తెలుగులో రాజు.. సంస్కృతంలో సుష్మా
విజయనగరం ఎంపీగా ఎన్నికైన పి.అశోక్ గజపతి రాజు గురువారం లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 16వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ కమల్నాథ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా అశోక్ గజపతి రాజు తెలుగులో లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కూడా లోక్సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఆమె సంస్కృతంలో లోక్సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు.
విజయనగరం లోక్సభ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజు ఎన్నికైయ్యారు. అనంతరం మోడీ కేబినెట్లో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్లోని విదిశ లోక్సభ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ ఎన్నికైయ్యారు. ఆమె కూడా మోడీ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతు స్వీకరించిన విషయం విదితమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్.కె అద్వానీ, సోనియాగాంధీ లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్వానీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి అభివాదం చేశారు.