Hidden treasures
-
Gupta Nidhulu: గుప్తనిధుల కోసం తవ్వకాలు
శాలిగౌరారం: మండలంలోని ఆకారం గ్రామంలో గల పురాతన సూర్య దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం–వల్లాల అనుసంధాన డొంకదారి సమీపంలో వ్యవసాయ పంటపొలాల నడుమ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉన్న సూర్య దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో రెండు చోట్ల తవ్వకాలు చేపట్టిన దుండగులు గర్భ గుడిలో కూడా తవ్వకాలు జరిపారు. ఈ దేవాలయంలో సూర్యదేవుడి భారీ పంచలోహ విగ్రహంతో పాటు నంది, ఇతర విగ్రహాలు కూడా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ సమీపంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసినప్పటి నుంచి గుప్తనిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరపడంతో పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
గుప్తనిధుల కోసం 20 అడుగుల గొయ్యి!
విశాఖపట్నం: ఓ వ్యక్తి తన ఇంటి వద్ద గుప్తనిధులు ఉన్నాయని 20 అడుగుల గొయ్యి తవ్వినట్టు కంచరపాలెం ఐదో పట్టణ పోలీసులకు సమాచారం అందింది. పోటీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెం ధర్మానగర్ రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న కోటేశ్వరరావు అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల నుంచి అతని ఇంటి ముందు తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విజయవాడకు చెందిన పలువురు వచ్చి గుప్తనిధుల కోసమే ఈ గొయ్యి తవ్వుతున్నారని వివరించారు. విషయం బయటకు పొక్కడంతో గేట్లకు తాళాలు వేశారని పేర్కొన్నారు. కంచరపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేశారు. వాస్తు బాగోలేక ఈ తవ్వకాలు చేపట్టినట్లు కోటేశ్వరరావు చెప్పాడు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
11మందిని పొట్టన పెట్టుకుని?
సాక్షి, నాగర్‌కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం.. ఎవరైనా ఎదురుతిరిగితే మట్టుబెట్టడం.. ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని∙పొట్టన పెట్టుకున్నాడని భావిస్తున్న ఓ నరహంతకుడిని నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ యాదవ్ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు, మాయలు తెలుసునంటూ అమాయక మహిళలు, వ్యక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.' తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని, కుటుంబ కలహాలు, సమస్యలను పరిష్కరిస్తానంటూ మొదట తనకు పరిచయం అయిన వారిని నమ్మిస్తాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా పథకం ప్రకారం హత్యకు తెగబడతాడని బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 11 మంది అమాయకులను బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. కాగా మంగళవారం నిందితుడి పూర్తి వివరాలను వెల్లడిస్తామని నాగర్‌కర్నూల్ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. కందనూలులో కలకలం! 'మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను నమ్మిస్తాడు.. మాటలతో పూర్తిగా మభ్యపెట్టి ఆస్తులు రాయించుకుంటాడు.. ఎవరైనా తన దారిలోకి రాలేదని అనుమానం వస్తే మట్టుబెట్టేందుకు సైతం వెనకాడడు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 11 మందిని హతమార్చాడు.. ఇలా మాయమాటలతో మొదలుపెట్టి.. హత్యలతో ముగింపు పలుకుతున్న సదరు మాయగాడి పాపం పండింది.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతుండటంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..' కందనూలులో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా.. మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న మాయగాడు రామెట్టి సత్యనారాయణయాదవ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తన దారికి రానందుకు ఏకంగా 11 మందిని హత్య చేసి పొట్టనబెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం, ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వదకొండు మంది అమాయకుల హత్యలో సత్యనారాయణకు ప్రమేయం ఉందని, పూర్తిస్థాయి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మాయగాడు సత్యనారాయణయాదవ్ కు సంబంధించి పూర్తి వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది. ► తనకు మంత్రాలు తెలుసంటూ అమాయకులను మచ్చిక చేసుకోవడం, గుప్తనిధులను వెలికితీస్తానంటూ నమ్మిస్తూ సత్యనారాయణయాదవ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన రామస్వామి(50) 2022 నవంబర్ 17న వనపట్ల శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. లింగస్వామి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రతిఫలంగా ఆయనకు ఉన్న 130 గజాల ప్లాటును మార్టిగేజ్ చేయాలని నమ్మించాడని బాధిత కుటుంయిం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాటును మార్టిగేజ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే రామస్వామి హత్యకు గురయ్యాడని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి మరణంతో పాటు వీపనగండ్ల మండలానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసుతోనూ సత్యనారాయణ యాదవ్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ► ఇప్పటికే 11 మందిని హత్య చేసినట్లు అనుమానాలు ► హైదరాబాద్‌లో జరిగిన ఓఘటనతో కదులుతున్న డొంక ► పోలీసుల అదుపులో మాయగాడు సత్యనారాయణ ► మూడేళ్ల క్రితం నాగాపూర్‌లో సంచలనం రేపిన నలుగురి మృతి ► ఈ ఘటన వెనుక కూడా ఇతడి హస్తమే ఉన్నట్లు సమాచారం ► గతంలోనే నిందితుడి బాగోతాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ మహిళలపై లైంగిక వేధింపులు.. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలను నమ్మిస్తూ వారిపై సత్యనారాయణయాదవ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటుండగా.. వారి కుటుంబ సమస్యను మంత్రశక్తితో పరిష్కరిస్తానంటూ ఆమెకు చెందిన భూమిని సత్యనారాయణయాదవ్ తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సత్యనారాయణయాదవ్ బాగోతాలపై ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’ శీర్షికన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు కొనసాగిన హత్యోదంతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. సంచలనం రేపిన నాగాపూర్ ఘటన! 'జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న ఘటనలపై బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తన మంత్రశక్తితో దూరమైన భార్యాభర్తలను కలుపుతానంటూ మహిళను నమ్మించి రూ.లక్షలు విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ మనోహర్ని కలసి ఫిర్యాదు చేసింది.' ► జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న సెటిల్మెంట్ రాయుళ్లదందా ► మంత్రాలు, మాయలతో అమాయకులకు బురిడి ► వరస ఘటనలు చోటుచేసుకుంటున్నా పట్టని పోలీసు అధికారులు ► చోద్యం చూస్తూ నేరస్తులకే సహకరిస్తున్నారన్న ఆరోపణలు మంత్రాలు, మాయలు అంటూ అడ్డగోలు దందా.. జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ నమ్మబలుకుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్న మాయగాళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మాయగాళ్ల చేతుల్లో నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.. జిల్లాలోని వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆమె భర్తతో కొన్నాళ్లుగా గౌడవలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ తాను మంత్రాలు చేసి భార్యభర్తలను కలుపుతానని నమ్మబలికాడు. ఇందుకోసం మహిళ పేరిట భూమి, ఆస్తులు ఉంటే పని జరగదని చెప్పి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సదరు మహిళకు ఉన్న రెండు ప్లాట్లను సత్యనారాయణ పేరిట, అతని బందువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం భర్తకు చెప్పిన తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న భార్యభర్తలు ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన.. నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన లింగస్వామి (50)కి రామెట్టి సత్యనారాయణ 2013లో 130 గణాల ప్లాటును విక్రయించాడు. తర్వాత లింగస్వామితో పరిచయం పెంచుకున్న సత్యనారాయణ.. లింగస్వామి చిన్న కుమారుడు శివశంకర్‌కు బ్యాంకులో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్లాటును మార్టిగేజ్ చేయాలని ఒప్పించారు. 2022 నవంబర్ 7న తన బందువు మహేశ్ పేరిట భూమిని మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత పది రోజులకే 2022 నవంబర్ 17న లింగస్వామి వనపట్ల శివారులో దారుణహత్యకు గురయ్యాడు. లింగస్వామి హత్యకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన మహ్మద్ పాషా శ్రీపురం రోడ్డులో డబ్బాను ఏర్పాటుచేసుకుని చిన్నపిల్లలకు తాయత్తులు కడుతుండేవాడు. తన వద్దకు వచ్చే మహిళకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు సంబందించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశాడు. అతని వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచినా స్పందన లేదు! జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణ నాకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, భూమిని మార్టిగేజ్ చేయించాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత పదిరోజులకే మా నాన్న హత్యకు గురయ్యాడు. మాకు వేరే ఎవరితో గొడవలు లేవు. నిందితులను పట్టుకోవాలని ఇప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను బయటపెట్టాలి. -శివశంకర్,గన్యాగుల విచారణ చేపట్టాం.. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రతి కేసును లోతుగా విచారణ చేపడుతున్నాం. త్వరలోనే విచారణ పూర్తిచేస్తాం.- మోహన్ కుమార్, డీఎస్పీ, నాగర్ కర్నూల్ -
ప్రకాష్‌ను చంపేందుకు స్వామిజీతో కలిసి నాగమణి స్కెచ్.. క్షుద్రపూజలు!
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం వంకరకుంటలో సంచలనం రేకెత్తించిన గుప్త నిధుల తవ్వకాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను పుట్టపర్తి డీఎస్పీ యశ్వంత్ వెల్లడించారు. ఏం జరిగిందంటే.. నల్లమాడ పోలీసు సర్కిల్ పరిధిలోని వంకరకుంట గ్రామానికి చెందిన రైతు వెంకటాద్రి పొలంలో గుప్త నిధుల కోసం ఈ నెల 14న కొందరు తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై రైతు వెంకటాద్రి ఫిర్యాదు మేరకు అప్పట్లో నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఆదేశాల మేరకు డీఎస్పీ యశ్వంత్ పర్యవేక్షణలో పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి లోతైన దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పట్టుబడింది వీరే.. గుప్త నిధుల తవ్వకాల కేసులో పట్టుబడిన వారిలో ఖమ్మం నివాసి నిజాముద్దీన్, నల్లమాడ మండలం చెరువు వాండ్లపల్లికి చెందిన శివశంకరరెడ్డి, నరేంద్ర రెడ్డి, హైదరాబాద్ నివాసి శ్రీనివాసులు, పుట్టపర్తికి చెందిన విజయ్, తమిళనాడుకు చెందిన చాంద్‌బాషా, మురుగన్, సురేష్, అనంతపురానికి చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ భార్య నాగమణి ఉన్నారు. వీరి నుంచి గుప్త నిధుల తవ్వకానికి వినియోగించిన ఇనుపరాడ్లు, బండను తొలగించేందుకు ఉపయోగించే 20/30 పౌడర్, పూజకు వినియోగించిన ముడుపు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇదే కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. హత్య కుట్ర వెలుగులోకి పట్టుబడిన నిందితులను విచారణ చేయడంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ మాజీ కానిస్టేబుల్ ప్రకాష్ హత్యకు పన్నిన కుట్ర వెలుగు చూసింది. ప్రకాష్, నాగమణి దంపతులు. ప్రకాష్ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని భార్యను నిర్లక్ష్యం చేయడమే కాక, వేధింపులకు గురి చేస్తుండడంతో ఖమ్మంకు చెందిన నిజాముద్దీన్‌తో కలిసి భర్త హత్యకు నాగమణి పథకం రచించింది. దీంతో తదుపరి విచారణ నిమిత్తం ఈ కేసును అనంతపురం పోలీసులకు బదిలీ చేశారు. కాగా, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన నల్లమాడ సీఐ నిరంజన్‌రెడ్డి, నల్లమాడ, ఓడీసీ, బుక్కపట్నం, అమడగూరు ఎస్ఐలు వలీబాషా, గోపీకుమార్, నరసింహుడు, వెంకటరమణ, సర్కిల్ సిబ్బందిని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ అభినందించారు. -
తండ్రి మాట ప్రకారం.. నిమ్మకాయలు, నల్లకోడి కోసి తవ్వకాలు.. పక్కా సమాచారంతో..
సాక్షి, గీసుకొండ(వరంగల్): అరేయ్.. చేనులో చెట్టుకింద గుప్తనిధులు ఉన్నాయి.. తవ్వుకుని తీసుకోండి, నాకేదో గుబులుగా ఉంది.. అంటూ ఓ తండ్రి తరచుగా తన కుమారులకు చెబుతుండేవాడు.. గుప్తనిధి విషయం కలలో వస్తోందని తండ్రి పదే పదే మొత్తుకున్నా వారు ఆసక్తి చూపలేదు. ఇటీవల తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. అతడు చెప్పినట్లు కుమారులు గుప్తనిధుల కోసం చెట్టుకింద తవ్వ కాలు చేపట్టగా.. 30 రాగి నాణేలు బయటకు వచ్చాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో యార కొమురయ్య అనే రైతుకు మల్లారెడ్డి, రమణయ్య, కుమారస్వామి, రాజిరెడ్డి అనే నలుగురు కుమారులున్నారు. కాగా మల్లారెడ్డికి 1.8 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో తండ్రి మాట ప్రకారం గత నెల 23న తన అన్నదమ్ములు, మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన పంజరబోయిన శ్రీనివాస్, గంగ దేవిపల్లికి చెందిన మేడిద కృష్ణ,నెక్కొండ మండలం అమీన్‌పేటకు చెందిన యాటపూర్ణచందర్ అనే పురోహితుడి సాయంతో నల్లకోడి, నిమ్మకాయలను కోసి పూజలు చేసి ఐదు చోట్ల లోతు గోతిని తవ్వారు. వారి తవ్వకాల్లో 1818నాటి పురాతనమైన 30 రాగి నాణేలు లభ్యం కాగావాటిని మష్ అనే మధ్యవర్తి సహకారంతో హైదరాబాద్‌లో విక్రయించడానికి ప్రయత్నించగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ప్రణాళిక ప్రకారం పట్టుకుని, నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నాలుగు సెల్ఫోఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యార రమణయ్య, కుమారస్వామి, రాజిరెడ్డిలు పరారీలో ఉన్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. కాగా, పురాతనమైన రాగినాణేలు లక్ష్మీగణపతి, ఆంజనేయస్వామి, వినాయకుడు, అమ్మవారి రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ ఐపీఎస్ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, సంతోష్, ఎస్సై ప్రేమానందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా, టాస్క్‌ఫోర్స్ అందింన వివరాల ప్రకారం తవ్వకాల్లో ప్రమేయం ఉన్నవారిపై కేసు నమోదు చేసి నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: Gadwal Bidda: ఇంటర్నెట్ సెన్సేషన్ గద్వాల్ బిడ్డ కన్నుమూత! -
మహాస్తూపంలో ‘గుప్త నిధుల’ తవ్వకాలు
రాంబిల్లి: విశాఖ జిల్లాలో ప్రసిద్ధి చెందిన.. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోని కొత్తూరు బౌద్ధ క్షేత్రంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ క్షేత్రంలో గల మహాస్తూపంలోని ఓ గదిలో ఎనిమిది అడుగుల మేర గొయ్యిని తవ్వినట్లు పురావస్తు శాఖ కన్జర్వేటివ్ అసిస్టెంట్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది మహాస్తూపంలో మట్టి కుప్పను గుర్తించి తనకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. కొన్ని ఏళ్ల క్రితం ఈ బౌద్ధక్షేత్రంలో కేంద్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో విలువైన ధాతు, రాతి భరిణెలు లభ్యమయ్యాయి. వీటిలో కళ్లు మిరిమిట్లు గొలిపే వజ్రాలు, ఇతర వస్తువులున్నాయి. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ధన దిబ్బలుగా పిలుస్తారు. ఈ ఘటన సంచలనం కలిగించింది. శనివారం రాత్రి నుంచి ఇక్కడ పోలీసులను పహారా పెట్టారు. -
గుప్తనిధుల కోసం భారీ సొరంగం
సాక్షి, తిరుపతి: శేషాచలంలో ఎర్రబంగారమే కాదు.. అపారమైన గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో ఓ ముఠా పథకం వేసింది. ఏడాది పాటు శ్రమించి భారీ సొరంగం తవి్వంది. మరికొంత సొరంగం తవ్వితే.. గుప్తనిధులు బయటపడేవని ముఠా సభ్యులు చెబుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని శనివారం అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లికి చెందిన పెయింటర్ నాయుడు 2014లో తిరుపతికి మకాం మార్చాడు. భార్య నుంచి విడిపోయిన అతడు తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి గుప్తనిధుల మీద ఆశ మొదలైంది. నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. తవ్వకాల సమీపంలో రాయిపై ఉన్న గుర్తులు కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్తనిధి ఉందని భావించారు. నాయుడు, రామయ్యస్వామి.. ఆరుగురు కూలీలతో కలిసి ఏడాది కిందట తవ్వకాలు ప్రారంభించారు. విషయం బయటకు తెలియకుండా సొరంగం తవ్వుతూ వచ్చారు. ఏడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా.. రేయింబవళ్లు 80 అడుగుల సొరంగం తవ్వారు. మరికొంత తవ్వేందుకు శుక్రవారం రాత్రి కూలీలతో బయలుదేరారు. మరికొందరి కోసం మంగళం వెంకటేశ్వరకాలనీ సమీపంలో ఎదురు చూడసాగారు. ఈ ముఠా కదలికలతో అనుమానం వచ్చిన కాలనీవాసులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల తవ్వకాలకు వచ్చినట్లు వారు విచారణలో తెలిపారు. వారిద్వారా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వితే సరిపోయేదని ముఠా సభ్యులు చెబుతున్నారు. -
ప్రాణాలు తీసిన అత్యాశ.. గుప్త నిధుల కోసం గుంత తవ్వుతుండగా
టీ.నగర్: మాంత్రికుడి మాటలు నమ్మి గుప్తనిధుల కోసం ఇద్దరు బలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తూత్తుకుడి జిల్లా, నజరేత్ తిరువళ్లువర్ కాలనీకి చెందిన ముత్తయ్య (65). ప్రైవేటు సంస్థలో వాచ్‌మన్. అతడి కుమారులు శివమాలై (40), శివవేలన్ (37). శివమాలై రియల్టర్. హిందూ మున్నని ముఖ్య నేత. శివవేలన్ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ముత్తయ్య ఇంటి వెనుక గుప్తనిధులు ఉన్నట్లు తెలిపి ఆయన కుమారులు ఇద్దరు తన స్నేహితులైన ఆళ్వార్ తిరునగరికి చెందిన రఘుపతి (47), పన్నంపారైకు చెందిన నిర్మల్‌గణపతి (18) సాయంతో గుంత తవ్వడం మొదలుపెట్టారు. ఆదివారం కూడా గుంత తవ్వుతుండగా ఊపిరాడక స్పృహ తప్పారు. విషయం తెలిసి నజరేత్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలం చేరుకున్నారు. వెంటనే నలుగురినీ నెల్లై ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే నిర్మల్‌గణపతి, రఘుపతి మృతిచెందారు. ప్రాణాపాయస్థితిలో శివమాలై, శివవేలన్ చికిత్స పొందుతున్నారు. నెల్లై పోలీసుల విచారణలో కేరళకు చెందిన ఒక మాంత్రికుని రఘుపతి సంప్రదించగా అతను శివమాలై ఇంటి వెనుక గుప్తనిధులు ఉన్నట్లు తెలిపినట్లు గుర్తించారు. దీంతో వారంతా అక్కడ గుంత తవ్వడం ప్రారంభించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు తెలిసింది. చదవండి: బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం -
ఇంట్లో గొయ్యి... అమ్మాయి అదృశ్యం!
ఎర్రుపాలెం: ఒకవైపు గుప్తనిధుల కోసం ఇంట్లో తవ్వకాలు.. మరోవైపు ఆ ఇంటికే చెందిన బాలిక అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో చోటుచేసుకుంది. రేమిడిచర్లకి చెందిన వెల్లంకి వెంకట్రావు,రాణి దంపతుల కుమార్తె రాజశ్రీ (16) వరంగల్‌లో నివసిస్తున్న తన బాబా యి వెల్లంకి నాగేశ్వరరావు వద్ద ఉంటోంది. ఆ ఊర్లోనే నివసిస్తున్న గద్దె నర్సింహారావు(నాగేశ్వరరావు మామ) ఇంట్లో లంకె బిందెలున్నా యని క్షుద్రపూజారులు చెప్పడంతో ఇంట్లో సొరంగంలా పెద్దగొయ్యి తీశారు. ఓ బాలికను నరబలి ఇస్తే ఫలితం ఉంటుందని పూజారులు చెప్పడంతో రాజశ్రీతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నారని, ఈ విషయం బాలిక తల్లిదండ్రులకూ తెలుసనే ప్రచారం జరుగుతోంది. రాజశ్రీ తల్లిదండ్రులు ఈ నెల 17న గుంటూరు జిల్లా పెద్ద కాకానిలోని గుడికి వెళ్లారు. రాజశ్రీకి జ్వరం వస్తోందని ఆమెను ఇంటి వద్దే ఉంచారు. వారు తిరిగి వచ్చేసరికి బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను పైచదువుల నిమిత్తం ఇల్లు విడిచి వెళ్తున్నానని బాలిక ఇంగ్లిష్‌లో రాసిన లేఖ ఆమె ఇంట్లో పోలీసులకు దొరికింది. విషయం తన స్నేహితురాలు శరణ్యకు తెలుసని, చదువు పూర్తయిన తర్వాత తిరిగి వస్తానని అందులో పేర్కొంది. ఈ లేఖ రాజశ్రీనే రాసిందా, లేక బలవంతంగా రాయించారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శరణ్యను విచారించగా, మహారాష్ట్రలోని అంబాని ఆశ్రమానికి వెళ్తానని రాజశ్రీ చెప్పినట్లు వివరించింది. రాజశ్రీ మొబైల్‌ను లొకేషన్ ట్రేసింగ్ చేస్తున్నారు. రాజశ్రీని నర బలి ఇచ్చారా లేక తనే ఇంటి నుంచి వెళ్లిపోయిందా.. మాంత్రికులు వేరే ప్రాంతాలకు తమ వెంట తీసుకెళ్లారా..అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఇంట్లో తవ్వకాలు; బంగారు నిధి పట్టివేత
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బుక్కరాయసముద్రంలో పోలీసులు బంగారు నిధిని పట్టుకున్నారు. డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నాగలింగ ఇంట్లో పోలీసులు మంగళవారం తవ్వకాలు జరిపి 15 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక రివాల్వర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాల్లో 10 పురాతన ట్రంకు పెట్టెలు లభించాయి. అయితే వీటిని గుప్త నిధులుగా పోలీసులు భావిస్తున్నారు. మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. ట్రెజరీ ఉద్యోగి మనోజ్ వద్ద నాగలింగ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగి మనోజ్, డ్రైవర్ నాగలింగను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
సూర్యాపేటలో గుప్తనిధుల కలకలం
-
లంకె బిందెలున్నాయంటూ లక్షలు గుంజాడు!
కర్నూలు, ఆదోని: పట్టణంలోని బుడ్డేకల్లు వీధికి చెందిన సామెల్ కనికట్టు విద్య ప్రదర్శించడంలో సిద్ద హస్తుడు. ఓ ఇంటి స్థలంలో రూ.కోట్ల విలువైన లంకె బిందెలున్నట్లు తన కనికట్టు విద్య ద్వారా ఓ వ్యక్తిని నమ్మించి రూ.23 లక్షలు గుంజాడు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. వివరాలను స్థానిక త్రీ టౌన్ సీఐ భాస్కర్, ఎస్ఐ రహంతుల్లా విలేకరులకు వెల్లడించారు. మండల పరిధిలోని చాగి గ్రామానికి చెందిన భాస్కర్ పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో నివాసం ఉంటూ ఇటీవల బళ్లారిలో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. బెంగళూరుకు చెందిన ఓ స్వామిని పిలిపించి స్థలం వాస్తు చూపగా నిధి నిక్షిప్తమై ఉందని చెప్పాడు. నిధిని వెలికి తీయాలని భాస్కర్ కోరగా స్వామి ఒప్పుకోకపోవడంతో పాటు ఇల్లు కట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. ఆశ చావని భాస్కర్ తన స్నేహితుడు క్యాబ్ డ్రైవర్ దేవిరెడ్డి సాయంతో సామెల్‌ను సంప్రదించారు. అతన్ని బళ్లారికి తీసుకెళ్లగా స్థలంలో అంజనం వేసి లంకె బిందెల్లో నిధి ఉన్నట్లు భాస్కర్‌కు చూపించి, ఆశలను రెట్టింపు చేశాడు. నిధి విలువ రూ. కోట్లలో ఉందని, వెలికి తీసేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చవుతోందని సామెల్ చెప్పడంతో అందుకు అంగీకరించిన భాస్కర్ నాలుగు విడతల్లో రూ.23లక్షలు సమర్పించుకున్నాడు. నాలుగు సార్లు స్థలంలో క్షుద్ర పూజలు నిర్వహించి, అంజనం వేసినట్లు కనికట్టు విద్యలు ప్రదర్శించిన చివరి సారిగా ఓ రాగి బిందెను వెలికి తీశాడు. సామెల్ చెప్పనట్లు ఇంటికి తీసుకు వెళ్లి ప్రత్యేక పూజల తరువాత బిందె మూతను తీయగా అందులో బొగ్గులు మాత్రమే ఉండడంతో మోసపోయినట్లు గుర్తించి త్రీ టౌన్ పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సామెల్‌పై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ చెప్పారు. సామెల్ బాధితులు జిల్లాలో ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని ఆయన సూచించారు. సామెల్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. -
'చెన్నంపల్లి' తవ్వకాల్లో అధికారుల కొత్తపాట
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల అన్వేషణ కొనసాగుతోంది. రెండున్నర నెలలుగా కోటలో దాదాపు ఎనిమిది ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టారు. ఇన్ని రోజులుగా ఖనిజ సంపద కోసం వేటగాళ్లు, పూజారులు, క్షుద్ర మాంత్రికులు, జియాలజీ అధికారుల సూచనల మేరకు తవ్వకాలు చేస్తున్నారు. అయితే కొత్తగా శాసనాలు, తాళపత్రాల ఆధారంగా తవ్వకాలు చేస్తున్నామని అధికారుల కొత్తపాట పాడుతుండటం గమనార్హం. కాగా, కోట పైభాగాన పలు ప్రాంతాలతో పాటు, కోట బురుజులను సైతం వదల్లేదు. సీతారామలక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, పూజా సామాగ్రి లభ్యమైన కొద్ది రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో చుట్టూ రాతి బండలతో కట్టిన తొట్టిలాంటిది బయట పడింది. సోమవారం కోట పైభాగంతో పాటు, దిగువున ఉన్న పెద్ద గుండు కింద సైతం తవ్వకాల పనులు చేపట్టారు. స్వామీజీలు, మాంత్రికులు, అధికారులు ఇలా ఎవరుపడితే వారు చెప్పిన చోటల్లా తవ్వకాల చేస్తుండడంతో జనం విస్తుపోతున్నారు. తవ్వకాలకు నెల్లూరు వచ్చిన 12 మంది కూలీలు ఉదయం సాయంత్రం పనులు చేస్తున్నారు. ఏది ఏమైనా మరో వారం రోజుల పాటు తవ్వకాలు చేపట్టి ముగింపు పలకనున్నట్లు సమాచారం. -
'చెన్నంపల్లి' తవ్వకాల్లో కీలక పరిణామం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో జరుగుతున్న తవ్వకాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో తవ్వకాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. అనంతంర ఈ నెల 3 వతేదీన మళ్లీ తవ్వకాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిపిన తవ్వకాల్లో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. తవ్వకాలు జరుపుతున్న కూలీలు ఇచ్చిన సమారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు దొరికిన విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణుడిగా ధ్రువీకరించారు. -
కోటనెందుకు నాశనం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల పేరుతో చెన్నంపల్లి కోటను ఎందుకు నాశనం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఈ గుప్త నిధుల తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, పురావస్తుశాఖ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, జిల్లా గనులు, పోలీసుశాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. -
కోటలో మళ్లీ తవ్వకాలు
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం తవ్వకాలు 15 రోజుల విరామం తర్వాత శనివారం పునఃప్రారంభమయ్యాయి. గతేడాది డిసెంబర్ 13న కోటలో ప్రారంభమైన తవ్వకాలు 36 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగాయి. తరువాత జనవరి 18న తవ్వకాలను నిలిపివేశారు. మొదట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ప్రభుత్వం ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో కొద్దిరోజుల తర్వాత ‘వాల్యూబుల్ మినరల్స్’ కోసమంటూ అధికారులతో ప్రకటన చేయించింది. ఓ వైపు తాంత్రిక పూజలు చేయిస్తూ.. మరో వైపు పలు సర్వేలను నిర్వహించింది. స్కానర్లు, రెసెస్టివిటీ మీటర్లతో పాటు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల ద్వారా అత్యాధునిక పరికరాలైన మాగ్నటో మీటరు, జీపీఆర్తో సర్వే చేయించింది. గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతం ఎగువ భాగాన కుడి వైపు స్థలంలో శనివారం మధ్యాహ్నం పూజలు చేసి.. తవ్వకాలు పునః ప్రారంభించారు. కర్నూలుకు చెందిన 12 మంది కూలీలతో తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం తవ్వకాలు చేస్తున్న ప్రాంతం ముందు గదుల ఆనవాళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. తవ్వకాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ పర్యవేక్షించారు. -
‘చెన్నంపల్లి’లో తవ్వకాలపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ ఎం.ఎస్.కె. జైశ్వాల్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను కర్నూలు జిల్లా, దూపాడుకు చెందిన బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాల పేరుతో చారిత్రక కట్టడాలను ధ్వంసం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ఆయన హైకోర్టుకు లేఖ రాశారు. ఏసీజే సూచన మేరకు ఈ లేఖను పిల్‌గా మలచారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, పూర్తి వివరాలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. -
‘చెన్నంపల్లి’ తవ్వకాలపై హైకోర్టుకు లేఖ
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా తుగ్గిలి మండల పరిధిలోని చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల కోసం ప్రభుత్వం ఆధ్వరంలో జరుగుతున్న తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలను దూపాడుకు చెందిన డాక్టర్ బ్రహ్మారెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తవ్వకాలను అడ్డుకోవాలని కోరు తూ లేఖ రాశారు.ఈ వ్యాజ్యంపై ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం 30న విచారణ జరపనుంది. -
అనుమానాలెన్నో?
చెన్నంపల్లి కోట.. ఇప్పుడు అందరి నోటా నానుతున్న మాట. ఇక్కడ కొనసాగు తున్న తవ్వకాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయంటూ అధికారులే నిధుల కోసం వేట సాగించడం చర్చ నీయాంశమైంది. ఇక్కడికి ఎవరూ రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు కనిపించకపోవడం.. అధికారులు ప్రభుత్వ అనుమతి పత్రాలు చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీడీపీకి చెందిన కీలక నేత ఆదేశాల మేరకు నిధిని కొల్లగొట్టడానికి తవ్వకాలుజరుపుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కర్నూలు, తుగ్గలి : కొన్నేళ్లుగా చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని అధికారులే ఏకంగా రంగంలోకి దిగి పోలీసు బందోబస్తు మధ్య ఈనెల 13 నుంచి కోటపై తవ్వకాల పనులు చేపట్టారు. ఏజెన్సీ ద్వారా తవ్వకాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా దాని పేరు ఏమిటో ఇంత వరకు బయటపెట్టకపోవడం గమనార్హం. దీంతో ఇక్కడి ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా అనుమతులు లేకున్నా టీడీపీ ముఖ్య నేత ఆదేశాలతో నిధుల వేట మొదలు పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు గ్రామస్తులు అడ్డుకోవడంతో వారితో ఓ కమిటీని ఏర్పాటు చేసి తవ్వకాల పనులు ముమ్మరం చేశారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, మైనింగ్ ఏడీ నటరాజ్, పోలీసు అధికారుల సమక్షంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఐదో రోజు ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డోన్ డీఎస్పీ బాబా పకృద్దీన్ తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. వీరే కాక పత్తికొండ, బనగానపల్లె, డోన్ సీఐలు విక్రమసింహ, శ్రీనివాసులు, శ్రీనివాస్, ఏడుగురు ఎస్ఐలు, మహిళా సీఐ ఆదిలక్ష్మి, 150 మంది దాకా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. తవ్వకాలపై గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. రకరకాలుగా ప్రచారం... ఐదు రోజులుగా దాదాపు 20 మందికి పైగా కూలీలు రాళ్లను పగులగొట్టి పక్కకు తొలగిస్తున్నారు. నిధి ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం ఇరుకుగా ఉండడంతో పనులు అనుకున్నంతగా ముందుకు సాగడం లేదు. 607 సర్వే నంబరులో 102.54ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట ఉంది. దాదాపు 300 అడుగులకు పైగా ఎత్తులో ఉండడంతో యంత్రాలు వెళ్లేందుకు వీలు లేకుండా పోతోంది. దీంతో ఎన్ని రోజులైనా కూలీలే తవ్వకాలు చేయాల్సి వస్తోంది. ఈ కోటలో విశేషంగా వజ్ర, వైఢూర్యాలు, బంగారం లాంటి సంపద ఉందని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అనంతపురానికి చెందిన ఓ స్వామీజీతో పాటు, పలు ముఠాల సభ్యులు అనేకమార్లు కోటపై అధునాతన పరికరాలతో పరీక్షించి విశేషంగా సంపద ఉందని గుర్తించారు. చాలా సార్లు గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరిపారు. అయితే ప్రతిసారీ విషయం బయటకు పొక్కు తుండడంతో విఫలమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఏకంగా ప్రభుత్వ అనుమతులపై స్పష్టత ఇవ్వకుండా అధికారులే రంగంలోకి దిగడంతో చర్చనీయాంశమైంది. నిధులు లేనప్పుడు ఇంత భారీ స్థాయిలో ఎందుకు తవ్వకాలు చేపడుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. తవ్వకాల్లో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల హస్తం లేకపోతే అధికారులు అనుమతులపై ఎవరికీ చెప్పకుండా ఇంత బహిరంగంగా తవ్వకాలు జరిపే ప్రసక్తే లేదని ప్రజలు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు అనుమతులపై మాత్రం సమాధానం ఇవ్వడం లేదు. అంతటా ఉత్కంఠ కోటలో నిధి కోసం అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఆదివారం తవ్వకాల్లో కొన్ని టెంకంలాంటి ముక్కలు, ఓ ఎముక బయటపడింది. ఇక నిధి వస్తుందేమోనని అందరూ ఆత్రుతతో ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. అయితే ప్రచారం జరుగుతున్నట్లు.. పక్కనే ఉన్న బండరాయికి వేసిన సీసం టెంకం స్పష్టంగా కనబడలేదు. పని చేసే చోట రాళ్లు, మట్టి వేగవంతంగా తొలగించేందుకు వీలుకావడం లేదు. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నిధి బయట పడుతుందని భావిస్తున్నారు. -
ఆగని వేట, తవ్వకాల్లో పెద్దల హస్తం?
కర్నూలు, తుగ్గలి: తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో గుప్తనిధుల వేట ఆగడం లేదు. నేరుగా అధికారులే రంగంలోకి దిగి వేట కొనసాగిస్తున్నారు. రేయింబవళ్లు తవ్వకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాల వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లే అధికారులు పోలీసు బలగంతో వచ్చి.. గ్రామస్తుల అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా తవ్వకాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీ ఆదేశాల మేరకే తవ్వకాలు జరుపుతున్నామని ఆదోని ఆర్డీఓ ఓబులేసు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బుధవారం తవ్వకాలను అడ్డుకున్న గ్రామస్తుల అనుమానాలను నివృత్తి చేస్తామంటూ అధికారులు గురువారం గ్రామసభ నిర్వహించారు. ఆదోని ఆర్డీఓ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పత్తికొండ సీఐ విక్రమసింహ, తుగ్గలి, పత్తికొండ ఎస్ఐలు, భారీగా పోలీసులు వచ్చారు. ఈ సభ గందరగోళంగా మారింది. స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ గ్రామసభలో ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడుతూ 607 సర్వే నంబరులో 102.54 ఎకరాలున్న చెన్నంపల్లి కోట విజయనగర రాజుల కాలం నాటిదని చెప్పారు. ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని కొన్నేళ్లుగా సాగుతున్న ప్రచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం తవ్వకాలు ప్రారంభినట్లు తెలిపారు. అయితే రాత్రి గ్రామస్తులు కొందరు అడ్డుకున్నారని, వారి అనుమానాలు నివృత్తి చేసేందుకు గ్రామసభ ఏర్పాటు చేశామని వివరించారు. ట్రెజరీ చట్టం 2–88 ప్రకారం భూమిలో ఉన్న సంపద ప్రభుత్వానికి చెందుతుందన్నారు. కోటలో సంపద ఉందని, దాన్ని వెలికి తీస్తామని ఓ ఏజెన్సీ ప్రభుత్వ అనుమతులు కోసం సీఎం పేషీని కోరిందన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు జరుపుతున్నామే తప్ప..మీరు అనుమానిస్తున్నట్లు ఇది ఎవరి కోసమో కాదన్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మైనింగ్ అధికారులు, గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి.. వారి సమక్షంలో తవ్వకాలు జరుపుతామని చెప్పారు. దీన్నంతటినీ వీడియో తీస్తామన్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తెలపాలని కోరడంతో సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్ గ్రామస్తుల తరఫున మాట్లాడారు. ప్రభుత్వ అనుమతులు ఉంటే గ్రామ ప్రజలకు, మీడియాకు చూపించకుండా దొంగ దారిలో తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆర్డర్ చూపాలని కోరితే అలాంటి రూల్ లేదని ఆర్డీఓ చెప్పడం సరైందికాదన్నారు. చట్టాలు తమకూ తెలుసని, ప్రజలెవరూ అమాయకంగా లేరని అన్నారు. భూమిలో ఉన్న సంపదను తీయాల్సి వస్తే చట్టం ప్రకారం ఆ సంపదలో చుట్టూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి 33 శాతం కేటాయించాలన్నారు. కోటలో సంపద ఉంటే దాంట్లో కొంత పంచాయతీ అభివృద్ధికి కూడా కేటాయించేలా అధికారులు గ్రామసభ తీర్మానం ద్వారా కలెక్టర్‌కు పంపాలన్నారు. అలా కుదరదని ఆర్డీఓ చెప్పడంతో తవ్వకాలు కూడా జరపనిచ్చే ప్రసక్తే లేదని నబీరసూల్ తేల్చి చెప్పారు. ఇదే విషయమై వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అధికారులతో వాదించారు. ప్రభుత్వ అనుమతులు చూపకుండా తవ్వకాలు ఎలా చేస్తారని నిలదీశారు. ఆర్డర్ చూపుతానని ఆర్డీఓ చెప్పగానే.. టీడీపీ నాయకులు జెడ్పీ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, ఎంపీపీ వెంకటేశ్వర్లు, సర్పంచ్ రంగమ్మ తనయుడు వెంకటపతి, వారి అనుచరులు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. ఇది తమ గ్రామ సమస్య అని, మీకేం సంబంధం అంటూ గందరగోళం సృష్టించారు. ఇదే అదనుగా అధికారులు గ్రామసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నాలుగైదు గంటల తర్వాత మళ్లీ కొంత మంది గ్రామస్తులతో కమిటీ వేసినట్లు చెబుతూ తవ్వకాలు కొనసాగించారు. అధికారులే తవ్వకాలకు పూనుకోవడంతో గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కోట పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎంత మంది ఉన్నారో తెలియడం లేదని స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. తవ్వకాలు జరిపే వారిలో కొందరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. కోట విశిష్టత.. చెన్నంపల్లి గ్రామం వెనుక ఉన్న కొండపై పురాతన కోట ఉంది. ఈ కోటలో ఇప్పటికీ చెక్కు చెదరని బురుజులు కనిపిస్తాయి. విజయనగర రాజులు, మౌర్యవంశీయులు, గుత్తి పాలకులకు ఈ కోటతో సంబంధం ఉన్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కొండపై గోడలు, ద్వారాలు, బురుజులు, కోనేర్లు, ఊరువాకిలి ఉన్నాయి. ప్రస్తుతం ఊరువాకిలి పూర్తిగా శిథిలావçస్థకు చేరుకుంది. ఈ కోట నుంచి గుత్తి కోటకు సొరంగ మార్గం ఉందని ప్రజలు చెబుతుంటారు. అంతేకాక కోట ప్రారంభంలో ఉన్న రాతి బండపై నిరంతరం నీళ్లు ఉండటం ఓ ప్రత్యేకత. కోటకు ఏడు కిలోమీటర్ల దూరంలోని జొన్నగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతనమైన చెన్నంపల్లి కోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ చాలాకాలంగా ప్రచారం సాగుతోంది. పదేళ్ల క్రితం అనంతపురం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ ఈ కోటలో విశేషంగా బంగారం ఉందని, దాన్ని బయటకు తీసేందుకు సహకరిస్తే ప్రతి ఇంటికీ పిడికెడు బంగారం ఇవ్వొచ్చని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. స్వామీజీ సూచనను అనుసరించి కోటపై ఉన్న ఓ రాతి బండ వద్ద నిధి ఉందంటూ రాత్రి సమయాల్లో తరచూ తవ్వకాలు చేసేవారు. చివరకు అప్పటి కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందడంతో తవ్వకాలు జరిపిన చోట పోలీసులు పెద్దబండరాయి వేయించారు. అయినప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఏకంగా ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ఎలాగైనా గుప్త నిధులు తీయాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మాట్లాడుతున్న బీవైరామయ్య, చిత్రంలో పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి దోచుకోవడమే చంద్రబాబు పని– వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య దొరికినంత దోచుకోవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని తెలుసుకున్న వారు గురువారం చెన్నంపల్లికి వచ్చి అధికారులను నిలదీశారు. అనంతరం సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నబీరసూల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాజుల కోటలో గుప్త నిధులున్నాయని, ఎవరికీ సమాధానం ఇవ్వకుండా అక్రమ తవ్వకాలు జరపడం అన్యాయమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంచభూతాలను సైతం వదిలిపెట్టలేదన్నారు. మట్టి, నీరు ఇలా వేటినీ వదలడం లేదని విమర్శించారు. చెన్నంపల్లి కోటలో ప్రభుత్వ అనుమతులు చూపకుండా.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా అధికారులు తవ్వకాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. నిజంగా ప్రభుత్వ అనుమతులు ఉంటే వాటిని మీడియాకు, ప్రజలకు ఎందుకు చూపలేదని నిలదీశారు. అమాయక ప్రజలపై ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గుప్త నిధులు కొల్లగొట్టేందుకే టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ఈ పన్నాగం పన్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గంలో ఆయనకు తెలియకుండానే అధికారులు తవ్వకాలు జరుపుతారా అని అన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాదిరిగా గుప్త నిధులను తీయాలని సూచించారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో ఆలయంలోని నిధులను స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక్కడ కూడా అలాగే చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం వచ్చినా ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని వారు హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నాగేష్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గోపాలరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు హనుమంతు, ఎంపీటీసీ సభ్యులు రామాంజినేయులు, రంగనాథరెడ్డి, మధుయాదవ్ పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
-
శిథిల రాజసం.. రాచకొండ!
- మరుగున పడుతున్న 700 ఏళ్ల చరిత్ర - రాచకొండ దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఎత్తయిన కొండలు.. పైన శత్రు దుర్భేద్యమైన కోట.. ముఖ ద్వారాలు, ఈత కొలనులు, మంచినీటి బావులు, ప్రార్థన మందిరాలు.. కనుచూపుమేర రాజ్యం. దేవాలయాలు, నాట్యశాలలు, పురోహితులు, ప్రజల ఆవాస ప్రాంతాలు, దట్టమైన అడవి.. ‘మాహిష్మతి’ని తలపించే రాచకొండ ఠీవికి నిదర్శనాలివి. 700 ఏళ్ల నాటి చారిత్రక అద్భుత ఆనవాళ్లు అవి. తెలంగాణ కీర్తిని దశదిశలా వ్యాప్తింపజేసిన పద్మనాయక వంశ (వెలమ) రాజులు.. సుమారు 150 దేవాలయాలను నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలు, గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాలతో కళ తప్పినా.. ఆ ‘రాజ’దర్పం మాత్రం చెక్కు చెదరలేదు. శిథిలమవుతున్న ఘన చరిత్రకు నిదర్శనంగా రాచకొండ నిలుస్తోంది. హైదరాబాద్‌కు సమీపంలోని రాచకొండ చరిత్రపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. – బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, నల్లగొండ 35 వేల ఎకరాల విస్తీర్ణం రాచకొండ విస్తీర్ణం.. సుమారు 35 వేల ఎకరాలు. ప్రస్తుత యాదాద్రి జిల్లాలో ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలం పరిధిలో 14,760 ఎకరాలు. చౌటుప్పల్, రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలంలో మిగతా ప్రాంతం విస్తరించి ఉంది. ఇక్కడ 4 వేలకు పైగా నెమళ్లు ఉన్నాయి. నక్షత్ర తాబేళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. విలువైన కలపను గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్, ఇబ్రహీంపట్నానికి తరలిస్తున్నారు. ఒకప్పుడు కీకారణ్యంలా ఉన్న ఈ ప్రాంతం చెట్ల నరికివేతతో మైదానంగా మారుతోంది. ఫిలిం సిటీగా కోట 2014 డిసెంబర్ 15న రాచకొండ గుట్టలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. రాచకొండను ఫిలిం సిటీగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర చిత్ర పరిశ్రమకు రానున్న రోజుల్లో పెద్ద దిక్కవుతుందని పేర్కొన్నారు. 2 వేల ఎకరాల్లో íఫిలిం సిటీ, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణాలను కోటకు సమీపంలో ఏర్పాటు చేయిస్తామన్నారు. అయితే మూడేళ్లవుతున్నా అలనాటి రాచరిక ఆనవాళ్లను కాపాడేందుకు, అభివృద్ధి చేసేందుకు బీజం పడలేదు. కోటను íఫిలిం సిటీగా అభివృద్ధి చేస్తే పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండపై ప్రభుత్వం దృష్టి పెడితే అంతరించిపోతున్న ‘రాచ’కీర్తికి పూర్వవైభవం కల్పించినట్లు అవుతుంది. చారిత్రక నేపథ్యం ఇదీ.. కాకతీయుల పతనానంతరం పద్మనాయకులు రాచకొండ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యం స్థాపించారు. రాచకొండ గ్రామానికి సమీపంలో కోటను నిర్మించారు. క్రీ.శ 1325–1475 మధ్య పద్మనాయక వంశీయుల పాలన సాగింది. రాచకొండ, దేవరకొండ దుర్గాలను వీరే నిర్మించారు. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే రాజు కాలంలో నిర్మించారు. ఎర్ర దాచ నాయుడితో ప్రారంభమైన వీరి పాలన సర్వజ్ఞరావు సింగభూపాలుడితో ముగిసింది. తర్వాత ఈ వంశీయులు విజయనగర రాజ్యంలో సామంతులుగా ఉండడం, అనంతరం బహుమనీల రాజ్య విస్తరణతో వారి ఏలుబడిలోకి వెళ్లింది. 7 ముఖ ద్వారాలు.. మంచినీటి బావులు.. ప్రధాన కోటకు కింద నుంచి పైకి 7 ముఖ ద్వారాలున్నాయి. ద్వారాలన్నీ శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. అయితే కోట అంతా నామరూపాలు లేకుండా పోయింది. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి నాశనం చేశారు. కొండపైన ఉన్న ప్రత్యేక ప్రార్థన మందిరం మాత్రమే రాజదర్పానికి ఆనవాలుగా ఉంది. కొండపైన 2 ఈత కొలనులు పెద్దపెద్ద బండలను తొలిచి నిర్మించారు. లోతైన మంచినీటి బావులు ఉన్నాయి. ఇక్కడి సంకెళ్ల బావికి ఓ ప్రత్యేకత ఉంది. పట్టుబడిన దొంగలకు సంకేళ్లు వేసి నీళ్లు తోడించావారట. సుమారు 300 చెరువులు, కుంటలు ఉన్నాయి. పెద్ద చెరువుల వద్ద ప్రత్యేకంగా శాసనాలు వేయించారు. అన్నపోత, నాగసంద్రం, దేవ, రాయ చెరువులు ఇక్కడ ప్రధానమైనవి. గొలసుకట్టుతో ఉన్న ఈ చెరువులు చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. కళాపోషకులు..: రాచకొండ రాజులు కళలకు ప్రాధాన్య మిచ్చారు. తెలుగు కావ్యత్రయంలోని ముఖ్యమైన రెండు కావ్యాలు రామాయణం, మహాభారతం ఇక్కడి నుంచే వెలువడ్డాయి. కొండ కింద కళామందిరాలు నిర్మించారు. వందల ఏళ్లయినా ఈ కళామందిర గోడలపై ఇప్పటికీ కళారూపాలు కనిపిస్తున్నాయి. పర్యావరణం కలుషితంతో ఇవి రానురాను శిథిలమవుతు న్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. 100కు పైగా శివాలయాలు.. రాచకొండలో 150 ఆలయాలుండగా.. అందులో 100కు పైగా శివాలయాలే. సూర్య కిరణాలు శివలింగంపై పడేలా ఆలయాలు నిర్మిం చారు. కొండ చుట్టూ దారి వెంట వినాయక ప్రతిమలు చెక్కించారు. చౌటుప్పల్ సమీపంలో జాతీయ రహదారిపై కొయ్యలగూడెం నుంచి రాచకొండకు వెళ్లే దారిలో కొండకింద ప్రధాన శివాలయం ఉంది. కోటకు అభిముఖంగా ఉన్న ఈ ఆలయానికి వచ్చి రాజులు పూజలు చేసేవారు. కోటకు వెళ్లే ప్రధాన ముఖద్వారం సమీపంలోనే రాముడిని ప్రతిష్టించారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
బయ్యారం మండలంలోని గట్టుముకాంబికాదేవి ఆలయ పరిసరాలలో గుప్తనిధుల కోసం గురువారం తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల రాక గమనించి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుప్త నిధుల కోసం ఆలయాలు ధ్వంసం
బ్రహ్మసముద్రం : గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటనలు మండలంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని పోలేపల్లి నుంచి భైరవానితిప్ప గ్రామానికి వెళ్లే దారిలోని పురాతన పాతప్ప స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం రెండురోజుల క్రితం ఆలయం బయట ఉన్న పాతప్ప స్వామి కట్టను తవ్వి ధ్వంసం చేశారు. అలాగే మూలవిరాట్ కట్టముందున్న పెద్ద బండరాయిని తొలగించి అక్కడ పెద్ద గోతిని తవ్వారు. విషయం ఆదివారం ఉదయం గ్రామస్థులు గమనించి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో గతంలో యరడికెర చెరువు కట్టమీదనున్న పురాతన శివాలయంతోపాటు, వేపలపర్తి లక్ష్మి రంగనాథస్వామి ఆలయం, పాల వెంకటాపురం కొండల్లో సైతం తవ్వకాలు జరిగాయి . ఈ సంఘటనలపై గ్రామస్థులు ఆలయకమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిచా పట్టించుకున్న దాఖాలాలు లేవు. ఎండో మెంట్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో తరచూ పురాతన ఆలయాలను గుప్తనిధుల కోసం ధ్వంసం చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
గుప్త నిధుల కోసం.. శివలింగం ధ్వంసం
కంబదురు(అనంతపురం): పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగులు శివలింగాన్ని ధ్వంసం చేయడమే కాక అడ్డొచ్చిన వాచ్‌మెన్‌ను కత్తులతో బెదిరించి పరారయ్యారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కంబదురులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక మల్లేశ్వర ఆలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో ఆలయంలోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఇది గమనించిన వాచ్మెన్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అతన్ని కత్తులతో బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.