సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. ఈ మూవీ ద్వారా యువ దర్శకుడు మహేశ్ పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి 'పాపతో పైలం' అంటూ సాగే ఐటమ్ సాంగ్ గ్లింప్స్ (ప్రోమో) రిలీజ్ చేసింది చిత్రబృందం.
(చదవండి: సుధీర్ బాబు 'హంట్' అప్‌డేట్.. టీజర్ రిలీజ్ ఆరోజే..!)
ఈ సాంగ్‌లో సుధీర్ బాబు, అప్సర రాణిలతో పాటు నటుడు భరత్ కూడా అదిరిపోయే స్టెప్స్ వేస్తూ కనిపించారు. ఈ సాంగ్ ప్రోమో చూస్తే మాస్ స్టెప్పలతో ఊర్రూతలూగిస్తోంది. ఫుల్ లిరికల్ సాంగ్ రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జీబ్రాన్ సంగీతమందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ మంచి విజయం అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment