సుధీర్ బాబు 'హంట్' అప్‌డేట్‌.. టీజర్ రిలీజ్ ఆరోజే..!  | Sudheer Babu Movie Hunt Teaser Release On 28th September | Sakshi

Sudheer Babu Movie Hunt: హంట్ టీజర్ రిలీజ్ ఆరోజే.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్

Sep 25 2022 6:39 PM | Updated on Sep 25 2022 6:45 PM

Sudheer Babu Movie Hunt Teaser Release On 28th September - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్‌ డోన్ట్‌ లై’ అనేది క్యాప్షన్‌. మహేశ్‌ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. పోలీసు పాత్రల్లో యాక్షన్‌ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం ఈనెల 28న టీజర్‌ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.   

(చదవండి: Sudheer Babu: కనిపించని శత్రువు కోసం సుధీర్‌బాబు వేట!)

సుధీర్, శ్రీకాంత్, భరత్‌లతో కూడిన పోస్టర్‌ టీజర్‌పై మరింత ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే  సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'  థియేటర్లలో సందడి చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement