Nayab Singh Saini
-
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
కాసేపట్లో హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం
-
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సైనీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. హర్యానాలో మూడోసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది.#WATCH | Nayab Singh Saini takes oath as Haryana CM for the second consecutive time, in PanchkulaPrime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Defence Minister Rajnath Singh, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union… pic.twitter.com/WK9ljGLwzd— ANI (@ANI) October 17, 2024 కంప్యూటర్ ఆపరేటర్ టు సీఎం..బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన సైనీ1996లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా చేరికమాజీ సీఎం ఖట్టర్ సాన్నిహిత్యంలో రాజకీయంగా ఎదిగిన సైనీ2014లో నారాయణ్ గఢ్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక మనోహర్ లాల్ ఖట్టర్ కేబినెట్లో హోంమంత్రిగా సేవలు 2019లో కురుక్షేత్ర నుంచి లోక్‌సభకు ఎన్నిక2023 అక్టోబర్‌లో హర్యానా బీజేపీ అధ్యక్షుడిగా నియామకం2024 మార్చిలో హర్యానా సీఎంగా బాధ్యతలు200 రోజుల్లో హర్యానా బీజేపీకి హ్యాట్రిక్ విజయంలో కీలక పాత్రపుట్టిన తేదీ: 1970 జనవరి 25సొంతూరు అంబాల జిల్లా మిర్జాపూర్ మజ్రా గ్రామంబీఏ, ఎల్ఎల్బీ, ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుబంధం హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు పంచకుల సెక్టార్ 5లోని దసరా మైదానానికి ప్రధాని నరేంద్ర మోదీ చేరుకున్నారు.#WATCH | Prime Minister Narendra Modi reaches Dussehra Ground in Sector 5, Panchkula, for the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini and the new Haryana government pic.twitter.com/pycGFJoZMY— ANI (@ANI) October 17, 2024 #WATCH | Haryana CM-designate Nayab Singh Saini to shortly take oath as Haryana CM, in Panchkula pic.twitter.com/2mzAKm0iGf— ANI (@ANI) October 17, 2024 హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.#WATCH | Union Home Minister Amit Shah, BJP national president JP Nadda, Union Minister Nitin Gadkari, Maharashtra CM Eknath Shinde, UP CM Yogi Adityanath and other CMs, Deputy CMs, Union Ministers, NDA leaders present at the swearing-in ceremony of Haryana CM-designate Nayab… pic.twitter.com/evktPWkU7p— ANI (@ANI) October 17, 2024 హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చండీగఢ్ చేరుకున్నారు.#WATCH | Union Minister and BJP national president JP Nadda arrives in Chandigarh to attend the swearing-in ceremony of Haryana CM-designate Nayab Singh Saini pic.twitter.com/zTkoc24GC7— ANI (@ANI) October 17, 2024 పంచకులకు బీజేపీ, ఎన్డీయే పాలిత సీఎంలు చేరుకుంటున్నారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అగ్రనేతలు హాజరుకానున్నారు. సైనీ రెండోసారి సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక.. బుధవారం పంచకులలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సైనీ.. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.#WATCH | Panchkula: Haryana CM-designate Nayab Singh Saini says, "CMs, Deputy CMs and senior leaders of NDA will participate in the swearing-in ceremony today. After that, there will be a meeting of NDA leaders." pic.twitter.com/uSebe32S6s— ANI (@ANI) October 17, 2024 ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది.Haryana CM-designate Nayab Saini offers prayers at Valmiki Temple, says double engine government will take state forward at fast paceRea @ANI story | https://t.co/Uidj8lvTvK#Haryana #NayabSaini #BJP #NDA pic.twitter.com/nUlUyWdSCh— ANI Digital (@ani_digital) October 17, 2024 -
హరియాణా బీజేపీఎల్పీ నేతగా సైనీ
చండీగఢ్/ పంచకుల: హరియాణా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నాయబ్‌సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. బుధవారం పంచకులలో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ నాయకుడిగా ఎన్ను కున్నారు. సైనీ పేరును ఎమ్మెల్యే క్రిషన్ కుమార్ బేడీ ప్రతిపాదించగా.. సీనియ ర్ నేత అనిల్ విజ్ బలపరిచారు. అనిల్ విజ్ సైతం సీఎం పదవిని ఆశించినప్పటికీ బీజేపీ అగ్రనేతలు సైనీ వైపు మొగ్గారు. పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సైనీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం సైనీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈనెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు నెగ్గి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలన్నీ అంచనా వేసిన కాంగ్రెస్ 37 స్థానాల వద్దే నిలిచిపోయింది. హరియాణా ముఖ్యమంత్రి రెండోసారి సైనీ గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీయే సీఎంలు హాజరుకానున్నారు. -
17న హర్యానా సీఎం ప్రమాణ స్వీకారం
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అక్టోబర్ 17న నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హర్యానాలోని పంచకుల సెక్టార్ 5లోని పరేడ్ గ్రౌండ్లో గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. బీజేపీ నేత నయాబ్ సింగ్ సైనీ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అక్టోబరు 17న పంచకులలో సీఎం, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేసేందుకు ప్రధాని ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు.త్వరలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుందని, అందులో శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారని తెలుస్తోంది. నయాబ్ సింగ్ సైనీని ఎమ్మెల్యేలు అధికారికంగా తమ నేతగా ఎన్నుకోనున్నారని సమాచారం. తాము మళ్లీ అధికారంలోకి వస్తే నయాబ్ సింగ్ సైనీ ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించింది.ఇటీవల నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా బీజేపీ సీనియర్ నేతలను కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 37 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. #WATCH | Union Minister & former Haryana CM Manohar Lal Khattar says, "We have received the nod of the PM that on October 17, in Panchkula, the CM and council of ministers will take oath." pic.twitter.com/SLxvKGPWSq— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: ‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’ -
ఈనెల 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం!
ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ పటాపంచలు చేస్తూ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. 90 స్థానాలకుగానూ 48 స్థానాల్లో విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 15న హర్యానాలో నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈనెల 15న పంచకులలో సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం పంచకులలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందుబాటులో ఉంటారో లేదో అనేది తెలియాల్సి ఉందని, ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.హర్యానా ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పంచకుల డిప్యూటీ కమిషనర్ అధ్యక్షతన 10 మంది సభ్యులతో కూడిన అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంచకుల అదనపు డిప్యూటీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూడా సభ్యులుగా ఉంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ ప్రసాద్ గురువారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్లో తెలిపారు.కాగా ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి నయాబ్ సింగ్ సైనీని సీఎం చేసిన విషయం తెలిసిందే. సైనీ నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది బీజేపీ... మరోసారి బీసీ నేత అయిన ఆయనకే రాష్ట్ర పగ్గాలను అప్పగించనుంది అధిష్టానం. ముఖ్యమంత్రితోపాట మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. -
హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. కూటమిదే కశ్మీర్
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ మూడోసారి హర్యానాలో అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్ సింగ్ సైనీకి ప్రకటించింది. ఇక.. ఇక్కడి ఆప్, జేజేపీ పార్టీలు ఒక్కసీటు కూడా గెలువలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఒక సయయంలో బీజేపీ పలు స్థానాల్లో వెనకంజలో ఉన్నా.. అనూహ్యంగా ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ అనుకూలమైన తాజా ఫలితాల తలకిందులు చేశాయి.ప్రస్తుతం సీఎం హర్యానా సైనీ.. ఆరు నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్నా.. పార్టీని హర్యానాలో గెలిపించుకున్నారు. ఆశలు లేని స్థాయి నుంచి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరసగా మూడు సార్లు అధికారం చేటపట్టలేదు. తాజాగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలిచి ఆ ఆనవాయితీని బ్రేక్ చేసింది. హర్యానాలోబీజేపీ: గెలుపు-48కాంగ్రెస్: గెలుపు- 37ఇతరులు:గెలుపు-5 ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన అధికారిక ఫలితాలు..జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి విజయంజమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన మ్యాజిక్ ఫిగర్ స్థానాలను కూటమి గెలుపొందింది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఎం స్థానంలో గెలుపు. కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.ఇక.. పీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. జమ్ము రీయన్లో కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా అవుతారని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు.జమ్ముకశ్మీర్లోనేషనల్ కాన్ఫరెన్స్ - 42 సీట్లుబీజేపీ - 29కాంగ్రెస్ - 06పీడీపీ - 03సీపీఎం - 01ఆప్ - 01జేపీసీ - 01స్వతంత్రులు - 07మొత్తం స్థానాలు: 90 -
హర్యానాలో బీజేపీ జోరు.. కాబోయే సీఎం ఎవరంటే?
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం దూసుకెళ్లోంది. ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో కాషాయ పార్థీ నేతలు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీనే మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం. సైనీవైపే హైకమాండ్ మొగ్గుచూపుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో లాడ్వా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం సైనీ.. కాంగ్రెస్ అభ్యర్థి మేమా సింగ్‌పై భారీ విజయం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. మూడో సారి బీజేపీకి అధికారం ఇచ్చినందకు ధన్యావాదాలు. మోదీ నాయకత్వం వల్లే విజయం సాధ్యమైందన్నారు. #WATCH | Kurukshetra: Haryana CM Nayab Singh Saini says "I want to thank the 2.80 crore people of Haryana for putting a stamp on the works of BJP for the third time. All this is only because of PM Modi. Under his leadership, we are moving forward. He spoke to me and gave his… pic.twitter.com/jPmMecyA8D— ANI (@ANI) October 8, 2024ఇదిలా ఉండగా.. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 90 స్థానాలు ఉన్న హర్యానాలో ఇప్పటికే 49 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. దీంతో మ్యాజిక్ ఫిగర్(46)ను అధికార బీజేపీ దాటేసింది. ఇక, ముందంజలో ఉన్న 49 స్థానాల్లో ఇప్పటికే 30 స్థానాల్లో కాషాయ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అయితే, ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ క్రమంగా బీజేపీ దూసుకెళ్లింది. కాంగ్రెస్ పట్టున్న పలు స్థానాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక, ప్రస్తుత లెక్కల ప్రకారం.. బీజేపీ 49 స్థానాల్లో, కాంగ్రెస్ 36 స్థానాల్లో, ఇతరులు ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నారు. BIG BREAKING NEWS 🚨 BJP heading for landslide victory in Haryana.BJP is leading on 51 assembly seats. Congress reduced to only 34. No one had imagined it even in dreams.Haryana CM Nayab Singh Saini dedicates Historic Haryana Hat-trick to PM Modi.#HaryanaElectionResult pic.twitter.com/xelrupD7At— ASHER (@ASHUTOSHAB10731) October 8, 2024 -
హర్యానా: ‘సీఎం సైనీ మంచి వ్యక్తి.. కానీ’
చంఢీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధిక సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ నివేదికలు వెల్లడించాయి.ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీపై జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ చౌతాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో నయాబ్ సింగ్ సైనీకి బీజేపీ.. చచ్చిన పాము స్థితిలో ఉన్న పార్టీని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సైనీ.. నియంత్రించలేకపోయారని అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం ఇదే అవుతుందని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హర్యానాలో బీజేపీ అధికారం కోల్పోయి..రాష్ట్రం బయటకు వెళ్లిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను మొదటి రోజు నుంచీ ఇదే విషయాన్ని చెబుతున్నా. బీజేపీ నేతలు ఏమి జరిగిందో కూడా అర్థం చేసుకోలేకపోయారు...హర్యానా ముఖ్యమంత్రికి బీజేపీ ‘చచ్చిన పాము’ స్థితిలో ఉన్న పార్టీని అప్పగించారు. ఇప్పటికే చాలా నష్టం కాంగ్రెస్ వల్లే జరిగిపోయింది. నయాబ్ సింగ్ సైనీ మంచి వ్యక్తి. కానీ, నష్టాన్ని నియంత్రించలేకపోయారు. ఒక మంచి వ్యక్తి మెడలో చనిపోయిన పామును బీజేపీ ఉంచింది...ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 20 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. కానీ, వాటిని నమ్మటం లేదు. బీజేపీకి 15 లేదా 16 సీట్లు మాత్రమే వస్తాయని నమ్ముతున్నా. కాంగ్రెస్ కూడా జేజేపీ లేదా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేం ఏమీ చెప్పలేం. ఫలితాలు వెలువడ్డ తర్వాతే చెబుతాం. కాంగ్రెస్‌కు కూడా మా పార్టీ మద్దతు అవసరమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది’’ అని అన్నారు.చదవండి: TN: ఎయిర్ షో మరణాలకు కారణం అదే: మంత్రి -
చిక్కుల్లో హరియాణా సర్కారు!
రాష్ట్రాల్లో అవకాశం చిక్కినచోటల్లా విపక్ష ప్రభుత్వాలను అస్థిరపరిచి, అధికారాన్ని చేజిక్కించు కోవటం అలవాటైన బీజేపీకి తొలిసారి సంకటస్థితి వచ్చిపడింది. హస్తినకు కూతవేటు దూరంలోవున్న హరియాణాలో ఆ పార్టీ ప్రభుత్వం సమస్యల్లో చిక్కుకుంది. సార్వత్రిక ఎన్నికల వేళ... రోడ్ షోలతో హోరెత్తించాల్సిన సమయంలో బీజేపీకి ఇదేమంత మంచి శకునం కాదు. అసలే ఉత్తరాదిలో బీజేపీ బలహీనపడిందని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. కనుక హరియాణా మాత్రమే కాదు... ఎన్నికలు జరగాల్సిన వేరే రాష్ట్రాల్లో కూడా వోటర్లకు వేరే సంకేతాలు వెళ్తాయి.ఈ నెల 25న ఆ రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా మంగళవారం ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. దాంతో 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. పైకి గంభీరంగా కనబడుతున్నా లోక్‌సభ ఎన్నికల హడావుడిలో తలమునకలైన బీజేపీకి దీంతో ఊపిరాడటం లేదు. ఎంపీలుగా పోటీ చేసేందుకు ఇద్దరు బీజేపీ సభ్యులు రాజీనామా చేయటంతో అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది సభ్యులున్నారు. ప్రభుత్వం సాగాలంటే బీజేపీకి 45 మంది మద్దతు అవసరం కాగా ఇద్దరు ఇండిపెండెంట్లు, హరి యాణా లోక్‌హిత్ పార్టీ సభ్యుడు బీజేపీకి మద్దతునిస్తున్నారు. అంటే బీజేపీ బలం 43కి పడిపోయింది. రెండు నెలల క్రితం బీజేపీ–జేజేపీ కూటమి సర్కారుకు నాయకత్వం వహిస్తున్న ఖట్టర్‌ను తొలగించి ఆయన స్థానంలో బీజేపీ అధిష్టానం నయాబ్‌సింగ్ సైనీని తీసుకొచ్చింది. దాంతోపాటు పదిమంది ఎమ్మెల్యేలున్న జన్నాయక్ జనతాపార్టీ (జేజేపీ)తో తెగతెంపులు చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వున్న పది స్థానాలూ గెల్చుకున్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో జేజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వదల్చుకోలేదు. సహజంగానే అంతవరకూ ఉపముఖ్యమంత్రిగా వున్న జేజేపీ నేతదుష్యంత్ చౌతాలాకు ఇది ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా చలవతోనే ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించు కున్నారన్నది వాస్తవం. అయితే కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే మద్దతిస్తామంటున్న జేజేపీ వాస్తవ బలమెంతో చెప్పలేం. ప్రస్తుత బేరసారాల్లో ఆ పార్టీకున్న పదిమంది ఎమ్మెల్యేల్లో ఎందరు మిగులుతారన్నది అనుమానమే. వారిలో నలుగురి మద్దతు తమకే వున్నదని సైనీ చెప్పు కుంటున్నారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని జేజేపీ కోరినా అది బీజేపీకే తోడ్పడుతుంది. ఉన్న 88 మందిలో నలుగుర్ని అనర్హులను చేయగానే సభలో సభ్యుల సంఖ్య 84కి పడిపోతుంది. దాంతో 43 మంది మద్దతున్న బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా బయటపడుతుంది.లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుండగా ప్రభుత్వ అస్తిత్వానికే ముప్పు ఏర్పడటం హరి యాణా ప్రజానీకానికి మంచి సంకేతం పంపదు. ఎమ్మెల్యేల బేరసారాలు కళ్లముందు స్పష్టంగా కన బడుతుండగా సుదీర్ఘ క్యూ లైన్లలో ఓపిగ్గా నిలబడి వోటేసేంత ఉత్సాహం ఎందరికుంటుంది? వచ్చే అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా ఈ కుర్చీలాట మొదలుకావటం వింత. రాష్ట్రంలో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదనటానికి ఈ సంక్షోభం సంకేతమని కాంగ్రెస్ నాయకుడు హుడా చెబుతున్నారు. నిజానికి జనం అలా అను కోవాలని, లోక్‌సభ ఎన్నికల్లో తమకే పట్టం కట్టా లని ఆయన ఆత్రుత పడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఫిరాయింపులకు ఎవరు పాల్పడినా తప్పే. వేరే రాష్ట్రాల్లో బీజేపీ చేసినప్పుడు విమర్శించిన కాంగ్రెస్ హరియాణాలో అదే పనికి పూనుకోవటం నైతికంగా సరైందేనా? రాష్ట్రపతి పాలన కాంగ్రెస్ ఉద్దేశమని కొందరంటున్నారు. అందుకే మద్దతిస్తా మంటూ జేజేపీ ముందుకొచ్చినా హుడా సాను కూలత చూపలేదని వారి వాదన. లోక్‌సభ ఎన్నికల జంజాటం లేకపోతే కొన్ని గంటల్లోనే బీజేపీ సునాయాసంగా చక్కదిద్దగలిగేది. కేంద్రంలో తాముండగా హరియాణాలో సొంత ప్రభుత్వాన్ని దించి రాష్ట్రపతి పాలనకు బీజేపీ సిద్ధపడటం కల్ల. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టీ హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయపై పడింది. బీజేపీకి లబ్ధి చేకూరేందుకు వీలుగా ప్రస్తుత ఎన్నికలు ముగిసేవరకూ సంక్షోభాన్ని కొనసాగించటం మాత్రం మంచిది కాదు. పాలకపక్షం సత్తాపై సంశయం ఏర్పడినప్పుడు నేరుగా అసెంబ్లీలోనే బలపరీక్షకు సిద్ధపడాలని కోరటం అన్నివిధాలా శ్రేయస్కరం. సంక్షోభాన్ని కొనసాగనిస్తే అనారోగ్యకర పరిణా మాలకు చోటిచ్చినట్టవుతుంది. ప్రభుత్వాల బలాబలాలు చట్టసభల్లో తేలాలి తప్ప రాజ్భవన్లలో కాదని చాన్నాళ్ల క్రితమే సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ వెంటనే బలపరీక్ష నిర్వహించటం సాధ్యంకాదనిపిస్తే కొంత వ్యవధి తీసుకోవచ్చు. అయితే ఈలోగా రాష్ట్రపతి పాలన విధించటమే ఉత్తమం. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంజాబ్ రైతులతోపాటు హరియాణా రైతులు కీలక పాత్ర పోషించారు. ఇటీవలి రైతు ఉద్యమంలో కూడా వారి పాత్ర తక్కు వేమీ కాదు. రిజర్వేషన్లు కావాలంటూ 2016లో జాట్లు సాగించిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. అది కులాల మధ్య కుంపట్లు రాజేసింది. మరోపక్క ఉపాధి అవకాశాలు కరువై యువ తలో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. ఖట్టర్‌ను సీఎం పదవి నుంచి తొలగించి సైనీని ప్రతిష్టించటం జాట్లకు ఆగ్రహం కలిగించిందంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయపు టెత్తుల్లో అధికార, విపక్షాలు రెండూ తలమునకలైతే ఇప్పటికే ఉన్న సమస్యలు రెట్టింపవుతాయి. కనుక ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే కోణంలో కాకుండా సాధ్యమైనంత త్వరగా ఈ రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి. -
దుష్యంత్ చౌతాలాకు షాక్.. ఖట్టర్‌ను కలిసిన నలుగురు జేజేపీ ఎమ్మెల్యేలు
బీజేపీ పాలిత ర్యానాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అసెంబ్లీలో బలపరీక్ష డిమాండ్ చేసిన దుష్యంత్ చౌతాలాకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే షాక్ ఇచ్చారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం బీజేపీ మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలిశారు. పానిపట్‌లోని మంత్రి మహిపాల్ దండా నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఖట్టర్, మహిపాల్‌తో సుమారు అరగంటపాటు జేజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరగంటపాటు సాగిన ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న తాజా సంక్షోభంపై చర్చించినట్లు సమాచారం.కాగా ఇటీవల ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు (సోంబీర్ సంగ్వాన్, రణధీర్ సింగ్ గొల్లెన్, ధరంపాల్ గోండర్) బీజేపీ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. దీంతో నయాబ్ సింగ్ సైనీ సర్కార్ సంక్షోభంలో పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరుతూ జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీఫ్ దుష్యంత్ చౌతాలా గురువారం హర్యానా గవర్నర్‌కు లేఖ రాశారు. ఒకవేళ ప్రభుత్వానికి మెజారిటీ రాకపోతే రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు.కాగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కాంగ్రెస్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ మాజీ మిత్రపక్షమైన దుష్యంత్ చౌతాలా స్పష్టం చేశారు. అసెంబ్లీలో అవిశ్వాసం పెడితే తాము బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని తెలిపారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎంచుకుంటే కాంగ్రెస్‌కు బయటి మద్దతు ఇస్తానని ప్రకటించారు. -
విశ్వాసపరీక్షలో నెగ్గిన సైనీ
చండీగఢ్: ఖట్టర్ రాజీనామాతో హరియాణా సీఎం కుర్చీపై కూర్చున్న నాయబ్ సింగ్ సైనీ బుధవారం అసెంబ్లీ చేపట్టిన విశ్వాస పరీక్షలో గెలిచారు. మంగళవారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనే స్వయంగా విశ్వాస పరీక్షకు గవర్నర్‌ను అభ్యరి్ధంచి శాసనసభ ప్రత్యేక సమావేశం జరిగేలా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక సంకీర్ణ ప్రభుత్వం నుంచి జననాయక్ జనతాపారీ్ట(జేజేపీ) వైదొలగడం, సీఎంగా ఖట్టర్ రాజీనామా చేయడం, నూతన సీఎంగా సైనీ ప్రమాణం చేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో విశ్వాసపరీక్షలో పాల్గొనకుండా 10 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలకు జేజేపీ విప్ జారీచేసింది. అయినాసరే ఐదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. కానీ తీరా బలపరీక్షపై ఓటింగ్ జరిగే సమయానికి బయటకు వెళ్లిపోయారు. విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టారు. రెండుగంటల చర్చ తర్వాత తీర్మానంపై ఓటింగ్‌ను స్పీకర్ అనుమతించారు. మూజువాణి ఓటుతో తీర్మానం నెగ్గింది. 90 మంది సభ్యులున్న హరియాణా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది సొంత ఎమ్మెల్యేల బలముంది. మరో ఏడుగురు మద్దతు పలికారు. బుధవారం 12 మంది సభకు రాకపోవడంతో సభలో సభ్యుల సంఖ్య 78కి, మెజారిటీ మార్కు 40కి దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ సర్కార్ బలపరీక్షలో నెగ్గడం లాంఛనమైంది. -
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం
చంఢీగఢ్: హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ.. నయాబ్ సింగ్‌తో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నయాబ్ సింగ్ సైని.. కురుక్షేత్ర నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిత్రపక్షం జేజేపీతో విభేదాల నేపథ్యంలో మనోహర్‌లాల్ కట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జేజేపీ-బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయటంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. నాయబ్ సింగ్ సైనీ ప్రస్థానం.. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు.2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
హర్యానా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ఎన్నుకుంది ఆ రాష్ట్ర బీజేఎల్పీ. మంగళవారం అక్కడి రాజకీయాల్లో ఒకదాని వెంట ఒకటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయగా.. ఆయన ప్రధాన అనుచరుడైన నాయబ్ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు.. జేజేపీ- బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో.. ఖట్టర్ రాజీనామా, నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. ఇదీ చదవండి: జేజేపీ అవుట్ చేసేందుకే బీజేపీ వ్యూహం! 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు. 2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.