![Pm Modi Attends Madyapradesh Cm Oath Taking Ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/13/mp%20cm%20copy.jpg.webp?itok=ER6463-W)
photo courtesy:INDIAN EXPRESS
భోపాల్:మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా,బీజేపీ నేషనల్ చీఫ్ జేపీ నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్,కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితర ప్రముఖులు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు.
కాగా, ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవ్‌డా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎం,డిప్యూటీ సీఎంలతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌కు బీజేపీ ఈసారి మధ్యప్రదేశ్ సీఎంగా అవకాశం కల్పించింది. రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ ఈ మార్పు చేసిందన్న ప్రచారం జరుగుతోంది.
ఇదీచదవండి..కర్ణిసేన చీఫ్ హత్య: ‘డుంకీ’ టెక్నిక్‌తో సూత్రధారి పరార్
Comments
Please login to add a commentAdd a comment