Is Sai Dharam Tej In Love With Larissa Bonesi Tweets Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Sai Dharam Tej : ఆ హీరోయిన్‌తో తేజ్‌ ప్రేమలో ఉన్నాడా? ట్వీట్‌ వైరల్‌

Published Sun, Oct 16 2022 12:40 PM | Last Updated on Sun, Oct 16 2022 1:38 PM

Is Sai Dharam Tej In Love With Larissa Bonesi Tweets Goes Viral - Sakshi

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోయిన్‌ లారిస్సా బొనేసితో ప్రేమలో ఉన్నాడా? గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లారిస్సా బొనేసి మరెవరో కాదు.. తేజ్‌తో తిక్క సినిమాలో నటించిన హీరోయిన్‌. బ్రెజిలియ‌న్ మోడ‌ల్‌ అయిన లారిస్సా తిక్క మూవీతోనే టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.

ఆ సినిమా సమయంలోనే వీరికి మంచి స్నేహం కుదిరింది. ఆపై తేజ్‌పై సోషల్‌ మీడియాలోనే పలు  సందర్భాల్లో తన ప్రేమను వ్యక్తపరిచింది లారిస్సా. తాజాగా శనివారం(అక్టోబర్‌15)న తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా లారిస్సా చేసిన ట్వీట్‌కు,తేజ్‌ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.



‘హ్యాపీ బర్త్‌డే మై తేజు'.. అంటూ లవ్‌ సింబల్‌తో లారిస్సా ట్వీట్‌ చేయగా, దీనికి 'టూ మై డిస్ట్రబన్స్‌' అంటూ తేజ్‌ ఆమెతో కలిసి దిగిన ఓ ఫోటోను షేర్‌ చేశాడు. దీనికి లారిస్సా కూడా ఫరెవర్‌ అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్లు చూసిన నెటిజన్లు.. నిజంగానే లవ్‌లో ఉన్నారా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాకుండా తేజ్‌ బర్త్‌డే రోజే.. నేను ప్రేమలో ఉన్నాను అంటూ లారిస్సా ట్వీట్‌ చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చినట్లయ్యింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement