శాలిగౌరారం: మండలంలోని ఆకారం గ్రామంలో గల పురాతన సూర్య దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం–వల్లాల అనుసంధాన డొంకదారి సమీపంలో వ్యవసాయ పంటపొలాల నడుమ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉన్న సూర్య దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు.
దేవాలయ ప్రాంగణంలో రెండు చోట్ల తవ్వకాలు చేపట్టిన దుండగులు గర్భ గుడిలో కూడా తవ్వకాలు జరిపారు. ఈ దేవాలయంలో సూర్యదేవుడి భారీ పంచలోహ విగ్రహంతో పాటు నంది, ఇతర విగ్రహాలు కూడా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ సమీపంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసినప్పటి నుంచి గుప్తనిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరపడంతో పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment