brahmasamudram
-
భూదానం తరతరాలు నిలిచిపోతుంది: మంత్రి ఉష శ్రీ చరణ్
-
అనంతపురంలో ఎలుగుబంటి కలకలం..
సాక్షి, అనంతపురం : జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలం రాయలదొడ్డి గ్రామ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం కలకలం రేపింది. ఎలుగుబంటి దారితప్పి జనావాసాల్లో రావడంతో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. ఎలుగుబంటి ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడ్డారు. తర్వాత గ్రామస్తులు మూకుమ్మడిగా ఎలుగుబంటిపై దాడికి దిగారు. దీంతో ఎలుగుబంటి సమీపంలోని కొండల్లోకి పరుగులు తీసింది. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
ఇసుక లారీ సీజ్
బ్రహ్మసముద్రం: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ లారీని బ్రహ్మసముద్రం పోలీసులు సీజ్ చేశారు. వివరాల్లోకెళితే... బ్రహ్మసముద్రంలోని వేదావతి హగరిలో నాణ్యమైన ఇసుక ఉంది. దీనిపై కన్నేసిన నంజాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అధికార పార్టీ నేతలు పాలవెంకటాపురం సమీపంలోని యర్రగుండ్ల దగ్గర గొల్లబాలు అనే రైతు పొలంలోని చీనీ చెట్లలో అక్రమంగా ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. హరీష్, గొల్ల బాలు అనే వ్యక్తులు పరారవగా... కర్ణాటక దాసర్లపల్లికి చెందిన విజయ్, నాగభూషణ, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో లారీలతో ఆ ఇసుకను కర్ణాటకలోకి చిత్రదుర్గంకు తరలిస్తున్న పోలీసులు తెలిపారు. అక్కడ లారీ ఇసుకను రూ. 40 వేలకు పైగా విక్రయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. -
నకిలీ పాసు పుస్తకాలపై పోలీసుల ఆరా
బ్రహ్మసముద్రం: అనంతపురంలో జూలై 17న ఇద్దరు వ్యక్తుల వద్ద పట్టుబడిన నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలపై పోలీసులు మంగళవారం బ్రహ్మసముద్రం తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చి ఆరాతీశారు. తీటకల్లు రెవెన్యూ గ్రామంలోని సర్వేనంబర్లు 13–1, 325లో కళ్యాణదుర్గం మండలం హులికల్లుకు చెందిన వారి పేరిట గల నకిలీ పాసుపుస్తకాలను ఆన్లైన్లో పరిశీలించగా నకిలీవని తేలింది. అయితే తమ కార్యాలయంలో ఈ పుస్తకాలను ఇవ్వలేదని, గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పాసుపుస్తకాలు తయారు చేసినట్లు తహసీల్దార్ వెంకటశేషు తెలిపారు. అనంతరం కంబదూరు మండలం పాళ్లూరు రెవెన్యూగ్రామంలోని నకిలీపుస్తకాలపై విచారణకు పోలీసులు బయల్దేరి వెళ్లారు. -
నకిలీ పాసు పుస్తకాలపై సీఐడీ అధికారుల ఆరా
బ్రహ్మసముద్రం : మండలంలో 2014–2015లో నమోదైన నకిలీ పట్టదారు పాసు పుస్తకాలు, కేసుల వివరాలపై సీఐడీ అధికారులు ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను తమకు అందజేయాలని తహశీల్దార్ సుబ్రమణ్యంకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే విషయమై బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో వివరాలు సేకరించినట్లు తెలిసింది. మండలంలో 2009 నుంచి 2015 వరకు మండలంలో పనిచేసిన తహశీల్దార్ల వివరాలు, సిబ్బందిపై నమోదైన పోలీస్ కేసులు తదితర వివరాలను అడిగినట్లు తహశీల్దార్ సుబ్రమణ్యం తెలిపారు. -
గుప్త నిధుల కోసం ఆలయాలు ధ్వంసం
బ్రహ్మసముద్రం : గుప్త నిధుల కోసం పురాతన ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటనలు మండలంలో అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని పోలేపల్లి నుంచి భైరవానితిప్ప గ్రామానికి వెళ్లే దారిలోని పురాతన పాతప్ప స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం రెండురోజుల క్రితం ఆలయం బయట ఉన్న పాతప్ప స్వామి కట్టను తవ్వి ధ్వంసం చేశారు. అలాగే మూలవిరాట్ కట్టముందున్న పెద్ద బండరాయిని తొలగించి అక్కడ పెద్ద గోతిని తవ్వారు. విషయం ఆదివారం ఉదయం గ్రామస్థులు గమనించి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. మండలంలో గతంలో యరడికెర చెరువు కట్టమీదనున్న పురాతన శివాలయంతోపాటు, వేపలపర్తి లక్ష్మి రంగనాథస్వామి ఆలయం, పాల వెంకటాపురం కొండల్లో సైతం తవ్వకాలు జరిగాయి . ఈ సంఘటనలపై గ్రామస్థులు ఆలయకమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిచా పట్టించుకున్న దాఖాలాలు లేవు. ఎండో మెంట్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో తరచూ పురాతన ఆలయాలను గుప్తనిధుల కోసం ధ్వంసం చేస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఆ టీడీపీ నేతపై క్రిమినల్ కేసు!
అనంతపురం: బ్రహ్మసముద్రం టీడీపీ నేత వెంకటేశ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. వేరుశెనగ విత్తనాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే వివాదం నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా జిల్లాలో వేరు శెనగ విత్తనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వీటికోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. అనంతపురం, బెలుగుప్ప, పుట్టపర్తి, సోమంవేపల్లి, గోరంట్లలో రైతుల ఆందోళన నిర్వహించారు. చాలీచాలని విత్తనాలు సరఫరా చేస్తున్నారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విత్తనాలు టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు బ్రహ్మసముద్రం టీడీపీ నేత వెంకటేశ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారని సమాచారం.