'జక్కన్న'గా మారుతున్న సునీల్ | sunil next movie title jakkanna | Sakshi
Sakshi News home page

'జక్కన్న'గా మారుతున్న సునీల్

Published Sat, Dec 5 2015 8:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

'జక్కన్న'గా మారుతున్న సునీల్

'జక్కన్న'గా మారుతున్న సునీల్

కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన సునీల్, ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత ఏడాది భీమవరం బుల్లోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సునీల్, 2015లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కృష్ణాష్టమి ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుందని భావించినా ఇప్పటివరకు అలాంటి వార్తే లేదు. వరుస ఫెయిల్యూర్స్తో సునీల్ మార్కెట్ భారీగా పడిపోవటంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

కృష్ణాష్టమి రిలీజ్ ఆలస్యం అవుతున్నా, తరువాతి సినిమాల విషయంలో మాత్రం జోరు చూపిస్తున్నాడు సునీల్. ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'జక్కన్న' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే రచయిత గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలోనూ సునీల్ హీరోగా నటించనున్నాడు. వీటితో మరో ఇద్దరు యువ దర్శకుల కథలను కూడా ఓకే చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement