సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రిలీజ్పై ఎలాంటి క్లారిటీ లేకపోవటంతో చాలా రోజులుగా తెలుగు తమిళ ఇండస్ట్రీలలో సినిమా రిలీజ్ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అయితే ఫైనల్గా ఈ నెల 22న కబాలి రిలీజ్ అవుతున్నట్టుగా తేలిపోవటంతో మిగతా సినిమాల నిర్మాతలు రిలీజ్ డేట్లు కన్ఫామ్ చేసేసుకుంటున్నారు. ముఖ్యంగా కబాలి దెబ్బకు ఎప్పుడు రిలీజ్ చేయాలో అర్థం కాక తికమక పడ్డ బాబు బంగారం, జనతా గ్యారేజ్ పోస్ట్ పోన్ కావటంతో ఆగస్ట్ 12న ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా తన నెక్ట్స్ సినిమా జక్కన్నకు డేట్ ప్రకటించేశాడు. ముందుగా 22న రిలీజ్ చేయాలని భావించిన అదే రోజు కబాలి రిలీజ్ అవుతుండటంతో ఒక వారం ఆలస్యంగా 29న ఇడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ కూడా డేట్ ఇచ్చేశాడు. సుప్రీమ్ సినిమా సక్సెస్తో సూపర్ ఫాంలో ఉన్న సాయి తిక్క సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కబాలి హవా తెలుగు నాట వారానికి మించి ఉండదన్న నమ్మకంతో కొంతమంది చిన్న సినిమాల నిర్మాతలు కూడా ఆగస్టు తొలి వారంలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్నారు.
వరుసగా రిలీజ్ డేట్స్ చెప్పేస్తున్నారు
Published Sat, Jul 16 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
Advertisement
Advertisement