Woman Pregnant
-
పెళ్లి కాకుండానే గర్భం.. టీచర్ మృతి.. చెత్తకుండీలో బిడ్డ!
సాక్షి, చెన్నై: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కుమార్తెకు కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆమె మృతిచెందడం, బిడ్డ చెత్త కుండీలోకి వెళ్లడం వెరసి ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ప్రియుడు, కుటుంబసభ్యుల్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్ కుమార్తె మంగయకరసి(29) ప్రైవేటు స్కూల్ టీచర్. 2019లో కోవిడ్ రూపంలో ఎదురైన లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు తీసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో వారి ఇంట్లో ఉన్న సమీప బంధువు యువకుడికి మంగయ కరసి దగ్గరైంది. ఇద్దరు చనువుగా ఉన్నా, కుటుంబీకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఇందుకు కారణం, ఆ యువకుడు మంగయకరసికి తమ్ముడి వరుస కావడమే. అయితే, వీరి చనువు హద్దులు దాటినట్టుంది. మంగయ కరసి గర్భం దాల్చడం, అబార్షన్ కూడా చేయలేని పరిస్థితి నెలకొనడంతో ఆ కుటుంబం తీవ్ర మనో వేదనలో పడింది. వరసకు తమ్ముడి రూపంలో ఆమె గర్భం దాల్చిన సమాచారం బయటకు పొక్కితే కుటుంబ పరువు పోతుందని జాగ్రత్త పడ్డారు. ఆమెను ఇంట్లోనే ఉంచారు. చదవండి: మహిళ మెడకు చున్నీ బిగించి.. 23 రోజుల తర్వాత! ఇంట్లోనే ప్రసవం.. కొద్ది రోజుల క్రితం పురుటినొప్పులు రావడంతో ఇంట్లోనే కుటుంబీకులు ప్రసవం చేశారు. మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే, తీవ్ర రక్తస్త్రావంతో మంగయకరసి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో, ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. దీంతో ఆ బిడ్డను తీసుకెళ్లి చెత్త కుండీలో పడేశారు. ఇంత వరకు ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడ్డా, మంగయ కరసి ఆస్పత్రిలో మృతిచెందడం, ఆగమేఘాలపై మృతదేహానికి అంత్యక్రియలు జరగడం ఇరుగుపొరుగు వారిలో అనుమానాల్ని రేకెత్తించాయి. వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో బండారం బయటపడింది. దీంతో ఇంట్లో ప్రసవం చేసిన విషయం తెలిసి ఆమె తల్లి తంగం, సోదరి గణేషప్రియ, తమ్ముడు కాళిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమె గర్భానికి కారుకుడైన ప్రియుడు అదిష్కుమార్ను కూడా అరెస్టు చేశారు. అయితే, చెత్తకుండీలో బిడ్డను పడేసిన సమయంలో ప్రాణాలతో ఉన్నట్టుగా కాళిదాసు పేర్కొనడంతో ఆ బిడ్డ జాడ కోసం పోలీసులు అన్వేషణ మొదలెట్టారు. ఎవరికైనా ఆ బిడ్డ దొరికిందా లేదా మరణించిందా అని ఆరా తీస్తున్నారు. చదవండి: యువకుల సాహసం.. వెంటనే చెరువులో దూకి.. -
16వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన మహళ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఈ ఘటన చూసిన తరువాత సమాజం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 45 ఏళ్ల మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ అధిక రక్తస్రావం కావడంతో మరణించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్వర్ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి. అయితే ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోకపోవడంతో తన తల్లి ఇలా పిల్లల్ని కంటూ వచ్చిందని మృతురాలి కూతురు సవిత తెలిపింది. ‘నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను. కానీ అమ్మ వినలేదు. వారం రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో అధిక రక్తస్రావం కావడంతో మరణించింది’ అని సవిత తెలిపింది. ఇక విషయంపై ఆ ప్రాంత మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఆమె 1997లో మొదటి సంతానానికి జన్మనిచ్చిందని తరువాత ఆమె కలలకు, జన్మనిచ్చిందని అలా ఇప్పటికి కొనసాగిస్తూనే ఉందని తెలిపారు. ఆమెకు చాలా సార్లు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆపరేషన్ చేయించుకోవాలని కోరామని తెలిపారు. కానీ ఆమె తన భర్త, అత్తమామలకు భయపడ చేయించుకోవాలని వివరించారు. ఇక తన 15వ కానుపు తరువాత చేయించుకోమని కోరగా ఆమె మోనోపోలి దశకు చేరుకోబోతున్నానని ఇక అవసరం లేదని సుఖ్రాని మొండిగా వ్యవహరించిందని స్థానిక మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ విషయంపై ఆమె భర్తను ప్రశ్నించగా ఈ వయసులో ఆమె పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకోవాలంటే భయపడిందని తెలిపారు. మొత్తానికి ఈ ఘటన సమాజంలో ఇంకా మార్పు రాలేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. చిన్నకుటుంబం మేలు అని ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నా కొంత మంది ఇప్పటికీ మూఢనమ్మకాలతో ముందుకు సాగుతున్నారు. చదవండి: బెజవాడ మహేష్ హత్య : చేధించిన పోలీసులు -
సూర్యాపేటలో ఓ గర్భిణి ప్రసవవేదన
-
చిట్టి ‘తల్లి’
⇒ పద్దెనిమిదేళ్లకు ముందే తల్లులు.. ⇒ కేంద్ర ఆరోగ్య శాఖ అధ్యయనంలో వెల్లడి సాక్షి, అమరావతి: డిగ్రీలు చేత పట్టుకోవాల్సిన అమ్మాయిలు ఒడిలో శిశువులను ఆడిస్తున్నారు.. వయసుకు ముందే పిల్లల్ని కని జోలపాట పాడుతున్నారు..! అవును.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉభయ రాష్ట్రాల్లో పద్దెనిమిదేళ్ల లోపే తల్లులవుతున్న వారి సంఖ్య ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. తాజాగా జాతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జీఎఫ్కే అనే ఓ ప్రైవేటు సంస్థతో చేయించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాల్లో.. చిన్న వయసులోనే తల్లులవుతున్న వారు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. రెండో స్థానంలో తెలంగాణ ఉన్నట్టు తేలింది. తెలంగాణలో ఇదీ పరిస్థితి.. తెలంగాణలో 7,567 మంది గర్భిణులను సర్వే చేయగా అందులో 10.6 శాతం మంది (757 మంది) 18 ఏళ్ల లోపు వయసున్నవారే అని తేలింది. ఇక ఏపీలో 10,428 మంది గర్భిణులను సర్వే చేయగా.. వారిలో 11.8 శాతం(1,230 మంది) 18 లోపు వయసున్న వారని స్పష్టమైంది. రాష్ట్రంలో గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్నిచోట్ల 11 శాతం మంది చిన్నారులు చిన్న వయసులోనే గర్భం దాలుస్తున్నట్టు నివేదికలో తేలింది. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్ (పాత జిల్లాలు) జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి ఎక్కువ కేసులున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో హై రిస్క్ ప్రెగ్నెన్సీ (ప్రసవం సమయంలో ప్రమాదకర పరిస్థితి) ఎక్కువగా ఉంటున్నట్టు తేల్చారు. మాతా శిశు మరణాల విషయంలోనూ ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మారుమూల ప్రాంతాల్లో బాల్య వివాహాలు, వయసుకు ముందే గర్భం దాల్చడంపై అవగాహన కల్పించడం లేదని సర్వేలో తేలింది. హైదరాబాద్‌లోనూ ఎక్కువే.. దక్షిణాది రాష్ట్రాల నగరాలతో పోలిస్తే.. బెంగుళూరు, చెన్నై కంటే హైదరాబాద్‌లో ‘ఎర్లీ ప్రెగ్నెన్సీస్’ (పద్దెనిమిదేళ్లకు ముందే గర్భం దాల్చడం) కేసులు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. హైదరాబాద్‌లో వంద మంది గర్భిణుల్లో ఐదుగురు చిన్న వయసులోనే గర్భం దాల్చినట్టు తేలింది. తెలంగాణ, ఏపీల్లో చిన్న వయసులోనే గర్భం దాల్చుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. చిన్న వయసులో తల్లులు కావడంతో నష్టాలివీ ► నెలలు నిండక ముందే ప్రసవం అయ్యే అవకాశం ఎక్కువ. దీంతో బిడ్డ బ్రతికే అవకాశాలు తక్కువ. ► గర్భిణికి అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువ హా నెలలు నిండినా సుఖ ప్రసవం అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సిజేరియన్ ద్వారా బిడ్డను తియ్యాల్సి ఉంటుంది. ► సిజేరియన్ వల్ల తల్లికి భవిష్యత్‌లో దుష్పరిణామాలు ఎదురవుతాయి. ► తల్లికి రక్తస్రావం అయ్యే అవకాశం హా బిడ్డ పోషణకు కావాల్సిన శక్తి తల్లికి లేకపోవడంతో హైపర్ టెన్షన్‌కు గురై, ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవగాహన లేకపోవడం వల్లే చిన్న వయసులో గర్భం దాలుస్తున్న ఘటనలు ఎక్కు వగా గ్రామాల్లో జరుగుతు న్నాయి. వారిలో అవగాహన ఉండడం లేదు. గర్భం దాల్చకుండా చాలా రకాల పద్ధతులున్నా వారికి తెలియడం లేదు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేయడం కూడా ఇందుకు కారణం అవుతోంది. టీనేజీలో గర్భం దాలిస్తే తల్లికి చాలా ప్రమాదాలున్నాయి. – డా.ఆండాల్రెడ్డి, గైనకాలజిస్ట్,కాంటినెంటల్ ఆసుపత్రి 20 ఏళ్లు దాటితేనే బిడ్డను మోసే శక్తి సాధారణంగా 20 ఏళ్ల తర్వాత మహిళ గర్భవతి అయితేనే బిడ్డను 9 నెలలు మోసే శక్తి వస్తుంది. అలాంటి శక్తి వచ్చినపుడే బిడ్డకు సరైన పోషకాహారం అందివ్వగలరు. లేదంటే నెలల తక్కువ బిడ్డలు పుడతారు. వారిని బతికించడం చాలా కష్టమవుతుంది. – డా.వంశీచంద్, చిన్న పిల్లల వైద్య నిపుణులు, రిమ్స్, కడప