takes oath
-
హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణం
చంఢీగఢ్: హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ.. నయాబ్ సింగ్‌తో కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. నయాబ్ సింగ్ సైని.. కురుక్షేత్ర నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిత్రపక్షం జేజేపీతో విభేదాల నేపథ్యంలో మనోహర్‌లాల్ కట్టర్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. జేజేపీ-బీజేపీల మధ్య పొత్తు తెగిపోవడంతో మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం పదవికి రాజీనామా చేయటంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. అయితే ఖట్టర్ మళ్లీ బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించగా.. అనూహ్యంగా నాయబ్ సింగ్ సైనీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే కొనసాగుతున్నారు. అంతేకాదు కురుక్షేత్ర పార్లమెంటు సభ్యుడు(ఎంపీ) కూడా. నాయబ్ సింగ్ సైనీ ప్రస్థానం.. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన నాయబ్ సింగ్ సైనీ గత ఏడాది బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. సైనీకి సంఘ్ కార్యకాలాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. 1996లో ఆయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2002లో అంబాలా బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2005లో ఆయన బీజేపీ అంబాలా యువమోర్చా జిల్లా అధ్యక్షుడయ్యారు. తరువాత బీజేపీ హర్యానా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2012లో అంబాలా జిల్లా అధ్యక్షునిగా నాయబ్ సింగ్ సైనీ నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణగఢ్ నుంచి గెలిచి హర్యానా అసెంబ్లీకి చేరుకున్నారు.2016లో ఖట్టర్ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాయబ్ సింగ్ సైనీ కురుక్షేత్ర ఎంపీగా ఎన్నికయ్యారు. 2023లో హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. -
ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణస్వీకారం
సాక్షి,అమరావతి: ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ఏపీ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గౌతమ్ అన్న ఆశయాలను నెరవేరుస్తానన్నారు. చదవండి: ఎన్నికలకు రెండేళ్ల ముందే.. టీడీపీలో టిక్కెట్ల లొల్లి! కాగా, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్‌రెడ్డి భారీ మెజార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఏకపక్షంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి.. 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఇక, పోటీలో నిలిచిన ప్రతిపక్ష నేతలను మేకపాటి విక్రమ్ రెడ్డి చిత్తుగా ఓడించారు. -
చంద్రబాబుకు చేతనైతే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ఏపీ మండలి ఛైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. శాసనమండలిలో సీఎం జగన్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఇళ్ల రుణమాఫీ పథకంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గతంలో చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో మహిళలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు.. శాసన మండలిలో గ్యాలరీ ఎక్కి మరీ బెదిరించారని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబు.. రాజకీయాలకు సిగ్గుచేటని.. వ్యవస్థలను, కుల వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఆయనకు చేతనైతే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తోంది: సజ్జల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆది మూలపుసురేష్ ,సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రతి పక్షాలు పాదయాత్రల పేరుతో వందల కోట్లు వసూలు చేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. ప్రజలు.. వైఎస్సార్సీపీని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని తెలిపారు. ప్రజలంతా ముక్తకంఠంతో తమ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని సజ్జల అన్నారు. కాగా, నిజమైన ప్రజల పక్షంగా ఉన్న పార్టీగా వైఎస్సార్సీపీ అవతరించిందని సజ్జల అన్నారు. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సజ్జల పేర్కొన్నారు. -
AP: ఎమ్మెల్సీలుగా 10 మంది ప్రమాణం
సాక్షి, అమరావతి: శాసన మండలికి నూతనంగా ఎంపికైన 11 మంది సభ్యులలో పది మంది బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో మండలి అధ్యక్షులు కొయ్యే మోషేనురాజు ఎనిమిది మంది సభ్యులతో వేదికపై ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో అనంతపురం స్థానిక సంస్థలకు చెందిన ఎల్లారెడ్డి గారి శివరామిరెడ్డి, గుంటూరు స్థానిక సంస్థలకు చెందిన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, విజయనగరం స్థానిక సంస్థలకు చెందిన ఇందుకూరి రఘురాజు, విశాఖ స్థానిక సంస్థలకు చెందిన వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు(వంశీ కృష్ణ యాదవ్), చిత్తూరు స్థానిక సంస్థలకు చెందిన కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, ప్రకాశం స్థానిక సంస్థలకు చెందిన తుమాటి మాధవరావు ఉన్నారు. కృష్ణా జిల్లా స్థానిక సంస్థలకు చెందిన తలశిల రఘురాం, మొండితోక అరుణ కుమార్ కాస్త ఆలస్యంగా రావడంతో మండలిలోని చైర్మన్ చాంబరులో వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. తలశిల రఘురాం విజయవాడ రూరల్ గొల్లపూడి నుంచి భారీ ర్యాలీతో ప్రమాణ స్వీకారానికి తరలివచ్చారు. తూర్పు గోదావరి స్థానిక సంస్థల నుంచి శాసన మండలి సభ్యులుగా ఎంపికైన అనంత సత్య ఉదయ భాస్కర్ త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, శంకర నారాయణ, మేకతోటి సుచరిత, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రమాణ స్వీకారం
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారాయణ స్వామి
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీరంగనాథ్ రాజు
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తానేటి వనిత
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కోడాలి నాని
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శంకరనారాయణ
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అంజాద్ బాషా
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెద్దిరెడ్డి
-
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆదిమూలపు సురేష్
-
నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణస్వీకారం
కోహిమా : నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ వ్యవస్థాపక నాయకుడు నైఫ్యూ రియో ప్రమాణ స్వీకారం చేశారు. నాగలాండ్ గవర్నర్ పీబీ ఆచార్య సమక్షంలో ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ వేడుకకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు నిర్మాలా సీతారామన్, కిరణ్ రిజుజులు హాజరయ్యారు. భారతీయ జనతాపార్టీ–నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కూటమి మద్దతుతో రియో ప్రభుత్వం నెలకొంది. డిప్యూటీ సీఎంతో పాటు 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ జెలియాంగ్ కంటే ముందు వరుసగా 11 ఏళ్లపాటు మూడుసార్లు రియో ముఖ్యమంత్రిగా చేశారు. నాగా పీపుల్స్ ఫ్రంట్ తరఫున మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన అర్ధాంతరంగా సీఎం పదవిని వదిలిపెట్టి 2014లో ఎంపీగా లోక్‌సభకు వెళ్లిన విషయం తెలిసిందే. -
భగవద్గీత సాక్షిగా ఆస్ట్రేలియా ఎంపీ ప్రమాణం
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన ఎంపీ డానియల్ మూకీ (32) హిందూ మత పవిత్ర గ్రంధం భగవద్గీత సాక్షిగా మంగళవారం ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు ఆయనే. డానియల్ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియన్ లేబర్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. డానియల్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆస్ట్రేలియాలో భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసిన తొలి రాజకీయ నాయకుడు తానేనని, దీన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నానని డానియల్ చెప్పారు. -
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా భూమా ప్రమాణం
-
హర్యానా ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం
చంఢీగఢ్: హర్యానా ముఖ్యమంత్రిగా మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలోని పంచ్కులలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖట్టర్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అద్వానీతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీనియర్ నేతలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 1966లో హర్యానా రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత మనోహర్‌లాల్ ఖట్టర్ ఆ రాష్ట్ర తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 15న ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 47 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా మనోహర్‌లాల్ ఖట్టర్‌ను ఎంపిక చేసింది. -
తెలుగులో రాజు.. సంస్కృతంలో సుష్మా
విజయనగరం ఎంపీగా ఎన్నికైన పి.అశోక్ గజపతి రాజు గురువారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 16వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా అశోక్ గజపతి రాజు తెలుగులో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కూడా లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఆమె సంస్కృతంలో లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజు ఎన్నికైయ్యారు. అనంతరం మోడీ కేబినెట్లో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌లోని విదిశ లోక్‌సభ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ ఎన్నికైయ్యారు. ఆమె కూడా మోడీ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతు స్వీకరించిన విషయం విదితమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్.కె అద్వానీ, సోనియాగాంధీ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్వానీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి అభివాదం చేశారు.