
ప్రమోషన్ సాంగ్‌లో ఫ్లింటాఫ్
లండన్ : 2019 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యేక రూపోందించిన ఓ ప్రమోషనల్ వీడియో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్‌లో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రచార గీతంలో ఫ్లింటాఫ్ ‘ప్రపంచకప్ వచ్చేస్తోంది’ అని హెడ్‌లైన్‌ను న్యూస్ పేపర్‌లో చూసి ఆనందంతో విజిల్ వేస్తూ.. కొంత మంది డ్యాన్సర్లు, అభిమానులతో గల్లీల్లో తిరుగుతూ.. పాడుతూ చిందేశాడు. ఫ్లింటాఫ్‌తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్‌నెల్‌లు కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ ఫ్లింటాఫ్ పాడుతుండగా.. వివిధ దేశాల జెండాలతో అభిమానులు, డ్యాన్లర్లు అతన్ని ఫాలో అవుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ప్రపంచ క్రికెట్ సంగ్రామం వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్ వేల్స్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరగనున్న ఈ టోర్నీలో 10 దేశాలు పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment