లండన్ : పాకిస్తాన్ ప్రపంపకప్ గెలిచేసింది. లండన్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కదా ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఫైనల్ చేరడం ఏంటి, ఫైనల్ మ్యాచ్ ఆదివారం కదా? అని అనుకుంటున్నారా? నిజమే పార్లమెంటు సభ్యులతో కూడిన ఇంటర్ పార్లమెంటరీ క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ కప్ కొట్టేసింది. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆయా దేశాల పార్లమెంటు సభ్యులు ఈ పోటీలో క్రికెట్ ఆడారు. రోజూ పార్లమెంటులో మాటలతో అలసిపోతున్నారు అనుకున్నాడో ఏమో గానీ ఓ బ్రిటన్ ఎంపీ ఈ టోర్నమెంటును నిర్వహించాడు.
పాక్, బంగ్లాదేశ్‌లు అన్ని దేశాలపై గెలిచి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. 25మంది సభ్యులు గల ఈ పార్లమెంటు బృందం పాక్ విదేశాంగశాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ కుమారుడు హుస్సేన్ ఖురేషీ నేతృత్వంలో లండన్ వెళ్లింది. ఒక పక్క దేశం అప్పుల్లో కూరుకొని దివాళా తీస్తుంటే వీళ్లకు క్రీడల పేరుతో విలాసాలు కావాలా? అంటూ కొందరు నెట్టింట దుమ్మెత్తి పోస్తుండగా.. యువకులతో కూడిన పాకిస్తాన్ క్రికెట్ టీం సెమీఫైనల్‌కు చేరకుండానే బోల్తా పడితే.. వీరు ఏకంగా కప్పే గెలిస్తే అభినందించడం మరిచి ఇలా విమర్శించడం సరికాదని కొందరు వెనకేసుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment