Promotional Song
-
ముగ్గురు టాప్ యాంకర్లతో హీరో ప్రదీప్ స్టెప్పులు
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనేది థియేటర్ల సాక్షిగా అభిమానులకు నేర్పించబోతున్నాడు యాంకర్ ప్రదీప్. ఆయన హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "30 రోజుల్లో ప్రేమించడం ఎలా?". ఫణి ప్రదీప్ (మున్నా) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే సందర్భంగా మంగళవారం 'వావా మేరే బావా' అనే ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: సింగర్ సునీత వెడ్డింగ్.. సుమ డాన్స్ అదరహో) ఇందులో పోర్ల జోలికి వెళ్లొద్దంటూనే ప్రదీప్ ముద్దుగా ముద్దుగుమ్మలతో డ్యాన్స్ చేయడం విశేషం. ఆ ముగ్గురు భామలెవరో కాదు, తెలుగు బుల్లితెరను ఏలుతున్న ముగ్గురు టాప్ యాంకర్లు రష్మీ, అనసూయ, శ్రీముఖి. ఇంకేముందీ.. యాంకర్లందరూ ఒకేచోట చేరి స్టెప్పులేస్తే ఆ జోష్ ఎలా ఉంటుందో చూపించాడు ప్రదీప్. ప్రస్తుతం ఈ వావా మేరే బావా పాట నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సాంగ్‌ను మీరు కూడా మరోసారి వినేయండి. (చదవండి: సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ వచ్చిందని ఏడ్చాను: ప్రదీప్) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సినిమా ప్రమోషన్ అందరి బాధ్యత
‘‘ఇండస్ట్రీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అన్నదే ఉంటాయి. అందరూ మంచి సినిమా తీయాలనే చేస్తారు. ఒక్కోసారి ప్రేక్షకులు తిరస్కరిస్తుంటారు. ‘రాగల 24 గంటల్లో’ టీమ్ చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి.. అవుతుంది కూడా’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ సినిమా ప్రచార పాటని దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలోని ప్రచార పాటని విడుదల చేసినందుకు శ్రీనివాస్‌రెడ్డిగారు నాకు థ్యాంక్స్ చెబుతున్నారు.. నిజం చెప్పాలంటే ఇది నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకే నేను థ్యాంక్స్ చెబుతున్నా. సినిమాని ప్రమోట్ చేయడం నటీనటులు, సాంకేతిక నిపుణుల బాధ్యత. సరిగ్గా ప్రమోట్ చేసి చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లినప్పుడే విజయం సాధించి మరో సినిమా రూపంలో అందరికీ పని దొరుకుతుంది. సినిమా బాగా ఆడుతుందని నమ్మకం ఉన్నా కూడా ప్రమోషన్ చేయాలి. ఎవరికైనా విజయాలు, అపజయాలు సాధారణం. అయితే శ్రీనివాస్ రెడ్డిగారు అందరితో మంచివాడు అనే ట్యాగ్‌లైన్ పొందడం సంతోషం. ఆయన ఎన్నో సక్సెస్‌లు కొడుతూనే ఉండాలి’’ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకి నేను, రఘు కుంచె ప్రమోషనల్ సాంగ్ చేద్దామనుకున్నప్పుడు దేవిశ్రీగారి ప్రత్యేక పాటలే గుర్తొచ్చాయి. మా ఈ పాటకి ఆయన పాటలే స్ఫూర్తి. అందుకే ఈ పాటని ఆయనతో విడుదల చేయించాం. ప్రస్తుతం యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రమోషన్స్‌కి రావడానికి ఇష్టపడటం లేదు. అందరూ రావాల్సిన అవసరం ఉంది. నిర్మాతలను కాపాడాల్సిన బాధ్యత నటీనటులు, సాంకేతిక నిపుణులు, మీడియాపై ఉంది. నిర్మాత బాగున్నప్పుడే మరో సినిమా చేస్తారు.. దాని ద్వారా కొన్ని వందల మందికి పని దొరుకుతుంది. శ్రీనివాస్‌లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం’’ అన్నారు. ‘‘సినిమాలంటే చాలా ప్యాషన్. కనీసం ఓ టీవీ సీరియల్ అయినా తీయలేనా? అనుకునేవాణ్ణి. సినిమా నిర్మిస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ భగవాన్గార్ల వల్లే ‘రాగల 24 గంటల్లో’ సినిమా తీయగలిగాను. ఈ ఏడాదిలో వచ్చిన మంచి చిత్రాల్లో మా ‘రాగల 24 గంటల్లో’ సినిమా కూడా నిలుస్తుంది’’ అన్నారు శ్రీనివాస్ కానూరు. ‘‘నాకు మంచివాళ్లంటే ఇష్టం. అందుకే.. శ్రీనివాస్‌రెడ్డిని బ్రదర్ థెరిస్సా అని పిలుస్తుంటా. ఈ సినిమాతో ఆయన స్టార్ డైరెక్టర్ కావాలి.. శ్రీనివాస్ కానూరు పెద్ద నిర్మాత అవ్వాలి’’ అన్నారు నటుడు కృష్ణభగవాన్. చిత్ర సంగీత దర్శకుడు రఘు కుంచె, కెమెరామన్ అంజి, పాటల రచయిత శ్రీమణి, నటుడు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉర్రూతలూగిస్తున్న ప్రపంచకప్ ప్రమోషనల్ వీడియో
లండన్ : 2019 ప్రపంచకప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రత్యేక రూపోందించిన ఓ ప్రమోషనల్ వీడియో క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తోంది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ లీడ్ రోల్లో రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రచార గీతంలో ఫ్లింటాఫ్ ‘ప్రపంచకప్ వచ్చేస్తోంది’ అని హెడ్‌లైన్‌ను న్యూస్ పేపర్లో చూసి ఆనందంతో విజిల్ వేస్తూ.. కొంత మంది డ్యాన్సర్లు, అభిమానులతో గల్లీల్లో తిరుగుతూ.. పాడుతూ చిందేశాడు. ఫ్లింటాఫ్‌తో పాటు శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, మహిళా క్రికెటర్ చార్లొటె ఎడ్వర్డ్స్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఫిల్ టఫ్నెల్లు కూడా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’ అంటూ ఫ్లింటాఫ్ పాడుతుండగా.. వివిధ దేశాల జెండాలతో అభిమానులు, డ్యాన్లర్లు అతన్ని ఫాలో అవుతూ డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రపంచ క్రికెట్ సంగ్రామం వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లండ్ వేల్స్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. రౌండ్ రాబిన్, నాకౌట్ పద్దతిలో జరగనున్న ఈ టోర్నీలో 10 దేశాలు పోటీపడనున్నాయి. చదవండి: ఇంగ్లండ్ టూర్ ఆటకోసమా? హనీమూన్ కోసమా? -
ఐసీసీ ప్రమోషనల్ వీడియోకు క్రికెట్ ఫ్యాస్స్ ఫిదా
-
ప్రేక్షకులకు థ్రిల్
సీనియర్ దర్శకుడు వి.సాగర్ నిర్మాతగా మారారు. తమ్ముడైన సీనియర్ కెమెరామన్ శ్రీనివాసరెడ్డి వుయ్యూరుని దర్శకునిగా పరిచయం చేస్తూ జోత్న్స ఫిలిమ్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘చారుశీల’. బ్రహ్మానందం, రేష్మి, రాజీవ్ కనకాల, జశ్వంత్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌ను బ్రహ్మానందం, టీజర్‌ను రాజీవ్ కనకాల విడుదల చేశారు. సాగర్ మాట్లాడుతూ- ‘‘థ్రిల్లర్ కథాంశంతో సాగే చిత్రమిది. 1990లో స్టీఫెన్ కింగ్ రాసిన ‘మిజరీ’ నవల ఆధారంగా తెరకెక్కించాం. అన్ని భాషల్లో తీయగల యూనివర్సల్ కథాంశమిది’’ అన్నారు. ఈ చిత్రం తాము హక్కులు కొన్న తమిళ ‘జూలీ గణపతి’కి ఫ్రీమేకంటూ కొందరు కోర్టుకెక్కారు. ఈ వివాదంపై మాట్లా డుతూ, ‘‘చిత్రానికి ఉన్న అడ్డంకులు కోర్టు తీర్పుతో తొలగి పోయాయి. సెప్టెంబర్‌లో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొ న్నారు. ‘‘ఈ చిత్రంలో ఓ మంచి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అని బ్రహ్మానందం అన్నారు. -
మోడ్రన్ కృష్ణుడిగా సునీల్
హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్, హీరోగా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త పరవాలేదనిపించినా, తర్వాత ఓ మోస్తరు హిట్ కూడా ఇవ్వలేక తడబడ్డాడు. ఇలాంటి సమయంలో కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సినిమా అప్ డేట్స్‌ను తెలియజేస్తూ ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సినిమా గ్రాండియర్‌తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సాంగ్, సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ముందుగా సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం భారీ పోటీ ఉండటంతో మరోసారి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి అనుకున్నట్టుగా కృష్ణాష్టమి సునీల్ కెరీర్‌కు హిట్ ఇస్తుందేమో చూడాలి. -
నాని ప్రమోషనల్ సాంగ్
‘‘ ‘ఈగ’ సినిమా తర్వాత నేను చేసిన ప్రమోషనల్ సాంగ్ ఇది. ఈ సినిమాలో నేనిచ్చిన వాయిస్ ఓవర్ తర్వాత వచ్చే సాంగ్ ఇది. మహేష్ శంకర్ చక్కటి సంగీతం అందించారు’’ అని నాని చెప్పారు. వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలని ముఖ్యతారలుగా సిరాజ్ కల్లా దర్శకత్వంలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మిస్తున్న ‘డి ఫర్ దోపిడి’ కోసం నానిపై ప్రత్యేకంగా చిత్రీకరించిన ప్రమోషనల్ సాంగ్‌ను హైదరాబాద్‌లో విడు దల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘బాలీవుడ్లో మేం చేసిన ‘గో గోవా గాన్’ చిత్రానికి నృత్యదర్శకత్వం చేసిన ఆదిల్ షేక్ నేతృత్వంలో ఈ ప్రమోషనల్ సాంగ్ చేశాం. ఒక్క రోజులో ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశామ’’ని తెలిపారు. టైటిల్ సాంగ్‌నే ప్రమోషనల్ సాంగ్‌గా చిత్రీకరించామని దర్శకుడు చెప్పారు. నవంబర్ ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ‘దిల్’ రాజు తెలిపారు.