవ్ కి వచ్చి ఉండదు. వాళ్లింటికి మసీదు దగ్గర కాబట్టి వాళ్లంతా అక్కడికి వెళ్తుంటారు అనుకుంటాడు. రహీమ్‌కీ ఇవేమీ తెలియవు. కేశవ్ గాడితో అప్పటికే అనేకసార్లు గుడికి కూడా వెళ్లి, చేతిలో కేశవ్ వాళ్ల అమ్మ పెట్టిన కొబ్బరి ముక్కను తనూ కళ్లకు అద్దుకుని తినే ఉంటాడు. పెద్దయ్యాక ఇవేవీ ఉండవు. లేకుండా చేస్తాయి సంప్రదాయాలు, ఆచారాలు. రహీమ్, కేశవ్ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. కేశవ్‌కి ఐ.ఐ.టి లో సీటు రావాలని రహీమ్ అల్లాను ప్రార్ధిస్తాడు. రహీమ్‌కి వీసా రావాలని కేశవ్ వేంకటేశ్వరుడిని వేడుకుంటాడు. మనిషి ఉన్నంతకాలం ఈ స్నేహం ఉంటుంది. ‘పెట్టె’ ను మోయడానికి కేశవ్, ‘కట్టె’ ను మోయడానికి రహీమ్ భుజం ఇస్తూనే ఉంటారు. రామ్ నరేష్ దూబే, సయ్యద్ వాహిద్ అలీ బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ మేట్స్. కాలేజ్ మేట్స్. మధ్యప్రదేశ్, సాగర్ జిల్లాలోని చతుర్భట గ్రామం వాళ్లది. అలీ లాయర్ అయ్యాడు. దూబే పురోహితుడు అయ్యాడు. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో అలీ చనిపోయినప్పుడు దూబే తన వృత్తిబాట్లను తెంచుకుని మరీ వెళ్లి అలీతో మరుభూమి వరకు నడిచాడు. ఆ స్నేహపాశం తెగిపోలేదు. ఇప్పుడివి ఆలయాలలో పూజలు జరిపించి పితృదేవతలకు తర్పణం వదిలే రోజులు. ఏటా పక్షం రోజులు ఉంటాయి. ఈ ఏడాది.. పితృదేవతలతో పాటు తన మిత్రుడికీ తర్పణం వదిలాడు దూబే!! దేవతలారా దీవించండి. -
వైరల్: ఇంటిల్లిపాది ‘డ్యాన్స్’
కాంతి: అదో ఉమ్మడి కుటుంబం. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు... ఏకంగా కుటుంబంలో 19మందికి కరోనా సోకింది. పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మధ్యప్రదేశ్‌లోని కాంతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో చేరి అందరూ విజయవంతంగా కరోనా నుంచి బయటపడ్డారు. మీకు నెగెటివ్ వచ్చింది.. డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్లు చెప్పగానే ఆనందం పట్టలేక 8మంది కుటుంబసభ్యులు ఇలా డ్యాన్స్ చేశారు. చిచోరే సినిమాలోని ‘చింతా కర్కే క్యా పాయేగా, మర్నే సే పహలే మర్ జాయేగా (బాధపడితే ఏమొస్తుంది, మరణం సంభవించక ముందే చనిపోతావు)’ పాటకు మహిళలు, పిల్లలతో పాటు అంతా ఇలా డ్యాన్స్ చేసి ఆనందం వ్యక్తపరిచారు. ఈ వీడియో మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. (కీలక దశలో దేశీ వ్యాక్సిన్) -
మహిళ ఫిర్యాదు, మరుగుదొడ్లు కడిగిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్‌లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని కోరిన ఆయన స్వయంగా పౌర రక్షణా సిబ్బందితో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. టాయ్లెట్లు సరిగా లేనందువల్ల మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్ మార్చి నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: పీపీఈ సూట్‌తో ఓటు.. మరో ఎమ్మెల్యేకు కరోనా -
‘ఏ పులి బతికుంది పేపర్ మీదా? సర్కస్ లోనా?’
భోపాల్: బీజేపీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాధ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సింధియా మార్చిలో కమల్‌నాధ్ అధ్యక్షతన అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి 22 ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికయ్యారు. బీజేపీలో చేరిన చాలామంది ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు సంపాదించి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జ్యోతిరాధిత్య ‘సింధియా టైగర్ అభి జిందాహై’ (టైగర్ ఇంకా బతికే ఉంది) అంటూ వ్యాఖ్యనించారు. దీనిపై స్పందించిన కమల్‌నాధ్ ‘ఏ టైగర్ బతికి ఉంది. పేపర్ మీద ఉన్నదా? సర్కస్‌లో ఉన్నదా?’ అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. మన దేశంలో రెండు రకాల గుర్రాలు ఉంటాయని, ఒకటి పెళ్లి ఊరేగింపులో ఉండేది, మరొకటి రేసులో ఉండేది అంటూ కమల్‌నాధ్ వ్యాఖ్యానించారు. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రధాని నరేంద్రమోదీ మీద కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (టైగర్ అభీ జిందా హై: జ్యోతిరాదిత్య) తాను టీ ఎప్పుడూ అమ్మలేదు అన్న కమల్‌నాధ్ ... కొంతమంది తమకు తాము టైగర్స్ అని చెప్పుకుంటున్నారని, అయితే తాను టైగర్‌ను కాదని, పేపర్ మీద ఉండే టైగర్‌ను కూడా కాదని, జస్ట్ కమల్‌నాధ్‌ని అని ఆయన పేర్కొన్నారు. ఎవరు ఏంటనేది ప్రజలకు తెలుసని అన్నారు.ఇలాంటి సంఘటనలు మధ్యప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ గురించి మాట్లాడుతూ, అది బేరసారాల ప్రభుత్వమని, అందులో ఉన్నవారు ఎమ్మెల్యేలు కాదని, బేరమాడి కొనుకున్నవారు అని కమల్‌నాధ్ అన్నారు. (కొత్త మంత్రుల ప్రమాణం.. సింధియా మార్క్!) -
సన్యాసి దర్శనం.. భౌతిక దూరం ఉల్లంఘన
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునే లాక్డౌన్ నిబంధనలు భౌతికదూరం పాటించటం, ముఖానికి మాస్క్‌లు ధరించడాన్ని పాటించకుండా యథేచ్చగా ప్రజలు గుమిగూడుతున్నారు. ఓ జైనమత సన్యాసిని దర్శించుకోవటం కోసం ఒక్కసారిగా ప్రజలు పెద్దఎత్తున అతని వద్దకు తరలివచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. జైనమత సన్యాసి దర్శనం కోసం కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు ప్రజలు పాటించకుండా ఉల్లంఘించారని సాగార్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ భూరియా తెలిపారు. ఆ సన్యాసిని దర్శించుకునే కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. (‘రాజధాని’ స్టాప్‌లు పెంచండి: సీఎం) సాగర్ జిల్లాలో ఇప్పటికే పది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. భౌతికదూరం పాటించకుండా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించటాన్ని నేరంగా పరిగణించాలని ఇటీవల హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ పేర్కొన్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం కొన్ని లాక్డౌన్ సడలింపు మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయటంపై ప్రజల నుంచి సలహాలు కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 24,386 కరోనా వైరస్ బాధితులు డిశ్చార్జ్ అవ్వగా, 2415 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 47,480 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. -
మధ్యప్రదేశ్‌లో 1355 కరోనా పాజిటివ్ కేసులు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో మొత్తం 1355 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 23070 శాంపిళ్లను పరీక్షించారు. ఇంకా 2708 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇండోర్, భోపాల్‌లలో అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో 881, భోపాల్‌లో 208 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 69 మంది కరోనా బారినపడి మృతిచెందారు. వీరిలో 47 మంది ఇండోర్‌కు చెందిన వారే ఉన్నారు. -
ప్రజల సలహా మేరకే ఆ మార్పులు : సింధియా
గ్వాలియర్ : మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ముసలం ముదురుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాష్ట్రంలోని పార్టీ నాయకత్వంపై కొద్ది రోజులుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. తన ట్విటర్ ఖాతాలో ఉన్న కాంగ్రెస్‌కు సంబంధించిన తన వ్యక్తిగత వివరాలను కూడా మార్పులు చేశారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ పేరు కనిపించకుండా.. ప్రజాసేవకుడిగా, క్రికెట్ ఔత్సాహికుడిగా తన అధికారిక ఖాతాలో దర్శనమిస్తున్నాయి. కాగా దీనిపై ఆయన స్పందిస్తూ.. నెల క్రితమే ప్రజల సలహా మేరకు తన ట్విటర్ ఖాతాలోని వివరాలను మార్చినట్లు వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి వస్తున్న వార్తలు కూడా పూర్తిగా నిరాధారమైనవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధేయుడైన దివంగత మాధవరావు సింధియా వారసుడిగా జ్యోతిరాదిత్య రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ లోని గుణ, శివ్ పురి లోక్‌సభ స్థానం నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తూ వచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా పరాజయం చూశారు. భారతీయ జనతాపార్టీకి చెందిన కృష్ణపాల్ సింగ్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా పెద్దగా క్రియాశీలకంగా ఉండట్లేదు. గతంలో జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో బీజేపీకి అనుకూలంగా జ్యోతిరాదిత్య సింధియా కొన్ని ప్రకటనలు చేశారు. దీనిపై అప్పట్లోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు షోకాజ్ నోటీసులను కూడా జారీ చేశారు. ఈ వ్యవహారాలతో విసిగిపోయిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. Jyotiraditya Scindia to ANI, on no mention of Congress party in his Twitter bio: A month back I had changed my bio on Twitter. On people's advice I had made my bio shorter. Rumours regarding this are baseless. pic.twitter.com/63LAw9SIvb — ANI (@ANI) November 25, 2019 -
కుమారుడి పెళ్లి వేడుకలో.. తండ్రి హత్య!
ముంబై: వారంలో రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి.. కుటుంబమంతా ఆ వేడుకల్లో ఆనందంగా ఉంది. అయితే పెల్లి వేడుకల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఇంటిపెద్ద మృతి చెందిన ఘటన ఆ కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ జిల్లాకు చెందిన విక్రమ్ సింగ్(47) కుమారుడు రంజిత్ సింగ్ వివాహం కుదిరింది. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబమంతా జంగోతి గ్రామంలోని ఓ ఆలయానికి వెళ్లారు. అందరూ ఆలయంలోకి వెళుతున్న సమయంలో తుపాకీతో మూడుసార్లు కాల్పులు జరిపారు. అందులోని చివరి బుల్లెట్ విక్రమ్ సింగ్ ఛాతీలోకి దూసుకువెళ్లింది. దాంతో అతడిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విక్రమ్ సింగ్ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుల్లెట్ విక్రమ్ సింగ్ ఛాతి భాగంలో తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించాల్సి ఉందని అడిషినల్ ఎస్పీ అంటార్ సింగ్ కనేష్ తెలిపారు. అయితే విక్రమ్ సింగ్‌ను టార్గెట్ చేసుకునే కాల్పులు జరిపారా, లేక అనుకోకుండా బుల్లెట్ తగిలిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
లిప్‌స్టిక్‌లో రహస్య కెమెరాలు
భోపాల్: సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ సెక్స్ స్కాంలో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. లిప్‌స్టిక్‌ల్లో, కళ్లద్దాల్లో రహస్యంగా దాచిన కెమెరాల ద్వారా రాసలీలలను చిత్రీకరించారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి పదుల సంఖ్యలో స్పై కెమెరాలను స్వాధీ నం చేసుకున్నామన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఒక యువతితో ఓ హోటల్ గదిలో చేస్తున్న రాసలీలల వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హిందుత్వ సంస్థకు చెందిన నాయకుడికి సన్నిహితుడైన ఓ పెద్దాయనకు సంబంధించిన మరో వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. అయితే, అవి నిజమైనవా? కావా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ స్కామ్‌కు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవి చాలావరకు నకిలీవని తెలుస్తోంది. కొందరు మహిళలు మధ్యతరగతి కాలేజీ అమ్మాయిలను ఎర వేసి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులతో పనులు చేయించుకుని కోట్లు సంపాదించిన స్కామ్ ఒకటి తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన విషయం తెలిసిందే. అదే సమయంలో వారు ఆ యువతులతో ఉన్న సమయంలో వీడియోలు తీసి, బ్లాక్ మెయిల్ చేయడం ద్వారానూ పనులు చేయించుకునేవారు. ఓ సీనియర్ ఇంజినీర్ ఫిర్యాదుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి ఆర్తి దయాల్, మోనిక యాదవ్, శ్వేత విజయ్ జైన్, శ్వేత స్వప్నిల్ జైన్, బర్ఖా సోని, ఓం ప్రకాశ్ కోరిలను సిట్ అరెస్ట్ చేసింది. నిందితుల నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మాజీ మంత్రుల శృంగారాలున్న వీడియో, ఆడియో క్లిప్‌లను వేలాదిగా సిట్ స్వాధీనం చేసుకుంది. -
కోట్లున్నా.. పాన్‌కార్డు లేదు!
మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు కోట్ల ఆదాయం ఉన్నా కొందరికి పాన్ కార్డు కూడా లేదని, మరికొందరు అసలు ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) వెల్లడించింది. 16 మంది ఎమ్మెల్యేలకు కోట్ల ఆస్తులున్నాయని, అయితే వారెవరూ ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయలేదని ఏడిఆర్ నివేదిక పేర్కొంది. ఎన్నికల అఫిడవిట్లో కనీసం పాన్ కార్డు వివరాలు కూడా పేర్కొనని ఎమ్మెల్యేల్లో గదర్వార ఎమ్మెల్యే సునీతా పటేల్, సిరోంజి ఎమ్మెల్యే ఉమాకాంత్ శర్మ ఉన్నారు. సునీతకు ఆరు కోట్లకు పైగానే ఆస్తులున్నాయి. పాన్‌కార్డు వివరాలిచ్చి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారిలో బాలఘాట్ బీజేపీ ఎంపీ బోధ్‌సింగ్ భగత్ ఉన్నారు. ఈయన ఆస్తి రూ.2 కోట్లకు పై మాటే. షహదాల్ ఎంపీ జ్జాన్‌సింగ్, రేవా ఎంపీ జనార్దన్ మిశ్రా కూడా కోటీశ్వరులైనా ఐటీ రిటర్నులు దాఖలు చేయలేదు. వీరిద్దరూ బీజేపీ ఎంపీలేనని ఏడీఆర్ నివేదిక తెలిపింది. రూ.5 కోట్ల ఆస్తి ఉన్న బర్వానీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్, రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్న గుణ ఎమ్మెల్యే గోపీలాల్ జాతవ్, రెండు కోట్ల ఆస్తి ఉన్న కోటమ ఎమ్మెల్యే సునీల్ కుమార్, మంగోలి ఎమ్మెల్యే బ్రజేంద్ర సింగ్‌కు పాన్‌కార్డులు కూడా లేవు. వీరందరి వివరాలను ఏడీఆర్ మధ్యప్రదేశ్ ప్రధాన ఆదాయం పన్ను శాఖ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా తెలిపింది. ఈ ఎమ్మెల్యేలు, ఎం పీల్లో కొందరు 2–3 సార్లు ఎన్నికైన వారూ ఉన్నారని, వారి ఆస్తులు ఎన్నో రెట్లు పెరిగాయని అయినా వారు పాన్, ఐటీ రిటర్నుల వివరాలను అఫిడవిట్లో పేర్కొనడం లేదని ఏడీఆర్ ఐటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో ఆర్థిక లావాదేవీల గురించి పూర్తిగా చెప్పకపోయినా, తప్పుగా చెప్పినా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు 2013, సెప్టెంబర్ 13న తీర్పు ఇచ్చిందని, దాని ప్రకారం వీరిపై చర్య తీసుకోవాలని ఏడీఆర్ కోరింది. -
‘భగువర్’ గ్రామం ప్రత్యేకత ఏంటో తెలుసా?
దేశ ప్రగతికి పల్లెలే పట్టుకొమ్మలు. అందుకే మనదేశంలో మంచి పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తూ.. అభివృద్ధిలో ఒక అడుగు ముందుకేసి ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలెన్నో ఉన్నాయి. మరోపక్క వివిధ రకాల కారణాలతో అభివృద్ధికి నోచుకోని గ్రామాలూ ఉన్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఇప్పటికీ.. సర్పంచ్ లేకపోయినా.. ఓ గ్రామం ఒడిదుడికులన్నింటిని అధిగమిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా, కరేలి మండలంలో భగువర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాక సర్పంచ్ పదవికి ఎన్నిక జరగలేదు. గ్రామంలోని పెద్దను సామూహికంగా నిర్ణయించి, పెద్ద నిర్ణయాలతో ముందుకు సాగుతారు భగువర్ గ్రామ ప్రజలు. 1962లో గ్రామ పంచాయతీ భవనాన్నీ నిర్మించారు. అయితే ఈ భవనాన్ని ఒక దేవాలయంగా భావిస్తారు వారంతా. సర్పంచ్ లేక పోయినా గ్రామస్వరాజ్యం సాధించడంలో భగువర్ గ్రామం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామం మొత్తం అభివృద్ధిని పరిశీలిస్తే... ఆదర్శ గ్రామాలైన.. రాలేగావ్ సిద్ధి, హివారే బజార్, గంగదేవిపల్లి గ్రామాల అభివృద్ధి కంటే కొన్ని వందల రెట్లు భగువర్ గ్రామం ముందంజలో ఉంది. మొదట్లో గ్రామానికి చెందిన నిర్ణయాలు ఆ గ్రామం లోని పెద్ద, మర్యాదస్తుడుగా అందరూ గౌరవించే ‘‘భయ్యాజీ’’ తీసుకునే వారు. భయ్యాజీ కష్టపడేతత్వం చూసిన గ్రామస్తులు ఆయన అడుగు జాడల్లో నడిచి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. 2012 లో భయ్యాజీ మరణించినా, ఇప్పటికి ఆయన మార్గంలోనే గ్రామస్తులంతా నడుస్తున్నారు. అత్యుత్తమ నీటి వ్యవస్థ.. దేశంలోనే అత్యుత్తమ మురుగు నీటి వ్యవస్థ ఈ గ్రామంలో ఉంది. మురుగునీరు రోడ్లపై పారకుండా భూగర్భ కాలువ వ్యవస్థ ఉంది. వర్షపు నీరు, వృథాగా పోయే నీరు నిల్వ చేయడానికి ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు తగినంత స్థాయిలో ఉన్నాయి. ఏ భేదం లేకుండా... గ్రామ పాఠశాలలో కుల, మతాలతో సంబంధం లేకుండా అందరు విద్యార్థులు కలిసి చదువుకుంటారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. ఇటువంటి గ్రామాలు జిల్లాకో రెండు ఉన్నా.. దేశం అభివృద్ధిలో మరింత వేగంగా దూసుకుపోతుంది. ఇంతటి గొప్ప అభివృద్ధి కలిగిన భగువర్ గ్రామంపై ‘‘స్వరాజ్ ముమ్కిన్ హై’’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ కూడా తీశా>రు. ఈ డాక్యుమెంటరీకి అవార్డు కూడా లభించడం విశేషం. అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్లు... దేశంలోనే అత్యధిక గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉన్న గ్రామంగా భగువర్ రికార్డు సృష్టించింది. ఈ గ్రామ జనాభా 1700 లకు పైగా ఉంటుంది. సుమారు 400 ఇళ్లు ఉన్నాయి. గ్రామం మొత్తం మీద 51 గోబర్ గ్యాస్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి సాయంతోనే వంట గ్యాస్‌ను, వీధి లైట్లను వెలిగిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం భగువర్ గ్రామంలో నిషేధించారు. గ్రామంలో సేకరించిన చెత్తనంతా ఒకచోట పెద్ద గుంతలో వేసి ఎరువుగా తయారు చేస్తారు. ఈ ఎరువును ఏడాదికి ఒకసారి వేలం వేసి, వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి వినియోగిస్తున్నారు. సొంతంగా రోడ్ల నిర్మాణం... భగువర్కు మొదట్లో సరైన రహదారి ఉండేదికాదు. గ్రామంలోని యువకులంతా కలిసి మూడు కిలో మీటర్ల మేర రోడ్డును స్వయంగా నిర్మించారు. అది గుర్తించిన ప్రభుత్వం తర్వాత సిమెంటు రోడ్డు నిర్మించింది. భగువర్లో 35 ట్రాక్టర్లు, 75 చెరుకు గడల ప్రాసెస్ మిషన్లు, అందరూ వాడుకునేందుకు 25 చేతి పంపులు ఉన్నాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ఏదైనా సమావేశాలు, పండగలు, ఫంక్షన్లు నిర్వహించినప్పుడు వాడుకోవడానికి జనరల్ టాయిలెట్స్ కూడా నిర్మించుకున్నారు. -
వలసల భారతం ఏం చెబుతోంది?
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమల్ నాథ్ మాట్లాడుతూ స్థానికుల ఉద్యోగావకాశాలను ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలసవచ్చిన వారు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. ఇక నుంచి స్థానికులకు 70 శాతం ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు తన ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని కూడా హామీ ఇచ్చారు. ఆయన మాటల్లో నిజమెంత ? అబద్ధం ఎంత ? అసలు వాస్తవం ఎంత ? వాస్తవానికి మధ్యప్రదేశ్‌కు వలసవస్తున్న వారి కన్నా మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. 1991–2001 దశాబ్దంతో పోలిస్తే 2001 నుంచి 2011 దశాబ్దానికి రాష్ట్రం నుంచి వలసపోతున్న వారి సంఖ్య 461 శాతం పెరిగింది. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకన్నా వలసపోతున్న వారి సంఖ్య తక్కువే. మధ్యప్రదేశ్ నుంచి ఒక్కరు వలసపోతే బీహార్ నుంచి 3.5, ఉత్తరప్రదేశ్ నుంచి 7.6 శాతం మంది ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు. బీహార్ నుంచి వలసపోతున్నవారి కన్నా వలసవస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అంటే యూపీ నుంచి బీహార్ నుంచి ఆ రాష్ట్రానికి వలస పోతున్నవారి సంఖ్య మరీ తక్కువనే విషయం అర్థం అవుతోంది. యూపీ, బీహార్ నుంచి గతంలో ఎక్కువ మంది మహారాష్ట్రకు వెళ్లగా ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ పట్టణాలకు ఎక్కువగా వెళుతున్నారు. గతంతో పోలిస్తే యూపీ నుంచి వలసపోతున్న వారి సంఖ్య దశాబ్ద కాలంలో 197 శాతం పెరగ్గా, బీహార్ నుంచి 237 శాతం పెరిగింది. భారత దేశంలోని ప్రజలు ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం కొత్త విషయం కాదు. స్వాతంత్య్రానికి ముందునుంచి ఉన్నదే. అయితే స్వాతంత్య్రం వచ్చాక దేశంలో ఎక్కడికైనా వెళ్లి స్థిర నివాసం ఏర్పరుచుకునే హక్కు ప్రతి భారతీయుడికి రాజ్యాంగ పరంగా సంక్రమించింది. ఈ వలసలకు వ్యతిరేకంగా ఉద్యమాలు, ఆందోళనలు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు కూడా విడిపోవాల్సి వచ్చింది. 1960వ దశకంలో తమిళనాడులో హిందీ భాషకు, హిందీ మాట్లాడే వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఆ తర్వాత అస్సాంలో బెంగాలీ, హిందీ, నేపాలీ భాషలు మాట్లాడే వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఇక మహారాష్ట్రలో 1960 దశకం నుంచి ఇప్పటికీ ఉత్తర భారతీయులతోపాటు దక్షిణ భారతీయులు కూడా స్థానికుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ మరాఠీ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు. 2017లో కర్ణాటకలో కూడా హిందీ మాట్లాడేవారికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మొన్న అక్టోబర్ గుజరాత్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరగ్గా వేలాది మంది గుజరాత్ నుంచి పారిపోయారు. హిందీ మాట్లాడే వారు తమ ఉద్యోగాలు కొల్లగొడుతున్నారంటూ ఇతర రాష్ట్రాల వారు ఇంతవరకు ఆరోపిస్తూ ఆందోళనలు చేస్తుండగా, తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ ఓ హిందీ రాష్ట్రమైన మధ్యప్రదేశ్ ఆరోపించడం ఇదే తొలిసారి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన 2017 నాటికి దేశంలో వలసపోయిన వారి సంఖ్య 45.36 కోట్లు. ఈ సంఖ్య మరింత పెరిగితే చైనాలోలాగా వలసల నియంత్రనకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి రావచ్చు. -
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌దే
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో మంగళవారం ఎంతో ఉత్కంఠతో సాగిన ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం వరకు కొనసాగింది. ఊహించినట్లుగానే ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం దక్కకుండా హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. మొత్తం 230 సీట్లున్న శాసనసభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్ 114 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మెజారిటీ మార్కుకు కేవలం రెండే సీట్ల దూరంలో ఆగిపోయింది. బీజేపీ 109 స్థానాల్లో గెలిచింది. అయితే ఈ రాష్ట్రంలో ఎక్కువ ఓట్లు మాత్రం బీజేపీకే పడ్డాయి. కాషాయ పార్టీ 41 శాతం ఓట్లు దక్కించుకోగా, కాంగ్రెస్‌కు 40.9 శాతం ఓట్లు వచ్చినప్పటికీ బీజేపీ కన్నా 7 సీట్లు అధికంగా గెలుపొందింది. బీఎస్పీకి 2, ఎస్పీకి 1 సీటు దక్కగా, నాలుగు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఏ పార్టీకీ సాధారణ ఆధిక్యం లభించకపోవడంతో బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలకు ప్రాధాన్యమేర్పడింది. అయితే తాము కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు బీఎస్పీ, ఎస్పీలు ప్రకటించాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా తమకే ఉందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ తెలిపారు. 15 ఏళ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైంది. బీజేపీని గద్దె దింపేందుకే: మాయావతి మధ్యప్రదేశ్‌లోనే కాక అవసరమైతే రాజస్తాన్‌లో కూడా కాంగ్రెస్‌కు తాము మద్దతివ్వాలని నిర్ణయించినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు కూడా తమకు నచ్చవనీ, కేవలం బీజేపీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న పట్టుదలతోనే కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించామని మాయావతి తెలిపారు. కేంద్రంలో, పలు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాల పాలనతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేందుకు నిదర్శనమే తాజా ఎన్నికల ఫలితాలని ఆమె పేర్కొన్నారు. శివరాజ్ సింగ్ రాజీనామా ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇప్పటికి వరుసగా 13 ఏళ్లపాటు మధ్యప్రదేశ్‌కు సీఎంగా ఉన్నారు. ‘నా రాజీనామాను గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు సమర్పించాను. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ప్రజలు కూడా మాపై ప్రేమ చూపారు. కానీ మేం కనీసం అత్యధిక సీట్లు కూడా గెలవలేదు. కమల్‌నాథ్‌కు అభినందనలు. ప్రచారంలో హామీ ఇచ్చినట్లు రైతు రుణమాఫీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోపు అమలు చేయాలి’ అని చౌహాన్ విలేకరులతో అన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలోని 10 మందికి పైగా ప్రముఖులు ఈ ఎన్నికల్లో ఓటమిపాలవడం గమనార్హం. రాహుల్‌కు సీఎం ఎంపిక బాధ్యత 15 ఏళ్ల అనంతరం మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుండటంతో ఆ రాష్ట్రానికి సీఎంను ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకులు ఏకే ఆంటోనీ, భన్వర్ జితేంద్ర సింగ్‌ల పర్యవేక్షణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం భోపాల్‌లో జరిగింది. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను రాహుల్ గాంధీకే అప్పగిస్తున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తోపాటు కాంగ్రెస్ ఎంపీ, రాహుల్‌గాంధీకి సన్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియాలు మధ్యప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి రేసులో ఉండటం తెలిసిందే. రుణమాఫీ హామీతోనే గెలుపు! మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రుణమాఫీ హామీనే ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పదిరోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని రాహుల్ ఎన్నికల ప్రచారంలో హమీనిచ్చారు. దీంతో రైతులంతా గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ అధ్యక్షుడు శివ కుమార్ శర్మ అభిప్రాయపడ్డారు. రుణమాఫీ అవుతుంద న్న ఉద్దేశంతో రైతులు ప్రస్తుతం తమ వద్ద ఉన్న వరి పంట దిగుబడులను కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారు. ఈ వడ్లను అమ్మితే ఆ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోకి వెళ్తుంది. బ్యాంకులు రుణం కంతును వారి ఖాతాల్లోంచి తీసుకుంటాయి. ఈ కారణంతో రైతులు తమ దిగుబడిని కూడా అమ్మకుండా అలాగే పెట్టుకున్నారని శర్మ చెప్పారు. రుణమాఫీ సాధ్యం కాని హామీ అని శివరాజ్ సింగ్ గతంలో అన్నారు. -
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ భవితవ్యం ఏమిటి?
15 ఏళ్ల అధికార బీజేపీ జైత్రయాత్రను అడ్డుకోగలదా? కీలకమైన మధ్య ప్రాంతాల్లో పట్టు సాధించగలదా? నవంబర్ 28న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీపై తలెత్తుతున్న అనుమానాలివి. కూటమి కుదర్లేదు మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీపై పోరుకు విపక్ష కూటమిని కూడగట్టాలన్న కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. అదే కూటమిని రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావించింది. కానీ విపక్ష కూటమి ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. కూటమిలో ప్రధాన పక్షాలుగా భావించిన పార్టీలన్నీ ఒంటరి పోరుకే మొగ్గు చూపాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లు వేర్వేరుగానే రంగంలోకి దిగాయి. సొంతంగా 200 సీట్లకు పోటీచేస్తున్నట్టు ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదంపై కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. మధ్యప్రాంతాలే కీలకం అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలోని మాల్వా, మధ్య ప్రాంతాల్లోని (సెంట్రల్ రీజియన్) 86 సీట్లు అత్యంత కీలకం. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిచింది 10 సీట్లలో మాత్రమే. అప్పటివరకు కాంగ్రెస్‌కు ఆ ప్రాంతాల్లో కనీసం 30 సీట్లలో గెలవగలిగే బలముండేది. 2013 ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో బీజేపీ 50% పైగా ఓట్లతో 74 సీట్లలో విజయ భేరీ మోగించింది. బీజేపీ గెలిచిన వాటిలో మాల్వా ప్రాంతంలో 45, సెంట్రల్ రీజియన్‌లో 29 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ మాల్వాలో 4, సెంట్రల్ రీజియన్‌లో 6 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. సెంట్రల్ రీజియన్‌లోని బుధ్ని నుంచే సీఎం శివరాజ్‌చౌహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండోర్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేతలు సుమిత్ర మహాజన్, కైలాష్ విజయ్‌లకు మాల్వా ప్రాంతంపై మంచి పట్టుంది. కీలకమైన ఈ రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రదర్శన పూర్తిస్థాయిలో మెరుగైతేనే అధికార సాధన సులువవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. హిందూ మంత్రం గట్టెక్కించేనా? బీఎస్పీతో కోరుకున్న పొత్తు కుదరకపోవడంతో అగ్రవర్ణాలు ముఖ్యంగా బ్రాహ్మణుల ఓట్లను తిరిగి సాధించడం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు స్పష్టమవుతోంది. పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలనన్నింటినీ సందర్శిస్తూ హిందువుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ను శివభక్తుడిగా చూపుతూ, శివలింగానికి రాహుల్ అభిషేకం చేస్తున్న ఫొటోలతో స్వాగత తోరణాలు, బ్యానర్లు వెలిశాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన దారిలో ఉన్న చిత్రకూట్‌లోని కామ్టానాథ్ దేవాలయంలో పూజలతో రాహుల్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఆంటోనీ కమిటీ ఏం చెప్పింది ? మైనారిటీ పక్షపాత రాజకీయాల కారణంగా మెజారిటీ హిందువులకు దూరం అవుతున్నామన్న భావన కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో మూడోసారి ఓటమితో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసినప్పటి నుంచి ఈ విషయంలో అంతర్మథనం మొదలైంది. దీనిపై సీనియర్ నేత ఏకే ఆంటోనీ నేతృత్వంలో పార్టీ ఒక కమిటీని వేసింది. ముస్లిం అనుకూల వైఖరి కారణంగానే వరస ఓటముల బారిన పడుతున్నట్లు ఆ కమిటీ తేల్చింది. కాంగ్రెస్‌ను ముస్లిం అనుకూల పార్టీగా భావించి మెజారిటీ హిందువుల్లోని కొన్ని వర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని పేర్కొంది. సెక్యులరిజానికి కొత్త నిర్వచనం ఇస్తూ మెజారిటీ హిందువుల మన్నన పొందేందుకు ప్రయత్నించాల్సిందిగా ఈ కమిటీ సూచించింది. ప్రభావం చూపే అంశాలు.. ♦ రైతాంగ సమస్యలు ఈ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించాలని, రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2017 జూన్‌లో మందసోర్లో ప్రారంభమైన ఉద్యమం తీవ్రరూపం దాల్చి.. పోలీసు కాల్పులకు దారి తీసింది. ఆ కాల్పుల్లో ఆరుగురు రైతులు చనిపోయారు. ♦ సపాక్ అనే సంస్థను స్థాపించి జనరల్, ఓబీసీ, మైనారిటీ ఉద్యోగులు ఏకతాటిపైకి వస్తున్నారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ♦ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్టీలు 20.3%, ఎస్సీలు 15.2% ఉన్నారు. ఈ వర్గాల ఓట్లు మెజారిటీ స్థానాలను ప్రభావితం చేయనున్నాయి. ♦ నిరుద్యోగంతో 11.2 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల్లో నమోదు చేసుకుంటే 2017లో 422 మందికే ఉద్యోగాలొచ్చాయి. గత 3 ఎన్నికల్లో ఇలా..! 2003లో బీజేపీ – 173 (42.5%) కాంగ్రెస్ – 38 (38.87% (ఈ ఎన్నికల్లో ఉమాభారతి సారధ్యంలో బీజేపీ పదేళ్ల దిగ్విజయ్ పాలనకు చరమగీతం పాడింది) 2008లో బీజేపీ – 143 (37.64%) కాంగ్రెస్ – 71 (32.39%) 2013లో బీజేపీ – 165 (44.88%) కాంగ్రెస్ – 58 (42.67%) (2008, 2013 ఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీని విజయతీరాలకు చేర్చారు) -
పోలీసుల వేధింపులు.. మహిళా ఎమ్మెల్యే కంటతడి
భోపాల్ : పోలీసులు వేధిస్తున్నారంటూ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో తన గోడును విన్నవించుకుంటూ స్పీకర్ ముందు బోరుమన్నారు. వివరాల్లోకి వెళితే.. రివా జిల్లాకు చెందిన నీలిమా అభయ్ మిశ్రా అనే బీజేపీ మహిళా నేత సిమరియా నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత కొంత కాలంగా సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత ప్రోద్భలంతో తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నరని స్పీకర్ ఎదుట వాపోయారు. స్పందించిన స్పీకర్ హోమంత్రిని వివరణ కోరారు. హోంమంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీతో చర్చించి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు. కాగా ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మండిపడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకే అలా అయితే ఇక సామాన్యుల పరిస్థితి ఎంటని ప్రశ్నించింది. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణలేదంటూ అసెంబ్లీలో నినాదాలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేకే ఇలా జరగడం పట్ల బీజేపీ సిగ్గుపడాలని విమర్శించింది. ఒక మహిళా ఎమ్మెల్యేకు ఇలా జరగడం సిగ్గుచేటని కాంగ్రెస్ పేర్కొంది. కాగా హోంమంత్రి భూపేంద్రసింగ్ మిశ్రా కూర్చునే సీటు వద్దకు వెళ్లి మాట్లాడారు. బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా మిశ్రా వద్దకు వెళ్లి ఓదార్చారు. -
దళితులు నా ఇంట్లో భోజనం చేస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఇళ్లకు వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన తాము పవిత్రులం కాబోమని, అదే దళితులను తన ఇంటికి ఆహ్వానించి.. వారికి తన స్వహాస్తాలతో భోజనం వడ్డించినప్పుడే.. పవిత్ర భావం కలుగుతుందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు. మధ్యప్రదేశ్ నౌగావ్‌లోని గాధ్మౌవ్ గ్రామంలో ఆమె సామాజిక సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, దళితుల ఇంటికి వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన దళితులకు గౌరవం లభించడంగానీ, సామాజిక సామరస్యం ఏర్పడటంగానీ జరగదని ఆమె అన్నారు. ‘ నేను వెళ్లి దళితుల ఇళ్లలో భోజనం చేసినంతమాత్రాన వారు పవిత్రులు అవ్వడానికి నేనేమీ రాముడ్ని కాదు. అందుకు బదులు నేనే దళితులను నా ఇంటికి పిలిచి.. వారికి స్వయంగా భోజనం వడ్డించినప్పుడు.. అది నన్ను పవిత్రురాలిని చేస్తుంది’ అని ఆమె అన్నారు. ‘నన్ను నేను శ్రీరాముడినని భావించుకోను. అందుకే సామాజిక సామూహిక భోజనాల్లో నేను పాల్గొనను’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ.. ఆమె దళితులతో కలిసి భోజనం చేయలేదు. వేరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో త్వరగా వెళ్లాల్సి వచ్చిందని, అందుకే భోజనంలో పాలుపంచుకోలేదని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు. ‘దళితులను అంటరానివారిగా చూసే రోజులు.. వారితో కలిసి భోజనం చేస్తే.. వారు ఆనందపడి.. స్వాధికారిత వస్తుందనుకునే రోజులు పోయాయి. దళితులు ఇప్పుడు ఆర్థిక, సామాజిక సావలంబన కోరుకుంటున్నారు. ప్రభుత్వ, పరిపాలనలో భాగం కోసం తపిస్తున్నారు’ అని ఆమె తెలిపారు. -
భారత్ బంద్
-
భారత్ బంద్‌లో కాల్పుల కలకలం
-
భారత్ బంద్: బాల్కనీలో నిల్చుంటే.. బుల్లెట్ తగిలి!
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నీరుగార్చవద్దంటూ దళిత సంఘాలు చేపట్టిన భారత్ బంద్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ బంద్ హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ‘భారత్ బంద్’ ఆందోళనలో హింస చోటుచేసుకుంది. పోలీసులతో నిరసనకారులు ఘర్షణ పడటం, పోలీసులు గాలిలోకి కాల్పులు జరపడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 450 కిలోమీటర్ల దూరంలోని మోరెనా ప్రాంతంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు ఇక్కడ రైల్వేట్రాక్‌లను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు నిరసనకారులను నియంత్రించేందుకు ఒక దశలో గాలిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. నిరసనకారులు, పోలీసులు ఘర్షణ పడుతున్న సమయంలో సమీపంలో ఉన్న భవనం బాల్కనీలోంచి రాహుల్ పాఠక్ అనే వ్యక్తి ఈ గొడవను చూస్తున్నాడు. ఈ క్రమంలో పోలీసులు గాలిలో కాల్పులు జరపడంతో.. ఓ బుల్లెట్ దూసుకొచ్చి ఆయనకు తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడని సమాచారం. ఇటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హరియాణా, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్రలో భారత్ బంద్ తీవ్ర ఉద్రికతలకు దారితీసింది. పెద్ద ఎత్తున నిరసనకారులు రోడ్లపైకి వచ్చి బలవంతంగా షాపులు మూయించారు. ఆస్తుల విధ్వంసానికి దిగారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులకు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ జరపడంతో పలువురు గాయపడ్డారు. -
పెళ్లిలో వరుడికి గడ్డం తెచ్చిన తంట..
సాక్షి, భోపాల్(ఖండ్వా) : ఒకప్పుడు పెళ్లిళ్లు కట్నకానుకల విషయంలో తగాదాలు వచ్చి ఆగిపోతుండేవి. ఇప్పుడు వాటికి భిన్నంగా అనవసర విషయాల కారణంగానే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పెళ్లి కొడుకు స్నేక్ డ్యాన్స్ చేస్తున్నాడన్న కారణంగా ఒకరు, వరుడు బ్యూటీ పార్లర్‌కి వెళ్లి పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చారని మరోకరు.. ఇలా చాలా రకాలుగా వధువులు పెళ్లిళ్లు ఆపాలని చూస్తున్నారు. అయితే తాజాగా వీటన్నింటికి భిన్నమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఒకటి చోటుచేసుకుంది. ఏకంగా వరుడికి గడ్డం ఉందని అది గీయించుకుంటేనే పెళ్లి చేసుకుంటానని పెళ్లి మండపంలో వధువు మొండికేసి కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోగల అయ్గటీ గ్రామంలో రూపాలీ, మంగల్సింగ్ల వివాహానికి పెద్దలు ఏర్పాటు చేశారు. అయితే పెళ్లి మండపం వద్దకు వరుడు బంధువులతో ఊరేగింపుగా వచ్చాడు. ఆ సమయంలో వరుడిని గమనించిన వధువు.. అతని గడ్డం ఉందని అది తీసేసి వస్తేనే పెళ్లి చేసుకుంటానని మొండికేసి కూర్చుంది. దీంతో వధువు తరుపు బంధువులు వరుడికి గడ్డం గీయించుకొని రమ్మని చెప్పారు. ఇందుకు వరుడు నిరాకరించాడు. వరుడు గడ్డం గీసుకుని రావాలని చెప్పడం వరుడి బంధువులకూ నచ్చలేదు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో పెళ్లికి వచ్చిన వారు పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. పోలీసులు మండపానికి చేరుకుని నచ్చజెప్పడంతో వరుడు షేవింగ్ చేసుకునేందుకు అంగీకరించాడు. అప్పటికే ముహుర్త సమయం దాటిపోయింది. దీంతో మరుసటి రోజు ఉదయన్నే మరో ముహూర్తానికి వివాహం జరిపించారు. -
కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారని..
జబల్పూర్ : కళ్ల ముందే తల్లిదండ్రుల్ని కొట్టారన్న బాధతో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పూర్లో ఏడోతరగతి చదువుతున్న బాలికను గత కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. శనివారం ఆ యువకుడు బాలిక చేతిలో బలవంతంగా ఫోన్ పెట్టి.. తనకు కాల్ చేయాలని వేధించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు బాలిక తల్లిదండ్రులు అతడి ఇంటికి వెళ్లారు. తమ కూతురిని వేధిస్తున్న సంగతి వారు యువకుడి తల్లిదండ్రులు చెప్పినప్పటికీ.. ఈ విషయాన్ని నమ్మకపోగా బాలిక కళ్లముందే ఆమె కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ హఠాత్ పరిణామాన్ని జీర్ణించుకోలేని బాలిక ఆవేదనకు గురై ఇంటికి వెళ్లిన అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు చెప్పడంతో వారు గుండెలు బాదుకున్నారు. యువకుడిపై, అతడి తల్లిదండ్రులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసినట్టు ఏఎస్పీ అల్పానారాయణ్ మిశ్రా తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుడైన యువకుడి వయస్సు 17 ఏళ్లు అని, అతడు మైనర్ తల్లిదండ్రులు చెప్తుండగా... ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో పామును కొరుక్కు తిన్నాడు..
మధ్యప్రదేశ్ : సాధారణంగా పాములంటే చాలు కిలోమీటర్ దూరం పరిగెత్తుతాం. కానీ మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తనను కాటేయడానికి వచ్చిన పామునే తిన్నాడు. ఈ ఘటన శనివారం మధ్యప్రదేశ్‌లోని మొరానాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సబల్‌పూర్ తెహిల్‌సిల్‌లోని పషేర్ గ్రామంలో చోటుచేసుకుంది. జలిమ్ సింగ్ కుష్వాహ(34) అనే వ్యక్తి పొలంలో పనిచేసుకుంటుండగా ఓ నల్లని పాము కనిపించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆయన పామును పట్టుకొని నమిలి తినాలనుకున్నాడు. దీంతో ఆ పాము కాసేపటికి చనిపోయింది. అనంతరం స్పృహ కోల్పొయిన కుష్వాహను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషపూరితమైన పామును కొరకడంతో కుష్వాహ స్పృహకోల్పోయాడని డాక్టర్ రాఘవేంద్ర యాదవ్ తెలిపారు. సరైన సమయంలో చికిత్సకు తీసుకొచ్చారని లేకపోతే విషం రక్త ప్రవాహంలోకి చేరి ప్రాణానికే ప్రమాదం ఉండేదని చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. -
తుపాకీని రూ.లక్షకు విక్రయించాం
టీ.నగర్: మధ్యప్రదేశ్‌లో రూ.30వేలకు తుపాకీ కొనుగోలు చేసి తమిళనాడులో రూ.లక్షకు విక్రయించినట్లు తుపాకీల విక్రయం కేసులో నింది తులు మంగళవారం పోలీసులకు వెల్లడించారు. అస్సాం, గువాహటి నుంచి చెన్నై సెంట్రల్‌కు వచ్చిన రైల్లో తుపాకులు, నకిలీ కరెన్సీ, మత్తు పదార్థాలు తరలిస్తున్న చెన్నై పెరంబూరుకు చెందిన కమల్ (26), తిరుమంగళంకు చెందిన ప్రదీప్ (28)లను గత 26వ తేదీ చెన్నై పోలీసులు అరెస్టు చేశారు.వీరిచ్చిన సమాచారం మేరకు తంజావూరు పోలీసులు గత 27న తిరుచ్చి లాడ్జిలో తుపాకులతో బస చేసిన చెన్నై నమ్మాళ్వారుపేటకు చెందిన కానిస్టేబుల్ పరమేశ్వరన్ (34), అతని సహాయకుడు నాగరాజ్ (30) తంజావూరు జిల్లా తిరుసిట్రంబళం ప్రాంతానికి చెందిన శివ (32) ను అరెస్టు చేసి వారినుంచి రెండు తుపాకులు, 10బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిని తిరుచ్చి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. తిరుచ్చిలో గల పారిశ్రామికవేత్తకు తుపాకీ విక్రయిస్తుండగా పరమేశ్వరన్తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అలాగే ఈ కేసులో మరియ ప్రకాష్, దివ్యశేఖర్ ఎట్టయప్పన్‌లను అరెస్ట్ చేసి ఈ నెల 3వ తేదీ కోర్టులో హాజరుపరిచి జైల్లో నిర్బంధించారు. ఇలా ఉండగా ఈ కేసు సీబీసీఐడీ పోలీసులకు బదిలీచేస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు ఇచ్చా రు. ఈ కేసుౖలో జైల్లో ఉన్న నిందితులు మంగళవారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో మధ్యప్రదేశ్‌లో రూ.30వేలకు తుపాకీ కొనుగోలు చేసి రాష్ట్రానికి తీసుకువచ్చి రూ.లక్షకు విక్రయించినట్లు తెలిపారు. -
నాయకుడు లేకుండానే రాజస్థాన్, ఎంపీల్లో పోటీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య సమష్టి నాయకత్వం అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ఏడాది చివరలో అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీకి క్లిష్టంగా మారింది. దాంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ప్రకటించకుండా ఆయా రాష్ట్రాల్లో పార్టీ విజయాన్ని సమష్టి నాయకత్వానికి అప్పగించాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సమష్టి నాయకత్వం వ్యూహాన్ని అప్పుడే అమలు చేస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న భూపేష్ బాఘెల్, ప్రతిపక్ష పార్టీ నాయకుడు టీఎస్ సింగ్ దేవ్లను అలాగే కొనసాగిస్తూ రామ్ దయాళ్ యూహైక్, శివకుమార్ దయారియాలను అదనపు వర్కింగ్ పార్టీ అధ్యక్షులుగా రాహుల్ గాంధీ నియమించారు. ఇక జార్ఖండ్ విషయంలో ఐదుగురు కో ఆర్డినేటర్లను నియమించారు. ఇక పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించక ముందు నుంచే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీలో నాయకత్వం కోసం పోటీ పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందుగా అంతర్గత నాయకత్వ సమస్యను అత్యవసరంగా కాంగ్రెస్ పార్టీ పరిష్కరించుకోవాల్సి ఉంది. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ నామినీ రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాజేష్ పైలట్, మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నాయకుడు అశోక్ గెహ్లాట్‌లు సీఎం అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్నారు. ఇక మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య, కమల్‌నాథ్‌లు ఉన్నత పదవి కోసం పోటీ పడుతున్నారు. రాస్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్షం నాయకుడు అజయ్ సింగ్, మాజీ పీసీసీ చీఫ్ సురేశ్ పచౌరీలు కూడా రేస్‌లో ఉన్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న అరుణ్ యాదవ్‌ను తొలగించి ఆయన స్థానంలో డైనమిక్‌గా ఉండే నాయకుడిని నియమించాలని పార్టీ అధిష్టానంపై ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిని నియమించినా పార్టీలో అసమ్మతి రాజకీయాలు రాజుకుంటాయి. అందుకని సమష్టి నాయకత్వానికే బాధ్యతలు అప్పగించి, ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకోవడమే సముచితమని రాహుల్ భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. -
విరాట్ దేశభక్తిపై విమర్శలు.. బీజేపీ ఎమ్మెల్యేకు ఘాటు వార్నింగ్!
గునా (మధ్యప్రదేశ్) : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతుల దేశభక్తిని ప్రశ్నిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కోహ్లి దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం శాక్యాకు లేదని తేల్చిచెప్పింది. ఇప్పటికైనా సదరు ఎమ్మెల్యే తీరు మార్చుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చింది. ' విరాట్ కోహ్లి-అనుష్క శర్మ దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరం ఆ ఎమ్మెల్యేకు లేదు. నచ్చినచోట పెళ్లిచేసుకొనే అవకాశం వారికి ఉంది. బీజేపీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ఆ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఆయన తీరు మార్చుకోవాలి' అని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఎస్ ప్రకాశ్ తెలిపారు. బీజేపీ ప్రతిష్ట దెబ్బతినే వ్యాఖ్యలు ఇకముందు చేయొద్దని పన్నాలాల్‌ను ఆయన హెచ్చరించారు. కోహ్లి, అనుష్క ఇటలీలో పెళ్లి చేసుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఇండియాలో విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, డబ్బులు సంపాదించి.. వాటిని ఇటలీలో ఖర్చుపెట్టిన విరాట్-అనుష్కలకు అసలు దేశభక్తి ఉందా? ఈ దేశంలోనే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు, ధర్మరాజు లాంటి పురాణ పురుషులు పెండ్లిళ్లు చేసుకున్నారు. మనందరం కూడా ఇక్కడే పెండ్లిళ్లు చేసుకున్నాం.. ఇకపైనా చేసుకుంటాం. మనలో ఎవరైనా విదేశాలకు వెళ్లి పెండ్లిళ్లు చేసుకున్నామా? మరి కోహ్లి మాత్రం ఆ పని ఎందుకు చేసినట్లు? ఇక్కడ (ఇండియాలో) సంపాదించిన డబ్బును విదేశాల్లో ఖర్చుచేయడమేంటి?’ అని పన్నాలాల్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో ఆయన తీరుపై బీజేపీ ఘాటుగా స్పందించింది. విరాట్-అనుష్కల పెండ్లి డిసెంబర్ 11న ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో.. 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్న విరుష్కలు.. సన్నిహితుల కోసం డిసెంబర్ 21న ఢిల్లీలో, 26న ముంబైలో రిసెప్షన్ ఇవ్వనున్నారు. -
కేంద్రమాజీ మంత్రికి తుపాకీతో గురిపెట్టాడు!
ఛిన్ద్వారా: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్‌కు ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్‌ను గురిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన అంగరక్షకులు కానిస్టేబుల్ అడ్డుకొని పక్కకు తోసేశారు. కమల్‌నాథ్ ఢిల్లీకి చార్టెడ్ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్ పవార్ అనే కానిస్టేబుల్ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్ విమానం ఎక్కుతుండగా.. పవార్ తన సర్వీస్ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టి.. అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అంగరక్షకులు కానిస్టేబుల్‌ను అడ్డుకొని.. పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో కానిస్టేబుల్ పవార్‌ను సస్పెండ్‌చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్ సోనీ వెల్లడించారు. కమల్‌నాథ్ ఛిన్ద్వారా లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈ ఘటన కమల్‌నాథ్ దృష్టికి రాలేదు. ఆయన యథావిధిగా ఢిల్లీకి బయలుదేరారు. -
‘పద్మావతి’ సినిమాకు కేంద్రమంత్రి సింపుల్ పరిష్కారం!
సాక్షి, న్యూఢిల్లీ: ‘పద్మావతి’ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్ వర్గీయులు తీవ్రస్థాయిలో ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వివాదంపై కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ స్పందించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలని, సినిమాలో ఏదైనా అభ్యంతరకరమైనది ఉంటే దానిని తొలగించాలని డిమాండ్ చేయాలని సూచించారు. ’కొన్ని చారిత్రక వాస్తవాలు మన ప్రస్తుత ఆలోచనలకు అనుగుణంగా ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లు మొదట సినిమాను చూడాలి. సినిమాలో ఏమైనా అభ్యంతరకరమైనవి ఉంటే వాటిని తొలగించాలని డిమాండ్ చేయాలి’ అని ఆయన పీటీఐతో పేర్కొన్నారు. మరో కేంద్రమంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. సినిమాలు సర్టిఫై చేయాల్సిన బాధ్యత సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ)దని, మొదట సెన్సార్ బోర్డు తన పనిని పూర్తిచేయనివ్వాలని సూచించారు. కాగా, ఇప్పటికే పద్మావతి సినిమాను నిషేధించిన మధ్యప్రదేశ్ సర్కారు.. తాజాగా రాణి పద్మావతి స్మారక కట్టడాన్ని నిర్మించాలని నిర్ణయించింది. -
తినే ప్లేట్లతో టాయిలెట్ క్లీన్ చేయించారు..?
సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో దారుణం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో గత గురువారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు పాఠశాల ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శర్మ విచారణకు ఆదేశించారు. ఓ విద్యార్థి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. టాయిలెట్‌లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని తన కూతురు పాఠశాల నుంచి ఇంటికి రాగానే తెలిపిందని అప్పటికే పాఠశాల మూసేశారని, దీంతోనే ఉపాధ్యాయులను నిలదీసేందుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛతపై అవగాహన కోసమే.. అయితే ఈ ఆరోపణలను పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ రాకేశ్ తెలిపారు. పాఠశాల్లో ఒకటే టాయిలెట్ ఉందని అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని ఆయన ప్రశ్నించారు. -
దారుణం.. కన్నతల్లినే కాటేశాడు!
