హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం | Nayab Singh Saini takes oath as new chief minister Haryana | Sakshi
Sakshi News home page

హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం

Published Tue, Mar 12 2024 5:32 PM | Last Updated on Tue, Mar 12 2024 6:22 PM

Nayab Singh Saini takes oath as new chief minister Haryana - Sakshi

చంఢీగఢ్‌: హర్యానా నూతన ముఖ్యమంత్రిగా  నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ.. నయాబ్‌ సింగ్‌తో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

నయాబ్ సింగ్ సైని.. కురుక్షేత్ర నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిత్రపక్షం జేజేపీతో విభేదాల నేపథ్యంలో మనోహర్‌లాల్‌ కట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

జేజేపీ-బీజేపీల మధ్య  పొత్తు తెగిపోవడంతో  మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి‌ రాజీనామా చేయటంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్‌ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్‌ సింగ్‌ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. 

నాయబ్‌ సింగ్‌ సైనీ ప్రస్థానం..
ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్‌ సింగ్‌ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్‌ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి  చేరుకున్నారు.2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement