గుప్త నిధుల కోసం ఆలయాలు ధ్వంసం | temples vandalise of Hidden treasures | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం ఆలయాలు ధ్వంసం

Published Sun, Aug 21 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

temples vandalise of Hidden treasures

బ్రహ్మసముద్రం : గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటనలు మండలంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని పోలేపల్లి నుంచి భైరవానితిప్ప గ్రామానికి వెళ్లే దారిలోని  పురాతన పాతప్ప స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం రెండురోజుల క్రితం ఆలయం బయట ఉన్న పాతప్ప స్వామి కట్టను తవ్వి ధ్వంసం చేశారు. అలాగే మూలవిరాట్‌ కట్టముందున్న పెద్ద బండరాయిని తొలగించి అక్కడ పెద్ద గోతిని తవ్వారు. విషయం ఆదివారం ఉదయం గ్రామస్థులు గమనించి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.


మండలంలో గతంలో యరడికెర చెరువు కట్టమీదనున్న పురాతన శివాలయంతోపాటు, వేపలపర్తి లక్ష్మి రంగనాథస్వామి ఆలయం, పాల వెంకటాపురం కొండల్లో సైతం  తవ్వకాలు జరిగాయి . ఈ సంఘటనలపై గ్రామస్థులు ఆలయకమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిచా పట్టించుకున్న దాఖాలాలు లేవు. ఎండో మెంట్‌ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో తరచూ పురాతన ఆలయాలను గుప్తనిధుల కోసం ధ్వంసం చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి  చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement