Hunt
-
Gupta Nidhulu: గుప్తనిధుల కోసం తవ్వకాలు
శాలిగౌరారం: మండలంలోని ఆకారం గ్రామంలో గల పురాతన సూర్య దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం–వల్లాల అనుసంధాన డొంకదారి సమీపంలో వ్యవసాయ పంటపొలాల నడుమ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉన్న సూర్య దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో రెండు చోట్ల తవ్వకాలు చేపట్టిన దుండగులు గర్భ గుడిలో కూడా తవ్వకాలు జరిపారు. ఈ దేవాలయంలో సూర్యదేవుడి భారీ పంచలోహ విగ్రహంతో పాటు నంది, ఇతర విగ్రహాలు కూడా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ సమీపంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసినప్పటి నుంచి గుప్తనిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరపడంతో పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఏరివేతకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం గాజాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదులను వేటాడి హతమార్చాలని గూఢచారి సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. నెతన్యాహు ఆదేశాలను అమలు చేయడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీ, లెబనాన్, ఖతార్‌లలో హమాస్ నాయకులను వేటాడేందుకు ఇజ్రాయెల్ గూఢచారి ఏజెన్సీలు ఇప్పటికే నిఘా పెట్టాయి. హమాస్ వర్గానికి ఖతార్ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. రాజధాని దోహాలో హమాస్ కార్యకలాపాలను దశాబ్దంపాటు కొనసాగించేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగించేందుకు కూడా ఖతార్ కీలక పాత్ర పోషించింది. ఖతార్, ఇరాన్, రష్యా, టర్కీ, లెబనాన్,లు హమాస్ కార్యకలాపాలకు అవకాశం కల్పించాయని యుఎస్ ఇప్పటికే ఏన్నోసార్లు ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంక్షోభాలను తొలగించడానికి ఇజ్రాయెల్ కూడా ఇన్నాళ్లు హమాస్‌ను ఇతర దేశాల్లో లక్ష్యంగా చేయలేదు. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్‌ను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ ప్రస్తుతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హమాస్ నాయకులను వేటాడి హతమార్చాలని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించడం ఇజ్రాయెల్‌లోని మాజీ ఇంటెలిజెన్స్ అధికారులలో చర్చకు దారితీసింది. మాజీ మొస్సాద్ డైరెక్టర్ ఎఫ్రైమ్ హేలేవీ దీనిని తప్పు నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. హమాస్ నాయకులను నిర్మూలించడం వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తొలగిపోదని తెలిపారు. అందుకు బదులుగా హమాస్ అనుచరులు మరింత ఘోరమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇదీ చదవండి: గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్‌ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్‌డే గిఫ్ట్: ఫాక్స్‌కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్‌లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్‌ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం
ఇంఫాల్: మనిషి రూపంలోని మృగాల కోసం మణిపూర్‌లో భారీ ఎత్తున వేట కొనసాగుతోంది. జాతుల మధ్య వైరంతో విద్వేషం పెంచుకుని.. మూక దాడిలో ఇద్దరిని బలిగొనడమే కాకుండా.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలపై ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ వ్యవహారంలో మరో అరెస్ట్ జరిగింది. వైరల్ వీడియో ఆధారంగా.. ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌ను.. మరో ముగ్గురిని పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది. మరోవైపు హుయిరేమ్ ఇంటిని తగలబెట్టిన కొందరు మహిళలు.. అతని కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన నిందితులను పట్టుకునేందుకు భారీ ఎతున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మణిపూర్ పోలీసులు. ఈ సెర్చ్ ఆపరేషన్‌ను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు. నిందితుల్లో ఓ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మరణశిక్ష కోసం ప్రయత్నిస్తామంటూ సీఎం బీరెన్ సింగ్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. వీడియో ఆధారంగా వీలైనంత మందిని ట్రేస్ చేసి.. వాళ్ల ద్వారా మిగతా వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ కావడంతో వాళ్లంతా తలోదిక్కు పారిపోయి తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు. మణిపూర్ వ్యాప్తంగా అటు కొండప్రాంతంలో.. ఇటు లోయ ప్రాంతాల్లోనూ 126 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి జల్లెడపడుతున్నారు. శాంతి భద్రతలకు మరోసారి విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిందితులను త్వరగతిన పట్టుకునే ప్రయత్నం చేస్తామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే.. నిబంధనలు ఉల్లంఘించిన 413 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకోపక్క మణిపూర్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికర కంటెంట్ అవుతోంది. ఈ క్రమంలో పుకార్లకు చెక్‌పెట్టేందుకు.. 9233522822 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయించింది మణిపూర్ ప్రభుత్వం. ఇక.. కుకీ వర్సెస్ మెయితీల ఘర్షణల్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలను దయచేసి దగ్గర్లో ఉన్న స్టేషన్లో అప్పగించాలంటూ జనాలకు విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం. బెస్ట్ స్టేషన్ సమీపంలోనే.. మణిపూర్ నుంచి దేశాన్ని కుదిపేసిన కీచకపర్వానికి సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 2020లో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది నోంగ్‌పోక్ సెక్మయ్ స్టేషన్. ఈ పీఎస్ పరిధిలో.. అదీ ఒక కిలోమీటర్ పరిధిలో ఈ అకృత్యం జరగడం గమనార్హం. మే 4వ తేదీన(మణిపూర్ ఘర్షణలు మొదలైన మరుసటి రోజే) బీ ఫైనోమ్ గ్రామంలో మహిళలను నగ్నంగా ఊరేగించారు. పక్షం తర్వాత బాధితులు ఫిర్యాదు చేయడంతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నోంగ్‌పోక్ సెక్మయ్ పోలీసులు.. అపహరణ, హత్య, గ్యాంగ్ రేప్ నేరాల కింద కేసు నమోదు చేశారు. అయితే.. జులై 19న వీడియో వెలుగులోకి రావడం.. విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరో ఘటన కూడా? మణిపూర్‌లో ఘర్షణల ముసుగులో జరిగిన రాక్షస చర్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన సమయంలోనే మరో దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. బీ ఫైనోమ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో.. కాంగ్‌పోక్సీలో కారు సర్వీస్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. అనంతరం బయటకు ఈడ్చేయడంతో వాళ్లు తీవ్రంగా గాయపడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాళ్లు కన్నుమూశారని ఆ యువతుల స్నేహితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి జాతీయ మీడియా కథనాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి పోలీసుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కళ్ల ముందు జింక ఉన్నా.. వేటాడని పులి.. వీడియో వైరల్..
పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు. The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2 — Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023 ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్‌గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
ఆఫీషియల్: విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి హాంట్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేం భరత్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ మూవీ ‘ముంబై పోలీస్’కు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. అయితే హంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బోల్తా పడింది. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ దీంతో ఈ మూవీ థియేటర్లో విడుదలైన 2 వారాలకే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్కు అంతా రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. అంటే ఈ శుక్రవారం నుంచి హంట్ ఓటీటీలో సందడి చేయబోతోంది. కాగా ఏ చిత్రమైన థియేటర్లో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుంది. కానీ సుధీర్ భాబు, శ్రీకాంత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ Get ready for the action-packed #HuntTheMovie thriller movie releasing on Feb 10 on aha.#HuntTheMovieOnAHA Premieres Feb 10@isudheerbabu @_apsara_rani @actorsrikanth @bharathhere @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @adityamusic pic.twitter.com/qGghi97ip0 — ahavideoin (@ahavideoIN) February 9, 2023 -
అప్పుడే ఓటీటీలోకి ‘హంట్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఆ మధ్య టాలీవుడ్ ఓ రూల్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ హంట్ చిత్రం మాత్రం రెండు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. -
నేను అలాంటి సినిమాలు చేయను: సుధీర్ బాబు
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి హిట్ టాక్ లభించింది. తాజాగా చిత్రబృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ..'సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్‌లో 30 నిమిషాలు ఎక్సలెంట్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను సూపర్బ్ అంటూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా థాంక్స్. నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా.' అని అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..'క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. భరత్ మా సినిమాలో నటించినందుకు థాంక్స్. సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఆయనదే.' అని అన్నారు. భరత్ మాట్లాడుతూ..'తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్నేళ్లు టైమ్ తీసుకున్నా. మంచి సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వ్యాల్యూస్‌తో తీశాం. మహేష్ కెరీర్లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..'సినిమాకు లభిస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాం. కొత్తగా చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బాగుంది.' అని అన్నారు. -
‘హంట్’ మూవీ రివ్యూ
టైటిల్ : హంట్ నటీనటులు: సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్, చిత్ర శుక్లా తదితరులు నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్ నిర్మాత: వీ ఆనంద్ ప్రసాద్ దర్శకుడు: మహేశ్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫి: అరుల్ విన్సెంట్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: జనవరి 26, 2023 కథేంటంటే.. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు), మోహన్ భార్గవ్(శ్రీకాంత్), ఆర్యన్దేవ్(భరత్)ల చుట్టు ఈ కథ సాగుతుంది. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఏ కేసునైనా ఇట్టే సాల్వ్ చేస్తారు. వీరిలో ఆర్యన్ దేవ్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసును అర్జున్ ప్రసాద్ విచారిస్తాడు. తన స్నేహితుడిని చంపిదెవరో తెలుసుకునే క్రమంలో అర్జున్‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదం కారణంగా ఆయన గతం మర్చిపోతాడు. ఈ విషయాన్ని దాచి మళ్లీ ఆ కేసును విచారించే బాధ్యతను అర్జున్‌కే అప్పగిస్తాడు కమిషనర్ మోహన్ భార్గవ్. గతం మర్చిపోయిన అర్జున్ ఈ కేసును ఎలా చేధించాడు? ఈక్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? ఇంతకి ఆర్యన్ దేవ్‌ని హత్యచేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు చివరకు అర్జున్ ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హంట్ ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. గతం మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్..తన గతం తెలుసుకొని ఓ మర్డర్ కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. క్లైమాక్స్‌లో వచ్చే ఒక ట్విస్ట్.. అందరికి షాకివ్వడమే కాకుండా అప్పటి వరకు సినిమాపై ఉన్న ఒపీనియన్‌ని మార్చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్‌కి ఒప్పుకొని సినిమాను తీసిన సుధీర్ బాబుని కచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఈ సినిమా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగదు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. సినిమా ప్రారంభం అయిన కొన్ని క్షణాలకే అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. స్టార్టింగ్ కాస్త ఇంట్రెస్టింగ్గా కథనం సాగుతుంది. కానీ ఓ 15 నిమిషాల తర్వాత రొటీన్ సన్నివేశాలు..స్లో నెరేషన్ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతుంది. దర్శకత్వం లోపం వల్ల కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మిస్ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్‌కి గట్టి షాకిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గతం మర్చిపోయిన పోలీసు అధికారిగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌లో సుధీర్ బాబు నటన అందరినీ మెప్పిస్తుంది. మోహన్ భార్గవ్ పాత్రకి శ్రీకాంత్ న్యాయం చేశాడు. కాస్త సీరియస్‌గా ఉండే పాత్ర తనది. భరత్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మెరిశాడు. ఏసీపీ ఆర్యన్ దేవ్‌గా ఆయన ఉన్నంతలో చక్కగా నటించారు. కథంతా అతని పాత్ర చుట్టే తిరుగుతుంది. మైమ్ గోపీ, కబీర్ సింగ్ దుల్హన్, మంజుల, సంజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అందుకే డూప్స్.. రోప్స్ వాడలేదు
‘‘హంట్’ మూవీ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. స్నేహం నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు నాపాత్రతో ప్రయాణిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ సినిమా ఆడియన్స్‌కి కొత్త అనుభూతిని పంచుతుంది’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. మహేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘హంట్’. శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్‌బాబు పంచుకున్న విశేషాలు. ► ఓ సినిమా కోసం 50, 60 కథలు వింటుంటే ఒక మంచిపాయింట్ నచ్చుతుంది. దాన్ని ఎందుకు వదులుకోవడం? కొత్త దర్శకుడైనా మనం ఎందుకు సపోర్టు చేయకూడదు? అని ఆలోచిస్తాను. నాకు డౌట్స్ ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా.. ఆ తర్వాత టెస్ట్ షూట్ చేయమని చెబుతా. ‘హంట్’ సరికొత్త కథ. పైగా, భవ్య క్రియేషన్స్‌లాంటి అనుభవం ఉన్న నిర్మాతలున్నారు. ఆ నమ్మకం తోనే ఈ సినిమా చేశాను. ► ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్పాత్ర చేశాను. గతం మర్చిపోవడానికి ముందు, గతం మర్చిపోయిన తర్వాత.. ఇలా రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో యాక్షన్ రియల్‌గా ఉండాలనుకున్నాం. అందుకే డూప్స్, రోప్స్ వాడలేదు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు మా మూవీకి పనిచేశారు. ఫారిన్లో ఫైట్లు షూట్ చేశాం. నాలుగు రోజుల్లో యాక్షన్ సీక్వెన్సులు తీశాం. ► ‘హంట్’లో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలో లీనమవుతారు. నాకు, నా కుటుంబ సభ్యులకు, ప్రీమియర్ చూసిన వందల మందికి సినిమా నచ్చింది. అయితే ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు ఇది. ► మా మామయ్య కృష్ణగారు చాలా ప్రయోగాలు చేశారు. నేను కొత్తగా చేసిన ‘హంట్’ చూసి అభినందిస్తారనే నమ్మకం ఉండేది. కానీ, ఆయన మన మధ్య లేకపోవడంతో వెలితిగా ఉంది. ప్రస్తుతం హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ సినిమా, యూవీ క్రియేషన్స్‌లో అభిలాష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. -
సుధీర్ బాబు హంట్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)
-
కృష్ణగారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను.. సుధీర్ బాబు ఎమోషనల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ ఏ.ఎమ్.బి. మాల్లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్. మావయ్య చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ. ఆయన లేని వెలితి కనిపిస్తుంది. నా ప్రతి సినిమా ఫస్ట్ షో చూసిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. మావయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారట. ఇది నాకు గర్వకారణం. కెరీర్లో ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటాను' అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు. -
ఆ సినిమా రీమేక్ నేను చేయాల్సింది: భరత్
‘టాలీవుడ్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
ఆద్యంతం ఆసక్తికరంగా ‘హంట్’ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. ఈ చిత్రంలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. మెమరీ లాస్‌కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
' హంట్ మూవీ ' హీరో సుధీర్ బాబుతో " స్పెషల్ చిట్ చాట్ "
-
డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్.. సుధీర్ బాబు యాక్షన్ స్టంట్స్ మేకింగ్ వీడియో రిలీజ్
సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘హంట్’. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్‌ని ఫ్రాన్స్‌కి చెందిన క్యాంపస్ యూనివర్స్ కాస్కేడ్స్ టీమ్ డిజైన్ చేసింది. సుధీర్‌బాబు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలోని రిస్కీ ఫైట్స్‌కి డూప్ వాడలేదు. రోప్, బెడ్లాంటివి ఏవీ లేకుండానే ఫైట్స్ చేశాం. ఈ సినిమాలో అన్నీ మరపోయే రెండు షేడ్స్ ఉన్న అర్జున్ పాత్ర చేశాను. జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక.. ఇలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘హై వోల్టేజ్యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ త్రాన్ని రూపొందించాం. హాలీవుడ్ వర్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’కి స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి చిత్రానికి కూడా వాళ్లే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఈ ముగ్గురికీ తొలి భారతీయ చిత్రం ఇది’’ అన్నారు ఆనందప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’
సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హంట్’. మహేశ్ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్ పోలీసాఫీసర్లుగా నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’ సినిమాను జనవరి 26న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియార్ ‘హంట్’ సినిమాకు యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. వాళ్లు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా నిలుస్తుంది’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
సుధీర్‌బాబు హంట్‌కు హాలీవుడ్ యాక్షన్ టచ్
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు పని చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "హాలీవుడ్లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. 'హంట్' మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. చదవండి: మరో భాషలో వస్తున్న కాంతార, రిలీజ్ ఎప్పుడంటే? బాలీవుడ్ నటిపై నిఖిల్ ఆగ్రహం -
తార్ మార్ తక్కర్ మార్.. చివరికి భలే ట్విస్ట్
ప్రాణి ప్రపంచం వాటి మనుగడ పోరాటాన్ని మాత్రమే కాదు అప్పుడప్పుడు సరదాను కూడా మానవాళికి పంచుతుంటుంది. అలాంటి వీడియోనే ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి.. నీల్గై (బ్లూబక్)ను చూసి వేటాడాలనుకుంది. దాడి చేసే క్రమంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. సరిగ్గా.. ఆ నీలిజింక తలెత్తి చూసే సమయానికి కిందకు వంగుని దాగుడు మూతలు ఆడింది. చివరికి.. ఆ రెండింటి మధ్య జరిగిన తార్ మార్ తక్కర్ మార్ ఫలితం ఏంటో మీరూ చూసేయండి. Hide and seek! It began when she saw the #Nilgai at about 80m. Interestingly, the #tiger had all the grass to hide, but she continued to blend with the road without cover. #SatpuraNationalPark #Hunting #predator #SavetTiger #TigerTales @NatureIn_Focus @RGSustain1 @conserve_ind pic.twitter.com/qMbK1fOhXG — Rajesh Sanap (@RajeshVS87) November 6, 2022 మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్‌లో ఈ ఘటన జరిగిందని రాజేష్ సనాప్ అనే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియోను పోస్ట్ చేశారు. విపరీతమైన లైకులు, వ్యూస్‌తో దూసుకుపోతోంది ఆ వీడియో. సరదా కామెంట్లు మాత్రమే కాదు.. ఈ వీడియోపై సీరియస్ కోణంలోనూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇదీ చూసేయండి: రైళ్లలో కొందరు ఛాయ్ ఎలా వేడి చేస్తారో తెలుసా? -
‘హాంట్’ టైటిల్ పై వివాదం.. నోటీసులు పంపిన చిత్ర బృందం
గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది. శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో జూలై లొనే హాంట్ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ నోటీసులు పంపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్, హీరో నిక్షిత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తరువాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్‌తో అప్లై చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్స్ రిజెక్ట్ చేశాయి. ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు. అందుకే మా లాయర్ ద్వారా వాళ్లందిరికి నోటీసులు పంపించాం. మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం’ అని అన్నారు. ‘చాలా ఖర్చు పెట్టి సినిమా తీశాం. ఇప్పుడు టైటిల్ ఇష్యూ వల్ల బిజినెస్‌కి ఇబ్బంది అవుతుంది. మా టైటిల్ మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం’అని నిర్మాత నర్సింగరావ్ అన్నారు. ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్స్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉందని చెప్పాయి. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తప్పును వారే తెలుసుకోవాలి. ఎవరికి అన్యాయం జరగవద్దు అనేది నా కోరి’అని అన్నారు. -
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్‌ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్‌పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘హంట్’టైటిల్‌ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్‌ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
చీకట్లో నల్ల చిరుత.. అలా బంధించే హక్కు ఎవడిచ్చాడు?
వైరల్: నల్ల చిరుత.. చాలా అరుదుగా కనిపించే ప్రాణి. అలాంటి ప్రాణి వేటాడే దృశ్యాలు ఇంకా అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన సందర్భాన్ని బంధించే క్రమంలో.. ఓ వీడియోగ్రాఫర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నల్ల చిరుత.. ఓ జింకను వేటాడి దాని కళేబరాన్ని నోట కరుచుకుని వెళ్లబోతోంది. అయితే ఆ సమయంలో ఓ వీడియోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించే యత్నం చేశాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫోకస్ లైట్ వేసి మరీ వాహనం శబ్దం చేయడంతో అది ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతలో.. అక్కడే ఉన్న సాధారణ చిరుత ఆ కళేబరాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. పర్ఫెక్ట్ క్యాప్చర్ అంటూనే.. స్పాట్ లైట్ యొక్క పూర్తి కాంతిలో ప్రకృతి యొక్క ఈ అరుదైన క్షణాలను సంగ్రహించే హక్కు ఎవడిచ్చాడు అంటూ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత్ నంద ఆ వీడియోను పోస్ట్ చేశారు. A perfect capture. Both by the leopard & the videographer😞😞 But who gave the right to capture these rare moments of nature in full glare of spot light? WA fwd. pic.twitter.com/ZITOBOpO92 — Susanta Nanda (@susantananda3) October 8, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిదో తెలియదు. ఎవరి ఆ క్షణాల్ని బంధించారో తెలియదు. కానీ, ఆ వీడియోగ్రాఫర్ చేష్టలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. -
అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్'. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్‌ను రిలీజ్ చేసింది. 'అతను అర్జున్ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అర్జున్ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్‌లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే.