krishnastami
-
దేశవ్యాప్తంగా శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలు ఘనంగా (ఫొటోలు)
-
అయోధ్యలో కృష్ణాష్టమి వేడుకలకు సన్నాహాలు
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రామనగరిలోని మఠాలు, ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠ తరువాత జరుగుతున్న తొలి జన్మాష్టమి వేడుకలు ఇవి.జన్మాష్టమి నాడు రామ్‌లల్లాకు 50 కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు. సాయంత్ర వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామనగరి అయోధ్యలో కృష్ణభక్తి కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.అయోధ్యలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. బాలరాముని ఆస్థానంలో ఆగస్టు 26న జన్మాష్టమి వేడుకలు జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలోని గోకుల్ భవన్, బ్రిజ్మోహన్ కుంజ్, రాధా బ్రిజ్రాజ్ ఆలయం, రాజ్ సదన్ వద్ద ఉన్న రాధా మాధవ్ ఆలయం, గురుధామ్, ఇస్కాన్ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలకు సన్నాహాలు పూర్తయ్యాయి. -
తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
తిరుమల/సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. గోగర్భం డ్యామ్ చెంత ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్దనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిõÙకాలు చేసి ఉట్లోత్సవం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ చేపట్టారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8–10 గంటల నడుమ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహించారు. ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానాన్ని ఘనంగా చేపట్టారు. కాగా, శుక్రవారం తిరుమలలో సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని బంగారు తిరుచ్చిపై మలయప్పస్వామివారు, మరో తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ తిలకించనున్నారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. కాగా, ఒడిశా గవర్నర్ గణేషీ లాల్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనాలను, అధికారులు ప్రసాదాలను అందజేశారు. కాగా, గోవిందకోటి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. చిన్నారులు, యువతలో సనాతన ధర్మం, మానవీయ విలువలు, మానవ సంబంధాల గురించి అవగాహన, ఆసక్తి పెంచడానికి టీటీడీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గురువారం గోవింద కోటి రాయడాన్ని ప్రారంభించారు. -
శ్రీకృష్ణాష్టమి ఎల్వీ గంగాధరశాస్త్రి తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి
-
పరమాత్ముడు పరమ ఆప్తుడు
కిట్టనివాళ్లు మాయగాడు అన్నారు. ఓరిమితో సహించాడు. శృంగార పురుషుడన్నారు... కిమ్మనలేదు. కొంటెకృష్ణుడని ఆడిపోసుకున్నారు... ఆగ్రహించలేదు. నల్లనివాడనీ, వెన్నదొంగ అనీ అన్నారు. కిమ్మనలేదు. తాత్వికుడన్నారు. కాదనలేదు. పరమాత్ముడవంటూ పూజలు చేశారు, కాదు పొమ్మనలేదు, తామరాకు మీది నీటిబొట్టులా దేనికీ చలించకుండా ఎవరు ఏ దృష్టితోచూస్తే ఆ దృష్టితో దర్శనమిచ్చాడు. పుట్టింది మొదలు అవతార పరిసమాప్తి వరకు అడుగడుగునా అనేక లీలలను ప్రదర్శించాడు. అందుకే పురాణాలు శ్రీకృష్ణుని లీలామానుష విగ్రహునిగా పేర్కొన్నాయి. నదులన్నీ సముద్రంలో చేరినట్లు కృష్ణుడు అందరికీ ఆప్తుడయ్యాడు. పరమాత్ముడయ్యాడు. త్రేతాయుగంలో దుష్టశిక్షణ అంతా మానవ ధర్మానికి కట్టుబడి జరిగిందే. అయితే ద్వాపరయుగానికి వచ్చేసరికి పరిస్థితులలో పెనుమార్పులు వచ్చాయి. దాంతో శ్రీహరి ఆయా పరిస్థితులకు అనుగుణంగా జవాబు చెప్పవలసి వచ్చింది. లక్ష్యం లోకోత్తరమైనది కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించినా, అందులో లక్ష్యసాధనే ప్రధాన ధ్యేయం. అంటే వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు అధర్మాన్ని అధర్మంతోనే జయించి, ధర్మాన్ని రక్షించడమే కృష్ణావతార ధ్యేయం. అందుకే కొన్ని సందర్భాలలో శ్రీకృష్ణుడు అవలంబించిన విధానాలు అధర్మంగా అగుపించవచ్చు. అయితే అవి యుగధర్మానుసారం జరిగినవే! పూర్ణ పురుషుడు... ఒక పురుషునిలో ఏమేమి లక్షణాలుంటే స్త్రీలందరికీ నచ్చుతాడో ఆయనకు బాగా తెలుసు. అందుకే తాను పరమాత్ముడయినప్పటికీ, ఒక సాధారణ బాలకునిలా ఎన్నోచిలిపి చేష్టలు చేశాడు. అమాయక బాలునిలా మన్ను తిన్నాడు. అదేమని అడిగిన అమ్మకు నోటిలో పదునాలుగు భువనభాండాలు చూపించాడు. అమ్మ ప్రేమపాశానికి లొంగిపోయి, గంధర్వులకి శాపవిముక్తి కావించాడు. మేనమామ కంసుడు పంపిన రాక్షసులను మర్ధించి, వారికి మోక్షం ప్రసాదించాడు. గోవులు కాచాడు. గోవర్థనగిరిని చిటికెన వేలిపై నిలిపి గోకులాన్ని రక్షించాడు. కాళియుడి పీచమణిచాడు. ఉట్టికొట్టాడు, వెన్న దొంగిలించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్లాడు. తోటిగోపాలకుల ఆనందం కోసం మురళి వాయించాడు. రాధను ప్రేమించాడు. తండ్రి బలవంతం మేరకు ఇష్టంలేని పెండ్లికి తలవంచిన రుక్మిణి కోసం యుద్ధం చేశాడు. ఇష్టసఖి సత్యభామ కోపంతో తన్నినా చిరునవ్వే సమాధానంగా చూపాడు. చివరకు ఆమెకోసం తులాభారం తూగాడు. ద్రౌపదికి మానసంరక్షణ చేశాడు. సుభద్రాతనయుడైన అభిమన్యుని ప్రేమను గెలిపించాడు. పాండవులకు అన్నింటా తానే అయి నిలిచాడు. వారికోసం దౌత్యం కూడా నడిపాడు. చివరికి అర్జునునికి రథసారథిగా మారాడు. ఆత్మస్థైర్యం కోల్పోయిన అర్జునుని కోసం గీతాచార్యునిగా మారి కొన్ని తరాల పాటు గ్రోలినా తరగనటువంటి వంటి గీతామృతాన్ని మానవాళికి ధారపోశాడు. గోపాలకృష్ణుడెలా అయ్యాడు? ‘గో’ అంటే ఆవు అని సామాన్యార్థం. గోపాలకుడు అంటే గోవులను కాసే వ్యక్తి. అయితే ‘గో’ అనే శబ్దానికి కిరణాలు, భూమి, పంచభూతాలు, జీవుడు అన్నవి విశేషార్థాలు. కాబట్టి గోవులను పాలించేవాడు అంటే సంరక్షించేవాడు కాబట్టి ఆయన గోపాలకృష్ణుడయ్యాడు. కృష్ణుడు అంటే క్లేశాలను, కష్టాలను పోగొట్టేవాడని అర్థం. చూపరులను సమ్మోహనం చేసే చిరునవ్వు, అందరినీ ఆనంద పరవశులను చేసే మురళీగానం, మనోల్లాస కరమైన సంభాషణలతో అందరినీ అలరించాడు. పుట్టింది మొదలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, దేనికీ భయపడకుండా, ఎవరికీ లొంగకుండా పరిస్థితులను ఎదిరించి పోరాడాడు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయం సాధించాడు. నమ్మినవారికి అండగా నిలిచాడు. ఆ స్వామిని సేవించిన వారికి మాయ అంటదని శ్రీమద్భాగవతం చెబుతోంది. మోహన రూపం శ్రీకృష్ణునిది మేఖశ్యామల వర్ణం. అంటే చామన చాయ. నల్లని రంగు దేనికీ తక్కువ కాదని చాటటమే అందులోని అంతరార్థం. బంగారు పిందెల మొలతాడు, సరిమువ్వగజ్జెలు, శిఖలో పింఛం, పట్టు దట్టి, కస్తూరీ తిలకం, వక్షస్థలంలో కౌస్తుభమణి... ఇవన్నీ ఆయన విభవానికి చిహ్నాలు. నాయనమ్మ అలంకరించిన నెమలి పింఛాన్ని ఆమె ప్రీతికోసం ఎల్లప్పుడూ ధరించేవాడు. చేతిలోని మురళి గోవులను, గోపబాలకులను అలరించేందుకు ఉద్దేశించినదే. మానవునిగా జన్మించినందుకు యశోద వాత్సల్యాన్ని నిండుగా అనుభవించాడు. పసితనంలోని అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని మెండుగా గ్రోలాడు. బాల్యంలోని మాధుర్యాన్ని హాయిగా ఆస్వాదించాడు. లోకానికి కంటకంగా మారిన కంస, నరకాసురాది రక్కసులను సంహరించాడు. చివరకు తానే దూర్వాసుని శాపానికి కట్టుబడి సామాన్య మానవునిలా బోయవాని చేతిలో మరణించాడు. కృష్ణాష్టమిని ఎలా జరుపుకోవాలి? కృష్టజన్మాష్టమీ వ్రతం చేసుకునేవారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, షోడశోపచారాలతో కృష్ణుని పూజించాలి. పగలంతా ఉపవసించి సాయంకాలం చిన్నికృష్ణుని విగ్రహాన్ని పూజించి, తర్వాత ఊయలలో ఉంచి, ఊపాలి.దేవకీదేవి బాలకృష్ణునికి స్తన్యమిస్తున్నట్లుగా ఉండే విగ్రహాన్ని పూజిస్తే మంచిది. కృష్ణునికి ప్రీతికరమైన పాలు, వెన్న, పండ్లు, అటుకులు మొదలైన వాటిని నైవేద్యం పెట్టి, వాటిని ప్రసాదంగా ఆరగించడం వల్ల అన్నింటా జయం సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ పుణ్యతిథి నాడు కృష్ణుని పూజించి, భాగవత గ్రంథాన్ని పఠించినా, దానం చేసినా సకల పాపాలూ తొలగి, చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని భాగవతోక్తి. వెన్న ఎందుకు దొంగిలించాడు? వెన్న నల్లని కుండలలో కదా ఉండేది. మృణ్మయ రూపమైన మనుష్యశరీరమే మృత్తికారూపమైన వెన్నకుండ. మన మనస్సే కుండలోని వెన్న. అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ. వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు. -
గోపాలుడు..అందరివాడు
-
ఆ...బాల గోపాలం
-
చిన్ని కిట్టయ్యల సందడి
-
'కృష్ణాష్టమి' మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణాష్టమి జానర్ : రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తారాగణం : సునీల్, డింపుల్ చొపడే, నిక్కి గల్రాని, ముఖేష్ రుషి, అశుతోష్ రాణా సంగీతం : దినేష్ కనకరత్నం దర్శకత్వం : వాసువర్మ నిర్మాత : దిల్ రాజు రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కృష్ణాష్టమి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సునీల్. సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించగా, జోష్ ఫేం వాసువర్మ తొలి సినిమా తరువాత ఏడేళ్లకు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నించాడు. కమెడియన్ నుంచి హీరోగా మారిన తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సునీల్ కెరీర్‌కు ఈ చిత్రం సక్సెస్ కీలకంగా మారింది. మరి కృష్ణాష్టమి సునీల్ కెరీర్‌కి బూస్ట్ ఇచ్చిందా..? ఈ సినిమాతో అయినా వాసువర్మ దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడా..? కథ : చిన్నప్పుడే అమ్మానాన్నను పోగొట్టుకున్న కృష్ణవర ప్రసాద్ ( సునీల్ )ను పెదనాన్న రామచంద్ర ప్రసాద్ ఫారిన్లో చదివిస్తుంటాడు. అక్కడే పెరిగి పెద్దవాడైన కృష్ణవర ప్రసాద్ వీడియో గేమ్ డిజైనర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. 18 ఏళ్లుగా తన వాళ్లకు దూరంగా ఉన్న కృష్ణ ఎలాగైన ఇండియా రావాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ పెదనాన్న మాత్రం కృష్ణ ఇండియాకు రాకుండా అడ్డు పడుతుంటాడు. అంతేకాదు అక్కడే సెటిల్ అయిన ఓ ఎన్నారై అమ్మాయితో కృష్ణకు పెళ్లి కూడా కుదురుస్తాడు. దీంతో ఎలాగైనా ఇండియా రావాలనుకున్న కృష్ణ పెదనాన్నకు తెలియకుండా ఫ్రెండ్ గిరి (సప్తగిరి)తో కలిసి ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తాడు. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యూరోప్‌లో దిగిన కృష్ణ, అక్కడ పల్లవి(నిక్కి గల్రానీ)ని తొలి చూపులోనే ప్రేమించి, తిరిగి ఫ్లైట్ ఎక్కేలోపు తనని కూడా ప్రేమలో పడేస్తాడు. ఇక కృష్ణ వరప్రసాద్ ఇండియాలో దిగాక అసలు కథ మొదలవుతుంది. కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో కృష్ణకు పరిచయం అయిన డాక్టర్ అజయ్ కుమార్(అజయ్) ఎయిర్ పోర్ట్‌లో ఓ హత్య చూసి భయపడిపోతాడు. దాంతో అతనిని ఇంటికి చేర్చే బాధ్యత కృష్ణ తీసుకుంటాడు. కృష్ణ, అజయ్‌లు ఇంటికి వెళ్లే సమయంలో ఎయిర్ పోర్ట్‌లో హత్య చేసిన వాళ్లే వీరి మీద మరోసారి దాడి చేస్తారు. ఈ దాడిలో అజయ్ గాయపడతాడు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబానికి తెలియజేయడానికి వెళ్లిన కృష్ణ, అక్కడి పరిస్థితుల కారణంగా నిజం చెప్పలేక తానే అజయ్‌గా ఉండిపోవాల్సి వస్తుంది. ఇంతలో ఆ ఇంటి పెద్ద తన కూతురి(డింపుల్ చోపడే)ని అజయ్‌కి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడని తెలుసుకున్న కృష్ణ, అజయ్‌గా తాను చెపుతున్న అబద్దానికి ముగింపు పలకాలనుకుంటాడు. ఉత్తరం రాసిపెట్టి ఆ ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో కొంతమంది మళ్లీ కృష్ణను చంపడానికి ప్రయత్నిస్తారు. అసలు కృష్ణను చంపాలనుకుంటుంది ఎవరు..? అజయ్ కుటుంబానికి కృష్ణకు ఉన్న సంబందం ఏంటి..? కృష్ణను అతడి పెదనాన్న ఇండియా రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు..? ఈ సమస్య లన్నింటికి కృష్ణ ఎలా ముగింపు పలికాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన సునీల్ ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లు, బిల్డప్ షాట్లతో మాస్ హీరో ఇమేజ్ కోసం బాగానే కష్టపడ్డాడు. చాలా వరకు బాగానే అనిపించినా సునీల్ ఇమేజ్ కారణంగా కొన్ని చోట్ల అంతగా వర్క్ అవుట్ కాలేదు. తన మార్క్ కామెడీ, డ్యాన్స్‌లతో మాత్రం మరోసారి ఆకట్టుకున్నాడు. ఇక పేరుకు ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఎవరికీ నటన పరంగా పెద్దగా అవకాశం లేదు. అయితే ఉన్నంతలో గ్లామర్ షోతో మాత్రం బాగానే ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో పల్లవిజం కాన్సెప్ట్‌తో నిక్కి గల్రానీ నవ్వించే ప్రయత్నం చేసినా అది బాద్షా సినిమాలో కాజల్ పాత్రకు స్పూఫ్‌లా అనిపించింది. ఎప్పుడు నెగెటివ్ పాత్రలో కనిపించే ముఖేష్ రుషి, పాజిటివ్ పాత్రలోనూ మెప్పించాడు. అషుతోష్ రాణా విలన్‌గా ఆకట్టుకున్నాడు. సప్తగిరి, పోసాని కృష్ణమురళిల కామెడీ బాగానే వర్క్ అవుట్ అయింది. సెల్పీ పిచ్చి ఉన్న క్యారెక్టర్లో కనిపించిన బ్రహ్మనందం మరోసారి నిరాశపరిచాడు. సాంకేతిక నిపుణులు : జోష్ సినిమాతో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయినా దర్శకుడు వాసు వర్మ మీద ఎంతో నమ్మకంతో దిల్ రాజు మరో అవకాశం ఇచ్చాడు. అయితే రెండో అవకాశాన్ని కూడా వాసు వర్మ సరిగ్గా ఉపయోగించుకున్నట్టుగా కనిపించలేదు. హీరో విలన్ ఇంట్లో ఉండి వాళ్లను మార్చటం అనే రొటీన్ కాన్సెప్ట్నే మరోసారి ఎంచుకున్న వాసువర్మ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త సోలోగా నడించినా సెకండాఫ్‌లో మాత్రం వేగంగా కథ నడిపించాడు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో(అల్లు అర్జున్) కోసం రాసుకున్న కథను కామెడీ ఇమేజ్ ఉన్న హీరోతో తెరకెక్కించడం అంతగా వర్క్ అవుట్ అయినట్టుగా లేదు. ఇక సినిమాటోగ్రాఫీ చాలా బాగుంది. యూరప్ అందాలతో పాటు ఇండియాలోని లోకేషన్స్‌ను కూడా చాలా బాగా చూపించారు. దినేష్ కనకరత్నం సంగీతం పరవాలేదనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సాంగ్స్, ఫైట్స్, ఫారిన్ లొకేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : కామెడీ సినిమాటోగ్రఫి సినిమా నిడివి మైనస్ పాయింట్స్ : రొటీన్ కథ ఫస్ట్ హాఫ్ పాటలు ఓవరాల్‌గా కృష్ణాష్టమి, రొటీన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్ -
ఆ గదికి ఇప్పటికీ రెంట్ కడుతున్నారట..!
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కామెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలలో స్థానం సంపాదించుకున్నారు. కానీ ఒకప్పుడు ఈ ఇద్దరు అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో సునీల్, త్రివిక్రమ్‌లు పంజాగుట్ట సాయిబాబా గుడి సమీపంలోని రూంలో అద్దెకు ఉండేవారు. వీరి జీవితాల్లో ఎంతో విలువైన క్షణాలెన్నో ఆ రూంతో ముడిపడి ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఆ రూంకు రెంట్ కడుతున్నామన్నాడు హీరో సునీల్. తను హీరోగా నటించిన కృష్ణాష్టమి రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సునీల్, కెరీర్ స్టార్టింగ్‌లో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న కృష్ణాష్టమి సినిమాకు జోష్ ఫేం వాసు వర్మ దర్శకుడు. చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి. -
ఆయనతో సినిమా నా లక్ష్యం
‘కృష్ణాష్టమి’ చిత్రం వినోద ప్రధానంగా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది’’ అని ‘దిల్’ రాజు అన్నారు. సునీల్ హీరోగా వాసూ వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు చెప్పిన విశేషాలు... ‘కృష్ణాష్టమి’ సినిమా షూటింగ్ ఆగస్టులోనే పూర్తయింది. సెప్టెంబరులో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ రిలీజ్ ఉండటంతో అక్టోబరులో రిలీజ్ చేద్దామనుకున్నా. కానీ, ‘రుద్రమదేవి, అఖిల్, బ్రూస్లీ’ లాంటి పెద్ద సినిమాల రిలీజ్‌లను ప్రకటించడంతో డిసెంబరులోనో, సంక్రాంతి టైమ్‌లోనో రిలీజ్ ప్లాన్ చేశాం. అప్పుడు కూడా చాలా సినిమాలు ఉండటంతో అనువైన తేదీ కోసం చూశాను. ఫిబ్రవరి 19 సరైన డేట్ అనిపించింది.. ముందు బన్నీతో ఈ సినిమా తీద్దామనుకున్నాం. దర్శకుడు గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’ కన్నా ముందే నాకీ కథ చెప్పాడు. ఈ కథ విన్న బన్నీ, ‘‘ ‘ఆర్య, ‘పరుగు’ తర్వాత మనం చేసే సినిమా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలి. మామూలు కమర్షియల్ ఎంటర్టైనర్స్ చేయకూడదు’’ అని సలహా ఇచ్చాడు. అందుకే ఆపేశాం. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ని కూడా బన్నీతోనే తీయాలనుకున్నాం. అప్పటికే త్రివిక్రమ్‌తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’కి బన్నీ కమిట్ కావడంతో, తనకు చెప్పి సాయిధరమ్‌తో ఈ సినిమా తీశాం. గోపీచంద్ మలినేని నాకు చెప్పిన ‘కృష్ణాష్టమి’ కథను వాసూవర్మకు చెప్పాను. ఆ తర్వాత తను కథ మీద వర్కవుట్ చేశాడు. సునీల్ ఈ కథ విని, ‘అన్నా... ఇంత పెద్ద బడ్జెట్ సినిమానా?’ అని ఆశ్చర్యపోయాడు. సునీల్‌కి ఈ సినిమా ఎంతగా నచ్చిందంటే ఈ సినిమా 80 శాతం పూర్తయ్యేవరకూ వేరే చిత్రాలను సునీల్ అంగీకరించలేదు. ‘జోష్’ సినిమా ఫ్లాప్ అయినా వాసుతో సినిమా చేయడానికి అతనికీ, మా బ్యానర్‌కీ ఉన్న అనుబంధమే. అయినా ‘జోష్’ కథను ఎంపిక చేసుకోవడంలో నిర్మాతగా నేను ఫెయిల్ అయ్యాను. దానికి నాదే బాధ్యత. అనిల్ రావిపూడి-సాయిధరమ్‌తేజ్ కాంబినేషన్లో ‘సుప్రీమ్’ రెడీ అవుతోంది. కృష్ణవంశీతో ఓ సినిమా ఉంటుంది. దాని పేరు ‘రుద్రాక్ష’ అని వార్త ప్రచారంలో ఉంది. ఆ టైటిల్ ఉండచ్చు... ఉండకపోవచ్చు. వరుణ్‌తేజ్ హీరోగా వెంకీ అనే కొత్త దర్శకునితో, అలాగే రాజ్‌తరుణ్ హీరోగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శతమానం భవతి’... ఇలా వరుసగా సినిమాలు ఉన్నాయి. రవితేజ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయాలనుకున్న ‘ఎవడో ఒకడు’ని నాగార్జునగారితో చేద్దామను కుంటున్నాం. అయితే, ఇంకా చర్చల దశలోనే ఉంది. పవన్‌కల్యాణ్ తో సినిమా చేయాలన్నది నా లక్ష్యం. మంచి స్క్రిప్ట్‌తో వస్తే చేస్తానని ఆయన మాటిచ్చారు. -
మోడ్రన్ కృష్ణుడిగా సునీల్
హీరోగా మారిన స్టార్ కమెడియన్ సునీల్, హీరోగా స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త పరవాలేదనిపించినా, తర్వాత ఓ మోస్తరు హిట్ కూడా ఇవ్వలేక తడబడ్డాడు. ఇలాంటి సమయంలో కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉన్నా, వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సినిమా అప్ డేట్స్‌ను తెలియజేస్తూ ఓ ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సినిమా గ్రాండియర్‌తో పాటు నటీనటులను పరిచయం చేస్తూ రూపొందించిన ఈ సాంగ్, సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. ముందుగా సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం భారీ పోటీ ఉండటంతో మరోసారి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. మరి అనుకున్నట్టుగా కృష్ణాష్టమి సునీల్ కెరీర్‌కు హిట్ ఇస్తుందేమో చూడాలి. -
'జక్కన్న'గా మారుతున్న సునీల్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన సునీల్, ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత ఏడాది భీమవరం బుల్లోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సునీల్, 2015లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కృష్ణాష్టమి ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుందని భావించినా ఇప్పటివరకు అలాంటి వార్తే లేదు. వరుస ఫెయిల్యూర్స్‌తో సునీల్ మార్కెట్ భారీగా పడిపోవటంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణాష్టమి రిలీజ్ ఆలస్యం అవుతున్నా, తరువాతి సినిమాల విషయంలో మాత్రం జోరు చూపిస్తున్నాడు సునీల్. ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'జక్కన్న' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే రచయిత గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలోనూ సునీల్ హీరోగా నటించనున్నాడు. వీటితో మరో ఇద్దరు యువ దర్శకుల కథలను కూడా ఓకే చేశాడన్న టాక్ వినిపిస్తోంది. -
సంక్రాంతి బరిలో పూలరంగడు
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన టాలీవుడ్ నటుడు సునీల్. అందరూ కమెడియన్ లలా కాకుండా స్టార్ ఇమేజ్ అందుకునే స్ధాయి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఈ ఇమేజ్ ను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. హీరోగా చేసిన రెండు మూడు సినిమాలు బాగానే వర్క్ అవుట్ అయినా తరువాత మాత్రం పెద్గగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా కామెడీ ఇమేజ్ ఉన్న సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో భారీ యాక్షన్స్ సీన్స్ చేసేటం ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. దీంతో సునీల్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈ షాక్ తో ఆలోచనలో పడ్డ సునీల్ కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరి లావుగా కాకపోయినా ఈ సినిమాలో కాస్త చబ్బీ చబ్బీగా కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పవన్, మహేష్, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్ పోటీలో ఉండగా సునీల్ తన సినిమా రిలీజ్ కు అదే సీజన్ ను ఎంపిక చేసుకోవటం రిస్కే అంటున్నారు సినీ విశ్లేషకులు. -
వెండితెరపై కృష్ణయ్య పాటలు
-
కృష్ణ లీలలు కథలు కాదు సమాజసేవ
ఇవాళ కృష్ణాష్టమి. ఆయన జగద్గురువు. ఇవాళ టీచర్స్ డే కూడా. జగతిలోని గురువులందరికీ వందనాలు. మనకు ఉన్నదే జ్ఞానము అనుకోవడం మూర్ఖత్వం. జ్ఞానం ఉన్నవారిని అనుసరించకపోవడం అవివేకం. చాగంటివారు చల్లని గురువు. జ్ఞానమూ ఉంది, పరిజ్ఞానమూ ఉంది. పరులకు పంచిపెట్టే ప్రజ్ఞా ఉంది. జగద్గురువుకు, జగద్గురువులకు, జగమెరిగిన గురువులకు... సాదర ప్రణామాలు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సాక్షి టీవీ,దినపత్రిక కోసం ‘ఎమెస్కో బుక్స్’ అధినేత దూపాటి విజయకుమార్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. విజయకుమార్: మీ వ్యక్తిగత వివరాలు వినాలని ఉత్సుకతగా ఉంది... దయచేసి చెబుతారా? చాగంటి: మా నాన్నగారు గొప్ప పండితులు, కవి. పశ్చిమగోదావరి జిల్లా చాటపర్రులోని ఒక ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా జీవితాన్ని సాగించారు. జీతంలో కొంత భాగాన్ని పేదపిల్లల చదువుకు వినియోగించేవారు. భక్తి తత్పరులు. ఆయన దృష్టిలో భక్తి అంటే సమాజాన్ని ప్రేమించడం. మా అమ్మ సుశీలమ్మ భర్తను అనుకరించడం మినహా ఏమీ తెలియని సాధ్వి. నాకు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు. అందరూ చదువుకున్నారు. నేను ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. వృత్తి రీత్యా అధికారిని అయినా, ప్రవృత్తి రీత్యా సాయంకాలం ప్రవచనం చేయడాన్ని ఒక అలవాటుగా స్వీకరించాను. నా భార్య సుబ్రహ్మణ్యేశ్వరి రాష్ట్రప్రభుత్వంలో పనిచేస్తూ నాకన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉంటోంది. నా కొడుకు, కూతురు ఇంజినీర్లే. భగవంతుడు నాకన్నీ ఇచ్చాడు. సంతోషంగా ఉన్నా. విజయకుమార్: ధర్మం అంటే సమాజ హితం అన్నారు. అది ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుందా? మారుతుందా? అసలు ధర్మం స్వరూపం ఏమిటి? చాగంటి: ధర్మం అందరికీ అన్వయిస్తుంది. ప్రత్యేకించి మనిషి జన్మ ఎత్తిన వాడికి ధర్మాన్ని అనుష్ఠించడం అత్యంత అవసరం. పశువులన్నింటికీ ఒకటే ధర్మం. ఆకలేస్తే తింటుంది, భయం వేస్తే భయపడుతుంది, నిద్ర వస్తే పడుకుంటుంది, సంతానం కావాలనుకుంటే కంటుంది, చివరికి శరీరాన్ని వదిలిపెడుతుంది. మనిషి అలా కాదు. మారే ధర్మాన్ని నిరంతరం పట్టుకోవాలి. ధర్మం నాలుగు విషయాల ఆధారంగా మారిపోతుంటుంది. అవి దేశం, కాలం, వర్ణం, ఆశ్రమం. దేశం అంటే.. నేను ఇంట్లో ఉంటే చేసే పనులను ఇంకో ఊరు వెళితే చేయలేను. ఇంట్లో అందుబాటులో ఉన్న వ్యవస్థ వేరే ఊళ్లో ఉండదు. మానసికంగా ధ్యానం చేసి సంతోషించాలి. ఇంట్లో చేసే పూజలో పదోవంతు ఇక్కడ చేస్తే చాలు. కాలం.. ఒక కాలంలో ఉన్నది ఇంకో కాలంలో ధర్మం అవదు. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు పారణ ధర్మం. వర్ణం.. యజ్ఞోపవీతం ఉన్న వాడికి సంధ్యావందనం ధర్మం, యజ్ఞోపవీతం లేకపోతే సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. ఎవరికి ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికలా విధించింది శాస్త్రం. ఆశ్రమం.. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి. ఒక్కొక్కరిది ఒక్కో ధర్మం. గృహస్థు దానం పడతాడు. బ్రహ్మచారి దానం పట్టకూడదు. వానప్రస్థుకి కుటుంబంతో తాదాత్మ్యత ఉండదు. గృహస్థు తన భార్యాబిడ్డల గురించి పట్టించుకోవాలి. అందుకనే ఆశ్రమాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది. ఈ ధర్మాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నవాడు చిట్టచివరికి మారనటువంటి సత్యంగా మారిపోతాడు. సత్యమే ఈశ్వరుడు. నాకు ఒకటి ధర్మం అనిపిస్తే, మరొకరికి మరొకటి ధర్మం అనిపిస్తుంది. వ్యక్తుల అవకాశాన్ని బట్టి ధర్మాన్ని నిర్ణయించే అవకాశాన్ని విడిచిపెట్టలేదు భగవంతుడు. ధర్మానికి శాస్త్రమే నిర్ణేత. ఒక పని చెయ్యాలా, చెయ్యకూడదా, చేస్తే ఎలా చేయాలనేది శాస్త్రం చెబుతుంది. అది చదువుకోవడం, పట్టుకోవడం మనిషి అభ్యున్నతికి కారణాలవుతాయి. ప్రతిరోజూ ధర్మానుష్ఠానం చేసి ధార్మిక జీవితం గడిపితే తను ప్రశాంతంగా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్లకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఇచ్చి చివరికి సత్యమై నిలిచిపోతాడు. విజయకుమార్: ఆచారం ధర్మానికి మూలం. మరి ఆచారం కూడా నిరంతరం మారుతూ ఉండాలి కదా? చాగంటి: నిజమే. ధర్మం ఎలా మారుతుందో ఆచారం కూడా అలా మారుతుంది. మనిషి స్థితిని దృష్టిలో పెట్టుకుంది శాస్త్రం. ఇలాగే చేయాలి అంటే అందరూ అన్ని వేళలా అలా చెయ్యలేకపోవచ్చు. ఉదాహరణకు 20 మంది కలిసి కాశీ యాత్రకు వెళ్లారు. అందులో ఒక వ్యక్తికి 104 జ్వరం రావడంతో స్నానం చేయలేదు. మిగిలినవాళ్లు స్నానం చేశారు. 20 మందీ తిరిగివచ్చారు. వారిలో కాశీలో గంగాస్నానం చెయ్యకుండా తిరిగివచ్చిన అతను కూడా గంగాస్నానం చేసినట్లా.. కాదా... అంటే... గంగాస్నానం కోసమే అతను కాశీకి వెళ్లాడు. శరీరానికి వైక్లబ్యం వచ్చింది. శరీరాన్ని వదిలిపెట్టేసి స్నానం ఎలా చేస్తాడు? కానీ కాశీకి వెళ్లిందే గంగాస్నానం కోసం కాబట్టి అతను కూడా గంగాస్నానం చేసినట్లే. అందుకే మనిషి స్థితిని బట్టి ఆలోచన చేయాలి. ఆరోగ్యంగా ఉంటే తల స్నానం చెయ్యి. జ్వరమొస్తే నడుం వరకూ, ఆ ఓపికా లేకపోతే మూడుసార్లు నీళ్లు చల్లుకో. అది కూడా చేయలేని పరిస్థితి అయితే విభూతి చల్లుకో చాలు. అదీ చేయలేకపోతే మంచం మీదే పడుకుని గోవింద నామం చెప్పు. అదీ చేయలేని స్పృహ లేని పరిస్థితి అయితే కొడుకు పక్కనే కూర్చుని గోవింద అంటే చాలు. తండ్రి స్నానం చేసినట్లే. ఇప్పుడు ఆచారం మారిందా, లేదా! మారింది. మనిషి మనసును ప్రశాంతంగా ఉంచడం కోసం ఆచారకాండ వచ్చిందే తప్ప బాధపెట్టడానికి కాదు. ఆచారం ప్రధాన ఉద్దేశం మనసును పవిత్రం చేయడం. మనసును పవిత్రంగా ఉంచుకోవాలనే తాపత్రయం ఉంది కాబట్టి ఆచారం పాటించాలి. రమణమహర్షి పంచెకట్టుకున్నాడా లేదా అని ఎవరూ అడగరు. గోచి పెట్టుకున్నా ఆయన పరమేశ్వరుడే. ఆ స్థితికి వెళ్లిపోయాక ఆచారంతో సంబంధంలేదు. అప్పటివరకూ ఆచారాన్ని వదిలిపెట్టవద్దు. ఎందుకంటే అది మనసును పవిత్రంగా ఉంచి మనిషిని మనిషిగా బతకడానికి మార్గం చూపిస్తుంది. విజయకుమార్: బట్టతలలు, తెల్లజుట్టు వాళ్లు కనిపించే మీ సభల్లో ఈ మధ్య కుర్రాళ్లు ఎక్కువగా కనపడుతున్నారు. దేవాలయాలకూ కుర్రాళ్లు ఎక్కువగా వస్తున్నారు. పిల్లలు భక్తి మార్గానికి ఎక్కువగా వస్తున్నారు. సమాజంలో వచ్చిన మార్పు వల్ల ఈ తరం ఐడెంటిటీ క్రైసిస్‌ను ఎదుర్కొంటోంది. కానీ వారికి సమాజ హితమే భక్తి అని చెప్పడానికి మీరేం చేస్తారు? చాగంటి: మనిషికి మనిషితో అనుబంధం ఏర్పడడానికి రెండు కారణాలుంటాయి. సోదరభావం, స్నేహభావం. సోదర భావానికి మన ప్రయత్నం అక్కర్లేదు. నాతో కలిసిపుట్టినవాడు, నా అక్కచెల్లెళ్లున్నారు. వాళ్ల మీద నాకు ప్రేమ. ఎక్కడ ఉన్నా నేను వాళ్లను స్మరించుకుంటే నా మనసు ఆర్ద్రత పొందుతుంది. వాళ్లేదైనా కష్టంలో ఉంటే నా ఖర్చు తగ్గించుకుని వాళ్లకి సాయం చేయాలనిపిస్తుంది. వాళ్లిళ్లలో ఏదైనా శుభకార్యం జరిగితే వెళ్లి పాల్గొనాలనిపిస్తుంది. ఈ సంబంధానికి మూలం మేమంతా ఒక్క తల్లితండ్రీ బిడ్డలం కాబట్టి. భక్తికి ప్రారంభం దేశంలో ఎక్కడుందంటే మేం అంతా ఒక్క తల్లితండ్రుల బిడ్డలమనే. ఎవరా తల్లితండ్రులు? లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, ఏ పేరైనా పెట్టుకోండి. జాతీయ సమైక్యతకు, సెక్యులరిజానికి మూలాలు ఈ దేశంలో ఎక్కడున్నాయి? భక్తిలో ఉన్నాయి. భక్తి మౌఢ్యం ఎప్పుడూ కాదు. యువతకు భక్తి ఉండి తీరాలి. భక్తిలో రెండు భిన్నమైన విషయాలు ఏకీకృతమవుతాయి. పిల్లలు దేవాలయాలకు వెళ్లడానికి, వినడానికి కారణం అదే. నేను చాలా భయపడుతున్నాననుకోండి ధైర్యంగాలేనని. నేను ధైర్యంగా ఉన్నాననుకోండి, భయంగాలేనని. కానీ భక్తి ఉన్నవాడికి భక్తి, ధైర్యం రెండూ ఉంటాయి. నేను భక్తుణ్ణి అంటే రోజూ వెయ్యి మారేడు దళాలు తెచ్చి పూజ చేస్తానని కాదు. భక్తి అంటే నేను భగవంతుడిని నమ్మానని. తప్పు చేయకుండా నియంత్రించేది భక్తి ఒక్కటే. అందుకే ఈ దేశంలో ఒకప్పుడు ఇంటికి తాళం కప్పలేదు. ఎందుకు లేదంటే తలుపు తీసి వెళ్లిపోయినా ఇంకో వ్యక్తి ఆ ఇంట్లో వస్తువును తీసుకోడు. ఇంకొకడి వస్తువు నాకు బెడ్డ ముక్క. అది నాకు ఈశ్వరుడు ధార్మికంగా ఇస్తే తృప్తి. ఇది మనిషికి తృప్తి, సంతోషం, శాంతినిస్తుంది. దీనివల్ల పక్కవాణ్ణి ఇబ్బంది పెట్టడు, పాడు చేయడు, పాపపు పని చేయడానికి భయపడతారు. దేశమంతా శాంతిభద్రతలుంటాయి. అందుకే భారతదేశం అంటే ఒకప్పుడు శాంతికి పర్యాయపదం. ఇప్పటికీ శాంతిసూక్తం చెబితే, మనుషుల శాంతి గురించి మాట్లాడారు. అంతరిక్ష శాంతి, గోశాంతి, భూశాంతి, వాయుశాంతి. వాయువు ప్రకోపించకూడదు. భూమి ప్రకోపించకూడదు. ప్రజల మనోభావాలు, సంస్కృతి వల్ల పంచభూతాలు ప్రశాంతంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన భయం భక్తిలో ఉంటుంది. ధైర్యం భక్తిలో ఉంటుంది. భక్తి కలిగిన దేశం కాబట్టే ఈ దేశం ప్రపంచంలో మిగిలిన దేశాలకు నాయకత్వం వహించింది. ఇవాళ మళ్లీ యువత భక్తిలోకి రావడం, భక్తి వల్ల ఆరోగ్యవంతమైన భయాన్ని, ధైర్యాన్ని పొందడం ఎంతో సంతోషించదగ్గ విషయం. నేను ఒకప్పడు భాగవతం గురించి చెబుతూ కృష్ణలీలలన్నీ కథలు కాదు సమాజసేవని చెప్పాను. పూతన సంహారం సమాజసేవ. కాళీయమర్దనం యమునానది నీళ్లు పాడవకుండా చేసిన సమాజ సేవ. కృష్ణుడు సమాజ సేవలో సంతోషం పొందాడు. అవే మనం నేర్చుకోవాలని చెప్పా. ఆ తర్వాత కొద్దిరోజులకి ప్రవచనానికి వెళ్లిపోతుంటే ఒక పిల్ల వచ్చింది మా ఇంటికి. ఎవరు నువ్వనడిగితే బీటెక్ చదువుకుంటున్నాను, మీకు నమస్కారం చేయాలని వచ్చానంది. నేను ప్రవచనానికి వెళుతున్నానమ్మా మళ్లీ వెనక్కివచ్చి నీతో మాట్లాడే సమయం లేదన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు కనబడ్డారు చాలు నమస్కారం అంది. ఇద్దరం లిఫ్టులో దిగుతుండగా నాకు నమస్కారం పెట్టాలని ఎందుకు అనిపించిందని అడిగాను. మీ మాటల వల్ల ప్రేరణ చెందానని చెప్పడంతో ఆశ్చర్యపోయి ఏం ప్రేరణ చెందావని అడిగా. మీరు చెప్పిన కృష్ణలీలలు సమాజ సేవన్నారు అది ప్రేరణ కల్పించిందని, నా స్థాయిలో సమాజ సేవ చేశానంది. కారెక్కబోతున్నవాడిని ఆగి ఏం సమాజ చేశావని అడిగాను. ప్రతిరోజూ ఒక గంట సేపు గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్లి ఓపీ కౌంటర్ దగ్గర కూర్చుంటానని, నిరక్షరాస్యులు, రూపాయి లేని వాళ్లకి, ఓపి టికెట్ రాయడం రానివారికి సహాయపడతానని చెప్పింది. వాళ్లకి వార్డులు చూపించి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి, మందులిప్పించి పంపిస్తానంది. ఈ మధ్య ఇంట్లో కాలుజారి పడిపోయిన ఒక గర్భిణీని ఇక బతకదు అన్న స్థితిలో తీసుకొచ్చారు. ఆ సమయంలో తాను చేసిన ఉపకారం వల్ల ఆవిడ బతికి ఆడపిల్లకు జన్మనిచ్చిందని, ఆ పిల్లకు తన పేరు పెట్టుకున్నారని, అది తనకు ఎంతో తృప్తినిచ్చిందని చెప్పింది. నేను కారెక్కి వెళ్లిపోతున్నవాడిని ఆగి ఆ పిల్లని వెనక్కి తీసుకెళ్లి పసుపు కుంకుమలు, బట్టలూ ఇచ్చి పంపాను. దీన్ని ఒకసారి టీవీ లైవ్‌లో చెప్పాను. దాన్ని చూసి చాలామంది పిల్లలు ఇది తమకు నచ్చిందంటూ తాము కూడా సమాజ సేవ చేస్తున్నామని ఉత్తరాలు రాశారు. ఇప్పుడు చెప్పండి. యువత మంచి ప్రేరణ పొందట్లేదా? ఉపకారాలు చేయట్లేదా..? ధైర్యంతో ఉండడం లేదా? భక్తి మనిషిని నిలబెడుతుంది. లక్షల సంవత్సరాలుగా ఈ జాతి గౌరవ ప్రతిష్ఠలు భక్తి చేతనే ఉన్నాయి. సేవ చేయడానికి పెద్ద ఆలోచనలు అవసరమా. ఎంత అవలీలగా చేసేసింది. విజయకుమార్: భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి మూలకారణాలు వేదాలు, ఉపనిషత్తులు. వీటిని కోట్ చేస్తూ, మీరు, మీతోపాటు అనేక మంది ప్రవచనాలు చెబుతున్నారు. మీరు మాట్లాడే ప్రతిమాటకు శాస్త్ర ప్రమాణం ఉందనుకునే మాట్లాడుతున్నారా? చాగంటి: నాకు తెలిసున్నంతవరకూ నా బుద్ధికి తోచినట్లు మాట్లాడే ప్రయత్నం చేయాలన్న సంకల్పం కూడా నాకుండదు. ఒకవేళ నా బుద్ధికి తోచిన విషయం గురించి చెప్పాలనుకున్నా ఎవరూ అభ్యంతర పెట్టరు కదా. సీతారామకళ్యాణం గురించి చెప్పమన్నారంటే కథ తెలియక వాళ్లడగడంలేదు. అందులో ఏదో ధర్మసూక్ష్మం ఉందని, దాన్ని తెలుసుకుని ఆచరించాలని వాళ్ల తాపత్రయం. అప్పుడు అందులో ప్రామాణికంగా ఏ విషయం అంతర్లీనమై ఉందో, పెద్దల చేత అంగీకరింపబడిందో దాన్నే ప్రస్తావించాలి తప్ప నా బుద్ధికి తోచినట్టుగా చెప్పడం అనేది మంచిది కాదు. అందుకనే నేను ప్రమాణానికి కట్టుబడతాను. నాకు తెలిసినంతవరకూ ప్రమాణాన్ని విడిచి స్వబుద్ధికి తోచినవి చెప్పాలనే ఆలోచన నాకు తడుతుందని నేననుకోవడంలేదు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున అన్నానేమో తెలియదు. కానీ నా సంకల్పం ఎప్పుడూ ప్రమాణానికి కట్టుబడాలనే ఉంటుంది. సమన్వయం: ఫణికుమార్ సాక్షి, విజయవాడ విజయకుమార్: ప్రపంచీకరణ ఒక ఉప్పెనలా వచ్చి కొత్త సంస్కృతిని తెచ్చిపెట్టింది. ప్రపంచీకరణలో దేవుడు పర్సనల్ అయ్యాడు. పర్సనల్ గాడ్, ఎటర్నల్ కాస్మిక్ పవర్ మధ్య ఎట్లా ఒక వారధిని నిర్మించుకోవాలి? కొత్త జనరేషన్ పిల్లలు దీన్నెలా అర్థం చేసుకోవాలి? చాగంటి: ఇందులో ఒక గంభీరమైన విషయం నిబిడీకృతమై ఉంది. ప్రపంచమంతా నా కుటుంబం. అందరూ బావుండాలి. ఏ సంస్కృతి, సంప్రదాయానికి చెందినవారైనా సంతోషంగా ఉండాలి. సంస్కృతిని మాత్రం పాడు చేయకూడదు. ఒక ఉదాహరణ చెబుతాను. రాముడు వానరులు- సుగ్రీవాదులు, రాక్షసులు- విభీషణాదులు, గుహుడు లాంటి ఆటవికులతో స్నేహం చేశాడు, వాళ్లంతా ఆయనకు వశవర్తులు. కానీ ఆయన ఏరోజూ కిష్కింధకు వెళ్లి ఈ సంస్కృతేమిటి, ఈ అల్లరేమిటి, ఈ జీవనం ఏమిటి, మిమ్మల్ని కొంతమందిని నేను కొన్ని సమూహాలుగా అయోధ్యకు తీసుకెళ్లి శిక్షణా తరగతులు పెడతానని చెప్పలేదు. వారి సంస్కృతిని విడిచిపెట్టమని వారికి చెప్పలేదు. అధర్మాన్ని విడిచిపెట్టమన్నాడు. ఎవరి సంస్కృతిని వాళ్లని కాపాడుకోమని చెప్పాడు తప్ప సంస్కృతిలో వేలు పెట్టలేదు. అందరి సంస్కృతి, సంప్రదాయాన్ని గౌరవించాడు. ప్రపంచీకరణ దోషం అని నేను అనను. విశాలదృక్పథంతో ఉండండి. కానీ సంస్కృతిని విడిచిపెట్టకండి. ఇతర సంస్కృతుల వెంటపడి మన సంస్కృతిని నాశనం చేసుకోకూడదు. కాపాడుకోవాలి. ఇంగ్లీషులో మాట్లాడు, ఫైల్ రాయి. ఇంటికొచ్చి కొడుకుతో పోతన పద్యం చెప్పు. దేవాలయానికెళ్లేటప్పుడు పంచె కట్టుకో. యువతకు ఆ కోణంలో చెప్పాలి. ఎమెస్కో విజయకుమార్ -
టీవీ పడి బాలుడి మృతి
కుషాయిగూడ, న్యూస్‌లైన్: అందరి ఇళ్లల్లో కృష్ణాష్టమి వేడుకలకు చిన్నారులు సిద్ధమవుతుంటే.. మరో పక్క తల్లిచేతి గోరు ముద్దలు తింటూ ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న ఆ చిన్నారికి అంతలోనే నూరేళ్లు నిండిపోయాయి. తల్లి చూస్తుండగానే టీవీ రూపంలో వచ్చిన మృత్యువు పైనబడి ఆ బాలుడి ని కబళించింది. హృదయ విదారకమైన ఈ సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున నగర్లో చోటుచేసుకుంది. బొమ్మల రామారంలోని ‘బాంబుల కంపెనీ’లో మేనేజర్‌గా పనిచేస్తున్న శంకర్ రెడ్డి.. భార్య ప్రణతి ఇద్దరు కుమారులతో నాగార్జున నగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు(3)కి టిఫిన్ తినిపించిన ప్రణతి.. చిన్న కుమారుడు ప్రణవ్ (16నెలలు)కు కూడా గోరు ముద్దలు తినిపించింది. ఉదయం పదకొండు గంటలకు కొడుకుకు స్నానం చేయిద్దామని ఆమె బాత్రూంలోకి వెళ్లింది. అదే సమయంలో ఇల్లంతా పాకుతూ ఆడుకుంటున్న ఆ బాలుడు ఒక్కసారిగా టీవీ స్టాండ్‌ను పట్టుకొని లాగాడు. వీల్స్‌పై ఉన్న టీవీ ఒక్కసారిగా ఆ చిన్నారిపై పడంది. ఆ శబ్దానికి గాబరా పడుతూ బయటకు వచ్చిన ప్రణతి బిడ్డని ఒళ్లోకి తీసుకుంది. అప్పటికే తిన్నదంతా వాంతి చేసుకుని సొమ్మసిల్లిన ప్రణవ్ను ఇరుగు, పొరుగు సహాయంతో ఆమె స్థానిక ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. అయితే అప్పటికే ఆ బాలుడు మృతిచెందాడని తెలియడంతో ఆమె హతాశురాలైంది. విషయం తెలిసిన భర్త, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడిని మంగళవారం సాయంత్రం వారి స్వస్థలం నల్లగొండ జిల్లా నాగిరెడ్డి పల్లి గ్రామంలో ఖననం చేశారు.