మోరెనా(మధ్యప్రదేశ్): సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అంటారు. కానీ మద్యం మత్తులో నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే రక్తం పంచుకు పుట్టిన కొడుకు కాటేశాడు. మానవత్వానికే మాయని మచ్చ ఈ సంఘటన. తల్లిపై అత్యాచారానికి పాల్పటడంతోపాటు అడ్డుకున్న పాపానికి ఆమెను దారుణంగా చంపాడు. మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లా కైలారస్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన ఓ యువకుడు(24) మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 5న రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. అర్థరాత్రి సమయంలో నిద్రిస్తున్న తల్లి(50)పై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించటంతో గాయపరిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె తలపై బండరాయితో మోది చంపాడు. అక్కడే రాత్రంతా నిద్రించాడు. మరునాడు ఉదయం చుట్టుపక్కల వారు గమనించటంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అప్పటికే అతడు ఇల్లు వదలి పారిపోయాడు. అప్పటి నుంచి మద్యం మత్తులో వింతగా ప్రవర్తిస్తున్నాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దారుణాన్ని ఒప్పుకున్నాడు. హత్యకు ఉపయోగించిన బండరాయితోపాటు మృతురాలి దుస్తులను సేకరించి ఆధారాలను పరిశీలించగా నేరం నిర్ధారణ అయింది. ఈ మేరకు సదరు యువకుడిని రిమాండ్‌కు తరలించారు. -
'బ్లూవేల్' అలర్ట్: విద్యార్థులను దూరంగా ఉంచండి!
భోపాల్: ప్రమాదకర ఆన్లైన్ గేమ్ 'బ్లూవేల్ ఛాలెంజ్'కు విద్యార్థులను దూరంగా ఉంచాలని, దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సూచనలు అందాయి. ఈ గేమ్ ఆడుతూ పలువురు టీనేజ్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాజ్య శిక్షా కేంద్రం(ఆర్ఎస్కే) ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు ఈ మేరకు సోమవారం ప్రధానోపాధ్యాయులకు లేఖలు పంపింది. రేడియేషన్ కారణంగాను, ఇతర అనర్థాలు జరుగుతున్న దృష్ట్యా విద్యార్థులు పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు వాడటాన్ని ఈ సంస్థ నిషేధించింది. బ్లూవేల్ చాలెంజ్ ను నేర ప్రవృత్తిగల వ్యక్తులు రూపొందించారని, ఇది ఆడడం అలవాటు ఉన్నవారు అందులోంచి బయటపడడం కష్టమని, ఈ గేమ్ బారిన పడి కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని ఆర్ఎస్కే తెలిపింది. విద్యార్థులు ఫోన్లు వాడకుండా చూడడం, వారి ఫోన్లలో బ్లూవేల్ గేమ్ లాంటివి ఏమైనా ఉంటే.. వెంటనే వాటిని తొలగించడం ఉపాధ్యాయుల బాధ్యత అని సూచించింది. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమైనప్పుడు తమ పిల్లలపై నిఘా ఉంచి 'బ్లూవేల్ గేమ్'కు దూరంగా ఉంచాలని సూచించాలని నిర్దేశించింది. -
వారిని తలకిందులుగా వేలాడదీస్తా: సీఎం వార్నింగ్
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహన్ తాజాగా కలెక్టర్లకు ఘాటు వార్నింగ్ ఇచ్చారు. రెవెన్యూ కేసులను నెలలోపే విచారించాలని, నెల గడిచినా ఏదైనా రెవెన్యూ కేసు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిస్తే.. ఆ కేసుకు సంబంధించిన రెవెన్యూ అధికారులను తలకిందులుగా వేలాడదీస్తానని హెచ్చరించారు. భోపాల్‌లో శనివారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెవెన్యూ ఫిర్యాదుల అంశాన్ని బీజేపీ నేతలు లేవనెత్తారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సీఎంను కోరారు. దీంతో ఈ సమావేశంలో సీఎం చౌహాన్ ఈమేరకు అధికారులకు తీవ్రమైన హెచ్చరిక చేసినట్టు తెలిసింది. నవంబర్ నెలలో సీఎం చౌహాన్ తాను అధికారంలోకి వచ్చి 12 ఏళ్ల పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. అప్పటిలోగా రెవెన్యూ కేసులను నిర్దిష్ట గడువుతో పరిష్కరించకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. అయితే, మరోవైపు కలెక్టర్లపై ముఖ్యమంత్రి అభ్యంతరకరమైన భాష ఉపయోగించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. -
కన్న కూతుళ్లే కాడెద్దులుగా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ తండ్రి కన్న కూతుళ్లనే కాడెద్దులుగా మార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే సెహోర్ తాలూకా బసంత్‌పూర్ గ్రామానికి చెందిన సర్దార్ కహ్ల కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతోంది. వారిది రెక్కాడితే కాని డొక్కారి పరిస్థితి. సర్దార్ కహ్ల తన పొలం దున్నటానికి ఎద్దులు లేవు. వాటిని కొని పోషించే స్తోమత అంతకన్నా లేదు. దీంతో తన ఇద్దురు కూతుళ్లని బడి మానిపించి వారినే పొలం దున్నటానికి ఉపయోగించుకుంటున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కూతుళ్లు రాధిక, కుంతిల చదువుకు అంతరాయం కలిగించానని కహ్ల చెప్పాడు. దీని గురించి డీఆర్డీఓ ఆశిశ్ శర్మ స్పందించి రైతు దుస్థితి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. మీ కూతుళ్లని అలా ఎద్దుల స్థానంలో ఉపయోగించల్సింది కాదని రైతుతో అన్నారు. -
దీక్ష కొనసాగింపుపై నేడు సీఎం నిర్ణయం!
రెండోరోజూ కొనసాగిన చౌహాన్ దీక్ష మధ్యప్రదేశ్‌లో శాంతిస్థాపనే లక్ష్యంగా సీఎం శివరాజ్‌సింగ్ చౌహార్ రెండోరోజూ ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. భోపాల్‌లోని దసరా మైదానంలో ఆయన దీక్ష కొనసాగుతోంది. మంత్రివర్గమంతా ఆయన వెంటే ఉంది. దీక్షాస్థలి వద్దే ఉన్నతాధికారులతో సీఎం చౌహాన్ సమావేశమై.. పరిపాలనను పర్యవేక్షించారు. వందలాది మంది రైతులు దీక్షాస్థలికి తరలివచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం ప్రకటించారు. సీఎం నిరాహార దీక్ష చేపట్టాల్సిన అవసరం లేదని.. తమ గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తే చాలని అన్నదాతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. నిరాహార దీక్ష కొనసాగింపుపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటన తర్వాత మధ్యప్రదేశ్ వ్యాప్తంగా చెలరేగిన హింస నేపథ్యంలో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ నిరాహార దీక్షకు దిగారు. -
ట్రక్కు-హార్వెస్టర్ ఢీ: నలుగురి మృతి
బుర్హాన్పూర్: మధ్యప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హార్వెస్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నింబోల పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్సర్గర్ గ్రామ సమీపంలో ఇండోర్-ఇచ్చాపూర్ హైవేపై చోటు చేసుకుంది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరిని వారి డాక్యుమెంట్ల ఆధారంగా ఇండోర్‌కు చెందిన జగదీశ్ అహిర్వార్, విడిషాకు చెందిన ధీరజ్ బల్ముకుంద్లుగా గుర్తించామని, మరో ఇద్దరి గురించి ఎలాంటి వివరాలు తేలియలేదని బుర్హాన్పూర్ ఎస్పీ పరిహార్ మీడియాకు తెలియజేశారు -
ఉత్తర భారత్‌లో భారీ వర్షాలు
-
మధ్యప్రదేశ్‌లో చిరుతపులులు మృతి
-
పెళ్లికి పిలవలేదని స్నేహితుడిపై దాడి
-
మధ్యప్రదేశ్‌లో మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ వెళ్లారు. ఖాండ్వా జిల్లాలోని రెండు 600 మెగావాట్ల సింగాజి థర్మల్ విద్యుత్ ఫ్లాంట్లకు ఆయన గురువారం శంఖుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఇండోర్ విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మోదీకి సాదర స్వాగతం పలికారు. శివరాజ్‌ను కలిసిన వెంటనే మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం శివరాజ్ 56వ జన్మదినం జరుపుకుంటున్నారు.