parliament members
-
వీడియో: జీ-7 సదస్సు వేళ ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్తత.. ఎంపీల కొట్లాట..
రోమ్: జీ-7 సదస్సు జరుగుతున్న వేళ ఇటలీలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇటలీ పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పార్లమెంట్‌లోని దిగువ సభలో చట్ట సభ్యులు(ఎంపీలు) ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రతిపక్ష సభ్యుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. ఇటలీ పార్లమెంట్లో సభ్యులు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం కారణంగా దాడి జరిగింది. చట్టసభలో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తిని విస్తరించే ప్రభుత్వ వివాదాస్పద ప్రతిపాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సభలో సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన ప్రతిపక్ష సభ్యుడిని వీల్ చైర్లో ఆసుపత్రికి తరలించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ITALIAN PARLIAMENT: A fight breaks when Five Star Movement deputy Leonardo Donno unfurls an Italian flag in protest against plans to grant more autonomy from Rome to regions that want it. Protestors argue that it undermines Italy's unity. pic.twitter.com/qf6bVFteC3— Mark Alan Pearce (@PearceAlan1962) June 13, 2024 కాగా, వివాదాస్పద ప్రతిపాదనలను వ్యతిరేకించిన ప్రతిపక్ష సభ్యుడు లియోనార్డో డాన్నో ఆ దేశ జెండాను సభలో మంత్రికి ఇవ్వడానికి ప్రయత్నించిన సమయంలో దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై ఇటలీ రాజకీయ నేతలు స్పందించారు. ఇది ఇటలీ ఐకత్యను దెబ్బతిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధుల కుమ్ములాట
ప్రిస్టినా: కొసావో పార్లమెంటు సమావేశాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే చట్టసభను రణరంగంలా మార్చేశారు. ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తూ ముష్టియుద్ధానికి తెగబడ్డారు. సాక్షాత్తూ ఆ దేశ ప్రధాన మంత్రి పైనే నీళ్లు కుమ్మరించి ప్రతిపక్షాలు నానా యాగీ చేశాయి. గురువారం జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కొసావో ప్రధాన మంత్రి ఆల్బిన్ కుర్తి ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకుడు మెర్గిమ్ లుష్టాకు తన చేతిలో వాటర్ బాటిల్ తో నడుచుకుంటూ వచ్చి ప్రధానమంత్రి మొహం మీద నీళ్లు కుమ్మరించారు. అంతలో పాలకపక్షం సభ్యులు ఆయనను అడ్డుకోబోతే ఏకంగా ముష్టి యుద్దానికి తెరతీశారు. మధ్యలో మహిళా సభ్యురాలు అడ్డం వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా కనికరించకుండా పిడిగుద్దులు కురిపించారు ప్రతిపక్ష నాయకులు. తోపులాటలో ఆమెను పక్కకు తోసేశారు. చిన్నగా మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని సభ్యులను చెదరగొట్టి ప్రధానమంత్రిని బయటకు తీసుకుని వెళ్లారు. ఎందుకీ రచ్చ.. ప్రధాన మంత్రి అల్బిన్ కుర్తి విధానాల వలన పాశ్చాత్య దేశాల మైత్రి దూరమైందని, కొసావోలో సెర్బులు-పోలీసులు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా ఇప్పటికే అనేకమంది గాయాల పాలయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 1998లో ఇదే తరహా ఘర్షణలు చెలరేగి ఆనాడు సుమారు 10000 మంది మరణించారని. ఈరోజు ప్రధాని అసమర్ధత వల్ల దేశంలో మళ్ళీ అలాంటి పరిస్థితులు నెలకొన్నాయని వారన్నారు. Brawl breaks out in the Kosovo Parliament after an Opposition MP threw water at the Prime Minister.pic.twitter.com/OP2DG0F9YX — The Spectator Index (@spectatorindex) July 13, 2023 ఇది కూడా చదవండి: పబ్జీ జంట ప్రేమ కథ: ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ -
‘క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు ఎలాంటి మినహాయింపు ఉండదు’
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. ‘పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవు.’అని స్పష్టం చేశారు వెంకయ్య. పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను వెల్లడించారు రాజ్యసభ ఛైర్మన్. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ ప్రక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు. ఇదీ చదవండి: Mallikarjun Kharge: ఈడీ విచారణకు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్! -
ఎంపీల వేతనాల్లో 30% కోత
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటంలో నిధులను సమకూర్చుకునే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సహా పార్లమెంటు సభ్యులందరి వేతనంలో సంవత్సరం పాటు 30% కోత విధిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సంఘటిత నిధిలో చేరే ఈ మొత్తాన్ని కరోనాపై పోరాటంలో వినియోగించనున్నారు. ఈ మేరకు ‘శాలరీ, అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్–1954’కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ రూపొందించామని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు కూడా తమ సామాజిక బాధ్యతలో భాగంగా, తమ వేతనాల్లో కొంత భాగాన్ని కరోనాపై పోరుకు వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్నారు. సాయం అందించడం మన నుంచే ప్రారంభం కావాలన్న నానుడిని ఈ సందర్భంగా జవదేకర్ ఉటంకించారు. ఎంపీల వేతనానికి, ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల వేతనాలకు తేడా ఉంటుంది. ఎంపీలు నెలకు సుమారు రూ. లక్ష వేతనంతో పాటు, రూ. 70 వేలను నియోజకవర్గ అలవెన్స్‌గా పొందుతారు. మంత్రుల వేతనం కూడా దాదాపు అంతే ఉంటుంది కానీ వారికి వేరే అలవెన్సులు కూడా ఉంటాయి. అయితే, ఈ కోత వేతనానికే అని, పెన్షన్, ఇతర అలవెన్సుల్లో ఈ కోత ఉండబోదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఆ తరువాత వివరణ ఇచ్చారు. ఎంపీల్యాడ్(ఎంపీ లోకల్ ఏరియా డెవలప్మెంట్) ఫండ్ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని రెండు ఆర్థిక సంవత్సరాల(2020–21, 2021–22) పాటు నిలిపివేయనున్నారు. ఈ మొత్తాన్ని కూడా కోవిడ్–19పై పోరుకు వినియోగిస్తారు. లోక్‌సభలో 543, రాజ్యసభలో 245 మంది సభ్యులున్నారు. ఈ మొత్తం 788 మంది ఎంపీలకు ఎంపీల్యాడ్స్ కింద ఒక్కొక్కరికి ఏటా రూ. 5 కోట్ల చొప్పున ఇస్తారు. రెండేళ్లకు గానూ ఈ మొత్తం దాదాపు రూ. 7,880 కోట్లు అవుతుంది. అలాగే, ఎంపీల వేతనాల్లో కోత ద్వారా ఏటా రూ. 29 కోట్లు కరోనాపై పోరాటానికి జమ అవుతాయి. వేతనాల్లో కోత ద్వారా కోల్పోయే మొత్తం ఎంపీలకు పెద్ద సమస్య కాబోదు కానీ, ఎంపీల్యాడ్స్‌ను కోల్పోవడంతో నియోజకవర్గాల్లో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎంపీల వేతనాల్లో కోత నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. అయితే, ఎంపీల్యాడ్స్‌పై నిర్ణయానికి సంబంధించి పునరాలోచించాలని కోరింది. -
ప్రపంచకప్ పాక్ గెలిచింది..కానీ?
లండన్ : పాకిస్తాన్ ప్రపంపకప్ గెలిచేసింది. లండన్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కదా ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఫైనల్ చేరడం ఏంటి, ఫైనల్ మ్యాచ్ ఆదివారం కదా? అని అనుకుంటున్నారా? నిజమే పార్లమెంటు సభ్యులతో కూడిన ఇంటర్ పార్లమెంటరీ క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ కప్ కొట్టేసింది. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆయా దేశాల పార్లమెంటు సభ్యులు ఈ పోటీలో క్రికెట్ ఆడారు. రోజూ పార్లమెంటులో మాటలతో అలసిపోతున్నారు అనుకున్నాడో ఏమో గానీ ఓ బ్రిటన్ ఎంపీ ఈ టోర్నమెంటును నిర్వహించాడు. పాక్, బంగ్లాదేశ్‌లు అన్ని దేశాలపై గెలిచి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. 25మంది సభ్యులు గల ఈ పార్లమెంటు బృందం పాక్ విదేశాంగశాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ కుమారుడు హుస్సేన్ ఖురేషీ నేతృత్వంలో లండన్ వెళ్లింది. ఒక పక్క దేశం అప్పుల్లో కూరుకొని దివాళా తీస్తుంటే వీళ్లకు క్రీడల పేరుతో విలాసాలు కావాలా? అంటూ కొందరు నెట్టింట దుమ్మెత్తి పోస్తుండగా.. యువకులతో కూడిన పాకిస్తాన్ క్రికెట్ టీం సెమీఫైనల్‌కు చేరకుండానే బోల్తా పడితే.. వీరు ఏకంగా కప్పే గెలిస్తే అభినందించడం మరిచి ఇలా విమర్శించడం సరికాదని కొందరు వెనకేసుకొస్తున్నారు. -
తొలి అడుగుకు వేళాయె..
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ, అరకు, అనకాపల్లి ఎంపీలుగా ఎన్నికైన ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, భీశెట్టి సత్యవతిలు తొలిసారిగా సోమవారం లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. అనంతరం పార్లమెంటు సభ్యులుగా ప్రమాణ స్వీకారణ చేస్తారు. రాష్ట్రంలో 22 ఎంపీ స్థానాలు వైఎస్సార్సీపీ గెలుచుకోగా.. విశాఖ జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా ఆపార్టీ సభ్యులే విజయకేతనం ఎగురవేశారు. దేశంలోనే 50 శాతం ఓట్లు..86 శాతం సీట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టించింది. విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ, 11 అసెంబ్లీ సీట్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన నిర్ణయాలతో ప్రజల మన్ననలు చూరగొంటూ దూసుకుపోతున్నారు. జగన్ కేబినెట్లో జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి దక్కగా.. మరొకరికి విప్ హోదా దక్కింది. జిల్లా నుంచి ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయగా... ఎంపీలుగా ఎన్నికైన మాధవి, సత్యవతి, సత్యనారాయణలు నేడు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి వ్యక్తిగా మాధవి ప్రమాణం సోమవారం నాడు పార్లమెంట్లో జరిగే తొలిసెషన్లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలి ఎంపీగా అరకు పార్లమెంటు సభ్యురాలు గొడ్డేటి మాధవి ప్రమాణ స్వీకారం చేయనుండగా.. నాలుగో వ్యక్తిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేస్తారు. శ్రేణుల్లో ఆనందం లోక్‌సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనుండడంతో ఆయా నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలకు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు. మరువలేని రోజు దేశంలో ఎందరో మహోన్నత వ్యక్తులు అడుగుపెట్టినటువంటి పార్లమెంట్లో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా జన్మలో ఎప్పటికీ మరువలేని రోజుగా గుర్తుంచుకోవాలి. తాను పార్లమెంట్లో అడుగుపెట్టడానికి కారణమైన వైఎస్ జగన్మోహన్రెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. స్థానిక సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తి వాటిపై పోరాడుతా. మా నాయుకుడు చెప్పిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యలను తీర్చుతా.–భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ప్రత్యేకహోదా కోసం పోరాడతాం.. తొలిసారి ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నందుకు చాలా గర్వంగా ఉంది. తొలి సెషన్లో మాట్లాడే అవకాశం వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నా మొదటి గళం కేంద్ర ప్రభుత్వానికి వినిపిస్తాను. నాన్న ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన తాను ప్రజల సమస్యలను లోక్‌సభలో వినిపిస్తాను. మా నాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా లోక్‌సభలో ఏపీ హక్కుల కోసం పోరాడతా. తాను పార్లమెంటులో అడుగుపెడతానని కలలో కూడా అనుకోలేదు. మా నేత జగన్మోహన్రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ ప్రాంత ప్రజల వాణిని లోక్‌సభలో వినిపిస్తా –గొడ్డేటి మాధవి, అరకు ఎంపీ. సంతోషంగా ఉంది అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని విశాఖ ప్రజలు భావించి ఎంపీగా నన్ను గెలిపించారు. వారికి కృతజ్ఞతలు. సోమవారం నేను లోక్‌సభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయనున్నాను. ప్రశ్నోత్తర సమయంలో విశాఖ సమస్యలను ప్రస్తావించడంతో పాటు విశాఖకు రావాల్సిన ప్రాజెక్టుల సాధన కోసం గళం విప్పుతాను. –ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ -
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులపై పెండింగ్‌లో ఉన్న కేసుల పూర్తి వివరాలను తమకు సమర్పించాలని 25 రాష్ట్రప్రభుత్వాలను, హైకోర్టులను, కేంద్రపాలిత రాష్ట్రాలను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్ కేసుల విచారణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టులకు వాటిని బదిలీచేయాల్సి ఉందని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ నవీన్ సిన్హాల బెంచ్ వ్యాఖ్యానించింది. 11 రాష్ట్రాల్లో ఇప్పటికే 12 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు పూర్తయిందని, కేసుల వివరాలన్నీ అక్టోబర్ 10కల్లా ఆ కోర్టులకు చేరాల్సి ఉందని బెంచ్ తెలిపింది. వివరాలు సమర్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హైకోర్టుల రిజిస్ట్రార్స్ జనరల్స్‌దే అని బెంచ్ స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు 25 కేసులు బదిలీ అయ్యాయని కేంద్రం గతంలో తన అఫిడవిట్లో పేర్కొంది. అయితే, ఇవిగాక మరెన్ని కేసులు ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్నాయో తేల్చాలని పిటిషనర్ సుప్రీం బెంచ్‌ను కోరడంతో అన్ని రాష్ట్రాలకూ కోర్టు ఆదేశాలిచ్చింది. 2014 ఎన్నికల సందర్భంగా నామినేషన్ పత్రాల దాఖలు నాటికి వీరందరిపై దేశవ్యాప్తంగా 1,581 కేసులున్నాయని కేంద్రం గతంలో తెలిపింది. -
ఇందిరాగాంధీ 18, మనం 19: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : 'ఇదొక పెద్ద విజయం. ఇప్పుడు మనం 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం' అని ప్రధాని నరేంద్రమోదీ తన పార్టీ సీనియర్ నేతలతో అన్నారు. పార్లమెంట్‌లోని గ్రంథాలయ భవనంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ముందుగా పార్టీ నేతలందరికీ నమస్కరించారు. '1980లో మనవి రెండు సీట్లు. ఇప్పుడు ఏకంగా 19 రాష్ట్రాల్లో మనం అధికారంలో ఉన్నాం. ఇది పెద్ద విజయం. ఆఖరికి ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పడు కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది. ఈ ఆనందంతో ఎవరూ అతిగా ఉప్పొంగవద్దు' అని సూచించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చించారు. -
'పవన్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు.. సినీనటుడు పవన్ కల్యాణ్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని కేంద్రమంత్రి సుజనా చౌదరి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎంపీలు పనితీరును నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. వ్యాపార వేత్తలు రాజకీయాల్లోకి రాకూడదని ఎక్కడా రాజ్యాంగంలో లేదని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ సోమవారం ప్రెస్ మీట్లో 'ఆంధ్ర ఎంపీలు వ్యాపారం చేస్తున్నారు. పార్లమెంటులో గోడలు చూసి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోతున్నారు..' అన్న సంగతి తెలిసిందే. దానికి కౌంటర్‌గా సుజనా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. -
మా జీతాలు, భత్యాలు రెట్టింపు చేయండి
ఎంపీల జీత భత్యాలన్నింటినీ దాదాపు రెట్టింపు చేయాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే మాజీ ఎంపీల పింఛనును 75 శాతం పెంచాలని తెలిపింది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నియమించిన ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సులు ఇలా ఉన్నాయి... ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి రూ. లక్ష చేయాలి. మాజీ ఎంపీలకు పింఛను ఇప్పుడు నెలకు రూ. 20 వేలు ఉండగా, దాన్ని రూ. 35 వేలు చేయాలి. పార్లమెంటు సమావేశాల సమయంలో సభకు హాజరైనందుకు ఇప్పుడు రోజుకు రూ. 2వేలు ఇస్తుండగా, దాన్ని రూ. 4వేలకు పెంచాలి. మాజీ ఎంపీలతో పాటు వాళ్ల భార్యలకు కూడా రైళ్లలో ఫస్ట్ క్లాస్‌లో వెళ్లేందుకు అనుమతించాలి. విమానాల ఎకానమీ క్లాస్‌లో మాజీ ఎంపీలను ఏడాదికి ఐదుసార్లు వెళ్లనివ్వాలి. ఎంపీలు కేబినెట్ సెక్రటరీ కంటే ఎక్కువ ర్యాంకులో ఉంటారు కాబట్టి, వాళ్ల స్థాయికి తగ్గట్లు గౌరవ మర్యాదలు కల్పించాలి. ఎంపీల పిల్లలకు పెళ్లిళ్లు అయినా, వాళ్లకు కూడా ఉచిత వైద్య సదుపాయాలు అందించాలి. ఈ ప్రతిపాదనలలో కొన్నింటిని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు ఇప్పటికే సమర్పించారు. మరికొన్నింటిని జూలై 13న జరిగే సమావేశంలో ఖరారు చేస్తారు. చిట్టచివరిసారిగా 2010లో ఎంపీల జీత భత్యాలను సవరించారు. ఇప్పుడు ఒకసారి సవరిస్తే, మళ్లీ ఐదేళ్ల తర్వాతే సవరిస్తారు. -
రాష్ట్రపతితో ముగిసిన తెలంగాణ ఎంపీల భేటీ
న్యూఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ ప్రాంత ఎంపీలు అన్నారు. రాష్ట్రపతి అనుమతి, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఏకపక్షంగా బిల్లు పెట్టడం అసమంజసమన్నారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని తెలిపేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో తెలంగాణ ఎంపీలు భేటి అయ్యారు. ఈ భేటికి 11 మంది టీఆర్ఎస్ ఎంపీలతోపాటు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు కూడా హాజరయ్యారు. ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ ప్రవేశపెట్టిన బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఎంపీలు డిమాండ్ చేశారు. గవర్నర్‌కు శాంతిభద్రతల అధికారం ఇవ్వడం రాష్ట్రాల హక్కును హరించడమేనని టి.ఎంపీలు అభిప్రాయపడ్డారు. ఈ రెండు అంశాలను రాష్ట్రపతికి వివరించామని, ఈ అంశాల్లో న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని తెలంగాణ ఎంపీలు స్పష్టం చేశారు. -
తెలుగులో రాజు.. సంస్కృతంలో సుష్మా
విజయనగరం ఎంపీగా ఎన్నికైన పి.అశోక్ గజపతి రాజు గురువారం లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. 16వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల చేత ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా అశోక్ గజపతి రాజు తెలుగులో లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కూడా లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. ఆమె సంస్కృతంలో లోక్‌సభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. అశోక్ గజపతి రాజు ఎన్నికైయ్యారు. అనంతరం మోడీ కేబినెట్లో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌లోని విదిశ లోక్‌సభ స్థానం నుంచి సుష్మా స్వరాజ్ ఎన్నికైయ్యారు. ఆమె కూడా మోడీ కేబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతు స్వీకరించిన విషయం విదితమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్.కె అద్వానీ, సోనియాగాంధీ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్వానీ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సభ్యుల వద్దకు స్వయంగా వెళ్లి అభివాదం చేశారు. -
సమస్యల సవాళ్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు :కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులకు పెండింగ్ ప్రాజెక్టులు స్వాగతం పలుకుతున్నాయి. డెల్టా ఆధునికీకరణ, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి మరమ్మతులు, మూలనపడిన ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకలుగా మారాయి. జిల్లా కేంద్రమైన గుంటూరులో అస్తవ్యస్తంగా ట్రాఫిక్, విస్తరించని రహదారులతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇప్పటికీ గుంటూరులో తాగునీటి సరఫరా అర్ధరాత్రి జరుగుతోంది. దీంతోపాటు రూ.600 కోట్ల విలువైన తాగునీటి పథకాల పనులు ఇంకా ఊపందుకోలేదు. జిల్లాలో టీడీపీ నుంచి ముగ్గురు పార్లమెంట్ సభ్యులు, 12 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువ మంది సీనియర్లు. గతంలో వీరంతా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాలు చేసినవారే. గ్రామస్థాయిలో ఉద్యమాలు, పాదయాత్రలు చేసి వాటి పరిష్కారానికి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ముఖ్యంగా సాగునీటి స్థిరీకరణకు దివంగత మహానేత వైఎస్ చేపట్టిన పులిచింతల ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో పూర్తికాక పోయినా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దానిని ప్రారంభించారు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించిన క్రస్ట్‌గేట్లను ఇంకా అమర్చాల్సి ఉంది. దీనికితోడు పునరావాస ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించాల్సి ఉంది. ఈ రెండు పనులు ఈ సీజనులో పూర్తి అయ్యే అవకాశాలు లేవు. వీటిని పూర్తిచేయాలంటే కనీసం ఆరునెలల సమయం పడుతుందని, అందుకు అవసరమైన పూర్తి నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని ఇంజినీర్లు చెబుతున్నారు. కొంతకాలంగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించిన నగదు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త పాలకులు రైతుల సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. అలాగే ముంపు గ్రామాల ప్రజలకు చెల్లించాల్సిన నష్టపరిహారం కోసం అక్కడి ప్రజలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. వీరికి మద్దతుగా టీడీపీ నేతలు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు అవశ్యం.. డెల్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో ప్రకాశం బ్యారేజి పనులను కూడా చేర్చడంతో సాగునీటిశాఖ అధికారులు ఈ ప్రాజెక్టుకు సాంవత్సరిక మరమ్మతులు కూడా చేయడం లేదు. దీంతో దిగువ ఆప్రాన్ శిథిలావస్థకు చేరింది. రానున్న ఖరీఫ్ సీజను దృష్టిలో ఉంచుకుని దిగువ ఆప్రాన్‌కు మరమ్మతులు చేయాల్సి ఉందని ఇటీవల బ్యారేజి పరిరక్షణ కమిటీ అప్పటి ప్రభుత్వానికి సూచించింది. ప్రకాశం బ్యారేజి పరిరక్షణపై కృష్ణా జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు అనేకసార్లు ఆందోళనలు చేశారు. ముఖ్యంగా ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమా సాగునీటి కొరత, సరఫరా సమస్యలపై అనేకసార్లు చేసిన ఆందోళనలు ప్రజలు మరిచిపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యారే జీకి అత్యవసర మరమ్మతులు చేయాల్సి ఉంది. నిధులు సమకూర్చితేనే సాగునీరు.. కృష్ణానదీ పరీవాహానికి ఇరుపక్కల నిర్మితమైన ఎత్తిపోతల పథకాలకు నాలుగేళ్లుగా మరమ్మతులు జరగడం లేదు. ముఖ్యంగా వీటి మరమ్మతులకు అవసరమైన నిధులను వాటిని నిర్వహిస్తున్న సొసైటీలే సమకూర్చాల్సి ఉంది. ఈ సొసైటీలపై అటు ఇరిగేషన్‌శాఖకు, ఇటు రెవెన్యూశాఖకు పూర్తిస్థాయిలో అధికారాలు లేవు. దీనితో వాటికి సంబంధించిన పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దాదాపు 30 ఎత్తిపోతల పథకాలు పూర్తిగా పనిచేయకపోవడంతో 23 వేల ఎకరాలకు సాగునీటి సరఫరా జరగడం లేదు. ఈ పథకాల బాధ్యతలను చేపట్టిని సొసైటీలకు అవసరమైన నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కొత్త పాలకులపైనే ఉంది. విజయవాడ నుంచి కృష్ణానది కుడి, ఎడమ కరకట్టలను ప్రభుత్వం ఆరేళ్ల క్రితం ప్రారంభిస్తే, ఎడమ కరకట్ట నిర్మాణం పూర్తయి రెండు సంవత్సరాలైంది. కుడివైపున కరకట్ట పనులను ఇటీవలనే నిర్మాణ సంస్థ ప్రారంభించింది. రూ.150 కోట్ల విలువైన ఈ కరకట్టను పూర్తి చేస్తే రేపల్లె వరకు పంట భూములకు ముంపు బెడద తొలగుతుంది. రహదారి సౌకర్యం ఏర్పడుతుంది. ఉడాకు సిబ్బంది కొరత.. మంగళగిరి సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఐదేళ్లుగా పాలకులు చేస్తున్న హామీలు ప్రకటనలకే పరిమితం అయ్యాయి. భూసేకరణ, నిధుల సమీకరణ కోసం కొంత ప్రయత్నం జరిగినా అది ముందుకు సాగలేదు. వీజీటీఎం ఉడా పరిధిని విస్తరించారే కాని అందుకు అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉడా పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వం 86 మంది కొత్త ఉద్యోగులను నియమించడానికి అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఉత్తర్వులు రాకపోవడంతో పరిమితంగా ఉన్న సిబ్బంది కారణంగా ఉడాలోని పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నగరవాసుల దాహార్తి తీరేనా? గుంటూరు నగరంలో రూ.600 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులకు ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. నగరంలోని ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండటంతో ఆర్టీసీ కొత్తగా సిటీ బస్‌లను మంజూరు చేసినా, వాటిని వినియోగంలోకి తీసుకురాలేని దుస్థితి ఉన్నది. రహదారుల విస్తరణతోపాటు ఆటోల సంఖ్య, నగరంలో కొత్త ఆటోల కొనుగోలు నిలిపివేయడం వంటి అనేక ముఖ్యపనులు కొత్త పాలకుల ముందున్నాయి. నగరంలోని రైల్వే గేట్ల సమస్య కారణంగా ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కొత్త పాలకులు కృషి చేస్తారని ప్రజలు ఆశతో ఉన్నారు.