jakkanna
-
నేను తీసిన సినిమాలలో నా ఫేవరెట్ సీను అదే : రాజమౌళి
-
మహేష్, జక్కన్న మూవీ పై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ..
-
డివైడ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు!
చెన్నై: చాలాకాలంగా హిట్ సినిమా లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న హీరో సునీల్‌కు 'జక్కన్న' కొత్త ఊపిరి ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగినస్థాయిలో సాధించింది. 'జక్కన్న' సినిమా రెండువారాల్లోనే రూ. 16 కోట్లు వసూలుచేసిందని టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ తెలిపారు. 'సునీల్‌కు 'జక్కన్న' ఊరటనిచ్చింది. ఈ సినిమా నిర్మాతకు లాభదాయకంగా నిలిచింది. రెండువారాల్లోనే 'జక్కన్న' బాక్సాఫీస్ వద్ద రూ. 16కోట్లు వసూలు చేశాడు. దీంతో హిట్ కోసం సునీల్ ఎదురుచూపులు ఫలించాయనే చెప్పొచ్చు' అని త్రినాథ్ ఐఏఎన్ఎస్కు చెప్పారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్, మన్నారా చోప్రా జోడీగా 'జక్కన్న' ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంపై నిర్మాత సుదర్శన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. 'సినిమాకు మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చింది. కానీ రెండోరోజు నుంచి సినిమా పుంజుకుంది. రెండువారాల్లో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. మొత్తంగా ప్రేక్షకుల స్పందన ఆనందం కలిగిస్తోంది' అని సుదర్శన్ రెడ్డి తెలిపారు. -
వంద కోట్ల పారితోషికమా!
భారీ చిత్రాలు కూడా ఈ రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించడం కష్టతరంగా మారింది. అలాంటిది ఒక దర్శకుడి పారితోషికం రూ.100 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉందా? అయితే నమ్మాల్సిందేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అవును అంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేసిన దర్శకుడు రాజమౌళి అన్న ప్రచారం ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి అన్న సంగతిని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తలదన్నే రీతిలో బాహుబలి-2 చిత్రాన్ని తాజాగా చెక్కుతున్నారు జక్కన్న. వెండితెర అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. చిత్ర వ్యాపారం కూడా మొదలైంది. ప్రారంభం అవడమే కాదు ప్రకంపనలు పుట్టిస్తోంది. తమిళనాడు హక్కులు 45 కోట్లకు అమ్మడు పోయినట్లు సమాచారం. అదే విధంగా కేరళ వెర్షన్ హక్కులు 15 కోట్లకు విక్రయించినట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఉత్తరాది హక్కులకు 100 నుంచి 150 కోట్లు వ్యాపారం జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు రాజమౌళి తన పారితోషికంగా తమిళ్, మలయాళం, హిందీ భాషల వ్యాపారంలో 50 శాతం డిమాండ్ చేసినట్లు పరిశ్రమ వర్గాల బోగట్టా. దీన్ని బట్టి చూస్తే ఆయన పారితోషికం రూ.100 కోట్లకు చేరుతుందని టాక్. ఇదే కనుక నిజం అయితే వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఏకైక భారతీయ సినీ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళీనే అవుతారు. -
చిరు 150లో సునీల్
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలో చిన్న రోల్ ఇచ్చినా చేయడానికి చాలా మంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. మెగా హీరోలయితే ఒక్కసారి కనిపించే పాత్ర ఇచ్చినా చాలని ప్రకటించేస్తున్నారు. ఇక మెగా హీరోలతో సమానంగా చిరుతో సన్నిహితంగా ఉండే సునీల్ కూడా మెగా మూవీలో చేసేందుకు సిద్దమని ఎప్పుడో చెప్పేశాడు. అయితే ఆ అవకాశం వచ్చినా.. ఉపయోగించుకోలేకపోయానని చాలా రోజులుగా బాధపడుతున్నాడు సునీల్. వీడు గోల్డెహే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సునీల్ చిరంజీవి 150వ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చినా చేయలేకపోయాడు. దీంతో వేరే ఆర్టిస్ట్‌తో ఆ సీన్స్ తీసేశారన్న టాక్ వినిపించింది. జక్కన్న రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సునీల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మిస్ అయ్యిందనుకున్న అవకాశం మరోసారి సునీల్ తలుపుతట్టిందని తెలిపాడు. తాను చేయలేకపోయానని బాధపడుతున్న చిరు సినిమాలోని పాత్ర తన కోసమే ఎదురుచూస్తుందట. వచ్చేనెలలో షూటింగ్లో పాల్గొంటానని, మెగాస్టార్ సినిమాలో నటించటం ఎంతో ఆనందంగా ఉందంటూ ప్రకటించాడు. జక్కన్న సినిమాతో కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సునీల్, హీరోగా మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. -
నవ్వులు తెప్పించే... జక్కన్న
• చిత్రం: ‘జక్కన్న’, • మాటలు: భవానీ ప్రసాద్, • సంగీతం: దినేష్, • కెమేరా: సి.రాంప్రసాద్, • నిర్మాత: ఆర్.సుదర్శన్‌రెడ్డి, • కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల వినోదం.. వినోదం.. వినోదం.. ఇటీవల మెజారిటీ తెలుగు సినిమాలు ఈ ఫార్ములా చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేక్షకులను వీలైనంత నవ్వించి వసూళ్లు రాబట్టాలనుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ వినోదానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఎటువంటి కథలోనైనా కామెడీ కంపల్సరీ అయిన ఈ తరుణంలో కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ మరిన్ని నవ్వులు పంచుతారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో గత సినిమా ‘కృష్ణాష్టమి’ చేసిన సునీల్, నవ్వించడానికి తిరిగొచ్చాడనట్లు బ్యాక్ టు ఎంటర్టైన్... క్యాప్షన్‌తో ‘జక్కన్న’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘రక్ష’ అనే హారర్ సినిమా తీసిన వంశీకృష్ణ ఆకెళ్ల ఈ ‘జక్కన్న’ సినిమాకి దర్శకత్వం వహించారు. ‘నీటిలో మునుగుతున్న చీమను పావురం కాపాడుతుంది. కృతజ్ఞతగా నీకు ఎప్పుడైనా సాయం చేస్తానని చీమ అంటే.. నువ్వో చిన్న ప్రాణివి, ఏం సాయం చేయగలవని పావురం నవ్వుతుంది. తర్వాత ఓ రోజున వేటగాడు పావురంపై బాణం గురిపెడతాడు. చీమ కుట్టడం ద్వారా బాణం గురి తప్పుతుంది. పావురం బతుకుతుంది’ - స్కూల్లో మాస్టారు (హీరో తండ్రి కూడా ఈయనే... నాగినీడు) చెప్పిన కథ గణేశ్ (సునీల్) బుర్రకి బాగా ఎక్కేసింది. చీమే అంత సాయం చేసినప్పుడు మనుషులం మనం సాయం చేయలేమా? అన్న మాటలు గణేశ్‌పై బాగా ప్రభావం చూపాయి. ఆ క్షణం నుంచి తనకు సాయం చేసిన వ్యక్తులపై, వాళ్లు కూడా తట్టుకోలేనంత ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వయసుతో పాటు హీరోలో ఈ లక్షణం కూడా ముదిరి పాకాన పడుతుంది. పెద్దయిన తర్వాత విశాఖలో అడుగుపెడతాడు. అజ్ఙాతంలో ఉంటూ విశాఖను గడగడలాడిస్తున్న రౌడీ బైరాగి (కబీర్ సింగ్)ని వెతుకుతుంటాడు. ఈ క్రమంలో సహస్ర (మన్నార్ చోప్రా)తో ప్రేమలో పడతాడు. ఎన్నో హత్యలు చేసిన బైరాగి ఎలా ఉంటాడో పోలీసులతో సహా ఎవరికీ తెలీదు. బైరాగిని చూసిన వ్యక్తి ప్రాణాలతో ఉండడు. ఎందుకంటే.. చంపేస్తాడు. కనీసం అతని ఫొటో ఎవరి దగ్గరా ఉండదు. కానీ గణేశ్ దగ్గరుంటుంది. చివరకు, వెతికి పట్టుకుంటాడు. అసలు గణేశ్, బైరాగిల మధ్య సంబంధం ఏంటి? తన గుట్టు తెలుసుకున్న గణేశ్‌ను బైరాగి ఏం చేశాడు? అనేది మిగతా సినిమా. సునీల్ నుంచి ఆశించే నవ్వులు అక్కడక్కడా ఉన్నాయి. యాక్టింగ్, డైలాగ్ డెలివరీల్లో వినోదం అందించాలనే తాపత్రయం కనిపిస్తుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుణ్ణి నవ్వించాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా బలం, బలహీనత. వంకాయలో వన్, టెంకాయలో టెన్ అంటూ మాటల రచయిత చిత్ర విచిత్ర పద ప్రయోగాలు చేశారు. పంచ్ డైలాగుల పేరుతో ప్రాస కోసం ప్రయాస పడ్డారు. ప్రథమార్ధంలో సప్తగిరి, ద్వితీయార్ధంలో పృథ్వి హీరోతో కలసి సందడి చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ప్లీజ్.. నన్ను హీరోలా చూడకండి'
'నన్ను కమెడియన్‌గానే చూడండి, ప్లీజ్.. హీరోలా చూడకండి' అంటున్నాడు సునీల్. ఈ శుక్రవారం సునీల్ 'జక్కన్న' విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. కమెడియన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న సునీల్ 'అందాలరాముడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన 'మర్యాదరామన్న' సూపర్ హిట్ అవ్వడంతో పూర్తిస్థాయి హీరోగా కొనసాగుతున్నాడు. అయితే గత కొంతకాలంగా సునీల్ ఖాతాలో ఒక్క హిట్టూ పడకపోవడంతో తిరిగి తనకు బాగా అలవాటైన కామెడీనే నమ్ముకునే ప్రయత్నంలో ఉన్నాడు. దీనిపై సునీల్ మాట్లాడుతూ.. 'నా అభిమాని అడిగిన ఒక ప్రశ్న నా ఆలోచనను మార్చుకునేలా చేసింది. ఇతర ఏ ఆర్టిస్ట్‌లోనూ కనపడని కామెడీ టైమింగ్ మీలో ఉంటుంది. అది తెలిసి కూడా మీకు సూటవ్వని సీరియస్ క్యారెక్టర్లు (హీరో) ఎందుకు చేస్తున్నారని ఓ అభిమాని అడిగిన ప్రశ్న నా మనసుని ఆలోచనలో పడేసింది' అన్నారు. జక్కన్నలో తాను హీరోను కాదని, ఒక కమెడియన్ని మాత్రమేనని, కేవలం స్టంట్స్ చేసిన రెండు ఎపిసోడ్స్‌లో మాత్రమే తను హీరోలా కనిపిస్తానని చెప్పుకొచ్చారు. తనను కమెడియన్‌గా చూడాలే తప్ప హీరోలా అనుకుని సినిమా చూడొద్దని ప్రేక్షకులను కోరారు. జక్కన్న పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, ఇంత మంచి సినిమాను రూపొందొంచినందుకు డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్లకు, ఆకట్టుకునే పంచ్ డైలాగులు రాసిన భవానీ ప్రసాద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. -
అందుకే పేరు మార్చుకున్నా!
‘‘పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమిది. ఓ రొమాంటిక్ ట్విస్ట్ కూడా ఉందండోయ్! కథను ఆసక్తికరమైన మలుపు తిప్పిన ఆ ట్విస్ట్ ఏంటో? చిత్రం చూసి తెలుసుకోండి’’ అని మన్నార్ చోప్రా అన్నారు. సునీల్ సరసన ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘జక్కన్న’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మన్నార్ చోప్రా చెప్పిన ముచ్చట్లు... ఈ చిత్రంలో స్వీట్, ఇన్నోసెంట్, బబ్లీ పాత్రలో కనిపిస్తాను. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో.. అటువంటి పాత్ర కావడంతో ఈజీగా నటించేశాను. నేను చూసినంత వరకూ తెలుగు సినిమాల్లో హీరోయిన్లు యాక్షన్ చేయడం అరుదు. లక్కీగా నాకు ఈ చిత్రంలో కరాటే, కిక్ బాక్సింగ్ చేసే అవకాశం లభించింది. హిందీలో డబ్బింగ్ అయిన సునీల్ చిత్రాలు చూశా. తెర మీదే కాదండి.. తెర వెనక కూడా ఎప్పుడూ జోకులు వేస్తూ నవ్విస్తుంటారు. ఆయనకు ఫ్యాషన్ మీద మంచి అవగాహన ఉంది. నా డ్రస్సింగ్ గురించి సలహాలిచ్చారు. గతంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేయడంతో సునీల్ పక్కన ఈజీగా డ్యాన్స్ చేశా. సునీల్, సప్తగిరి, నాకు మధ్య సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. దుబాయ్‌లో 55 డిగ్రీల టెంపరేచర్లో సాంగ్స్ చిత్రీకరిస్తున్నప్పుడు.. మధ్యలో నా మోకాలికి గాయమైంది. అయినా, షూటింగ్ పూర్తిచేశా. నిర్మాత సుదర్శన్ రెడ్డి, లతలు నన్నొక కుటుంబ సభ్యురాలిగా చూసుకున్నారు. ఆర్.పి.ఏ.క్రియేషన్స్ తొలిచిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’ చూశాను. అలాంటి చిత్రం చేయాలనుంది. మన్నార్ అంటే.. ప్రకాశించేది (సమ్‌థింగ్ దట్ షైన్స్) అని అర్థం. నటిగా నేను ప్రకాశించాలని పేరు మార్చుకున్నా. (అసలు పేరు బార్బీ హండా) ‘తిక్క’లో మంచి పాత్ర చేశా. ప్రయోగాత్మక చిత్రమది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘రోగ్’లో నటిస్తున్నాను. -
వరుసగా రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో చాలా రోజులుగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్‌ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఫైనల్‌గా ఈ నెల 22న కబాలి రిలీజ్ అవుతున్నట్టుగా తేలిపోవటంతో మిగతా సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లు కన్ఫామ్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కబాలి దెబ్బకు ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక తికమక పడ్డ బాబు బంగారం, జనతా గ్యారేజ్ పోస్ట్ పోన్ కావటంతో ఆగస్ట్ 12న ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా తన నెక్ట్స్ సినిమా జక్కన్నకు డేట్ ప్రకటించేశాడు. ముందుగా 22న రిలీజ్ చేయాలని భావించిన అదే రోజు కబాలి రిలీజ్ అవుతుండటంతో ఒక వారం ఆలస్యంగా 29న ఇడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు. సుప్రీమ్ సినిమా సక్సెస్‌తో సూపర్ ఫాంలో ఉన్న సాయి తిక్క సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కబాలి హవా తెలుగు నాట వారానికి మించి ఉండదన్న నమ్మకంతో కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. -
టైమింగ్.. టేకింగ్ కుదిరాయి
తొలిచిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’తో ఘనవిజయం అందుకున్న ఆర్పీఏ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ద్వితీయ చిత్రం ‘జక్కన్న’. సునీల్, మన్నార్ చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఫ్యామిలీ ఎంటర్టైన ర్గా తెరకెక్కిన చిత్రమిది. సునీల్ చాలా ఎనర్జిటిక్‌గా నటించారు. ఆయన కామెడీ టైమింగ్‌కి, వంశీ టేకింగ్కి ప్రేక్షకులు క్లాప్స్ కొడతారు. ఇటీవల చిరంజీవిగారి చేతుల మీదగా విడుదల చేసిన పాటలు సూపర్ హిట్ అవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. ఈ నెల 29న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కబీర్‌సింగ్, సప్తగిరి, పృధ్వీ, పోసాని, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సి. రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి. -
సునీల్ కొత్త సినిమాకు కామెడీ టైటిల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
ఉంగరాల రాంబాబుగా సునీల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టాలీవుడ్ నటుడు సునీల్. హీరోగా టర్న్ తీసుకున్న తరువాత కాస్త పర్వాలేదనిపించిన సునీల్ ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో తిరిగి తనకు బాగా కలిసోచ్చిన కామెడీ జానర్లోనే హీరోగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ హీరోగా తెరకెక్కిన జక్కన షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత వీడు గోల్డెహే అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు సునీల్. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే తను చేయబోయే తదుపరి చిత్రాన్ని కూడా ఫైనల్ చేశాడు. పరుచూరి ప్రసాద్ నిర్మాతగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించాడు. సునీల్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఉంగరాల రాంబాబు అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. -
‘జక్కన్న’ పాటలు విడుదల చేసిన చిరు
-
చిరు చేతుల మీదుగా సునీల్ ఆడియో
రాజకీయాలతో చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయిన చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమా ఫంక్షన్స్‌లో దర్శనమిస్తున్నాడు. అవార్డు వేడుకలు, ఆడియో రిలీజ్‌లతో తిరిగి సినిమా వాతావరణాన్ని అలవాటు చేసుకుంటున్నాడు. తన 150వ సినిమా షూటింగ్ మొదలవుతున్న సందర్భంగా అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే తనతో నటించడానికి ఖాళీ లేదన్న నటుడి సినిమా వేడుకకు కూడా హాజరవుతున్నాడు మెగాస్టార్. చిరు 150వ సినిమాలో కీలకపాత్రకు కామెడీ హీరో సునీల్‌ను సంప్రదించారు చిత్రయూనిట్. అయితే వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్న సునీల్, ఆ క్యారెక్టర్‌కు నో చెప్పటంతో వెన్నెల కిశోర్‌ను ఫైనల్ చేశారు. దీంతో చిరు, సునీల్ మధ్య బంధం తెగిపోయినట్టే అని అంతా భావించారు. కానీ ఇండస్ట్రీ వర్గాలకు షాకిస్తూ చిరు మరోసారి అందరివాడుగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న జక్కన్న ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హజరయ్యేందుకు అంగీకరించాడు మెగాస్టార్. అన్నయ్య రాకతో తన సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందన్న ఆనందంలో ఉన్నాడు సునీల్. -
'జక్కన్న' మూవీ స్టిల్స్
-
జక్కన్న అయినా హిట్ ఇస్తాడా..?
కమెడియన్ కెరీర్ మంచి ఫాంలో ఉన్న టైంలోనే హీరోగా టర్న్ తీసుకున్న నటుడు సునీల్. కథానాయకుడిగా మారిన తరువాత ఒకటి రెండు సినిమాలతో పరవాలేదనిపించినా, తరువాత మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రొటీన్ క్యారెక్టర్లతో బోర్ కొట్టిస్తున్న ఈ భీమవరం బుల్లోడు సరైన సక్సెస్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ తో కలిసి చేసిన కృష్ణాష్టమి కూడా నిరాశపరచటంతో తన తదుపరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం సునీల్, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో జక్కన్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సునీల్ మార్క్ కామెడీ కూడా బాగానే ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా మీద పాజిటివ్ టాక్ క్రియేట్ చేసిన రిజల్ట్ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉన్నారు. రక్ష సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వంశీకృష్ణకు కూడా జక్కన్న సక్సెస్ చాలా కీలకం. మరి రాజమౌళి పేరుతో వస్తున్న ఈ సినిమా అయినా సునీల్ కెరీర్ ను గాడిలో పెడుతుందేమో చూడాలి. -
జక్కన్న జాలీ ట్రిప్!
జక్కన్న సరదాగా తనకు నచ్చిన అమ్మాయితో దుబాయ్ అంతా చుట్టేశాడు. అక్కడి వీధుల్లో తన అందాల రాశితో ఎంచక్కా డ్యూయెట్లు పాడేసుకున్నాడు. వీరిద్దరి ఆటాపాటల సందడేంటో తెలియాలంటే ‘జక్కన్న’ చూడాల్సిందే అంటున్నారు చిత్ర దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల. సునీల్, మన్నార్ చోప్రా జంటగా ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రం కోసం ఇటీవల దుబాయ్‌లో ఓ పాట చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఊహించని ట్విస్టులతో ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ నెలలోనే పాటలను, జూలైలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: దినేశ్, సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్, సహ నిర్మాతలు: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి. -
ఎవరూ టచ్ చేయని కథతో...
కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుని, హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు సునీల్. ఆయన హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘జక్కన్న’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టాకీపార్ట్ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలు వెళ్లనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కథతో వంశీకృష్ణ చాలా ఆసక్తికరంగా రూపొందించారు. అందరినీ అలరించే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. మా సంస్థ నుంచి వచ్చిన మొదటి సినిమా ‘ప్రేమకథా చిత్రమ్’లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ చిత్రంలో అన్ని ఉంటాయి. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. జూన్ మూడో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దినేష్, కెమెరా: రాం ప్రసాద్, సహ నిర్మాతలు: ఆముష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి. -
లక్ష్యసాధనలో... జక్కన్న
‘రాళ్లను శిల్పాలుగా చెక్కి అమరశిల్పి జక్కన్న ఎంతో కీర్తి పొందారు. ఎందుకూ పనికి రాడనుకున్న వాడు గొప్ప గొప్ప పనులు చేసి లక్ష్యసాధనలో ఎలా విజయం సాధించాడన్నదే ఈ సినిమా ముఖ్య కథాంశం’’ అని హీరో సునీల్ చెప్పారు. సునీల్, మన్నార్ చోప్రా జంటగా వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘జక్కన్న’. ఈ సినిమా టైటిల్‌ను, మోషన్ పిక్చర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఎనభై శాతం పూర్తయింది. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. కెమేరామ్యాన్ సి. రామ్‌ప్రసాద్, సంగీత దర్శకుడు దినేశ్, మాటల రచయితలు భవానీ ప్రసాద్, జీఆర్ మహర్షి, నటులు రాజా రవీంద్ర, సప్తగిరి, సహ నిర్మాతలు ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'జక్కన్న' గా సునీల్
-
'జక్కన్న'గా మారుతున్న సునీల్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన సునీల్, ఇటీవల కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గత ఏడాది భీమవరం బుల్లోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సునీల్, 2015లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కృష్ణాష్టమి ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుందని భావించినా ఇప్పటివరకు అలాంటి వార్తే లేదు. వరుస ఫెయిల్యూర్స్‌తో సునీల్ మార్కెట్ భారీగా పడిపోవటంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. కృష్ణాష్టమి రిలీజ్ ఆలస్యం అవుతున్నా, తరువాతి సినిమాల విషయంలో మాత్రం జోరు చూపిస్తున్నాడు సునీల్. ప్రస్తుతం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు 'జక్కన్న' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అలాగే రచయిత గోపిమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమాలోనూ సునీల్ హీరోగా నటించనున్నాడు. వీటితో మరో ఇద్దరు యువ దర్శకుల కథలను కూడా ఓకే చేశాడన్న టాక్ వినిపిస్తోంది. -
శ్రీమంతుడు చూసి జక్కన్న ఫ్లాట్
ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనం తిరిగి ఏదో ఒకటి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతాం అంటూ.. సొంతూరి సెంటిమెంటుతో అభిమానుల హృదయాలు కొల్లగొట్టిన ‘శ్రీమంతుడు’ సినిమా చూసి టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా ఫ్లాటైపోయారు. కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసిన తర్వాత ఆయన తన ఫీలింగులను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్టును ఫ్యామిలీ సెంటిమెంటుతో చాలా తెలివిగా కలిపారని, అదే ఈ సినిమా విజయ రహస్యమని చెప్పారు. దర్శకుడు కొరటాల శివ చాలా బాగా చేసినందుకు అభినందనలు చెబుతూనే.. కలెక్షన్లు మాత్రం మహేశ్ బాబు వల్లే వస్తాయని స్పష్టం చేశారు. ఈ సినిమాలో మహేశ్ చాలా కూల్ గా కనపడుతూ, అంచనాలకు అందకుండా నటించి, ఏమాత్రం హడావుడి లేకుండా డైలాగులు చెప్పి ప్రేక్షకుల హృదయాలను చేరుకున్నారన్నారు. యూనిట్ సమష్టి కృషి చాలా అత్యద్భుతంగా ఉందని రాజమౌళి మెచ్చుకున్నారు. ఇక శ్రుతిహాసన్ ని చూస్తే ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతామని, ఆమె తన నటనలో చాలా ఎత్తులు ఎదిగిందని ప్రశంసల జల్లు కురిపించారు. దర్శకుడి విజన్ ను మాదీ ఫొటోగ్రఫీ మరింత పెంచిందని సాంకేతిక అంశాలనూ స్పృశించారు. తమ కుటుంబం మొత్తం ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశామన్నారు. శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో సినిమాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలంటూ ముగించారు. The success of srimanthudu lies in the clever mixture of village adoption with family sentiment. Well done sivagaru. But The paisa vasool — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting. Shruthi hassan grooves — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Comes from the man himself, mahesh looks cool, acts subtle talks mellow. But the overall effect is flabbergasting. Shruthi hassan grooves — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 are breath taking and she has improved by leaps and bounds on the acting front. And madhie’s photography enhanced the director’s vision. — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 Our whole family enjoyed the movie. Congratulations to everyone involved in srimanthudu for the blockbuster succcess.. — rajamouli ss (@ssrajamouli) August 7, 2015 -
ధీవర పాట మేకింగ్ వీడియో విడుదల
-
జక్కన్న లక్కీ సెంటిమెంట్
-
బాహుబలి రాక ఆలస్యం
-
ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాహుబలి