ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో అరుణాచల క్రియేషన్స్‌పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ చిత్రం మే 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతుండగా.. పరిశ్రమలో మీకున్న ముఖ్య స్నేహితులు ఎవరనీ యాంకర్ ప్రశ్నించగా.. ఆ సమయంలో తారక్ పేరు చెబుతాడని ప్రేక్షకులు భావించి అందరూ ఎన్టీఆర్ అంటూ కేకలు వేశారు. కానీ, రాజమౌళి మాత్రం అందుకు విభిన్నంగా ఇలా సమాధానం చెప్పాడు. 'టాలీవుడ్‌లో నాకు ఇద్దరు అత్యంత ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, సాయి కొర్రపాటి. వారితో బాహుబలి, ఈగ వంటి చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం. స్నేహితుడు కాదు. తారక్‌తో నా మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' ఛాన్స్ రావడానికి కారణం రచయిత పృథ్వీతేజ. అని ఆయన గుర్తుచేసుకున్నారు. స్టూడెంట్ నెం.1 తర్వాత తారక్- జక్కన్న కాంబినేషన్‌లో సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్‌ఆర్ చిత్రాలు వచ్చాయి. అన్నీ కూడా సూపర్ హిట్ సాధించాయి.
‘కృష్ణమ్మ’ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ.. సినిమా టైటిల్ నాతో పాటు అందర్నీ ఆకర్షించిందంటే కారణం కొరటాల శివగారు సమర్పించడమే. ఆయన సమర్పిస్తున్న తొలి సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ టీజర్, ట్రైలర్ చూస్తే సినిమాని కచ్చితంగా థియేటర్లోనే చూడాలనిపించేలా తీశాడు గోపాలకృష్ణ. కాలభైరవని చూస్తుంటే గర్వంగా ఉంది. ‘కృష్ణమ్మ’ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ఈ చిత్రం మే 10న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment