సాక్షి, భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల్లో దారుణం చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులు తినడానికి ఉపయోగించే ప్లేట్లతో ఉపాధ్యాయులు టాయిలెట్స్ క్లీన్‌చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, దమోహ్ జిల్లాలోని దోలి గ్రామంలో గత గురువారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని విద్యార్థులు తల్లితండ్రులకు తెలియజేయడంతో వారు పాఠశాల ముందు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శర్మ విచారణకు ఆదేశించారు. ఓ విద్యార్థి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. టాయిలెట్‌లోని మలాన్ని తినే ప్లేట్లతో ఎత్తించారని తన కూతురు పాఠశాల నుంచి ఇంటికి రాగానే తెలిపిందని అప్పటికే పాఠశాల మూసేశారని, దీంతోనే ఉపాధ్యాయులను నిలదీసేందుకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
స్వచ్ఛతపై అవగాహన కోసమే..
అయితే ఈ ఆరోపణలను పాఠశాల ఉపాధ్యాయులు ఖండిస్తున్నారు. స్వచ్ఛత గురించి విద్యార్ధులకు అవగాహాన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించామని, దీనిలో ఉపాధ్యాయులు కూడా పాల్లొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీచర్ రాకేశ్ తెలిపారు. పాఠశాల్లో ఒకటే టాయిలెట్ ఉందని అలాంటప్పుడు విద్యార్థులతో ఎందుకు క్లీన్ చేయిస్తామని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment