మోడ్రన్ కృష్ణుడిగా సునీల్ | sunil new movie krishnastami promotional song | Sakshi
Sakshi News home page

మోడ్రన్ కృష్ణుడిగా సునీల్

Published Fri, Dec 25 2015 3:04 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 PM

మోడ్రన్ కృష్ణుడిగా సునీల్

మోడ్రన్ కృష్ణుడిగా సునీల్

హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్, హీరోగా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్లో కాస్త పరవాలేదనిపించినా, తర్వాత ఓ మోస్తరు హిట్ కూడా ఇవ్వలేక తడబడ్డాడు. ఇలాంటి సమయంలో కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తోంది.

తాజాగా సినిమా అప్ డేట్స్ను తెలియజేస్తూ ఓ ప్రమోషనల్ సాంగ్ను రిలీజ్ చేశారు. సినిమా గ్రాండియర్తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సాంగ్, సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ముందుగా సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం భారీ పోటీ ఉండటంతో మరోసారి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి అనుకున్నట్టుగా కృష్ణాష్టమి సునీల్ కెరీర్కు హిట్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement