భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఈ ఘటన చూసిన తరువాత సమాజం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 45 ఏళ్ల మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ అధిక రక్తస్రావం కావడంతో మరణించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్‌వర్ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి. అయితే ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోకపోవడంతో తన తల్లి ఇలా పిల్లల్ని కంటూ వచ్చిందని మృతురాలి కూతురు సవిత తెలిపింది. ‘నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను. కానీ అమ్మ వినలేదు. వారం రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో అధిక రక్తస్రావం కావడంతో మరణించింది’ అని సవిత తెలిపింది.
ఇక విషయంపై ఆ ప్రాంత మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఆమె 1997లో మొదటి సంతానానికి జన్మనిచ్చిందని తరువాత ఆమె కలలకు, జన్మనిచ్చిందని అలా ఇప్పటికి కొనసాగిస్తూనే ఉందని తెలిపారు. ఆమెకు చాలా సార్లు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆపరేషన్ చేయించుకోవాలని కోరామని తెలిపారు. కానీ ఆమె తన భర్త, అత్తమామలకు భయపడ చేయించుకోవాలని వివరించారు. ఇక తన 15వ కానుపు తరువాత చేయించుకోమని కోరగా ఆమె మోనోపోలి దశకు చేరుకోబోతున్నానని ఇక అవసరం లేదని సుఖ్రాని మొండిగా వ్యవహరించిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయంపై ఆమె భర్తను ప్రశ్నించగా ఈ వయసులో ఆమె పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకోవాలంటే భయపడిందని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన సమాజంలో ఇంకా మార్పు రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. చిన్నకుటుంబం మేలు అని ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నా కొంత మంది ఇప్పటికీ మూఢనమ్మకాలతో ముందుకు సాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment