ఆ గదికి ఇప్పటికీ రెంట్ కడుతున్నారట..! | sunil, trivikram still continue to pay rent for that room | Sakshi
Sakshi News home page

ఆ గదికి ఇప్పటికీ రెంట్ కడుతున్నారట..!

Published Thu, Feb 18 2016 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

ఆ గదికి ఇప్పటికీ రెంట్ కడుతున్నారట..!

ఆ గదికి ఇప్పటికీ రెంట్ కడుతున్నారట..!

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కామెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలలో స్థానం సంపాదించుకున్నారు. కానీ ఒకప్పుడు ఈ ఇద్దరు అవకాశాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో సునీల్, త్రివిక్రమ్లు పంజాగుట్ట సాయిబాబా గుడి సమీపంలోని రూంలో అద్దెకు ఉండేవారు. వీరి జీవితాల్లో ఎంతో విలువైన క్షణాలెన్నో ఆ రూంతో ముడిపడి ఉన్నాయి.

అందుకే ఇప్పటికీ ఆ రూంకు రెంట్ కడుతున్నామన్నాడు హీరో సునీల్. తను హీరోగా నటించిన కృష్ణాష్టమి రిలీజ్ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సునీల్, కెరీర్ స్టార్టింగ్లో తను పడ్డ కష్టాలను గుర్తు చేసుకున్నాడు. దిల్రాజు నిర్మిస్తున్న కృష్ణాష్టమి సినిమాకు జోష్ ఫేం వాసు వర్మ దర్శకుడు. చాలా రోజులుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement