
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
సుధీర్‌బాబు, అదితీరావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘సమ్మోహనం’. శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో ‘మనసైనదేదో..’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ రచించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ –‘‘74ఏళ్ల వయసులో శర్మ ఇంత రొమాంటిక్‌గా పాట రాస్తారని ఊహించలేదు. కవిత్వానికి వయసుతో సంబంధం లేదని ఈ పాట వింటే ఒప్పుకుంటారు. పాట లాగే సినిమా కూడా హాయిగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా నాన్నగారు అనుభూతి కవిత్వానికి పెట్టింది పేరు. నాన్నగారికి సందర్భం చెప్పగానే రాత్రికి రాత్రి పాట రాసిచ్చారు’’ అన్నారు మోహనకృష్ణ. ‘సమ్మోహనం’ జూన్ 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment