sudheerbabu
-
పాపతో పైలం అంటున్న సుధీర్ బాబు.. 'హంట్' క్రేజీ అప్డేట్
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. ఈ మూవీ ద్వారా యువ దర్శకుడు మహేశ్ పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి 'పాపతో పైలం' అంటూ సాగే ఐటమ్ సాంగ్ గ్లింప్స్ (ప్రోమో) రిలీజ్ చేసింది చిత్రబృందం. (చదవండి: సుధీర్ బాబు 'హంట్' అప్డేట్.. టీజర్ రిలీజ్ ఆరోజే..!) ఈ సాంగ్‌లో సుధీర్ బాబు, అప్సర రాణిలతో పాటు నటుడు భరత్ కూడా అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఈ సాంగ్ ప్రోమో చూస్తే మాస్ స్టెప్పలతో ఊర్రూతలూగిస్తోంది. ఫుల్ లిరికల్ సాంగ్ రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ మంచి విజయం అందుకుంది. -
జక్కన్న బర్త్‌డే.. జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ విషెస్
టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే వినిపించేది మొదటి పేరు ఆయనదే. తెలుగు చలనచిత్ర స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఆయనే. స్టూడెంట్ నం.1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు టాలీవుడ్లో సంచలనాలు సృష్టించిన రాజమౌళి బర్త్‌డే ఈరోజు. ఈ సందర్భంగా దర్శకధీరుడికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జక్కన్నకు విషెస్ చెబుతున్నారు. (చదవండి: నయనతార కవలల పేర్లు తెలుసా.. వాటి అర్థాలు ఇవే..!) యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ జక్కన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే జక్కన్న.. మీరు ఎల్లప్పుడు గొప్పగానే ఉండాలి' అంటూ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు.. మీరే నా ఫెవరేట్' అంటూ రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో ఫోటోను పంచుకున్నారు. భారతీయ సినిమా గతిని మార్చిన వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సుధీర్ బాబు ట్వీట్ చేశారు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. భారతీయ సినిమాకు టార్చ్ బేరర్‌గా నిలిచిన రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ జక్కన్నకు విషెస్ తెలిపారు. మీ సినిమాలు, విజన్ మాకు చాలా ఇష్టం. భారతదేశం గర్వపడేలా చేసిన రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీ సినిమాలతో మాకు ఎల్లప్పుడు స్పూర్తినిస్తూ ఉండండి' అంటూ స్టార్ హీరో మహేశ్ బాబు విషెస్ తెలిపారు. అలాగే నటుడు సత్యదేవ్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా రాజమౌళికి విషెస్ చెప్పారు. Happy Birthday Jakkanna @ssrajamouli !! Wishing you the best as always. pic.twitter.com/WSq7Zon3KP — Jr NTR (@tarak9999) October 10, 2022 View this post on Instagram A post shared by Rhyme (@alwaysrhyme) Wishing you a happy birthday @ssrajamouli sir... Keep inspiring us with your cinematic brilliance! Happiness & success always! — Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2022 To the man who changed the course of Indian cinema.. Wishing @ssrajamouli sir a very happy birthday! Health and happiness to you always 🙏 pic.twitter.com/NedBUhxlMh — Sudheer Babu (@isudheerbabu) October 10, 2022 Wishing the Pride and Torch bearer of Indian Cinema, @ssrajamouli garu a very Happy Birthday. May you keep achieving all the glory and love that you deserve.#HBDSSRajaMouli garu pic.twitter.com/d2kZem5s87 — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 10, 2022 Happy birthday dear Rajamouli Sir. Have a fabulous one. I love your vision & all of us love your cinema. Keep making 🇮🇳 proud Sir. Most importantly, today is your day @ssrajamouli pic.twitter.com/q5qCVDJLsV — Ajay Devgn (@ajaydevgn) October 10, 2022 -
సుధీర్ బాబు 'హంట్' అప్డేట్.. టీజర్ రిలీజ్ ఆరోజే..!
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం ఈనెల 28న టీజర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. (చదవండి: Sudheer Babu: కనిపించని శత్రువు కోసం సుధీర్‌బాబు వేట!) సుధీర్, శ్రీకాంత్, భరత్‌లతో కూడిన పోస్టర్ టీజర్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' థియేటర్లలో సందడి చేస్తోంది. September 28th is going to be INTENSE 👊👊 #HuntTheMovie teaser is locked and loaded 🎯@bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @vincentcinema pic.twitter.com/5vqI8ATtuf — Sudheer Babu (@isudheerbabu) September 24, 2022 -
10 ఏళ్లు పూర్తి: ఆ చేదు సంఘటనను గుర్తు చేసుకున్న హీరో సుధీర్ బాబు
సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, హీరో సుధీర్ బాబు సినీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు గడిచాయి. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ సినిమాతో సుధీర్ బాబు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. 2012 ఫిబ్రవరి 10న విడుదలైన శివ మనసులో శ్రుతి మూవీలో హీరోగా నటిస్తూనే ఆ సినిమాను నిర్మించాడు సుధీర్ బాబు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచిన సుధీర్ బాబు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ వచ్చి నేటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సమంత సరసన క్రికెటర్ శ్రీశాంత్!, ఏ మూవీలో తెలుసా? ఈ మేరకు సుధీర్ బాబు మాట్లాడుతూ.. పదేళ్ల తన సినీ కెరీర్ సంతృప్తి నిచ్చిందన్నాడు. ‘నేను సినిమాలు, వాటి సంఖ్య కంటే కూడా నటుడిగా నాకు నేను సంపాదించుకున్న గౌరవమే ముఖ్యం. వెనక్కి తిరిగి చూసుకుంటే నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు ఉంది చాలు. కెరీర్లో నేను చూసిన వైఫల్యాలు, విజయాలు నాకు మంచి పాఠాలు. స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాను. కథతో పాటు బడ్జెట్, టెక్నికల్ టీమ్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలనే విషయాన్ని గ్రహించాను. పరిశ్రమలో ఎన్నేళ్లు ఉంటానని లెక్కలేసుకుని రాలేదు. నటుడిని కావాలనే తపనతో వచ్చాను. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం’ అని అన్నాడు. ఇక తన తొలి సినిమా షూటింగ్ సమయంలో ఓ చేదు అనుభవం ఎదురైందని ఈ సందర్భంగా సుధీర్ బాబు గుర్తు చేసుకున్నాడు. చదవండి: శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్ హిట్ ‘తొలి సినిమా షూటింగ్ మొదటి రోజే కెమెరా మెన్ నా అసిస్టెంట్త ఓ మాట అనడం విన్నాను. ‘‘ఇది వర్కౌట్ కాదు. హీరోది ఫోటోజెనిక్ ఫేస్ కాదని, నేను పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం’’ అని అన్నాడు. దీంతో గదిలోకి వెళ్లి నాన్‌స్టాప్‌గా ఏడ్చాను. ఎందుకంటే ఆ సినిమాకు నేనే నిర్మాతను. 60 లక్షల రూపాయలు అప్పు తీసుకుని మరి అప్పటికే అందరికి అడ్వాన్స్ ఇచ్చేశాను. కాబట్టి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. నా పర్ఫామెన్స్తోనే ఇలాంటి కామెంట్స్‌కు సమాధానం ఇవ్వాలనుకున్నా. అతడి వ్యాఖ్యలు నన్ను బాధించినప్పటికీ.. అవి నాకు పాఠంగా నిలిచాయి. అతడి మాటలతో నటుడిగా నన్ను ప్రూవ్ చేసుకోలవాలనే తపన నాలో పెరిగింది’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే.. ఆ తర్వాత హీరోగా కొత్త జోనర్లను ప్రయత్నించాలనే ఉద్దేశంతో ‘ప్రేమ కథా చిత్రం, సమ్మోహనం, చేశానన్నాడు. అలాగే నటుడిగా నిరుపించుకునేందుకు హిందీలో బాఘీ ఆఫర్ వస్తే చేశానని, ఇప్పుడు బ్రహ్మస్త్రలో విలన్‌గా నటించినట్లు తెలిపాడు. సినిమా, స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడైన మహేశ్ బాబు సాయం తీసుకున్నారా? అని అడగ్గా.. ఈ పదేళ్లలో తానేప్పుడు మహేశ్‌ను ఏ సాయం కోరలేదని చెప్పాడు. అది తను పాటిస్తున్న సూత్రమని, దర్శకనిర్మాతలు తన ప్రతిభను గౌరవిస్తున్నారు. అదే కారణంతో ఆఫర్లు వస్తున్నాయని పేర్కొన్నాడు. ఇక మంచి కథ దొరికితే మహేశ్‌తో నటించాలనేది తన కోరిక అని సుధీర్ బాబు తెలిపాడు. -
అమరావతి భూ అక్రమాల కేసులో ముగిసిన పోలీస్ కస్టడీ
సాక్షి, గుంటూరు: రాజధాని అమరావతి భూ అక్రమాల కేసులో నిందితుల రెండు రోజుల పోలీస్ కస్టడీ శనివారంతో ముగిసింది. అమరావతి గ్రామాల పరిధిలో భూముల రికార్డులను తారుమారు చేసిన కేసులో గుంటూరు జిల్లా తుళ్లూరు మండల మాజీ తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, విజయవాడ ఎం అండ్ ఎం వస్త్రదుకాణ యజమాని గుమ్మడి సురేష్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. చివరిరోజు శనివారం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విచారణ కొనసాగింది. రెండు రోజుల కస్టడీలో ఏడు గంటల పాటు నిందితులను పోలీసులు విచారించారు. ఉదయం 10 గంటలకు జిల్లా జైలుకు చేరుకున్న తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి న్యాయవాది సమక్షంలో సురేష్‌ను విచారించారు. ఆయన ఏ విధంగా అసైన్డ్ భూమిని కొనుగోలు చేశాడు..? అప్పటి తహసీల్దార్ అన్నే సుధీర్ బాబు సహాయంతో అసైన్డ్ భూమిని పట్టా భూమిగా ఏ విధంగా వెబ్ ల్యాండ్‌లోకి ఎక్కించారు..? ఈ మొత్తం వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. పరస్పర ఒప్పందంతోనే.. సుధీర్ బాబు, సురేష్‌లు ఇద్దరూ పరస్పర ఒప్పందంతోనే అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగానే సురేష్ భూమిని కొనుగోలు చేసి సీఆర్డీఏకు రికార్డులు సమర్పించే రెండు నెలలకాలం భూమిని పట్టా భూమిగా చూపారని, అనంతరం అసైన్డ్ భూమిగా వెబ్ ల్యాండ్‌లో మార్పు చేసినట్టు సమాచారం. -
బాబు ప్రొడ్యూసరు
సెట్లోకి హీరో వస్తే ‘బాబొచ్చాడు’ అని ప్రొడ్యూసర్ అలర్ట్ అవుతాడు.ఇప్పుడు బాబే ప్రొడ్యూసరయ్యి, మరో హీరో వస్తే ‘బాబొచ్చాడు’ అనేసిట్యుయేషన్ ఉంది.యంగ్ హీరోలు స్క్రీన్ మీదే కాదు, స్క్రీన్ వెనుక కూడా సినిమా కోసం కష్టపడుతున్నారు.హీరో కెరీర్‌తోపాటు ప్రొడ్యూసర్ కెరీర్నుకూడా బిల్డ్ చేసుకుంటున్నారు. సొంత సినిమాల్లో నటించి, డబుల్ ధమాకా చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి తీసుకున్న కొందరు తిరిగి ఇండస్ట్రీకి ఇవ్వడానికి ట్రై చేస్తారు. చేసిన సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకుని ఊరికే ఉండిపోయే హీరోల ధోరణి ఒకటైతే వచ్చిన డబ్బుతో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అదొక వ్యాపార వనరుగా చూసే హీరోల ధోరణి మరొకటి. గతంలో ఎన్టీఆర్‌కు రామకృష్ణ సినీస్టూడియోస్, ఏఎన్నార్‌కు అన్నపూర్ణ, కృష్ణకు పద్మాలయా బేనర్లు ఉండేవి. చిరంజీవి, నాగార్జున, మోహన్‌బాబు వంటి హీరోలు కూడా నిర్మాతలుగా సినిమాలు తీశారు. తాజాగా బాలకృష్ణ ఈ లిస్ట్‌లో చేరారు. మరి యంగ్ హీరోలు ఎవరు ఈ దారి పట్టారు? ఒకరికి అవకాశం ఇవ్వడానికే కాదు, తమను తాము నిలబెట్టుకోవడానికి కూడా చెక్‌లు సైన్ చేస్తున్న హీరోల పరిచయం ఇది. నిలిచి గెలిచాడు యంగ్ హీరోల్లో నిర్మాతగా ఎక్స్పరిమెంట్ చేయడానికి వెనుకాడని హీరో నాని. ఐదేళ్ల క్రితమే ఆయన ‘డి ఫర్ దోపిడీ’ చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించారు. అయితే అది అంతగా ఆడలేదు. కానీ నిర్మాణ రంగంౖపై నానికి మక్కువ తీరలేదు. ఏకంగా ‘వాల్‌పోస్టర్ సినిమా’ అనే బ్యానర్‌ను స్థాపించి ‘అ!’ అనే విభిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి తనలో ఓ మంచి నిర్మాత ఉన్నాడని చెప్పారు. ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇదే ఊపులో మరికొన్ని కథలు వింటూ ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హీరోగా ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్న నాని వచ్చే ఏడాది విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోగా నటిస్తారు. విజయోస్తు ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం’ సినిమాల విజయాలతో ప్రస్తుతం మంచి రైజింగ్‌లో ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. దాంతో ఆగకుండా ఇదే స్పీడ్‌లో నిర్మాతగా కూడా గట్టిగా కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అనే బ్యానర్‌ను మొదలెట్టి ప్రతిభ వున్న దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. తను హీరోగా నటించిన తమిళ, తెలుగు బై లింగ్వల్ ‘నోటా’ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన విజయ్ సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి తల పండక్కర్లేదన్న ఊపు మీద ఉన్నారు. ఇటీవల వచ్చిన ‘టాక్సీవాలా’ హిట్‌తో మరింత స్పీడుగా దూసుకెళ్లనున్నారు ఈ యంగ్ హీరో. సొంత గుర్తింపు కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీలో హీరో సుధీర్‌బాబు అడ్రస్ కేరాఫ్ సూపర్‌స్టార్ కృష్ణ అని అన్నారు ఫిల్మ్‌నగర్ వాసులు. ఆ తర్వాత ‘ప్రేమకథా చిత్రమ్, భలే మంచిరోజు, శమంతకమణి, సమ్మోహనం’ సినిమాలతో సొంత గుర్తింపును సంపాదించుకున్నారు. నచ్చిన కథలతో ఇతర నిర్మాతల డబ్బుపై ప్రయోగం చేయడం కంటే సొంత ప్రొడక్షన్లో సినిమాలు తీయడం మంచిదే అని భావిస్తున్నారు ఆయన. ‘సుధీర్‌బాబు ప్రొడక్షన్స్’ అనే కొత్త బ్యానర్‌ను స్థాపించి ‘నన్ను దోచుకుందువటే’ సినిమాను నిర్మించడంతో పాటు హీరోగా కూడా నటించారు. ఆర్.ఎస్. నాయుడు అనే కొత్త డైరెక్ట ర్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటించిన నభా నటేష్ టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. కొత్త ప్రస్థానం! ‘ప్రస్థానం’ సినిమాలో అందరి దృష్టిలో పడి ఆ తర్వాత ఐదేళ్లకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తో బాక్సాఫీస్ హిట్‌కొట్టిన హీరో సందీప్ కిషన్. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ వంటి సినిమాలు చేసినా సరైన హిట్ పడలేదు. ఈ నేపథ్యంలో ‘వెంకటాద్రి టాకీస్’ అనే బ్యానర్ ప్రారంభించి తను నటిస్తున్న ‘నిను వీడని నీడను నేనే’ సినిమాలో భాగస్వామి అయ్యాడతడు. షూటింగ్ పూర్తి కావొస్తున్న ఈ సినిమా రిలీజ్ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. నిర్మాత కార్తికేయ నిర్మాత కుమారుడు నిర్మాత కావడం ఆనవాయితీ. కాని దర్శకుడి కుమారుడు నిర్మాత కావడం కొత్తే. రాజమౌళి కుమారుడు కార్తికేయ ‘షోయింగ్ బిజినెస్’అనే బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారాడు. ఐదేళ్లపాటు ‘బాహుబలి’ సినిమా నిర్మాణాన్ని దగ్గర్నుంచి గమనించిన కార్తికేయకు సినిమాను ప్రొడ్యూస్ చేయాలన్న కోరిక కలిగింది. నాగచైతన్య ‘యుద్ధం శరణం’ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ వర్క్ చేసిన అనుభవంతో ‘ఆకాశవాణి’ అనే చిత్రానికి నిర్మాతగా మారారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు. సమ్మర్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అన్నట్లు... కార్తికేయ వివాహం కుదిరింది. వచ్చే ఏడాది ఆయన ఓ ఇంటివారు కాబోతున్నారు. ఛలో..ఛలో..! ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో నాగశౌర్య. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారారు. ఐరా క్రియేషన్స్ పేరుతో నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా ముల్పూరి, శంకర్ ముల్పూరినే సొంత నిర్మాణసంస్థ ప్రారంభించినా అది నాగశౌర్య సంస్థ కిందే లెక్క. ఆ బ్యానర్ కింద ఆయన హీరోగా నటించిన ‘ఛలో’ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇదే బ్యానర్‌పై రూపొందిన ‘నర్తనశాల’ను ప్రేక్షకులు మెచ్చలేదు. దీంతో మళ్లీ సక్సెస్ సాధించాలని డిఫరెంట్ కథలను వినడంలో బిజీగా ఉన్నారు శౌర్య. ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు మరికొందరు చిరంజీవి కమ్‌బ్యాక్ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో గతేడాది నిర్మాతగా మారారు హీరో రామ్‌చరణ్. ఇప్పుడు చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రానికి రామ్‌చరణే నిర్మాత. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్‌ను స్థాపించి నితిన్ హీరోగా ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రాన్ని నిర్మించారు పవన్ కల్యాణ్. హీరో బాలకృష్ణ ‘ఎన్బీకే ఫిల్మ్స్’ అనే బ్యానర్‌ను ఈ ఏడాదే స్థాపించి తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు హీరో రానా. వచ్చే ఏడాది ఆయన హీరోగా రూపొందనున్న ‘హిరణ్యకశ్యప’ సినిమాకు రానానే లీడ్ ప్రొడ్యూసర్. హీరో నారా రోహిత్ కూడా నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిలీజైన ‘కథలో రాజకుమారి’ సినిమాకు ఆయన ఒక నిర్మాతగా వ్యవహరించారు. ఇక కల్యాణ్ రామ్, మంచు విష్ణు ఇంతకు ముందే నిర్మాణం వైపు అడుగులు వేశారు. వందమంది నిర్మాతలు! కొత్త దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘మను’ చిత్రానికి దాదాపు వందమంది ప్రొడ్యూసర్స్. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఈ సినిమా నిర్మాణానికి మొదట ఏ నిర్మాతా ఆసక్తి చూపించకపోవడంతో క్రౌడ్ ఫండింగ్వైపు అడుగులు వేశారు ఈ సినిమా టీమ్. దీనికి సినీప్రియుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ ప్రకారం ఈ ఏడాది మరో వందమంది ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలోకి వచ్చినట్లేనని సరదాగా అనుకోవచ్చు.దర్శకులు కూడా వీలైనప్పుడు నిర్మాతలుగా మారుతున్నారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై దర్శకుడు సుకుమార్ సినిమా నిర్మాణంలో తన పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 21న విడుదల కానున్న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం 9000 కేఎమ్‌పీహెచ్’ సినిమాకు దర్శకుడు క్రిష్ ఒక నిర్మాత. ‘ఛల్ మోహన్‌రంగ’ సినిమాతో నిర్మాతగా మారారు త్రివిక్రమ్. దర్శకులు మారుతి, సంపత్ నంది కూడా ఇదే కోవలోకి వస్తారు. హీరో మహేశ్‌బాబు నిర్మాణరంగం వైపే మాత్రమే కాకుండా థియేటర్స్ బిజినెస్ వైపు కూడా దృష్టి పెట్టారు. ‘ఏఎమ్బి’ (ఏసియన్ అండ్ మహేశ్‌బాబు) మల్టీప్లెక్స్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేశారు. దీని సక్సెస్‌రేట్‌ను గమనించి మరిన్ని బ్రాంచ్‌లను మొదలెట్టాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఆయన హీరోగా నటిస్తున్న మహర్షి సినిమా విడుదల కోసం ముస్తాబవుతోంది. ఇక ఆయన జి.మహేశ్‌బాబు ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌తో నిర్మాతగా కూడా ఉన్నారు. ‘శ్రీమంతుడు, బ్రహోత్సవం’ సినిమా లకు సహనిర్మాతగా బాధ్యతలు నిర్వహించారు. -
మేకప్ వెనక మనసు ఉంటుంది
‘‘ఒకరోజు ఇంద్రగంటిగారు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ సినిమా గురించి చెప్పారు. పెద్దలు కథ చెబుతుంటే చిన్న పిల్లలు ఆసక్తిగా వింటారు కదా. అంత క్రమశిక్షణతో నేను కథ విన్నాను. చాలా నచ్చింది. నా వద్ద డేట్స్ లేకున్నా అడ్జెస్ట్ చేసి, ఈ సినిమా చేశా’’ అని అదితీరావు హైదరీ అన్నారు. సుధీర్‌బాబు, అదితీరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అదితీ చెప్పిన విశేషాలు. ► మణిరత్నం ‘కాట్రు వెలియిడై’ (చెలియా) సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయమయ్యాను. తెలుగులో ‘సమ్మోహనం’ నా తొలి చిత్రం. కథ నచ్చితేనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నా. దక్షిణాదిలో మణిరత్నంగారితో సినిమా చేయాలన్నది నా కల. ‘కాట్రు వెలియిడై’తో అది నెరవేరింది. ఇప్పుడు ఆయనతో రెండో సినిమా కూడా చేస్తున్నాను. తెలుగులో శేఖర్ కమ్ముల, తమిళంలో మిస్కిన్, గౌతమ్‌మీనన్ వంటి దర్శకులతో పనిచేయాలనుకుంటున్నా. ► వాళ్లవి కాని ఎమోషన్స్‌ని మనసులోకి తెచ్చుకుని ప్రేక్షకులను రంజింపజేయడానికి హీరోయిన్లు కృషి చేస్తారు. దాన్ని అభినందించాలి. అంతేగానీ హీరోయిన్లంటే కేవలం రక్తం, మాంసం ముద్దగా చూడకూడదు. మేం స్క్రీన్ మీద మేకప్‌తో కనిపిస్తాం. దాని వెనక ఉన్న మనసును చూడాలి. అందరూ మనలాంటి అమ్మాయిలే అనుకోవాలి. నేనైతే స్త్రీ, పురుషులు సమానమే అనుకుంటా. మావాళ్లు అలాగే పెంచారు. ► ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడం కాదు. నన్ను ఎప్పుడు ఎవరు అడిగినా నేను హైదరాబాదీనే అని చెప్పుకుంటా. అలా చెప్పుకోవడానికి గర్వపడతాను. ఇంట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడమని మా తాత చెప్పేవారు. కానీ నేను వినలేదు. ‘సమ్మోహనం’ కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ► ‘సమ్మోహనం’ షూటింగ్లో అందరూ బాగా చూసుకోవడంతో అలసిపోయినట్టు అనిపించలేదు. ఈ సినిమా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో లవ్‌స్టోరీ స్పెషాలిటీ తెరమీదే చూడాలి. ‘చెలియా’ సినిమా తెలుగులో సరిగ్గా ఆడలేదేమో కానీ, తమిళంలో బాగా ఆడింది. నేను అంత త్వరగా నెగటివ్ విషయాల గురించి ఆలోచించను. ► సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆస్ట్రోనాట్‌గా చేస్తున్నాను. ఉదయాన్నే రోప్ వర్క్స్ నేర్చుకుంటున్నా. రాత్రి మణిరత్నం సినిమా షూటింగ్లో పాల్గొంటున్నా. నేను బాగా కష్టపడతాను. ఎదుటివారిని గౌరవిస్తాను. నన్ను గౌరవించాలనుకుంటాను. మనకి ఎవరో వచ్చి గౌరవాలు ఇవ్వరు. ముందు మనల్ని మనం గౌరవించుకుంటే, ఎదుటివాళ్లు కూడా గౌరవిస్తారని నమ్ముతా. -
రొమాంటిక్ సాంగ్ @ 74
సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ‘మనసైనదేదో..’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ –‘‘74ఏళ్ల వయసులో శర్మ ఇంత రొమాంటిక్‌గా పాట రాస్తారని ఊహించలేదు. కవిత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ పాట వింటే ఒప్పుకుంటారు. పాట లాగే సినిమా కూడా హాయిగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నగారు అనుభూతి కవిత్వానికి పెట్టింది పేరు. నాన్నగారికి సందర్భం చెప్పగానే రాత్రికి రాత్రి పాట రాసిచ్చారు’’ అన్నారు మోహనకృష్ణ. ‘సమ్మోహనం’ జూన్ 15న విడుదల కానుంది. -
'నిన్ను చూసి గర్వపడుతున్నాం'
సాధారణంగా తెలుగు సినిమాల్లో ఎక్కువశాతం పరభాషా నటులు విలన్లుగా దర్శనమిస్తుంటారు. అచ్చంగా అలానే పరభాషా చిత్రంలో మన తెలుగు నటుడు విలన్ గా నటించి సత్తా చాటాడు. దాంతో ప్రస్తుతం అతడు 'టాక్ ఆఫ్ ద టాలీవుడ్' అయ్యాడు. తెలుగు యువ హీరో సుధీర్ బాబు తొలిసారి బాలీవుడ్ మూవీ 'భాగీ' లో నెగటివ్ రోల్ లో నటించి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సుధీర్ అభినయానికి తోటి నటీనటుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రెజీనా, రకుల్ ప్రీత్ సింగ్, మంచులక్ష్మీ, సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, ఆండీ శ్రీనివాసన్‌లు సధీర్ బాబుతో కలిసి భాగీని వీక్షించారు. 'సుధీర్ బాబు నిన్ను చూసి గర్వపడుతున్నాము. భాగీలో నీ నటన అద్భుతం. నీతో కలిసి భాగీని థియేటర్ లో చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది' అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన భాగీ చిత్రంలో విలన్ రోల్ లో సుధీర్ బాబు అలరించారు. శుక్రవారం విడుదలైన భాగీ ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా 2750 స్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. @isudheerbabu so proud of you in #Baaghi you were just amazing. Fun watching the movie w u in the theatres pic.twitter.com/nVNStgJrWt — Lakshmi Manchu (@LakshmiManchu) April 30, 2016