Tollywood Celebrities Special Birthday Wishes To SS Rajamouli, Posts Viral - Sakshi
Sakshi News home page

SS Rajamouli Birthday: దర్శకధీరుడు జక్కన్న పుట్టినరోజు.. టాలీవుడ్‌ ప్రముఖుల స్పెషల్ విషెస్

Published Mon, Oct 10 2022 3:59 PM | Last Updated on Mon, Oct 10 2022 5:59 PM

Birthday Wishes To SS Rajamouli From Tollywood Heroes Today - Sakshi

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వినిపించేది మొదటి పేరు ఆయనదే. తెలుగు చలనచిత్ర స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. స్టూడెంట్‌ నం.1 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన రాజమౌళి బర్త్‌డే ఈరోజు. ఈ సందర్భంగా దర్శకధీరుడికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జక్కన్నకు విషెస్ చెబుతున్నారు. 

(చదవండి: నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!)

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్‌ చేస్తూ జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే జక్కన్న.. మీరు ఎల్లప్పుడు గొప్పగానే ఉండాలి' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్‌ డే రాజమౌళి  గారు.. మీరే నా ఫెవరేట్' అంటూ రామ్ చరణ్‌ తన ఇన్‌స్టాలో ఫోటోను పంచుకున్నారు. భారతీయ సినిమా గతిని మార్చిన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ యంగ్‌ హీరో సుధీర్ ‍బాబు ట్వీట్ చేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.  

భారతీయ సినిమాకు టార్చ్ బేరర్‌గా నిలిచిన రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సాయిధరమ్‌ తేజ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ జక్కన్నకు విషెస్ తెలిపారు. మీ సినిమాలు, విజన్ మాకు చాలా ఇష్టం. భారతదేశం గర్వపడేలా చేసిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీ సినిమాలతో మాకు ఎల్లప్పుడు స్పూర్తినిస్తూ ఉండండి' అంటూ స్టార్ హీరో మహేశ్ బాబు విషెస్ తెలిపారు. అలాగే నటుడు సత్యదేవ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి విషెస్ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement