
ఛిన్‌ద్వారా: కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్‌కు ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రైఫిల్‌ను గురిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన అంగరక్షకులు కానిస్టేబుల్ అడ్డుకొని పక్కకు తోసేశారు.
కమల్‌నాథ్ ఢిల్లీకి చార్టెడ్ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్ పవార్ అనే కానిస్టేబుల్ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్ విమానం ఎక్కుతుండగా.. పవార్ తన సర్వీస్ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టి.. అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అంగరక్షకులు కానిస్టేబుల్‌ను అడ్డుకొని.. పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో కానిస్టేబుల్ పవార్‌ను సస్పెండ్‌చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్ సోనీ వెల్లడించారు. కమల్‌నాథ్ ఛిన్‌ద్వారా లోక్‌సభ స్థానం నుంచి ఇప్పటివరకు 9 సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే, ఈ ఘటన కమల్‌నాథ్ దృష్టికి రాలేదు. ఆయన యథావిధిగా ఢిల్లీకి బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment