చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. హర్యానాలో మూడోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది.
#WATCH | Nayab Singh Saini takes oath as Haryana CM for the second consecutive time, in Panchkula
Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union… pic.twitter.com/WK9ljGLwzd— ANI (@ANI) October 17, 2024
కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎం..
- బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన సైనీ
- 1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరిక
- మాజీ సీఎం ఖట్టర్ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ
- 2014లో నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక
- మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్‌లో హోంమంత్రిగా సేవలు
- 2019లో కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ఎన్నిక
- 2023 అక్టోబర్‌లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం
- 2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు
- 200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్ర
- పుట్టిన తేదీ: 1970 జనవరి 25
- సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామం
- బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో సుదీర్ఘ అనుబంధం
హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచకుల సెక్టార్ 5లోని దసరా మైదానానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi reaches Dussehra Ground in Sector 5, Panchkula, for the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini and the new Haryana government pic.twitter.com/pycGFJoZMY
— ANI (@ANI) October 17, 2024
#WATCH | Haryana CM-designate Nayab Singh Saini to shortly take oath as Haryana CM, in Panchkula pic.twitter.com/2mzAKm0iGf
— ANI (@ANI) October 17, 2024
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
#WATCH | Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Union Minister Nitin Gadkari, Maharashtra CM Eknath Shinde, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab… pic.twitter.com/evktPWkU7p
— ANI (@ANI) October 17, 2024
హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చండీగఢ్ చేరుకున్నారు.
#WATCH | Union Minister and BJP national president JP Nadda arrives in Chandigarh to attend the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini pic.twitter.com/zTkoc24GC7
— ANI (@ANI) October 17, 2024
పంచకులకు బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు చేరుకుంటున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు.
సైనీ రెండోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇక.. బుధవారం పంచకులలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీ.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
#WATCH | Panchkula: Haryana CM-designate Nayab Singh Saini says, "CMs, Deputy CMs and senior leaders of NDA will participate in the swearing-in ceremony today. After that, there will be a meeting of NDA leaders." pic.twitter.com/uSebe32S6s
— ANI (@ANI) October 17, 2024
ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది.
Haryana CM-designate Nayab Saini offers prayers at Valmiki Temple, says double engine government will take state forward at fast pace
Rea @ANI story | https://t.co/Uidj8lvTvK#Haryana #NayabSaini #BJP #NDA pic.twitter.com/nUlUyWdSCh— ANI Digital (@ani_digital) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment