Cricket World Cup
-
జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!
స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్ ఆటో డ్రైవర్ కిశోర్ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్ డేటా లిమిట్ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్ డేటా వాడకం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. అప్పుడైతే పీక్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయట! సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్ ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చౌక స్మార్ట్ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 2029 నాటికి మనమే టాప్... అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎరిక్సన్ చెబుతోంది.జీడీపీకి దన్నుపెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్వర్క్ స్పెషలిస్ట్ పరాగ్ కర్ చెప్పారు. కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్ టీఎంటీ కన్సలి్టంగ్ సంస్థ ఎనాలిసిస్ మేసన్‌కు చెందిన అశ్విందర్ సేథి చెప్పారు.అత్యధిక మొబైల్ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్) నెలవారీ వినియోగంప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్ స్ట్రీమింగ్: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం– సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాలేదు.. విరాట్ సాధించాడు..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఓ అరుదైన ఘనతను టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి సాధించాడు. అండర్ 19 ప్రపంచకప్ (2008), వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013), టీ20 వరల్డ్‌కప్ (2024) గెలిచిన తొలి క్రికెటర్‌గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఇతర ఆటగాడు ఇప్పటివరకు ఈ నాలుగు ఐసీసీ ట్రోఫీల విజయాల్లో భాగం కాలేదు.అయితే ఈ రికార్డు విషయంలో విరాట్‌కు దగ్గరగా మరో టీమిండియా స్టార్ ఆటగాడు ఉన్నాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కూడా అండర్ 19 ప్రపంచకప్ (2000), ఛాంపియన్స్ ట్రోఫీ (2002), టీ20 వరల్డ్‌కప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011) విజయాల్లో భాగమైనప్పటికీ.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్, శ్రీలంక సంయుక్తంగా (వర్షం కారణంగా ఫలితం తేలలేదు)పంచుకున్నాయి. ఈ ఒక్క విషయంలో విరాట్.. యువరాజ్ కంటే ముందున్నాడు.ఇదిలా ఉంటే, నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌కు కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత గెలుపులో విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ కూడా తన టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. విరాట్, రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు (ఇవాళ) రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు బై బై చెప్పాడు.ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; ఫోర్, 4 సిక్సర్లు), శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్, రబాడ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. హార్దిక్ పాండ్యా (3-0-20-3), అర్ష్‌దీప్ సింగ్ (4-0-20-2), బుమ్రా (4-0-18-2) సత్తా చాటడంతో లక్ష్యానికి 8 పరుగుల దూరంలో (169/8) నిలిచిపోయింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలో తడబడినప్పటికీ.. మధ్యలో క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియాను భయపెట్టాడు. ఆఖర్లో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్ అద్బుతంగా బౌలింగ్ చేయడంతో టీమిండియా విజయతీరాలకు చేరింది. -
హైదరాబాదీ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్.. ప్రపంచకప్ జట్టులో చోటు
U19 World Cup 2024 India Squad: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్ ఐసీసీ ఈవెంట్లో భాగమయ్యే ఛాన్స్ కొట్టేవారు. కాగా వికెట్ కీపర్ అవినాశ్, ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్.. ఈ ఇద్దరూ కూడా ఆసియా కప్‌లో భారత్ ఆడిన 3 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. కాగా అండర్–19 వరల్డ్‌కప్ టోర్నమెంట్లో పాల్గొనే యువ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్–19 ఆసియా కప్‌లో పాల్గొంటున్న జట్టునే.. ఒక్క మార్పూ లేకుండా ఈ మెగా టోర్నీ కోసం కూడా ఎంపిక చేయడం విశేషం. ఇక 15 మంది సభ్యుల ఈ ప్రపంచకప్ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. చదవండి: U19 Asia Cup 2023: ఏడు వికెట్లతో చెలరేగిన పేసర్.. భారత్ ఘన విజయం -
శతకోటి జనుల స్వప్నభంగం
పరమపద సోపానపటంలో చివరి దాకా వెళ్ళి, మరొక్క గడిలో లక్ష్యాన్ని అందుకుంటామనగా పెద్ద పాము నోటిలో పడితే ఎలా ఉంటుంది? విజయం అంచుల దాకా వెళ్ళి, ఓటమి కోరల పాలబడితే ఎవరి మానసిక పరిస్థితి అయినా ఏమవుతుంది? వరల్డ్ కప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్ళి, తీరా ఆదివారం ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన భారత క్రికెట్ జట్టు పరిస్థితీ, 140 కోట్ల మంది భారతీయుల మనఃస్థితీ అంతే. లక్షా 32 వేల మంది జనంతో క్రిక్కిరిసిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమ్లో నిశ్శబ్దం తాండవించగా, ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి, ఆరో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. శత కోటి భారతీయుల స్వప్నం భంగమైంది. ఆసీస్‌కు ఇది ఆరో వరల్డ్ కప్ టైటిలైతే, ఆ దేశంతో ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ ఫైనల్స్‌లో తలపడినప్పటి లానే భారత్‌కు మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. నిజానికి, ఈసారి భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగకపోయినా, టోర్నీ ఆరంభం నుంచి ఆటలో ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశ నుంచి ఎదురన్నది లేకుండా సాగింది. 2019 సెమీస్‌లో తమను ఓడించిన న్యూజిలాండ్‌ను ఈసారి సెమీస్‌లో తాను మట్టికరిపించి, ఫైనల్‌కు చేరింది. వరుస విజయాలతో కప్పు భారత్‌దే అన్న నమ్మకం కలిగించింది. తీరా ఆఖరి మహా సంగ్రామంలో తడబడింది. ఇక, తడబడుతూ ఈ టోర్నీని మొదలుపెట్టి, ఆఖరికి అఫ్గానిస్తాన్ చేతిలో సైతం ఓటమి కోరల నుంచి మ్యాక్స్‌వెల్ అసాధారణ డబుల్ సెంచరీతో బయటపడ్డ ఆసీస్ ఆఖరికి విజేత అయింది. తనదైన రోజున మన జట్టు మెడలు వంచి, టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు (కోహ్లీ – 765 రన్స్), అత్యధిక వికెట్లు (షమీ– 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు), అత్యుత్తమ విజయ శాతం (90.9) లాంటి ఘనతలు సాధించిన భారత జట్టు ఆఖరి మెట్టుపైకి చేరకుండానే ఆగిపోయింది. అలాగని మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న ఈ జట్టును తప్పుబట్టాల్సిన పని లేదు. అప్రతిహత విజయాలతో, అసాధారణ ప్రతిభా ప్రదర్శనతో, గత నెలన్నర పైగా కోట్లాది అభిమానులకు ఆనందోద్వేగాల్ని పంచిన భారత జట్టును తక్కువ చేయలేం. అసలు ప్రపంచ కప్‌లో ఫైనల్స్ దాకా చేరడమే గొప్ప.అలాగే, ఆటలో గెలుపోటములు సహజమనీ, విజేత ఒకరే ఉంటారనీ గుర్తెరగాలి. కాకపోతే, లోటుపాట్లేమిటన్నది కూడా సమీక్షించుకోవాలి. పేరున్న వేదికల్ని సైతం పక్కకునెట్టి, పాలకపక్ష పెద్దలు, బీసీసీఐ సారథుల స్వస్థలం లాంటి ఇతరేతర కారణాలతో అహ్మదాబాద్‌ను ఫైనల్స్‌కు వేదిక చేయడం మన కురచబుద్ధి రాజకీయాల తప్పు. ఇరుజట్లకూ సమాన విజయావకాశాలు కల్పించకుండా, టాస్‌ను కీలకం చేసి, మ్యాచ్‌ను లాటరీగా మార్చేసే పిచ్‌ను తుదిపోరుకు సిద్ధం చేయడం మరో తప్పు. ఇవన్నీ కొంప ముంచాయి. ప్రపంచ టోర్నీల్లో విజేతగా నిలిచే విషయంలో భారత్ వెనుకబడే ఉంది. ఈసారీ ఆ లోటు తీర లేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన తర్వాత దశాబ్ద కాలంగా మరో ప్రపంచ టైటిల్ ఏదీ మనం గెలవలేదు. పదేళ్ళ లెక్క తీస్తే, సెమీస్‌లో 3 సార్లు, ఫైనల్స్‌లో 5 సార్లు... మొత్తం 8 కీలక మ్యాచ్‌లలో మనం చతికిలపడ్డాం. భారీ గేమ్స్ తాలూకు ఒత్తిడి, ఓటమి భయం, జట్టు ఆలోచనా దృక్పథం... ఇలా అనేకం అందుకు కారణాలు కావచ్చు. అంతర్జాతీయ వేదికపై జెండా ఎగరేసేందుకు మనలోని ఈ అంతర్గత ప్రత్యర్థులపై ముందు విజయం సాధించాలి. అందుకెలాంటి ప్రయత్నం, శ్రమ, శిక్షణ అవసరమన్న దానిపై క్రికెట్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. కలబడి ఆడడమే కాదు... ఒత్తిడిలోనూ నిలబడి గెలవడమూ కీలకమేనని ఐపీఎల్ అలవాటైన నవతరానికి నూరిపోయాలి. టాస్ మొదలు ఏదీ కలసిరాని చావో రేవో మ్యాచ్‌లో పదో ఓవర్ నుంచి యాభయ్యో ఓవర్ మధ్య 40 ఓవర్లలో 4 బౌండరీలే భారత బ్యాట్స్మన్లు కొట్టారన్న లెక్క ఆశ్చర్యపరుస్తుంది. బ్యాటింగ్‌లో అవతల వికెట్లు టపటపా పడుతుంటే ఒక్కో పరుగుతో, భాగస్వామ్యం, తద్వారా భారీ ఇన్నింగ్స్ నిర్మించే ఓర్పు కావాలి. బంతిని బలంగా బాదడం కన్నా ప్రత్యర్థి ఫీల్డర్ల మధ్య ఖాళీల్లో కొట్టే నేర్పు రావాలి. అన్నీ తెలిసిన భారత్ ఆఖరి రోజున ఆ పనిలో విఫలమైంది. బలంగా కనిపించే జట్టులో తొలి అయిదుగురి తర్వాత బ్యాటింగ్ బలహీనతలూ బయటపడ్డాయి. కనీసం మరో 40 – 50 పరుగులు చేసివుంటే, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో మరింత రాణించివుంటే కథ మరోలా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నది అందుకే! అలాగని, ఆసీస్ తాజా విజయాన్ని తక్కువ చేయలేం. ప్రతి కీలక సందర్భంలో సర్వశక్తులూ ఒడ్డే ఆ జట్టు పోరాటస్ఫూర్తిని అలవరచుకోవడమే ఎప్పటికైనా మనకు ముఖ్యం. ఆటలను పిచ్చిగా ప్రేమించే, కేవలం 2.5 కోట్ల జనాభా గల ఆ దేశం తరగని ప్రేరణ. మన జట్టు గెలవాలనుకోవడం సబబే కానీ, అన్ని రోజులూ, అన్ని మ్యాచ్‌లూ మనమే గెలవాల నుకోవడం అత్యాశ. అంచనాలు, అనవసర ఒత్తిళ్ళు పెంచేయడం మన లోపమే. కొమ్ములు తిరిగిన ఆటగాళ్ళకైనా కలసిరాని రోజులూ కొన్ని ఉంటాయి. భారత క్రికెట్లో మొన్న ఆదివారం అలాంటిదే. ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొట్టినా, ఆ జట్టు కెప్టెన్ కప్ అందుకున్నా అభినందించలేనంత సంకుచిత ధోరణి క్రీడాస్ఫూర్తి కానేరదు. అహ్మదాబాద్ సాక్షిగా అందరం ముందు అది తెలుసుకోవాలి. అత్యు త్తమ బౌలింగ్ దాడి, కోహ్లీ అపూర్వ ఫామ్, రోహిత్ ఘనసారథ్యం లాంటి గొప్పలెన్నో ఈ టోర్నీ మిగిల్చిందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ప్రతిభకు పదును పెట్టుకుంటూనే, మనదైన మరో రోజు కోసం ఆగుదాం. వచ్చే వరల్డ్‌కప్‌ను ముద్దాడేందుకు నాలుగేళ్ళు నిరీక్షిద్దాం. శారీరకంగా, మానసికంగా మన జట్టు అందుకు సన్నద్ధమయ్యేందుకు సహకరిద్దాం. నెక్స్›్ట టైమ్ బెటర్ లక్... టీమిండియా! -
'ఆల్ ది బెస్ట్' టీమ్ ఇండియా..!
సాక్షి: ఐసీసీ మెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్– 2023 తుది సమరానికి సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది. మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి లీగ్ మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు ఓటమి లేకుండా అద్భుత ప్రదర్శన ను కనబరిచింది. జట్టులోని కీలక ఆటగాళ్లు ఫామ్‌లో ఉండడంతో ఈసారి ప్రపంచ విజేతగా రోహిత్ సేన నిలుస్తుందని సగటు క్రికెట్ అభిమాని ఆశిస్తున్నా రు. ఫైనల్ సమరాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. పలు హోటళ్లు, టీసెంటర్స్, బార్లు, రెస్టారెంట్లలో అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద పెద్ద స్క్రీన్లను ఇప్పటికే సిద్ధం చేశారు. పలువురు అభిమానులు ప్రపంచకప్ న మూనాను తలపై కత్తిరించుకొని తమ అభిమానాన్ని చాటుకున్నా రు. క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో పలువురి అభిప్రాయాలు.. -
ప్రపంచకప్‌లో టీమిండియాకు రెండోసారి ఇలా..!
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో భారత్ పలు రికార్డులను నమోదు చేసింది. ఇందులో ఒకే ప్రపంచకప్‌లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో రెండుసార్లు గెలుపొందిన రికార్డు ఒకటి. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకపై వరుసగా విజయాలు సాధించిన భారత్.. 2003 ప్రపంచకప్‌లో వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓవరాల్‌గా చూస్తే ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక వరస విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2003 ఎడిషన్‌లో ఆసీస్ వరుసగా 13 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అనంతరం 2007 ప్రపంచకప్‌లోనూ ఆసీస్ వరుసగా 12 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ రెండు ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా నిలిచింది. వరల్డ్‌కప్‌లో ఓవరాల్‌గా అత్యధిక వరుస విజయాల రికార్డు కూడా ఆసీస్ పేరిటే ఉంది. ఈ జట్టు వరుసగా 36 మ్యాచ్‌ల్లో (1999లో 7, 2003లో 13, 2007లో 12, 2011లో 4) గెలిచింది. ఆసీస్ 36 వరుస విజయాల జైత్రయాత్రకు 2011 వరల్డ్‌కప్‌లో బ్రేక్ పడింది. ఆ ఎడిషన్‌లో పాక్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఆసీస్ 36 వరుస విజయాల తర్వాత ఓడింది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రీలంక
శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2023 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో నిన్న (నవంబర్ 2) జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. వరల్డ్‌కప్‌లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్ టైమ్ జట్టుగా (టెస్ట్ హోదా కలిగిన జట్టు) అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఈ చెత్త రికార్డు గతంలో బంగ్లాదేశ్ పేరిట ఉండేది. 2011 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 58 పరుగులకే ఆలౌటైంది. దీనికి ముందు 1992 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 74 పరుగులకే చాపచుట్టేసింది. అయితే ఆ వరల్డ్‌కప్‌లో పాక్ ఛాంపియన్‌గా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
World Cup 2023: సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసిన నెదర్లాండ్స్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ధర్మశాల వేదికగా నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా జట్ల మద్య జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. తమ కంటే ఎంతో బలంగా ఉన్న సౌతాఫ్రికా జట్టును నెదర్లాండ్స్ మట్టికరిపించి అందరికీ షాక్ ఇచ్చింది. మొత్తం 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు నిర్ణీత 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాపై 38 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది నెదర్లాండ్స్ జట్టు. One of the greatest ICC Men's Cricket World Cup upsets of all time in Dharamsala as Netherlands overcome South Africa 🎇#SAvNED 📝: https://t.co/gLgies5ZBv pic.twitter.com/KcbZ10qdAG — ICC Cricket World Cup (@cricketworldcup) October 17, 2023 246 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు డచ్ బౌలర్లు చుక్కలు చూపారు. కేవలం 44 పరుగులకే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టును కష్టాల్లోకి నెట్టారు. వర్శం కారణంగా ఈ మ్యాచ్‌ను 43 ఓవర్లకే కుదించారు. స్కోర్లు: నెదర్లాండ్స్ 245-8 (43), దక్షిణాఫ్రికా 207 (42.5) -
ప్రపంచకప్ చరిత్రలో ఎవరి వల్ల కాలేదు.. ఇంగ్లండ్‌కు మాత్రమే సాధ్యమైంది
ప్రపంచకప్-2023లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి అనంతరం జగజ్జేత ఇంగ్లండ్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ప్రపంచకప్ చరిత్రలో అన్ని టెస్ట్ ప్లేయింగ్ జట్ల (11) చేతుల్లో ఓడిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 1975 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన ఇంగ్లండ్.. ఆతర్వాత 1979 వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్ చేతిలో పరాజయాన్ని మూటగట్టుకుంది. అనంతరం 1983, 1987 ప్రపంచకప్‌ల్లో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్.. 1992 వరల్డ్‌కప్‌లో పసికూన జింబాబ్వే చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, సౌతాఫ్రికా చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న ఇంగ్లీష్ టీమ్‌కు 2011 ప్రపంచకప్‌లో ఊహించని పరాభవం ఎదురైంది. ఈ ఎడిషన్‌లో ఆ జట్టు ఐర్లాండ్ చేతిలో ఓటమిపాలైంది. 2015లో ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. ఆ ఎడిషన్‌లో ఇంగ్లీష్ టీమ్.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. తాజా వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమితో, అన్ని టెస్ట్ ప్లేయింగ్ దేశాల చేతుల్లో ఓటములు ఎదుర్కొన్న తొలి జట్టుగా ఎవరికీ సాధ్యంకాని చెత్త రికార్డును ఇంగ్లండ్ మూటగట్టుకుంది. కాగా, న్యూఢిల్లీ వేదికగా నిన్న (అక్టోబర్ 15) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్.. జగజ్జేత ఇంగ్లండ్‌ను 69 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ కాగా.. ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. -
CWC 2023 SA VS SL: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం (ఫొటోలు)
-
వరల్డ్ కప్ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్‌లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్ ఐడియా (Vi) యాప్‌లో అందుబాటులో ఉంటాయి . డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్ రూ. 839 హీరో అన్లిమిటెడ్ ప్యాక్‌తోపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్‌ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్‌పై డబుల్ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది. ఇక రూ. 418 డేటా ప్యాక్‌పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీఐ యాప్‌లో కూపన్ కోడ్ల ద్వారా, వెబ్ పోర్టల్‌లో ఫ్యాన్కోడ్ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్‌లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్‌పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్ కప్ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్‌లు, ప్లాన్లను ప్రారంభించాయి. -
WC 2023 AFG Vs BAN: అఫ్గనిస్తాన్‌పై బంగ్లాదేశ్ గెలుపు (ఫొటోలు)
-
WC 2023: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా..(ఫొటోలు)
-
CWC 2023: ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్ల వీరులు వీరే..!
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లపై ఓ లుక్కేద్దాం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్ 1996-2007 మధ్యలో 39 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 ఐదు వికెట్ల ఘనతలు కూడా ఉన్నాయి. వరల్డ్‌కప్‌లో మెక్‌గ్రాత్ అత్యుత్తమ గణాంకాలు 7/15గా ఉన్నాయి. ఈ జాబితాలో స్పిన్ లెజెండ్, శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీథరన్ రెండో స్థానంలో ఉన్నాడు. మురళీ 1996-2011 మధ్యలో 40 మ్యాచ్‌ల్లో 68 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 4 నాలుగు వికెట్ల ఘనతలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో మురళీ అత్యుత్తమ గణాంకాలు 4/19గా ఉన్నాయి. మూడో స్థానం విషయానికొస్తే.. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ ఈ స్థానాన్ని అక్యూపై చేశాడు. మలింగ 2007-2019 మధ్యలో 29 మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో మలింగ అత్యుత్తమ గణాంకాలు 6/38గా ఉన్నాయి. మలింగ తర్వాత వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రమ్ నిలిచాడు. అక్రమ్ 1987-2003 మధ్యలో 38 మ్యాచ్‌ల్లో 55 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 నాలుగు వికెట్ల ఘనతలు, ఓ ఐదు వికెట్ల ఘనత ఉన్నాయి. ప్రపంచకప్‌లో అక్రమ్ అత్యుత్తమ గణాంకాలు 5/28గా ఉన్నాయి. ఈ జాబితాలో భారత బౌలర్ జహీర్ ఖాన్ ఏడో స్థానంలో నిలిచాడు. జహీర్ 2003-2011 మధ్యలో 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ నాలుగు వికెట్ల ఘనత ఉంది. ప్రపంచకప్‌లో జహీర్ అత్యుత్తమ గణాంకాలు 4/42గా ఉన్నాయి. ప్రస్తుతం క్రికెట్లో కొనసాగుతున్న బౌలర్లలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (18 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు) ఐదో స్థానంలో.. కివీస్ స్పీడ్‌గన్ ట్రెంట్ బౌల్ట్ (19 మ్యాచ్‌ల్లో 39 వికెట్లు) 10వ ప్లేస్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈనెల 5వ తేదీ నుంచి వరల్డ్‌కప్ స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ ఇంత తక్కువా..?
విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడల్లో ఫుట్‌బాల్, క్రికెట్ రెండు సరిసమానంగా ఉంటాయి. ఇటీవలికాలంలో ఫుట్‌బాల్‌తో పోలిస్తే క్రికెట్‌కు ప్రజాదరణ పెరిగిందనే చెప్పాలి. పాశ్యాత్య దేశాల్లో సైతం క్రికెట్‌కు విపరీతంగా క్రేజ్ పెరుగుతూ వస్తుంది. ప్రపంచంలో రెండు క్రీడలకు సరిసమానమైన క్రేజ్ ఉన్నా ఒక్క విషయంలో మాత్రం క్రికెట్‌కు అన్యాయమే జరుగుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో జెంటిల్మెన్ గేమ్ బాగా వెనుకపడి ఉంది. ప్రపంచకప్ విషయానికొస్తే.. ఫుట్‌బాల్ ప్రైజ్‌మనీతో పోలిస్తే క్రికెట్ ప్రైజ్‌మనీ చాలా తక్కువగా ఉంది. 2022 ఫిఫా ప్రపంచకప్ విన్నర్ (అర్జెంటీనా) ప్రైజ్‌మనీ భారత కరెన్సీలో సుమారు 334 కోట్ల రూపాయలు (42 మిలియన్ యూఎస్ డాలర్లు) అయితే.. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ విజేతకు 33 కోట్ల రూపాయలు (4 మిలియన్ యూఎస్ డాలర్లు) మాత్రమే దక్కుతుంది. ప్రైజ్‌మనీ విషయంలో రెండు క్రీడల మధ్య ఇంత వ్యత్యాసం ఉండటంతో క్రికెట్ అభిమానులు బాగా ఫీలైపోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంత డబ్బు సంపాధిస్తున్నా క్రికెట్‌పై ఎందుకు ఇంత చిన్నచూపు అని వారు ప్రశ్నిస్తున్నారు. అనాదిగా క్రికెట్‌పై ఈ వివక్ష కొనసాగుతూనే ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధరణ విషయంలో ఫుట్బాలర్లతో పోలిస్తే క్రికెటర్లు ఏమాత్రం తీసిపోనప్పటికీ వారికందే పారితోషికం మాత్రం నామమాత్రంగా ఉందని అంటున్నారు. ఇకనైనా క్రికెటర్ల వ్యక్తిగత పారితోషికం, జట్టుకు అందే ప్రైజ్‌మనీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, వన్డే ప్రపంచకప్ 2023 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ ప్రైజ్‌మనీ మొత్తం 10 మిలియన్ యూఎస్ డాలర్లుగా నిర్ణయించబడింది. ఇండియన్ కరెన్సీలో దీని విలువ దాదాపు 83 కోట్లు (82 కోట్ల 93 లక్షల 57 వేల 500 రూపాయలు). ఈ మొత్తం ప్రైజ్‌మనీ విజేత, రన్నరప్, సెమీ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ స్టేజ్‌లో నిష్క్రమించిన జట్ల మధ్య విభజించబడుతుంది. విజేతకు 40 లక్షల యూఎస్ డాలర్లు (33 కోట్ల 17 లక్షల 8 వేల రూపాయలు) దక్కుతుంది. రన్నరప్‌కు 20 లక్షల యూఎస్ డాలర్లు (16 కోట్ల 58 లక్షల 54 వేల రూపాయలు) అందుతుంది. సెమీ ఫైనలిస్ట్‌లకు 8 లక్షల యూఎస్ డాలర్లు (6 కోట్ల 63 లక్షల 43 వేల 600 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో నిష్క్రమించిన జట్లకు లక్ష యూఎస్ డాలరు (82 లక్షల 92 వేల 950 రూపాయలు).. గ్రూప్ స్టేజీలో మ్యాచ్ గెలిచిన జట్టుకు 40 వేల యూఎస్ డాలర్లు (33 లక్షల 17 వేల 668 రూపాయలు) ప్రైజ్‌మనీగా అందుతుంది. ఇదిలా ఉంటే, ఐసీసీ వన్డే ప్రపంచకప్-2023 భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్-గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ధి పాక్‌ను అక్టోబర్ 14న నరేంద్ర మోదీ స్టేడియంలో ఢీకొంటుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగుస్తుంది. -
భారత్, పాక్ వరల్డ్‌కప్ మ్యాచ్ టికెట్లు ఇచ్చే డేట్ వచ్చేసింది..!
క్రికెట్ అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. వన్డే వరల్డ్‌కప్-2023 టికెట్ల విక్రయానికి సంబంధించిన తేదీలను ఇవాళ (ఆగస్ట్ 15) ప్రకటించింది. దశలవారీగా జరిగే టిక్కెట్ల విక్రయ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దశ ఇదివరకే ప్రారంభం కాగా, ఆగస్టు 25 నుంచి టిక్కెట్ల కొనుగోలు దశ ప్రారంభమవుతుందని వెల్లడించింది. వరల్డ్‌కప్ మొత్తంలో అత్యంత ఆసక్తికరమైన దాయాదాల సమరానికి సంబంధించిన టికెట్ల విక్రయం సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. 🎟️ #CWC23 Ticket sales 🔹 25 August: Non-India warm-up matches and all non-India event matches 🔹 30 August: India matches at Guwahati and Trivandrum 🔹 31 August: India matches at Chennai, Delhi and Pune 🔹 1 September: India matches at Dharamsala, Lucknow and Mumbai 🔹 2… pic.twitter.com/GgrWMoIFfA — ICC (@ICC) August 15, 2023 టికెట్ల అమ్మకాల ప్రారంభ తేదీల వివరాలు.. ఏయే మ్యాచ్‌లు.. ఆగస్ట్ 25: నాన్-ఇండియా వార్మప్ మ్యాచ్‌లు మరియు అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు ఆగస్టు 30: గౌహతి, త్రివేండ్రంలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు ఆగస్టు 31: చెన్నై, ఢిల్లీ, పూణేలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు సెప్టెంబర్ 1: ధర్మశాల, లక్నో, ముంబైలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు సెప్టెంబర్ 2: బెంగళూరు, కోల్‌కతాలలో టీమిండియా ఆడే మ్యాచ్‌లు సెప్టెంబర్ 3: అహ్మదాబాద్‌లో టీమిండియా ఆడే మ్యాచ్ (భారత్ వర్సెస్ పాకిస్థాన్, అక్టోబర్ 14) సెప్టెంబర్ 15: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల టికెట్లు కాగా, ఆగస్ట్ 15 నుంచి www.cricketworldcup.com వెబ్సైట్లో వరల్డ్ కప్ అప్డేట్స్ గురించి తెలుసుకోవచ్చని ఐసీసీ తెలిపింది. అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ప్రపంచ కప్ ప్రారంభంకానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో(అక్టోబర్ 8న) ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్ల మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న జరుగనుంది. -
ఇండియా కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఆ జట్టే!
-
క్రీడల చరిత్రలో క్రికెట్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్ ప్లేయర్ ఎవరో తెలుసా..?
ప్రపంచ క్రీడల చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఒకటి ఉంది. ఓ అంతర్జాతీయ ప్లేయర్.. క్రికెట్ వరల్డ్‌కప్‌తో పాటు ఫిఫా ప్రపంచకప్‌లో కూడా పాల్గొని, విశ్వంలో ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారిణిగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ క్రీడల చరిత్రలో టార్చ్‌లైట్ వేసి వెతికినా ఇలాంటి ఓ ఘటన నమోదైన దాఖలాలు లేవు. ఆస్ట్రేలియాకు చెందిన 32 ఏళ్ల మహిళా క్రికెటర్ ఎల్లైస్ పెర్రీ 16 ఏళ్ల వయసులోనే (2007) అంతర్జాతీయ క్రికెట్ టీమ్‌తో పాటు ఫుట్‌బాల్ జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. అటు ఐసీసీ మహిళల వరల్డ్‌కప్ (2009)తో పాటు 2011 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లో కూడా పాల్గొంది. పెర్రీ.. ఓ పక్క క్రికెట్లో సంచనాలు నమోదు చేస్తూనే, ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటింది. ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో నేటికీ బద్ధలు కాని ఎన్నో రికార్డులు నమోదు చేసిన పెర్రీ.. ఫిఫా ప్రపంచకప్‌లో డిఫెండర్‌గా ఉంటూనే గోల్స్ సాధించింది. 2011 ఫిఫా ప్రపంచకప్‌లో స్వీడన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పెర్రీ.. మెరుపు వేగంతో సాధించిన గోల్‌ను ఆసీస్ ఫుట్‌బాల్ ప్రేమికులు ఎన్నటికీ మర్చిపోలేరు. అయితే ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కొన్ని క్లబ్‌లు క్రికెట్ కావాలో, ఫుట్‌బాల్ కావాలో తేల్చుకోమని చెప్పడంతో 2014లో ఫుట్‌బాల్‌కు స్వస్తి పలికి నేటికీ ఆసీస్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతుంది. క్లబ్ లెవెల్ ఫుట్‌బాల్‌లో ఎన్నో అద్భుతాలు చేసిన పెర్రీ.. అంతర్జాతీయ క్రికెట్లో అంతకుమించిన ఎన్నో చెరగని రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. అటు క్రికెట్లోనూ.. ఇటు ఫుట్‌బాల్‌లోనూ సత్తా చాటిన పెర్రీ ఎందరో మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమెను దేశంలోని అన్ని అత్యుత్తమ పురస్కారాలతో సత్కరించింది. క్రికెట్లో ఆసీస్ తరఫున టెస్ట్‌ల్లో 10 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 75.20 సగటుతో 752 పరుగులు చేసింది. ఇందులో 2 శతకాలు 3 అర్ధశతకాలు ఉన్నాయి. ఆమె అత్యుత్తమ స్కోర్ 213 నాటౌట్‌గా ఉంది. సుదీర్ఘ ఫార్మాట్లో ఆమె 37 వికెట్లు కూడా సాధించింది. 128 వన్డేలు ఆడిన పెర్రీ.. 50.28 సగటున 2 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీల సాయంతో 3369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టింది. ఇక, 126 టీ20లు ఆడిన పెర్రీ.. 4 హాఫ్ సెంచరీల సాయంతో 1253 చేసి 115 వికెట్లు పడగొట్టింది. ఇక ఫుట్‌బాల్ విషయానికొస్తే.. ఆసీస్ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 3 గోల్స్ సాధించింది. అలాగే క్లబ్ స్థాయిలో 50కి పైగా మ్యాచ్‌ల్లో పాల్గొంది. విండీస్ దిగ్గజం కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్ ఆడాడు.. అయితే..! పురుషుల క్రికెట్లో విండీస్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేట్ సర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఫిఫా వరల్డ్‌కప్, క్రికెట్ ప్రపంచకప్‌లలో ఆడాడు. 70, 80 దశకాలలో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రిచర్డ్స్.. 1975, (తొలి వన్డే ప్రపంచకప్), 1979, 1983 వన్డే ప్రపంచకప్‌లలో పాటు 1974 ఫిఫా వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొన్నాడు. కరీబియన్ దీవుల్లోని అంటిగ్వా తరఫున ఫిఫా వరల్డ్‌కప్ బరిలోకి దిగిన సర్ రిచర్డ్స్.. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. నాటి పోటీల్లో ఆంటిగ్వా ఆశించిన స్థాయిలో రాణించలేక, వరల్డ్‌కప్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయింది. -
స్వతంత్ర భారతి: ప్రపంచ కప్ విజయం (1983/2022)
లార్డ్స్ మైదానంలో ఆ రోజున భారత క్రికెట్ జట్టు ఓ అత్యద్భుత పరిణామం దిశగా అడుగులు వేసింది. ఆ ఏడాది జూన్ 25న భారత జట్టు సాధించిన విజయం భారత క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ స్ఫూర్తితో దేశంలో క్రికెట్ క్రీడ అపరిమిత ఆత్మవిశ్వాసాన్ని సొంతం చేసుకుంది. క్రికెట్ క్రీడలో రారాజులుగా వెలిగిపోతున్న వారిని దాదాపు నలభై ఏళ్ల క్రిందట ఓడించినప్పుడు కపిల్ బృందం ఈ పరిణామాన్ని ఊహించి ఉండదు. నాటి 60 ఓవర్ల వరల్డ్ కప్ మ్యాచ్‌లో అప్పటికి రెండుసార్లుగా డిఫెండింగ్ చాంపియన్‌గా ఉన్న వెస్ట్ ఇండీస్‌పై ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: (Lalu Prasad Yadav: లాలూ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం) -
ఇంకా నయం.. గ్లోవ్స్, బ్యాట్ మాత్రమే విసిరాడు!
మ్యాచ్ గెలిస్తే సెలబ్రేషన్ చేసుకోవడం సహజం. కానీ ఒక్కోసారి అలాంటి సెలబ్రేషన్స్ హద్దులు దాటిపోతాయి. చూడడానికి కాస్త ఓవర్‌గా కూడా అనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్ 2022లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం ఒమన్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కష్యప్ 81 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మహ్మద్ నదీమ్ 53 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి విజయాన్ని అందుకుంది. రిచీ బెరింగ్టన్(73), జార్జ్ మున్సీ(43), మైకెల్ లీస్క్(21) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివర్లో రిచీ బెరింగ్టన్ ఔట్ కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. ప్రధాన బ్యాటర్స్ అంతా వెనుదిరగడంతో భారం అంతా మార్క్ వాట్పై పడింది. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో ఓవర్ తొలి బంతిని మార్క్ వాట్ ఫోర్ తరలించాడు. ఆ తర్వాత మూడు బంతులకు నాలుగు పరుగుల వచ్చాయి. ఇక ఐదో బంతిని ఫోర్ కొట్టి జట్టను గెలిపించాడు మార్క్ వాట్. 37 పరుగులతో అజేయంగా నిలిచిన మార్క్ వాట్ తన సహచర బ్యాటర్ వద్దకు పరిగెత్తుకొచ్చి గ్లోవ్స్, బ్యాట్‌ను గాల్లోకి విసిరేసి.. హెల్మెట్‌కు ముద్దులు పెట్టాడు. దీంతో ఇదేం వింత సెలబ్రేషన్ అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ODI World Cup Qualifiers: వన్డేల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి నమోదు Mark Watt finished the game for Scotland with a ball in hand. He scored an unbeaten 37 in 35 balls. The celebration from him says it all about the importance of the win. pic.twitter.com/bgCzpEcrvL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2022 -
‘తొలి ప్రేమ’ పుట్టిన వేళా విశేషం..
జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మొదటి గెలుపు ఇచ్చే కిక్కే వేరప్పా! మన గురించి మనం చెప్పుకుంటే ఇలాంటి భావన చాలా మందిలో సాధారణమే. సరిగ్గా ఇలాంటిదే భారత క్రికెట్‌కు కూడా వర్తింపజేస్తే ఆ తొలి గెలుపు విలువేమిటో మనకు తెలుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే 1983 వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ గెలవడం అలాంటి అపూర్వ ఘట్టమే. రోజుకు 1500 రూపాయల మ్యాచ్ ఫీజుల నుంచి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించే స్థాయికి క్రికెట్ చేరిందంటే అది ఈ గెలుపు చలవే. భారత క్రికెట్ గతిని మార్చేసిన ఈ ఘనతకు నేటితో 37 ఏళ్లు. క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచే సమయానికి భారత్‌లో హాకీదే హవా. అప్పటికే ఒకసారి ప్రపంచకప్ గెలవగా... 1980 మాస్కో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణంతో ఏకంగా ఎనిమిది పసిడి పతకాల రికార్డు మన ఖాతాలో ఉంది. అలాంటి సమయంలో వచ్చిన కపిల్‌దేవ్ బృందం సాధించిన వరల్డ్‌కప్ విజయం దేశంలో క్రికెట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ ఆట పంచిన వినోదం దేశంలో అద్భుతాలను సృష్టించింది. వరల్డ్‌కప్ తర్వాత ఒకవైపు క్రికెట్ ఉజ్వలంగా వెలుగుతూ ఉవ్వెత్తున దూసుకుపోగా.... దానికి వ్యతిరేక దిశలో హాకీ పతనం కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత భారత్‌లో తిరుగులేని ఆటగా, ఒక మతంగా క్రికెట్ మారిపోయింది. అంచనాలు లేకుండా... 1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్ 3 మ్యాచ్‌లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్ ఆఫ్రికాపై గెలిచింది. 1979లో రెండో ప్రపంచకప్‌లో ఆ విజయం కూడా దక్కకుండా సున్నాకు సున్నా మార్కులే వచ్చాయి. పైగా వరల్డ్‌కప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడింది. ఇలాంటి నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరకు అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్ అర్హత సాధించింది. లీగ్ దశలో గ్రూప్‌లోని మిగిలిన 3 జట్లతో రెండేసిసార్లు భారత్ తలపడింది. వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపు... 66 పరుగులతో ఓటమి; ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి... 118 పరుగులతో విజయం; జింబాబ్వేపై 5 వికెట్లతో... 31 పరుగులతో విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్ చేరిన మన టీమ్ సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 6 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. అద్భుతం ఆవిష్కృతం... జూన్ 25, 1983... ఫైనల్‌కు వెళ్లినా, అప్పటికే లీగ్‌లో ఓడించినా సరే... దుర్బేధ్యమైన లైనప్ ఉన్న డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో గెలుపు అంత సులువు కాదని అందరికీ తెలుసు. పైగా ముందుగా బ్యాటింగ్ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్ డెవిల్స్ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్ జట్టును 140 పరుగులకే ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ప్రపంచ క్రికెట్‌పై భారత్ ముద్ర పడిన ఆ క్షణం ఎప్పటికీ మరచిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
ప్రపంచకప్ పాక్ గెలిచింది..కానీ?
లండన్ : పాకిస్తాన్ ప్రపంపకప్ గెలిచేసింది. లండన్‌లో శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అరే ఇంగ్లాండ్, న్యూజిలాండ్ కదా ఫైనల్‌కు చేరింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఫైనల్ చేరడం ఏంటి, ఫైనల్ మ్యాచ్ ఆదివారం కదా? అని అనుకుంటున్నారా? నిజమే పార్లమెంటు సభ్యులతో కూడిన ఇంటర్ పార్లమెంటరీ క్రికెట్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ కప్ కొట్టేసింది. ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆయా దేశాల పార్లమెంటు సభ్యులు ఈ పోటీలో క్రికెట్ ఆడారు. రోజూ పార్లమెంటులో మాటలతో అలసిపోతున్నారు అనుకున్నాడో ఏమో గానీ ఓ బ్రిటన్ ఎంపీ ఈ టోర్నమెంటును నిర్వహించాడు. పాక్, బంగ్లాదేశ్‌లు అన్ని దేశాలపై గెలిచి ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. 25మంది సభ్యులు గల ఈ పార్లమెంటు బృందం పాక్ విదేశాంగశాఖ మంత్రి మహ్మద్ ఖురేషీ కుమారుడు హుస్సేన్ ఖురేషీ నేతృత్వంలో లండన్ వెళ్లింది. ఒక పక్క దేశం అప్పుల్లో కూరుకొని దివాళా తీస్తుంటే వీళ్లకు క్రీడల పేరుతో విలాసాలు కావాలా? అంటూ కొందరు నెట్టింట దుమ్మెత్తి పోస్తుండగా.. యువకులతో కూడిన పాకిస్తాన్ క్రికెట్ టీం సెమీఫైనల్‌కు చేరకుండానే బోల్తా పడితే.. వీరు ఏకంగా కప్పే గెలిస్తే అభినందించడం మరిచి ఇలా విమర్శించడం సరికాదని కొందరు వెనకేసుకొస్తున్నారు. -
అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. ‘కపిల్’ కూతురు
ఎన్నో ఏళ్ల కలగా మారిన క్రికెట్ వరల్డ్‌కప్‌ను 1983లో కపిల్‌దేవ్ నాయకత్వంలోని టీమిండియా తొలిసారి గెలుచుకుంది. ఈ సంచలన విజయాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం ‘83. భారీ అంచనాలతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ కూతురు అమియాదేవ్ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 23 సంవత్సరాల చిన్న వయసులోనే కబీర్ ఖాన్ వద్ద దర్శకత్వ శాఖలో పని చేయడం ఆమెకు గొప్ప అనుభవాన్ని మిగుల్చుతుందని కపిల్‌దేవ్ ఈ సందర్భంగా అభిలషించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ద్వారా అమియా తన నైపుణ్యానికి పదును పెడుతోంది. కాస్ట్యూమ్స్ నుంచి షెడ్యూల్స్ వరకు అన్నింటినీ దగ్గరుండి మరీ పరిశీలిస్తోంది. క్రికెటర్ సందీప్ పాటిల్ పాత్రలో నటిస్తున్న ఆయన కుమారుడు చిరాగ్ పాటిల్ మాట్లాడుతూ ‘అమియా దేవ్‌ను మొదటిసారి షూటింగ్ స్పాట్లోనే కలిశా. తను నా కన్నా వయసులో చిన్నదైనా, పనిపట్ల ఎంతో అంకితభావం కలది’ అని ప్రశంసించారు. కప్ సాధించిన ఆటగాళ్ల పాత్రల్లో నటించనున్న వారిని సినిమా టీమ్ 10 రోజులపాటు ధర్మశాల తీసుకెళ్లనుంది. అక్కడ వారికి శిక్షణనివ్వడమే కాక వారిలో స్ఫూర్తి కలిగించడమే ట్రిప్ ముఖ్యోద్దేశమని తెలుస్తోంది. సాఖిబ్ సలీమ్, అమ్రీ విర్క్, పంకజ్ త్రిపాఠి, సాహిల్ ఖట్టర్, హార్దీ సంధు, తాహిర్ రాజ్ భాసిన్ లాంటి నటులు సినిమాలోని మిగిలిన క్రికెటర్ల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలవుతుందని సినిమా యూనిట్ తెలిపింది. -
పాకిస్తాన్ వెళ్లనున్న భారత క్రికెట్ దిగ్గజాలు..!
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం మరోమారు వాయిదా పడింది. మొదట ప్రకటించినట్లుగా ఆగస్టు 14న కాకుండా 18న ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధికార ప్రతినిధి ఫైజల్ జావేద్ శుక్రవారం వెల్లడించారు. ఇప్పటికే భారత్ నుంచి ఇమ్రాన్ ఖాన్ స్నేహితులైన సునీల్ గావస్కర్, కపిల్‌దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపామని తెలిపారు. 1992 వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులందరికీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపినట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు. కాగా, ఆగస్టు 13న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికైన నూతన సభ్యులు ప్రమాణం చేస్తారని పీటీఐ ఇన్ఫర్మేషన్ సెక్రటరీ ఫవాద్ ఛౌధురి తెలిపారు. అదేరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. సభలో తమకు 180 మంది సభ్యుల మద్దతు ఉందని ఫవాద్ చెప్తుండగా.. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. పీటీఐని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని కూటమిగా ఏర్పడిన పాకిస్తాన్ ముస్లింలీగ్ పార్టీ, (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముత్తహిదా మజ్లిసే అమల్ పార్టీ నాయకులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో.. తాము ఆగస్టు 18న జరిగే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి పాకిస్తాన్‌కు వెళ్తున్నామని సునీల్ గావస్కర్, కపిల్‌దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధూ మీడియాకు శనివారం వెల్లడించారు. -
ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ ప్రమోషనల్ వీడియో
లండన్ : 2019 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యేక రూపోందించిన ఓ ప్రమోషనల్ వీడియో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్లో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రచార గీతంలో ఫ్లింటాఫ్ ‘ప్రపంచకప్ వచ్చేస్తోంది’ అని హెడ్‌లైన్‌ను న్యూస్ పేపర్లో చూసి ఆనందంతో విజిల్ వేస్తూ.. కొంత మంది డ్యాన్సర్లు, అభిమానులతో గల్లీల్లో తిరుగుతూ.. పాడుతూ చిందేశాడు. ఫ్లింటాఫ్‌తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్నెల్లు కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ ఫ్లింటాఫ్ పాడుతుండగా.. వివిధ దేశాల జెండాలతో అభిమానులు, డ్యాన్లర్లు అతన్ని ఫాలో అవుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రపంచ క్రికెట్ సంగ్రామం వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్ వేల్స్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరగనున్న ఈ టోర్నీలో 10 దేశాలు పోటీపడనున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టూర్ ఆటకోసమా? హనీమూన్ కోసమా?